కరెంటు అఫైర్స్ : ఏప్రిల్ 2022 | ఆర్ట్ & కల్చర్ అఫైర్స్
Telugu Current Affairs

కరెంటు అఫైర్స్ : ఏప్రిల్ 2022 | ఆర్ట్ & కల్చర్ అఫైర్స్

మీనా నయ్యర్ & హిమ్మత్ సింగ్ రచించిన 'టైగర్ ఆఫ్ డ్రాస్' బుక్ విడుదల

మీనా నయ్యర్ మరియు హిమ్మత్ సింగ్ రచించిన 'టైగర్ ఆఫ్ డ్రాస్' పుస్తకం ప్రచురణకర్త హార్పర్‌కోలిన్స్ ఇండియా ద్వారా మార్కెట్లోకి విడుదలయ్యింది. ఈ పుస్తకం 1999లో కార్గిల్ యుద్ధంలో 23 ఏళ్ళ కెప్టెన్ అనుజ్ నయ్యర్ యొక్క పోరాటపటిమను గురించి రాయబడింది. ఈ పోరాటంలో 15 మంది భారత సైనికులను రక్షించేందుకు అనూజ్ వీరమరణం పొందాడు. కెప్టెన్ అనుజ్ నయ్యర్‌కు 2000లో భారతదేశపు రెండవ అత్యున్నత శౌర్య పురస్కారం మహా వీర్ చక్ర లభించింది.

Advertisement

'టెంపుల్ 360' వెబ్‌సైట్‌ ప్రారంభం

సాంస్కృతిక మరియు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి 'టెంపుల్ 360' వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్ట్స్‌లోని (IGNCA) యాంపిథియేటర్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ వెబ్‌సైట్ ద్వారా, దేశ్యవ్యాప్తంగా ఉన్న దేవాలయ సమాచారంతో పాటుగా ఆధ్యాత్మిక ప్రయాణాలు వివరాలు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది.

స్పోర్ట్‌స్టార్ ఏసెస్ అవార్డ్స్ 2022లో 'రోడ్ టు 1000' పుస్తకం విడుదల

తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌లో జరిగిన 2022 స్పోర్ట్‌స్టార్ ఏసెస్ అవార్డ్స్‌లో స్పోర్ట్‌స్టార్ మరియు ది హిందూ గ్రూప్ 'రోడ్ టు 1000' అనే కాఫీ-టేబుల్ పుస్తకాన్ని విడుదల చేశాయి. 520 పేజీల ఈ పుస్తకం భారత క్రికెట్ ప్రస్థానం, మరియు ముఖ్యమైన క్రికెట్ జ్ఞాపకాలకు సంబంధించి దాదాపు 1000 ప్రత్యేక చిత్రాల సమ్మేళనంతో రూపొందించారు.

ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, సయ్యద్ కిర్మాణి, దిలీప్ వెంగ్‌సర్కార్, మహ్మద్ అజారుద్దీన్, చంద్రకాంత్ పండిట్ మరియు నీలేష్ కులకర్ణిలు పాల్గున్నారు.

ధర్మేంద్ర ప్రధాన్ ద్వారా “బిర్సా ముండా”  పుస్తకం విడుదల

కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదగా “బిర్సా ముండా - జంజాతీయ నాయక్ ” పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన బిలాస్‌పూర్‌ గురు ఘాసిదాస్ విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ అలోక్ చక్రవాల్ రాశారు. ఈ పుస్తకం ప్రముఖ ఆదివాసీ స్వాతంత్ర యోధుడు భగవాన్‌ బిర్సా ముండా పోరాటాన్ని, స్వాతంత్య్ర ఉద్యమంలో వనవాసుల కోసం ఆయన చేసిన కృషి గురించి వ్రాయబడింది.

 జార్ఖండ్‌ సర్హుల్ ఫెస్టివల్ 2022

జార్ఖండ్ రాష్ట్రంలో ఏటా ప్రతిష్టాత్మకంగా జరిపే సర్హుల్ ఫెస్టివల్, 04 ఏప్రిల్ 2022న ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక స్థానిక సర్నా మతంకు చెందిన గిరిజన సంఘాలు జరుపుకునే నూతన సంవత్సర పండుగ. ఇది హిందూ క్యాలండర్ యొక్క చైత్ర మాసంలో, అమావాస్య ముగిసిన మూడో రోజున జరుపుకుంటారు. ఇది వసంతకాలం ప్రారంభానికి సంబంధించిన వేడుక.

Advertisement

Post Comment