Advertisement
యూపీఎస్సీ స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటిస్ ఎగ్జామినేషన్
Latest Jobs Railway UPSC

యూపీఎస్సీ స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటిస్ ఎగ్జామినేషన్

యూపీఎస్సీ స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటిస్ ఎగ్జామినేషన్ ఇండియన్ రైల్వే ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (జమలపూర్) లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో సీట్లు భర్తీచేసేందుకు నిర్వహిస్తారు. దేశంలో మొదటి ఇంజనీరింగ్ పరీక్షా చెప్పుకునే స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటిస్ ఎగ్జామినేషన్ కు 2015 తర్వాత యూపీఎస్సీ ముగింపు పలికింది. గత నాలుగు ఐదేళ్లలో ఈ పరీక్షను నిర్వహించలేదు.

నియామక బోర్డు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
నియామక పరీక్షా స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటిస్ ఎగ్జామినేషన్
ఎంపిక ప్రక్రియ రాతపరీక్ష/ఇంటర్వ్యూ
ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్
వయో పరిమితి 16 - 21 ఏళ్ళ మధ్య

ఎలిజిబిలిటీ

  • జాతీయత: ఇండియా, భూటాన్, నేపాల్ దేశాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
  • 1962 కు ముందు ఇండియాకు వచ్చి స్థిరపడిన టిబెటియన్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • భారత్ లో శాశ్వతంగా స్థిరపడేందుకు వచ్చిన పాకిస్తాన్, శ్రీలంక, బర్మా మరియు కెన్యా, ఉగాండా, జాంబియా దెసలకు చెందిన వారుకూడా అర్హులు.
  • వయోపరిమితి:  అభ్యర్థుల వయసు 16 నుండి 21 ఏళ్ళ మధ్య ఉండాలి.
  • విద్య అర్హుత:  మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి.
  • రైల్వే ఎగ్జామినేషన్ నిబంధనలు అనుచరించి అభ్యర్థులు శారీరకంగా ఫిట్ గా ఉండాలి.

అప్రెంటిస్ ప్రోగ్రాం వివరాలు మరియు ఎంపిక పద్ధతి

యూపీఎస్సీ నిర్వహించే రైల్వే స్పెషల్ క్లాస్ అప్రెంటిస్ పరీక్షను దేశంలో ఒకానొక మొదటి ఇంజనీరింగ్ పరీక్షగా చెప్పుకుంటారు. ఈ ప్రోగ్రాంను 1927 బ్రిటిష్ రైల్వే కాలంలో ప్రారంభించారు. యేటా ఒకసారి నిర్వహించే ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా నిరుద్యోగ అభ్యర్థుల నుండి పోటీఉండేది. ఉన్న ముప్పై, నలభై సీట్లకోసం లక్షల్లో అభ్యర్థులు పాల్గునేవారు. ఈ పరీక్షాను ఇండియన్ రైల్వే ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (జమలపూర్) లో మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రోగ్రాంలో సీట్లు భర్తీచేసేందుకు నిర్వహిస్తారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ మరియు మెడికల్ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఎంపిక చేపట్టేవారు. మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ మరియు మెంటల్ ఎబిలిటీ సంబంధిత సబ్జెక్టులతో రాతపరీక్ష జరుపుతారు. రాతపరీక్ష పూర్తిచేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ మరియు మెడికల్ టెస్ట్ నిర్వహించి, తుది ఫలితాలు ప్రకటిస్తారు.

ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్ రైల్వే ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (జమలపూర్) లో నాలుగేళ్ళ మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్'తో పాటుగా రైల్వే సంబంధిత ట్రయినింగ్ అందించేవారు. అప్రెంటిస్ వర్క్ షాప్ ట్రయినింగ్ సెషన్ హాలీడేస్'లో నిర్వహించే వారు.

ట్రయినింగ్ సమయంలో అభ్యర్థులకు 9100/- వరకు స్టైపెండ్ పాటుగా డీఏ, ఇతర అలోవెన్సులు అందజేస్తారు. 4 ఏళ్ళ అప్రెంటిస్ ప్రోగ్రాంను విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు రైల్వేలో గ్రూపు ఏ స్థాయి అధికార హోదాతో రైల్వే మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కార్యనిర్వహణ అధికారులుగా నియమిస్తారు.

Post Comment