ఆల్ ఇండియా యూత్ స్కాలర్షిప్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఇంజనీరింగ్ మరియు మెడిసిన్ కోర్సులలలో చేరే విద్యార్థుల కోసం నిర్వహిస్తున్నారు. ఈ స్కాలర్షిప్ అర్హుత పరీక్షలో మెరిట్ సాధించిన విద్యార్థులకు మెరిట్ ఆధారిత స్కాలర్‌షిప్‌తో పాటుగా స్టైపెండ్ మరియు ల్యాప్‌టాప్ వంటి రివార్డులు అందిస్తారు.
స్కాలర్షిప్ పేరు | ఆల్ ఇండియా యూత్ స్కాలర్షిప్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ |
ఎవరు అర్హులు | ఇంటర్మీడియట్ (బైపీసీ & ఎంపీసీ) |
దరఖాస్తు తేదీ | 01 Jan 2022 - 15 July 2022 |
ఎగ్జామ్ తేదీ | 01 Aug 2022 - 15 Aug 2022 |
అడ్మిట్ కార్డు | 01 Aug 2022 - 05 Aug 2022 |
ఫలితాలు | Sep 2022 - Oct 2022 |
స్కాలర్షిప్ డిస్టిబ్యూషన్ | Nov 2022 - Nov 2022 |
ప్రవేశ పరీక్షలో 90 శాతానికి పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకు పూర్తి కోర్సుకు స్కాలర్షిప్ అందిస్తారు. వీటికి సంబంధించిన స్లాబుల పట్టిక కింద గమనించగలరు.
స్కాలర్షిప్ స్లాబ్స్
Marks in AIYSEE Exam | Engineering(Private/Government) | Medical (Private/Government) |
≥ 90% | 4 Years | 5 Years |
86% to 89% | 3 years | 3 Years |
81% to 85% | 1.5 Years | 2 Years |
76% to 80% | 1 Semester | 1 Year |
71% to 75% | 3 Months Stipend (6000/- pm) | 3 Months Stipend (6000/- pm) |
55% to 70% | Rewards(laptop/tab/kindle) | Rewards(laptop/tab/kindle) |
AIYSEE Examination
AIYSEE పరీక్షా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్/బయాలజీ అంశాలకు సంబంధించి 90 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా 90 నిముషాల నిడివితో ఉండే పరీక్షా ఈ పరీక్షా ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్‌లో పద్దతిలో అందుబాటులో ఉంటుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైపులో ప్రతి ప్రశ్న నాలుగు ఆప్షనల్ సమాదానాలు కలిగి ఉంటుంది. సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు 1 మార్కు కేటాయిస్తారు, తప్పు సమాధానం ఇచ్చిన ప్రశ్నకు 0.25 మార్కులు తొలగిస్తారు.
పేపర్ | ప్రశ్నలు | మార్కులు | సమయం |
ఫిజిక్స్ కెమిస్ట్రీ మాథ్స్ /బయాలజీ |
30 ప్రశ్నలు 30 ప్రశ్నలు 30 ప్రశ్నలు |
30 మార్కులు 30 మార్కులు 30 మార్కులు |
90 నిముషాలు |
ఎలా దరఖాస్తు చేయాలి
ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులు AIYSEE వెబ్‌సైట్ ద్వారా మీ సొంత ఇమెయిల్ సహాయంతో అకౌంట్ రిజిస్టర్ చేసుకోవాలి. ఎగ్జామ్ నోటిఫికేషన్ సమయంలో అవసరమయ్యే ధ్రువపత్రాలతో ఇదే అకౌంట్ నుండి AIYSEE పరీక్షకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే దరఖాస్తు ఫీజుగా ప్రతి అభ్యర్థి 1150/- రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు చెల్లించిన విద్యార్థులకు జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలకు సరిపడే ప్రాక్టీస్ టెస్ట్ కిట్ అందిస్తారు. ఈ కిట్ దరఖాస్తు చేసిన నుండి ఏడాది వరకు ఉపయోగించుకోవచ్చు. దీనితో పాటుగా అన్ని పరీక్షలకు సంబంధించి గైడెన్స్ మరియు వాటి నోటిఫికేషన్ సమాచారం విద్యార్థికి అందిస్తారు. అలానే ఇంజనీరింగ్ మరియు మెడిసిన్ అడ్మిషన్ అసిస్టెన్స్ అందిస్తారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేసిన విద్యార్థులకు ప్రవేశ పరీక్షా తేదీతో పాటుగా పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలు అందిస్తారు.
ఆఫ్‌లైన్‌లో పరీక్ష రాసేవారికి అందుబాటులో ఉండే పరీక్షా కేంద్రాలు
Bhubaneswar, Chennai, Cuttack, Hyderabad, Tirupati,Vijaywada, Vishakhapatnam, Warangal.
స్కాలర్షిప్ డిస్టిబ్యూషన్
AIYSEE పరీక్షలో 55 శాతం కనీస మార్కులు సాధించిన విద్యార్థులకు స్కాలర్‌షిప్ స్లాబులలో చోటు కల్పిస్తారు. విద్యార్థి ఇంజనీరింగ్ లేదా మెడికల్ కోర్సులలో అడ్మిషన్ ప్రక్రియ పూర్తిచేసుకుని, వాటి వివరాలను AIYSEE వెబ్‌సైట్ యందు విద్యార్థి రిజిస్టర్ ఐడీ సహాయంతో పొందుపరచాల్సి ఉంటుంది. అడ్మిషన్ వివరాలు సక్రమంగా ఉండే విద్యార్థులకు AIYSEE లో సాధించిన మార్కుల ఆధారంగా, స్లాబ్ ప్రకారం స్కాలర్షిప్ అందిస్తారు.