యూపీఎస్సీ సీడీఎస్ ఎగ్జామినేషన్ (II) నోటిఫికేషన్ 2023 విడుదల
Latest Jobs UPSC

యూపీఎస్సీ సీడీఎస్ ఎగ్జామినేషన్ (II) నోటిఫికేషన్ 2023 విడుదల

2023 ఏడాదికి సంబంధించి భారతీయ త్రివిధ దళాల్లో వివిధ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ II నోటిఫికేషన్ విడుదల అయ్యింది. యూపీఎస్సీ నిర్వహించే ఈ నియామక ప్రకటనకు డిగ్రీ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.

ఈ నియామక ప్రకటన ద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నావల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ మరియు ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీల్లో దాదాపు 395 ఖాళీలను భర్తీచేయున్నారు. ఎంపిక పక్రియ రాత పరీక్ష మరియు సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.

ఎంపికైన అభ్యర్థులకు ఆయా అకాడమీల్లో పోస్టుగ్రాడ్యుయేషన్ విద్యతో పాటుగా సాయుధ దళాల ట్రైనింగ్ అందిస్తారు. అర్హులైన అభ్యర్థులు 06 జూన్ 2023 లోపు దరఖాస్తు చేసుకోండి.

నోటిఫికేషన్ నెంబర్ 11/2023.CDS-II
పోస్టుల సంఖ్యా 349
నోటిఫికేషన్ తేదీ 17/05/2023
దరఖాస్తు తుది గడువు 06.06.2023
పరీక్ష ఫీజు 200/-
పరీక్ష తేదీ 03/09/2023

యూపీఎస్సీ సీడీఎస్ 2023 ఖాళీలు

డిఫెన్స్ కోర్సు ఖాళీల సంఖ్యా
ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ 100
ఇండియన్ నావల్ అకాడమీ ఎజిమాలా 32
ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ 32
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై (మెన్) 169
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై (ఉమెన్) 16
మొత్తం ఖాళీలు 349

యూపీఎస్సీ సీడీఎస్ ఎగ్జామ్

భారత త్రివిధ దళాలకు చెందిన ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ, ఇండియన్ నావెల్ అకాడమీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలలో అధికారులను నియమించేందుకు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.

యూపీఎస్సీ నిర్వహించే ఈ నియామక పరీక్ష, యేటా రెండు సార్లు జరుగుతుంది. మే మరియు అక్టోబర్ నెలలో నోటిఫికేషన్ విడుదల చేసి సెప్టెంబర్ మరియు ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులను ఆన్‌లైన్ రాతపరీక్ష మరియు సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

యూపీఎస్సీ సీడీఎస్ ఎలిజిబిలిటీ

  • జాతీయత: ఇండియా, భూటాన్, నేపాల్ దేశాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
  • 1962 కు ముందు ఇండియాకు వచ్చి స్థిరపడిన టిబెటియన్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • భారత్ లో శాశ్వతంగా స్థిరపడేందుకు వచ్చిన పాకిస్తాన్, శ్రీలంక, బర్మా మరియు కెన్యా, ఉగాండా, జాంబియా దెసలకు చెందిన వారుకూడా అర్హులు.
  • వయోపరిమితి:  అభ్యర్థుల వయసు 18 నుండి 23 ఏళ్ళ మధ్య ఉండాలి.
  • వైవాహిక స్థితి : అభ్యర్థులు తప్పనిసరి అవివాహితులై ఉండాలి. ట్రయినింగ్ పూర్తయ్యే వరకు వివాహానికి అనుమతించారు.
  • విద్య అర్హుత:  మిలిటరీ అకాడమీ మరియు ఆఫిసర్ ట్రయినింగ్ అకాడమీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
  • ఇండియన్ నావెల్ అకాడమీకి దరఖాస్తు చేసే అభ్యర్థులు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
  • ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్డ్యులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ( ఇంటర్మీడియేట్ లో మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుకుని ఉండాలి) డిగ్రీ లేదా ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉండాలి.
  • కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ నిబంధనలు అనుచరించి అభ్యర్థులు శారీరకంగా ఫిట్ గా ఉండాలి.

యూపీఎస్సీ సీడీఎస్ దరఖాస్తు ఫీజు

కేటగిరి దరఖాస్తు ఫీజు
జనరల్ అభ్యర్థులు 200/-
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము లేదు

యూపీఎస్సీ సీడీఎస్ దరఖాస్తు విధానం

కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షకు పోటీపడే అభ్యర్థులు యుపిఎస్‌సి అధికారిక వెబ్సైటు ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. యూపీఎస్‌సీ కొత్తగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూపీఎస్‌సీ ఉద్యోగ భర్తీ ప్రకటన విడుదలయ్యే ప్రతీసారి, అభ్యర్థి తమ పూర్తి వివరాలు నమోదుచేయాల్సిన బెడద లేకుండా, వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను తీసుకొచ్చింది. ఇక మీదట యూపీఎస్‌సీ పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది.

ఇప్పటికే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ పూర్తిచేసిన వారు సంబంధిత వివరాలతో లాగిన్ అయ్యి, నియామక నోటిఫికేషన్ ఎంపిక చేసుకుని దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓటీఆర్ అకౌంట్ లేనివారు కొత్తగా రూపొందించుకోవాలి. ఓటీఆర్ దరఖాస్తులో అభ్యర్థి వ్యక్తిగత, విద్య, చిరునామా వివరాలు సరి చూసుకొని, ప్రస్తుత నియామక పరీక్షకు సంబందించిన ఎంపికలను నమోదు చేయాల్సి ఉంటుంది.

రెండవ దశలో అందుబాటులో ఉన్న పేమెంట్ విధానంలో దరఖాస్తు ఫీజు చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది. ప్రతి అభ్యర్థి గరిష్టంగా ఒక్క దరఖాస్తు మాత్రమే చేయాలి. దరఖాస్తు సమయంలో ఖచ్చితమైన వివరాలు అందించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ద్వారా అందించే తప్పుడు సమాచారంకు పూర్తి బాధ్యత అభ్యర్థులే వహించాలి. వయస్సు ధ్రువపత్రం, విద్యా అర్హత ధ్రువపత్రాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందినవారు ఇడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ మరియు  అవసరమైన వారు వయసు సడలింపు ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలి.

యుపిఎస్‌సి పరీక్షకు సంబంధించిన సమస్త సమాచారం ఇమెయిల్ మరియు మొబైల్ ఫోన్లకు పంపిస్తుంది. ఇమెయిల్ మరియు మొబైల్ అందుబాటులో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత అభ్యర్థులదే.

తెలుగు రాష్ట్రాలలో ఎగ్జామ్ సెంటర్లు

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ
విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి హైదరాబాద్, వరంగల్

యూపీఎస్సీ సీడీఎస్ ఎగ్జామ్ నమూనా

కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ రెండు దశలలో జరుగుతుంది. మొదటి దశలో 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో  ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సంబంధించి మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ 100 ప్రశ్నలతో, 2 గంటల నిడివితో, 300 మార్కులకు జరుగుతుంది.

ఆఫీసర్ ట్రయినింగ్ అకాడమీ సంబంధించిన అభ్యర్థులకు రెండు పేపర్లతో, 200 మార్కులకు జరుగుతుంది. ప్రశ్న పత్రాలు ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటాయి. ఇంగ్లీష్ మరియు హిందీ బాషలలో అందుబాటులో ఉంటాయి.

స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ రాతపరీక్ష & ఎస్ఎస్‌బి ఇంటర్వ్యూ
మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఆఫ్‌లైన్
సబ్జెక్టులు ఇంగ్లీష్ 100 ప్రశ్నలు
 జనరల్ నాలెడ్జ్ 100 ప్రశ్నలు
గణితం 100 ప్రశ్నలు
ఎగ్జామ్ నిడివి ఒక్కో పేపర్ 2 గంటలు
ప్రశ్నల సంఖ్యా 300 ప్రశ్నలు – IMA, INA AFA
200 ప్రశ్నలు – OTA
ఎగ్జామ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ & హిందీ

 

IMA, INA AFA ఎగ్జామ్ నమూనా
పేపర్ మార్కులు మరియు సమయం
ఇంగ్లీష్ (120 ప్రశ్నలు ) 100 మార్కులు (2 గంటలు )
జనరల్ నాలెడ్జ్ (120 ప్రశ్నలు ) 100 మార్కులు (2 గంటలు )
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ (120 ప్రశ్నలు ) 100 మార్కులు (2 గంటలు )
మొత్తం 300 మార్కులు (300 ప్రశ్నలు )
OTA ఎగ్జామ్ నమూనా
ఇంగ్లీష్ (120 ప్రశ్నలు ) 100 మార్కులు (2 గంటలు )
జనరల్ నాలెడ్జ్ (120 ప్రశ్నలు ) 100 మార్కులు (2 గంటలు )
మొత్తం 200 మార్కులు (200 ప్రశ్నలు )

యూపీఎస్సీ సీడీఎస్ ఎంపిక విధానం

రాతపరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు సెలక్షన్ సర్వీసెస్ బోర్డు ఇంటర్వ్యూ కాల్ లేటర్ పంపిస్తుంది. ఇంటర్వ్యూ మరియు రాతపరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

రాతపరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులను రిజర్వేషన్ మరియు జండర్ వారీగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. మెరిట్ లిస్టులో చోటు పొందిన వారికి తర్వాత దశలో ఫీజికల్ మరియు మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. ఈ రెండు పరీక్షలో అర్హుత పొందిన వారికీ చివరిగా ట్రైనింగ్ కోసం ఎంపిక చేస్తారు. ఫీజికల్ మరియు మెడికల్ టెస్టులకు సంబంధించి పూర్తి సమాచారం నోటిఫికేషన్ ద్వారా పొందగలరు.

ప్రాథమిక పరిశీలనలో చెవిలో వాక్స్, డివియేటెడ్ నాసల్ సెప్టం, హైడ్రోసెల్/ఫిమోసిస్, అధిక బరువు/తక్కువ బరువు. ఛాతీ సైజు తక్కువ, పైల్స్, గైనెకోమాస్టియా, టాన్సిలిటిస్, వరికోసెల్ వంటి అనారోగ్య మరియు లోపాలు ఉండే అభ్యర్థులను తొలగిస్తారు. రెండవ దశలో శారీరక దారుడ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో అర్హుత పొందిన వారికీ ఇతర మెడికల్ టెస్టులు నిర్వహించి ఎంపిక చేస్తారు.

Post Comment