Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 04, 2023
Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 04, 2023

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 04, 2023. జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు తాజా సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్సీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వే వంటి  వివిధ పోటీ పరీక్షల కోసం సిద్దమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఇవి రూపొందించబడ్డాయి.

భారతదేశ జిడిపి అంచనాను 6.4 శాతానికి పెంచిన మోర్గాన్ స్టాన్లీ

బహుళజాతి పెట్టుబడి బ్యాంకు అయినా మోర్గాన్ స్టాన్లీ భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను దాని మునుపటి అంచనా 6.2 శాతం నుండి 6.4 శాతానికి పెంచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ తన ప్రపంచ దేశాలతో పోలిస్తే వేగంగా వృద్ధి చెందుతుందని మోర్గాన్ స్టాన్లీ ఒక నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసిక డేటాలో సానుకూల ఫలితాల ఆధారంగా దీనిని సవరించింది.

భారతదేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడే కొన్ని అంశాలలో బలమైన దేశీయ డిమాండ్, మౌలిక సదుపాయాల అభివృద్ధి, తయారీ రంగంపై ప్రభుత్వం దృష్టి, పెరుగుతున్న ఎగుమతులు, పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరచడం యువ మరియు పెరుగుతున్న జనాభా వంటి అంశాలు ఉన్నాయి. మోర్గాన్ స్టాన్లీ యొక్క రేటింగ్, గోల్డ్‌మన్ సాక్స్ మరియు సిటీ గ్రూప్ వంటి ఇతర ప్రధాన ఆర్థిక సంస్థలతో సమానంగా ఉంది.

వాస్తవానికి, అధిక ద్రవ్యోల్బణం మరియు నిరుద్యోగం వంటి సమస్యలను కూడా భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటుంది. అయితే ప్రతికూల కారకాల కంటే సానుకూల అంశాలు ఎక్కువగా ఉండటం కారణంగా రాబోయే సంవత్సరాల్లో స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించడానికి భారతదేశం మంచి స్థానంలో ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ బిల్లును ప్రవేశపెట్టనున్న అస్సాం ప్రభుత్వం

బహుభార్యాత్వాన్ని నిషేధించే బిల్లును అస్సాం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు హిమంత బిస్వా శర్మ ప్రభుత్వం యోచిస్తుంది. ఈ బిల్లును డిసెంబర్ 2023లో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. బహుభార్యత్వం అనేది మహిళలు మరియు బాలికల హక్కులను ఉల్లంఘించే హానికరమైన ఆచారం. ఇది గృహ హింస, పిల్లల నిర్లక్ష్యం మరియు వివక్ష వంటి అనేక సామాజిక సమస్యలకు దారి తీస్తుంది.

అస్సాంలో బహుభార్యత్వంపై నిషేధం రాష్ట్రంలోని మహిళలు మరియు బాలికల హక్కులను పరిరక్షించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అవుతుంది. ఇది అస్సాం ప్రభుత్వానికి లింగ సమానత్వానికి ప్రాధాన్యత అని బలమైన సందేశాన్ని కూడా పంపుతుంది. బహుభార్యత్వాన్ని నిషేధించే నిర్ణయం ఆగష్టు 2023లో అస్సాం క్యాబినెట్ తీసుకుంది. బహుభార్యత్వాన్ని నిషేధించడం వల్ల కలిగే చట్టపరమైన మరియు సామాజిక చిక్కులను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

ఈ కమిటీ తన నివేదికను సెప్టెంబర్ 2023లో ప్రభుత్వానికి సమర్పించింది. ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బిల్లు ద్వారా అన్ని మతాలకు చెందిన బహుభార్యత్వాన్ని నిషేధించాలని భావిస్తున్నారు. ఇది ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకోవడం కూడా క్రిమినల్ నేరంగా పరిగణిస్తుంది. అయితే ఈ బిల్లు వివాదాస్పదమయ్యే అవకాశం కూడా ఉంది. సభలో మెజారిటీ ఉండటంతో ఇది అసెంబ్లీ ఆమోదం పొందుతుందని అస్సాం ప్రభుత్వం విశ్వసిస్తోంది.

2023 పురుషుల 5ఎస్ హాకీ ఆసియా కప్‌ విజేతగా భారత్

ఒమన్‌లోని సలాలాలో జరిగిన ప్రారంభ పురుషుల హాకీ 5ఎస్ ఆసియా కప్ 2023లో భారత్ ఫైనల్‌లో పెనాల్టీ షూటౌట్‌లో పాకిస్థాన్‌ను ఓడించి విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు చెందిన మహ్మద్ రహీల్ రెండు గోల్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ తరఫున జుగ్రాజ్ సింగ్, మణిందర్ సింగ్ కూడా గోల్స్ చేశారు. పాకిస్థాన్‌కు చెందిన అర్షద్‌ లియాఖత్‌, ముహమ్మద్‌ ముర్తాజా చెరో రెండు గోల్స్‌ చేశారు. పెనాల్టీ షూటౌట్‌లో పాక్‌ రెండు ప్రయత్నాలను కాపాడిన భారత గోల్‌కీపర్‌ సూరజ్‌ కర్కేరా హీరో ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.

ఈ విజయం ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ5 ప్రపంచ కప్ ఒమన్ 2024కి ఆసియా క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌గా నివహించబడింది. విజేతగా నిలవడం ద్వారా భారతదేశం ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ5ల ప్రపంచ కప్ ఒమన్ 2024కి అర్హత సాధించింది. హాకీ 5 ఫార్మాట్‌లో పాకిస్థాన్‌ను భారత్ ఓడించడం ఇదే తొలిసారి.

డురాండ్ కప్ 2023 విజేతగా మోహన్ బగాన్ సూపర్ జెయింట్

సాల్ట్ లేక్ స్టేడియంలో డ్యూరాండ్ కప్ 2023 ఫైనల్‌లో మోహన్ బగాన్ జట్టు 1-0తో ఈస్ట్ బెంగాల్‌ను ఓడించి 23 సంవత్సరాల తర్వాత మొదటిసారి డురాండ్ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ విజయంతో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ డ్యూరాండ్ కప్ చరిత్రలో 17 టైటిళ్లను గెలుచుకున్న మొదటి జట్టుగా నిలిచింది.

ఈస్ట్ బెంగాల్ జట్టు కూడా డ్యూరాండ్ కప్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉంది. ఈ టోర్నమెంట్‌లో రికార్డు స్థాయిలో 16 టైటిళ్లను గెలుచుకుంది. ఇండియన్ సూపర్ లీగ్ వివరాల ప్రకారం, 2010 తర్వాత ఈస్ట్ బెంగాల్ మరియు మోహన్ బగాన్ ప్రధాన టోర్నమెంట్‌లో ఫైనల్‌లో తలపడడం ఇదే మొదటిసారి. 2010లో ఫెడరేషన్ కప్ ఫైనల్‌లో ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సి 1-0తో మోహన్ బగాన్‌ను చివరిగా ఓడించింది.

జెట్ ఎయిర్‌వేస్ మరియు గో ఫిస్ట్‌ల ఎయిర్‌లైన్స్ కోడ్‌లు రద్దు

ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్,  గో ఫస్ట్ మరియు జెట్ ఎయిర్‌వేస్‌కు కేటాయించిన “G8” మరియు “9W” అనే ఎయిర్‌లైన్ కోడ్‌లను నాన్-ఆపరేషనల్ కారణంగా ఉపసంహరించుకుంది. రిజర్వేషన్‌లు, షెడ్యూల్‌లు, టైమ్‌టేబుల్స్, టెలికమ్యూనికేషన్స్, టికెటింగ్, కార్గో డాక్యుమెంటేషన్, చట్టపరమైన విషయాలు, టారిఫ్‌లు మరియు ఇతర వాణిజ్య మరియు ట్రాఫిక్ సంబంధిత ప్రయోజనాల వంటి వివిధ ప్రయోజనాల కోసం ఈ ఎయిర్‌లైన్ డిజైనర్ కోడ్‌లను కంపెనీలకు కేటాయిస్తుంది.

గోఎయిర్ అని పిలిచే గో ఫస్ట్, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మే 2023 ప్రారంభంలో వాణిజ్య విమానాల సేవలను నిలుపుదల చేసింది. జెట్ ఎయిర్‌వేస్ ఆర్థిక దివాలా కారణంగా ఏప్రిల్ 2019 నుండి సేవల నుండి విరమించుకుంది. ఈ ఎయిర్‌లైన్ కోడ్‌ల ఉపసంహరణ రెండు విమానయాన సంస్థలకు టికెటింగ్, రిజర్వేషన్‌లు మరియు బ్యాగేజీ నిర్వహణ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తుంది. ఇది ప్రయాణీకులకు వారి విమానాలను ట్రాక్ చేయడం మరియు టిక్కెట్లను బుక్ చేసుకోవడం మరింత కష్టతరం చేస్తుంది.

Post Comment