భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 300 ప్రకారం యూనియన్ ఆఫ్ ఇండియాగా పిలవబడే భారత ప్రభుత్వం, ప్రధానంగా కార్యనిర్వాహక, శాసనసభ మరియు న్యాయవ్యవస్థతో కూడి ఉంటుంది. భారత రాజ్యాంగం ప్రకారం భారత రాష్ట్రపతి దేశాధినేత మరియు భారత సాయుధ దళాలకు కమాండర్-ఇన్-చీఫ్'గా ఉంటారు. రాష్ట్రపతి తర్వాత ప్రధాన మంత్రి, పార్లమెంట్, మరియు సుప్రీం కోర్టులు ఉంటాయి.
ప్రధానమంత్రి కార్యనిర్వాహక అధిపతిగా వ్యవహరిస్తారు మరియు కేంద్ర ప్రభుత్వాన్ని నడపడానికి బాధ్యత వహిస్తారు. పార్లమెంట్ యందు ఉభయసభల వ్యవస్థ ఉంటుంది. దిగువ సభను లోక్‌సభ అని మరియు ఎగువ సభను రాజ్యసభ అంటారు. లోక్‌సభ అనేది తాత్కాలిక సభ. ఇది అధికారంలో ఉన్న పార్టీ సభలోని మెజారిటీ మద్దతును కోల్పోయినప్పుడు రద్దు చేయబడుతుంది. రాజ్యసభ శాశ్వత సభ. ఇది ఎప్పటికీ రద్దు చేయబడదు. రాజ్యసభ సభ్యులు ఆరు సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడతారు.
న్యాయవ్యవస్థలో అత్యున్నత న్యాయస్థానంగా సుప్రీం కోర్టు ఉంటుంది. దీనికి అనుబంధంగా దేశ వ్యాప్తంగా 25 హైకోర్టులు మరియు అనేక జిల్లా న్యాయస్థానాలు ఉంటాయి. పార్లమెంటుకు పూర్తి నియంత్రణ మరియు సార్వభౌమాధికారం లేదు. ఎందుకంటే దాని చట్టాలు సుప్రీంకోర్టు న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయి. అయినప్పటికీ, ఇది కార్యనిర్వాహక అధికారులపై కొంత నియంత్రణను కలిగి ఉంటుంది.
భారత ప్రభుత్వ అధిపతులు 2023
భారత రాష్ట్రపతి | ద్రౌపది ముర్ము |
భారత ఉపరాష్ట్రపతి | జగదీప్ ధంకర్ |
భారత ప్రధానిమంత్రి | నరేంద్ర మోదీ |
భారత ప్రధాన న్యాయమూర్తి | డా. జస్టిస్ డివై చంద్రచూడ్ |
భారత రాజ్యసభ ఛైర్మెన్ | జగదీప్ ధంకర్ |
భారత్ లోక్ సభ స్పీకర్ | ఓం బిర్లా |
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ | రాజీవ్ కుమార్ |
భారత ఎన్నికల కమిషనర్ | అనుప్ చంద్ర పాండే |
భారత ఎన్నికల కమిషనర్ | అరుణ్ గోయల్ |
కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ | గిరీష్ చంద్ర ముర్ము |
నీతి ఆయోగ్ చైర్ పర్సన్ | నరేంద్ర మోడీ (ప్రధానమంత్రి) |
నీతి ఆయోగ్ వైస్ చైర్ పర్సన్ | సుమన్ బెరీ |
నీతి ఆయోగ్ సీఈఓ | పరమేశ్వరన్ అయ్యర్ |
భారతదేశ అటార్నీ జనరల్ | ఆర్. వెంకటరమణి |
భారత సాయుధ దళాల అధిపతులు 2023
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ | జనరల్ అనిల్ చౌహాన్ |
ఆర్మీ స్టాఫ్ చీఫ్ | జనరల్ మనోజ్ పాండే |
ఎయిర్ స్టాఫ్ చీఫ్ | ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి |
నావల్ స్టాఫ్ చీఫ్ | అడ్మిరల్ ఆర్ హరి కుమార్ |