సీయూఈటీ (పీజీ) 2024 నోటిఫికేషన్ మరియు షెడ్యూల్
Admissions NTA Exams University Entrance Exams

సీయూఈటీ (పీజీ) 2024 నోటిఫికేషన్ మరియు షెడ్యూల్

సెంట్రల్ యూనివర్శిటీలలో పోస్టుగ్రాడ్యుయేట్ ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే సీయూఈటీ (పీజీ) 2024 నోటిఫికేషన్ వెలువడింది. సీయూఈటీ అనగా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అని అర్ధం. గతంలో ఈ పరీక్షను సీయూసెట్ పేరుతొ నిర్వహించే వారు. సీయూఈటీ ప్రవేశ పరీక్ష ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 44 సెంట్రల్ యూనివర్శిటీల యందు ప్రవేశం పొందొచ్చు.

  • తెలుగు రాష్ట్రాలలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యందు అడ్మిషన్ పొందేందుకు ఈ పరీక్ష రాయాల్సిందే.
  • సీయూఈటీ పరీక్ష ద్వారా కేవలం సెంట్రల్ యూనివర్సిటీల యందు మాత్రమే కాకుండా స్టేట్, ప్రైవేట్ మరియు వివిధ డ్రీమ్డ్ యూనివర్శిటీల యందు కూడా ప్రవేశం పొందొచ్చు.
  • ఈ అవకాశం సీయూఈటీ కోసం జాబితా చేయబడ్డ సదురు యూనివర్శిటీలకు మాత్రమే వర్తిస్తుంది.
  • ఈ జాబితా సీయూఈటీ పోర్టల్ యందు అందుబాటులో ఉంటుంది.

దేశంలో ఉన్నత విద్యకు సంబంధించి పరిశోధనాత్మక ప్రోగ్రాంలకు సెంట్రల్ యూనివర్సిటీలు కేంద్ర బిందువుగా ఉన్నాయి. ప్రతిభావంతులైన పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ దేశానికి వెలకట్టలేని మానవ వనరులను అందిస్తున్నాయి. ఈ కారణంగానే కేంద్ర విశ్వవిద్యాలయాలకు సంబంధించి జరిగే సీయూఈటీ పరీక్షకు విద్యార్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు.

సీయూఈటీ పీజీ ఆధారంగా దాదాపు 344 పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులతో పాటుగా 271 రీసెర్చ్ ప్రోగ్రాంలలో ప్రవేశం పొందొచ్చు. సీయూఈటీ పీజీ పరీక్షను ఈ ఏడాది ఇంగ్లీష్ మీడియంతో పాటుగా అన్ని రాష్ట్రాల స్థానిక బాషలలో నిర్వహిస్తున్నారు. స్థానిక బాషలలో పరీక్షను రాయాలనుకునే వారు తమ సొంత రాష్ట్రంలో పరీక్ష కేంద్రంను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

సీయూఈటీ (పీజీ) ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు 50 శాతం మార్కులతో గుర్తింపు పొందిన బోర్డు నుండి అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
  • దరఖాస్తు చేసేందుకు ఎటువంటి వయోపరిమితి లేదు.
  • విదేశీయులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • స్థానిక భాషలో పరీక్షను రాయాలనుకునే అభ్యర్థులు సొంత రాష్ట్రంలో ఎగ్జామ్ సెంటర్ ఎంపిక చేసుకోవాలి.

సీయూఈటీ (పీజీ) 2024 ముఖ్యమైన తేదీలు

సీయూఈటీ దరఖాస్తు ప్రారంభం 26 డిసెంబర్ 2023
సీయూఈటీ దరఖాస్తు చివరి గడువు 29 జనవరి 2024
అడ్మిట్ కార్డు 07 మార్చి 2024
సీయూఈటీ ఎగ్జామ్ తేదీ 11 - 28 మార్చి 2024
సీయూఈటీ రిజల్ట్స్ ఏప్రిల్ 2024

సీయూఈటీ (పీజీ) ఎగ్జామ్ ఫీజు

రిజర్వేషన్ కేటగిరి జనరల్ కేటగిరి ఓబీసీ ఎస్సీ, ఎస్టీ & ఇతరులు విదేశీయులు
2 సబ్జెక్టుల వరకు ₹ 1,200/- ₹ 1,000/- ₹ 900/- ₹ 6,000/-
ఒక్కో అదనపు పేపర్‌కు ₹ 600/- ₹ 500/- ₹ 500/- ₹ 2,000/-

సీయూఈటీ (పీజీ) ఎగ్జామ్ సెంటర్లు

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ
అమరావతి, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గూడూరు, గుత్తి, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తణుకు, తెనాలి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం హైదరాబాద్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సికింద్రాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, గద్వాల్, హయత్‌నగర్, వికారాబాద్, మంచేరియల్, మెదక్.

సీయూఈటీ (పీజీ) దరఖాస్తు విధానం

సీయూఈటీ పీజీ దరఖాస్తు పక్రియను ఆన్‌లైన్ విధానంలో చేపడతారు. సెంట్రల్ యూనివర్సిటీ అధికారిక ఎగ్జామ్ పోర్టల్ (www.cuet.samarth.ac.in) నుండి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో సీయూఈటీ కోరిన విద్య, వ్యక్తిగత, చిరునామా సమాచారం తప్పులు దొర్లకుండా పొందుపర్చాలి. అలానే దరఖాస్తుకు సంబంధించి ప్రొఫైల్ పాస్‌వర్డ్ రూపొందించుకోవాలి.

రిజర్వేషన్ కేటగిరి, కోర్సు ఎంపిక, యూనివర్సిటీ ఎంపిక, లాంగ్వేజ్ ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి ముఖ్యమైన వివరాలు దరఖాస్తులో నింపాల్సి ఉంటుంది. చివరిగా ఎగ్జామ్ ఫీజు చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది.

ప్రవేశ పరీక్షకు సంబంధించి సమస్త సమాచారం మెయిల్ మరియు మొబైల్ ద్వారా అందజేస్తారు. అందువలన అభ్యర్థులు ఖచ్చితమైన ఫోన్ నెంబర్ మరియు మెయిల్ ఐడీలు అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ విజయవంతమయ్యాక సంబంధిత దరఖాస్తు ప్రింట్ తీసి మీ వద్ద భద్రపర్చుకోండి.

సీయూఈటీ (పీజీ) ఎగ్జామ్ నమూనా

  • సీయూఈటీ పీజీ పరీక్షను 2 గంటల నిడివితో సీబీటీ ఆధారంగా నిర్వహిస్తారు.
  • ప్రశ్నపత్రం 100 ప్రశ్నలతో రెండు భాగాలుగా ఇవ్వబడుతుంది.
  • ఇందులో పార్ట్ A లో 25 ప్రశ్నలు, పార్ట్ B లో 75 ప్రశ్నలు లెక్కన ఇవ్వబడతాయి.
  • ప్రశ్నలు మరియు సిలబస్ అభ్యర్థి ఎంపిక చేసుకున్న పేపర్ కోడ్ ఆధారంగా మారుతుంటాయి.

సీయూఈటీ పీజీ పరీక్షను రోజుకు రెండు సెషన్ల చెప్పున ఉదయం, మధ్యాహ్నం నిర్వహిస్తారు. అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్టులను అనుచరించి ఆయా సెషన్లలో హాజరుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ గ్రాడ్యుయేట్ సిలబస్ ఆధారితంగా ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 4 మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానం చేసిన ప్రశ్నకు ఒక మార్కు తొలగిస్తారు.

ప్రశ్నల నమూనా పేపర్ కోడ్
1 పార్ట్ A : లాంగ్వేజ్ కంప్రహెన్షన్ & వెర్బల్ ఎబిలిటీ (25 ప్రశ్నలు)
పార్ట్ B : ఆప్షనల్ సబ్జెక్టు నుండి టీచింగ్ ఆప్టిట్యూడ్, సోషల్ సైన్సెస్, మాథ్స్, సైన్స్ (75 ప్రశ్నలు)
PGQP01
పార్ట్ A : లాంగ్వేజ్ కంప్రహెన్షన్ & వెర్బల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, జనరల్ అవెర్నెస్ (25 ప్రశ్నలు)
పార్ట్ B : ఆప్షనల్ సబ్జెక్టు (75 ప్రశ్నలు)
PGQP02 to PGQP07
PGQP09 to PGQP37
PGQP39
PGQP41 to PGQP59
PGQP61 to PGQ73
PGQP75 to PGQ77
2 పార్ట్ A : లాంగ్వేజ్ కంప్రహెన్షన్ & జనరల్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ  (25 ప్రశ్నలు)
పార్ట్ B : ఆప్షనల్ సబ్జెక్టు - సివిల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ (75 ప్రశ్నలు)
PGQP08
PGQP74
PGQP78
పార్ట్ A : జనరల్ అవెర్నెస్, మ్యాథమెటికల్ ఎబిలిటీ & లాజికల్ రీజనింగ్ (25 ప్రశ్నలు)
పార్ట్ B : ఆప్షనల్ లాంగ్వేజ్ (75 ప్రశ్నలు)
PGQP60
3 లాంగ్వేజ్ కాంప్రహెన్షన్/ వెర్బల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్/ క్వాంటిటేటివ్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ మరియు లాజికల్ రీజనింగ్ (100 ప్రశ్నలు) PGQP38
లాంగ్వేజ్ కాంప్రహెన్షన్/ వెర్బల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్/ క్వాంటిటేటివ్ ఎబిలిటీ, కంప్యూటర్ బేసిక్స్ మరియు లాజికల్ రీజనింగ్ (100 ప్రశ్నలు) PGQP40

సీయూఈటీ (పీజీ) అడ్మిషన్ విధానం

  • సీయూఈటీ పీజీలో సాధించిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు నిర్వహిస్తారు.
  • యూజీసీ అడ్మిషన్ నియమ నిబంధనలను అనుచరించి ప్రతి కోర్సులో ఆయా రిజర్వేషన్ కోటా ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.
  • యూనివర్సిటీలలో అందుబాటులో కోర్సులను మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
  • కౌన్సిలింగ్ సంబంధిత సమాచారం ఆయా సెంట్రల్ యూనివర్సిటీ వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయి.
  • మరిన్ని వివరాల కోసం ఈ క్రింది లింకును ప్రెస్ చేయండి.

Helpdesk (10:00 AM - 6:00 PM)

Mobile No. : 18004253800

Email Id : dgmcs.cc@sbi.co.in

Post Comment