Advertisement
ఖాన్ అకాడమీ ఆన్‌లైన్ క్లాసులు : క్లాస్ I నుండి క్లాస్ XII పూర్తి ఉచితం
Online Education Useful websites

ఖాన్ అకాడమీ ఆన్‌లైన్ క్లాసులు : క్లాస్ I నుండి క్లాస్ XII పూర్తి ఉచితం

ఖాన్ అకాడమీ అమెరికా కేంద్రంగా రూపొందించబడిన నాన్-ప్రాఫిట్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజషన్. దీన్ని 2008లో సల్మాన్ "సల్" ఖాన్ ఏర్పాటు చేసారు. స్కూల్ ఎడ్యుకేషన్'కు సంబంధించి అంతర్జాతీయ స్థాయి ఆన్‌లైన్ విద్యను అందిస్తున్న సంస్థల్లో ఖాన్ అకాడమీ ముందు వరుసలో ఉంది. విద్య పరంగా ఖాన్ అకాడమీ అందిస్తున్న అన్ని సేవలు పూర్తి ఉచితం. ఈ సంస్థ కేవలం డొనేషన్స్ సహాయంతో నిర్వహించబడుతుంది.

ఖాన్ అకాడమీ విద్య సేవలు అంతర్జాతీయంగా చేరువయ్యేందుకు, ఇతర భాషల్లో తర్జుమా చేసేందుకు, నూతన కంటెంట్ రూపొందేంచేందుకు గూగుల్, కార్లోస్ స్లిమ్ ఫౌండేషన్, AT&T మరియు బిల్ & మిలిండా ఫౌండేషన్ వంటివి మిలియన్ల డాల్లర్ల కొలది సహాయాన్ని అందిస్తున్నాయి.

khan academy

ఖాన్ అకాడమీ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పర్సనలైజ్డ్ లెర్నింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఖాన్ అకాడమీ తరగతులు ప్రత్యక్ష క్లాస్ రూమ్ బోధనలకు సరిసమంగా ఉంటాయి. క్లాసులు వీక్షించేటప్పుడు డిజిటల్ లెర్నింగ్ అనే భావన కాసింత కూడా మీకు కలగదు. ఖాన్ అకాడమీ 1 నుండి 12 వ తరగతి వరకు ఆన్‌లైన్ కంటెంట్ అందిస్తుంది.

ఈ క్లాసులు యూట్యూబ్ ద్వారా నేరుగా హోస్ట్ చేయబడి ఉంటాయి. ఈ తరగతులు ఒక్క వీడియో పాఠాలకే పరిమితం కాకుండా ప్రోగ్రస్ ట్రాకింగ్, ప్రాక్టీస్ అభ్యాసాలు మరియు టీచింగ్ టూల్స్'ని కూడా అందిస్తుంది. తరగతులు ఎలక్ట్రానిక్ బ్లాక్ బోర్డు ద్వారా రికార్డ్ చేయడం వలన ఉపాధ్యాయులు నేరుగా విద్యార్థులకు బోధిస్తున్న అనుభూతి కలుగుతుంది.

ఖాన్ అకాడమీ స్కూల్ ఎడ్యుకేషన్ తో పాటుగా SAT (స్కాలస్టిక్ అసెస్‌మెంట్ టెస్ట్), LSAT (లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్) వంటి ప్రవేశ పరీక్షలకు కంటెంట్ తో పాటుగా పరీక్షకు సన్నద్ధమయ్యే గైడెన్స్ అందిస్తుంది.

వీటికి సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లలో అంతర్జాతీయ స్థాయి ఫౌండేషన్ కోర్సులను అందిస్తుంది. ఖాన్ అకాడమీ కంటెంట్ ఇంగ్లీష్, హిందీతో  పాటుగా మరో 30 అంతర్జాతీయ భాషల్లో అందుబాటులో ఉంది. దానితో పాటుగా ఇరవై వేలకు పైగా ట్రాన్సిలేట్ చేయబడిన సబ్ టైటిల్స్ అందుబాటులో ఉంచింది.