జీప్యాట్ ప్రవేశ పరీక్షను ఎంఫార్మా మరియు వాటి అనుబంధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. జీప్యాట్ అనగా గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని అర్ధం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష ద్వారా, దేశ వ్యాప్తంగా ఎఐసీటీఈ గుర్తింపు పొందిన దాదాపు 800 కి పైగా ఫార్మా ఇనిస్టిట్యూట్లు, టెక్నికల్ ఇనిస్టిట్యూట్లు, యూనివర్సిటీలు, కాలేజీల్లో అడ్మిషన్ పొందొచ్చు.
జీప్యాట్ 2023
Exam Name | GPAT 2023 |
Exam Type | Entrance Exam |
Admission For | M.Pharmacy Courses |
Exam Date | NA |
Exam Duration | 3 Hours |
Exam Level | National Level |
జీప్యాట్ పూర్తి వివరాలు
జీప్యాట్ ఎలిజిబిలిటీ
- దరఖాస్తుదారుడు భారత పౌరుడు అయి ఉండాలి.
- అడ్మిషన్ పొందే సమయానికి 4ఏళ్ళ ఫార్మసీ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత అయి ఉండాలి.
- బీటెక్ ఫార్మాసిటీకాల్ మరియు కెమికల్ టెక్నాలజీ వంటి కోర్సులు చేసినవారు అనర్హులు.
- ఈ పరీక్ష రాసేందుకు ఎటువంటి వయోపరిమితి లేదు.
జీప్యాట్ 2023 ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభం | 12 ఫిబ్రవరి 2023 |
దరఖాస్తు తుది గడువు | 06 మార్చి 2023 |
చేర్పులు - మార్పులు | 7 - 9 మార్చి 2023 |
హాల్ టికెట్ డౌన్‌లోడ్ | NA |
పరీక్ష తేదీ | NA |
ఫలితాలు | NA |
కౌన్సిలింగ్ | NA |
జీప్యాట్ దరఖాస్తు ఫీజు
జీప్యాట్ దరఖాస్తు రుసుములు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా ఈ చలానా విధానంలో చెల్లించవచ్చు. చెల్లింపు సమయంలో సర్వీస్ చార్జీలు , జీఎస్టీ వంటి అదనపు చార్జీలు ఉంటె అభ్యర్థులనే భరించాలి.
జనరల్ కేటగిరి | పురుషులు 2000/- | మహిళలు 1000/- |
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ , EWS | పురుషులు 1000/- | మహిళలు 1000/- |
ట్రాన్స్ జండర్లు | 1000/- |
జీప్యాట్ దరఖాస్తు ప్రక్రియ
జీప్యాట్ దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. జీప్యాట్ కు చెందిన అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు సంబంధిత సర్టిఫికేట్లు అన్ని అందుబాటులో ఉంచుకోవాలి. దరఖాస్తు సమయంలో అందించే సమాచారంకు పూర్తి జవాబుదారీ మీరే కాబట్టి ఇచ్చే సమాచారంలో తప్పులు దొర్లకుండా చూసుకోండి.
దరఖాస్తులో సమర్పించే ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసే ముందు పునఃపరిశీలించుకోండి. దరఖాస్తు పూర్తిచేసాక మూడు లేదా నాలుగు కాపీలు ప్రింట్ తీసి భద్రపర్చండి.
- వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు.
- మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు.
- ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో మాత్రమే అప్‌లోడ్ చేయండి. అవి తారుమారు ఐతే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-200 కేబీల మధ్య ఉండేలా చూసుకోండి.
- దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటోగ్రాఫ్ కు సమానమైనది ఇంకో ఫొటోగ్రాఫ్ ను పరీక్ష రోజు ఆయా పరీక్షకేంద్రంలో ఇవ్వాల్సి ఉంటుంది.
- అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి.
- పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
- అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి.
- నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు.
తెలుగు రాష్ట్రాలలో జీప్యాట్ ఎగ్జామ్ సెంటర్లు
- ఆంధ్రప్రదేశ్ : గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి మరియు విశాఖపట్నం.
- తెలంగాణ: హైదరాబాద్, వరంగల్
జీప్యాట్ పరీక్ష నమూనా
జీప్యాట్ ప్రవేశ పరీక్ష పూర్తి ఆన్‌లైన్ (సీబీటీ) విధానంలో జరుగుతుంది. మూడు గంటల నిడివితో జరిగే ఈ పరీక్షలో కెమిస్ట్రీ కి చెందిన వివిధ టాపిక్స్ నుండి మొత్తం 125 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇవ్వబడతాయి. ప్రతి ప్రశ్నకు నాలుగు వేరువేరు సమాదానాలు ఉంటాయి. అందులో నుండి ఒక సరైన సమాధానమును గుర్తించాలి.
సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు 4 మార్కులు. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నకు 1 ఋణాత్మక మార్కు ఇవ్వబడుతుంది. మొత్తం 500 మార్కులకు జరిగే ఈ ప్రవేశ పరీక్ష లో అభ్యర్థి సాధించిన స్కోర్ ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న ఫార్మసీ కాలేజీల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.
Type Of Questions | No Of Questions | Total Marks |
---|---|---|
Pharmaceutical Chemistry & Allied Subjects | 38 ప్రశ్నలు | 152 మార్కులు |
Pharmaceutics & Allied Subjects | 38 ప్రశ్నలు | 152 మార్కులు |
Pharmacognosy & Allied Subjects | 10 ప్రశ్నలు | 40 మార్కులు |
Pharmacology & Allied Subjects | 28 ప్రశ్నలు | 112 మార్కులు |
Other Subjects | 11 ప్రశ్నలు | 44 మార్కులు |
Total | 125 ప్రశ్నలు | 500 మార్కులు |
ప్రశ్న పత్రాలు ఇంగ్లీష్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంటాయి |
కెమిస్ట్రీ టాపిక్స్ : ఫిజికల్ కెమిస్ట్రీ, ఫిజికల్ ఫార్మసీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మాసిటీక్స్, ఫార్మకాలజీ, ఫార్మకోగ్నోసి, ఫార్మసిటీకాల్ అనాలిసిస్, బయో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, పాథో ఫీజియోలజీ, బయో ఫార్మాసిటీక్స్, ఫార్మాసిటీకాల్ మేనేజ్‌మెంట్, ఫార్మసిటీకాల్ ఇంజనీరింగ్, హాస్పిటల్ ఫార్మసీ, క్లినికల్ ఫార్మసీ.
జీప్యాట్ అడ్మిషన్ విధానం
జీప్యాట్ అడ్మిషన్ ప్రక్రియ ప్రవేశ పరీక్షలో అభ్యర్థులు సాధించిన స్కోర్ ఆధారంగా జరుగుతుంది. అభ్యర్థులు సాధించిన స్కోర్ ఆధారంగా మెరిట్ జాబితా తయారుచేసి ఆల్ ఇండియా వారీగా ర్యాంకులు విడుదల చేస్తారు. అడ్మిషన్ సమయంలో కేటగిరి వారి రిజర్వేషన్ వాటా ప్రకారం సీట్లు భర్తీచేస్తారు. 15% ఆల్ ఇండియా కోటా కింద కేంద్ర ప్రభుత్వ అధీనంలో నడిసే కాలేజీల్లో సీట్ల శాతం కింది విదంగా ఉంటుంది.
- ఎస్సీ లకు 15 శాతం సీట్లు
- ఎస్టీ లకు 7.5 శాతం సీట్లు
- ఓబీసీ లకు 27 శాతం సీట్లు
- వికలాంగుల కోటాలో 5 శాతం సీట్లు
ఇతర డ్రీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ ఇనిస్టిట్యూట్లు లలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(AICTE) నియమాల అనుసారం కేటగిర్ల వారీగా, ఇనిస్టిట్యూట్ల వారీగా, ప్రాంతీయత ఆదరంగా సీట్లు భర్తీచేస్తారు.