ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ (GD) నోటిఫికేషన్ 2022 : మొత్తం ఖాళీలు 24369
Latest Jobs SSC

ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ (GD) నోటిఫికేషన్ 2022 : మొత్తం ఖాళీలు 24369

స్టాఫ్ సెలక్షన్ కమిషన్, కేంద్ర సరిహద్దు బలగాలు అయినా సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, ఎస్ఎస్ఎఫ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, అస్సాం రైఫిల్స్ యందు కానిస్టేబుల్ (జీడీ) మరియు సిపాయిల పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 24369 ఖాళీలు భర్తీ చేయనున్నారు. టెన్త్ ఉత్తీర్ణత పొంది, 18 నుండి 25 ఏళ్లలోపు యువతి, యువకులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. నియామక ప్రక్రియ రాత పరీక్ష మరియు ఫీజికల్, మెడికల్ టెస్టులు నిర్వహణ ద్వారా జరుగుతుంది.

Advertisement

ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ (GD) 2022 ఖాళీలు

ssc constable Vacancies

సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ & జీతాలు

ఎస్‌ఎస్‌సీ నిర్వహించే కానిస్టేబుల్ (జీడీ) మరియు సిపాయి నియామక ప్రక్రియ ద్వారా సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండిస్ట్రియల్  సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ (ITBP), షహస్త్ర సీమా బల్ (SSB), అస్సాం రేఫిల్స్ (AR), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NS), నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోల యందు కానిస్టేబుల్ (జీడీ) మరియు సిపాయి పోస్టులను భర్తీ చేస్తారు.

సెంట్రల్ సాయుధ పోలీసు దళాలు బిఎస్ఎఫ్, ఐటిబిపి, ఎస్ఎస్బిలు సరిహద్దు కాపలా దళాలుగా విధులు నిర్వర్తిస్తాయి. సిఐఎస్ఎఫ్ ప్రభుత్వ పరిశ్రమలకు సంబంధించిన భద్రత వ్యవహారాలు చూస్తాయి. లా అండ్ ఆర్డర్, కౌంటర్-టెర్రరిస్ట్ ఆపరేషన్స్, నక్సల్ ఆపరేషన్లు సిఆర్పిఎఫ్ & ఎన్ఎస్జి లు చేపడతాయి. బిఎస్ఎఫ్ & సిఆర్పిఎఫ్ లు అవసరమయ్యే సమయంలో ఆర్మీ తో కలిసి పనిచేస్తాయి.

సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ డిప్యూటేషన్లో భాగంగా దేశ అంతర్గత రక్షణ వ్యవహారాల్లో ప్రధాన భూమిక పోషించే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA), ఇంటిలిజెన్స్ బ్యూరో (IB), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో మరియు ఇండియన్ ఆర్మీ లో కూడా సేవలు అందిస్తారు.

 కానిస్టేబుల్ (గ్రౌండ్ డ్యూటీ ) పే లెవెల్ - 3 (Rs. 21,700-69,100)
నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో - సిపాయి పే లెవెల్ - 1(Rs.18,000 to 56,900)

ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ ఎలిజిబిలిటీ

  • జాతీయత : ఇండియా/నేపాల్/భూటాన్ దేశాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు.
  • వయోపరిమితి:  18నుండి 25 ఏళ్ళ మధ్య వయస్సు ఉండే అభ్యర్థులు దరఖాస్తు చెయ్యొచ్చు. ఓబీసీ అభ్యర్థులకు గరిష్టంగా 3 ఏళ్ళ వయోపరిమితి సడలింపు ఉంటుంది. షెడ్యూల్డ్ కులాల వారికీ గరిష్టంగా 5 ఏళ్ళు, వికలాంగులకు 10 ఏళ్ళు సడలింపు కల్పిస్తారు.
  • విద్య అర్హుత : టెన్త్ పాస్.

ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ దరఖాస్తు ఫీజు

జనరల్ కేటగిరి అభ్యర్థులు 100/-
మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, వికలాంగులు, ESM అభ్యర్థులు దరఖాస్తు ఫీజు మినహాహించారు

ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ షెడ్యూల్ 2022

నోటిఫికేషన్ నెంబర్ PPI01/11/2022-PP_1
పోస్టుల సంఖ్యా 24,369
దరఖాస్తు ప్రారంభం 27/10/2022
దరఖాస్తు తుది గడువు 30/11/2022
పరీక్ష ఫీజు 100/-
పరీక్ష తేదీ Jan 2023

ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ దరఖాస్తు విధానం

అర్హుత ఉన్న అభ్యర్థులు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైటు నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్'లో పొందిపర్చిన విదంగా కమిషన్ అడిగిన వ్యక్తిగత, విద్యా సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది.

దరఖాస్తు పారంభించే ముందు అవసరమయ్యే వివరాల్ని అందుబాటులో పెట్టుకోండి. పుటిన తేదీ వివరాలు, కేటగిరి వివరాలు, మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ఐడీ వంటి వివరాలు తప్పులు దొర్లకుండా పొందుపర్చండి. పోస్టు ఎంపిక, పరీక్షా కేంద్ర ఎంపిక వివరాలు మరో మారు సరిచూసుకోండి.

అప్లోడ్ చేసే ధ్రువపత్రాలు కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా రూపొందించుకోండి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేశాక అందుబాటులో ఉండే పేమెంట్ మార్గం ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించండి. దరఖాస్తు రుసుము చెల్లించని అప్లికేషన్లు పరిగణలోకి తీసుకోబడవు.

ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ ఎగ్జామ్ సెంటర్లు

ఎగ్జామ్ సెంటర్ SSC రీజనల్ కేంద్రం సమాచారం (సౌత్ రీజియన్)
చీరాల, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ,  తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం,
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్
Regional Director (SR), Staff Selection Commission, 2 nd Floor, EVK Sampath Building, DPI Campus, College Road, Chennai, Tamil Nadu-600006 (www.sscsr.gov.in)

ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ (జీడీ) ఎగ్జామ్ నమూనా

ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ (జీడీ) నియామక ప్రక్రియ మూడు దశలో జరుగుతుంది. మొదటి దశలో సీబీటీ ఆధారిత ఆబ్జెక్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హుత పొందిన వారికీ రెండవ దశలో ఫీజికల్ స్టాండర్డ్ టెస్ట్ / ఫీజికల్ ఎండ్యూరెన్సు టెస్ట్ ఉంటుంది. ఈ దశ దాటిన వారికీ మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి నియామక ప్రక్రియ పూర్తిచేశారు.

  1. సీబీఈ (ఆబ్జెక్టివ్ టెస్ట్)
  2. ఫీజికల్ స్టాండర్డ్ టెస్ట్ / ఫీజికల్ ఎండ్యూరెన్సు టెస్ట్
  3. డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్

మొదటి దశలో నిర్వహించే కంప్యూటర్ ఆధారిత ఎగ్జామినేషన్ పరీక్ష పూర్తి ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. జనరల్ ఇంటిలిజెన్స్ & రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ & జనరల్ అవెర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ మరియు ఇంగ్లీష్/హిందీ లాంగ్వేజ్ సంబంధించి 80 ప్రశ్నలకు నిర్వహిస్తారు. సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నలకు 2 మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానం చేసిన ప్రశ్నలకు 0.50 మార్కులు తొలగిస్తారు. పరీక్షకు 60 నిముషాల సమయం కేటాయిస్తారు.

ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ (జీడీ) - కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్
పార్ట్ సిలబస్ ప్రశ్నలు /మార్కులు సమయం
పార్ట్ I జనరల్ ఇంటిలిజెన్స్ & రీజనింగ్ 20/40 60 నిముషాలు
పార్ట్ II జనరల్ నాలెడ్జ్ & జనరల్ అవెర్నెస్ 20/40
పార్ట్ III ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20/40
పార్ట్ IV ఇంగ్లీష్/హిందీ లాంగ్వేజ్ 20/40

PST & PET

కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్ యందు అర్హుత సాధించిన అభ్యర్థులకు రెండవ దశలో ఫీజికల్ స్టాండర్డ్ టెస్ట్/ఫీజికల్ ఎండ్యూరెన్సు టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా కింద పొందుపర్చిన వివిధ టాస్కులు నిర్వహిస్తారు.

Physical Standard Test for all Posts (PST)
Category of candidates Height (in cm) Chest (in cm)
Unexpanded Expanded
For male candidates only (UR) 170 80 85
For all candidates belonging to Scheduled Tribes 162.5 77 82
For Female candidates only (UR) 157 - -
For all female candidates belonging to Scheduled Tribes 154 - -

 

Physical Endurance Test (PET) For all posts
For male candidates only For female candidates only
5 km race in 24 minutes 1.6 km race in 8.5 minutes
1.6 Kms race in 6.5 minutes 800 metre race in 4 minutes

మెడికల్ ఎగ్జామినేషన్ 

ఫీజికల్ స్టాండర్డ్ టెస్ట్/ఫీజికల్ ఎండ్యూరెన్సు టెస్ట్ అర్హుత సాధించిన అభ్యర్థులకు చివరిగా మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ కి చెందిన మెడికల్ ఆఫీసర్ లేదా ఇతర గ్రేడ్ 1 స్థాయి అసిస్టెంట్ మెడికల్ సర్జన్ తో మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. అభ్యర్థుల కంటి చూపు, మోకాలి సమస్యలు మరియు ఇతర వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు గురించి వాకబు చేస్తారు.  మెడికల్ రిపోర్టు అందించేందుకు 15 గడువిస్తుంది.

అభ్యర్థుల కంటి చూపు సమీప దృష్టి N6 (ఆరోగ్యవంతమైన కన్ను) , N9 (సమస్య ఉన్న కన్ను) ఉండాలి. అభ్యర్థుల మినిమం డిస్టెన్స్ విజన్ 6/6 (ఆరోగ్యవంతమైన కన్ను) , 6/9 (సమస్య ఉన్న కన్ను) ఉండాలి. అభ్యర్థులకు మోకాలి సమస్యలు, ఫ్లాట్ ఫుట్, కళ్ళల్లో స్క్యింట్ సమస్య ఉండకూడదు. అభ్యర్థులు భౌతికంగా మానసికంగా ఆరోగ్యాంగా ఉండాలి.

టాటూస్ పరిశీలన: శాశ్వత శరీర పచ్చబొట్లు ముంజేయి లోపలి ముఖంపై (మోచేయి లోపలికి మణికట్టుకు)మరియు అరచేతి / వెనుక (డోర్సల్) చేతి రివర్స్ వైపు) మాత్రమే అనుమతించబడతాయి. శరీరంలోని ఇతర భాగాలపై శాశ్వత శరీర పచ్చబొట్లు ఆమోదయోగ్యం కాదు. గిరిజన తెగలు వారి ఆచార, సంప్రదాయాల ప్రకారం ముఖాలపై వేసుకునే పచ్చబొట్లు అనుమతించబడతాయి.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఎంపిక విధానం

మెడికల్ టెస్ట్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. అభ్యర్థులు రెండు ఫోటో కాపీలతో పాటుగా అవసరమయ్యే అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరవ్వాల్సి ఉంటుంది.

కొన్ని పోస్టులకు సంబంధించి ఎంపికను మార్చుకునేందుకు చివరిసారి అవకాశం కల్పిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంతృప్తిపర్చని అభ్యర్థులను అనర్హులుగా పరిగణిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తియ్యాక తుది షార్ట్ లిస్ట్ తయారీలో నిమగ్నమౌతారు.

కేటగిరి వారీగా రాతపరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థుల షార్ట్ లిస్ట్ తయారు చేస్తారు. రాతపరీక్షలో అభ్యర్థులు 30% మార్కులతో తప్పనిసరి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. PST, PET టెస్టుల్లో తప్పనిసరి అర్హుత సాధించాలి.

కేటగిరి క్వాలిఫైయింగ్ మార్కులు
జనరల్ కేటగిరి అభ్యర్థులు 30%
ఓబీసీ /ఈడబ్ల్యూఎస్ 25%
ఇతరులు 20%

ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ (జీడీ) సిలబస్

జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్

Analytical aptitude and ability to observe and distinguish patterns will be tested through questions principally of non-verbal type. This component may include questions on analogies, similarities and differences, spatial visualization, spatial orientation, visual memory, discrimination, observation, relationship concepts, arithmetical reasoning and figural classification, arithmetic number series, non-verbal series, coding and decoding, etc.

జనరల్ నాలెడ్జ్ & జనరల్ అవేర్‌నెస్

Questions in this component will be aimed at testing the candidate’s general awareness of the environment around him. Questions will also be designed to test knowledge of current events and of such matters of every day observations and experience in their scientific aspect as may be expected of any educated person. The test will also include questions relating to India and its neighboring countries especially pertaining to sports, History, Culture, Geography, Economic Scene, General Polity, Indian Constitution, and scientific Research etc. These Questions will be such that they do not require a special study of any discipline.

ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్

This paper will include questions on problems relating to Number Systems, Computation of Whole Numbers, Decimals and Fractions and relationship between Numbers, Fundamental arithmetical operations, Percentages, Ratio and Proportion, Averages, Interest, Profit and Loss, Discount, Mensuration, Time and Distance, Ratio and Time, Time and Work, etc.

ఇంగ్లీష్ / హిందీ లాంగ్వేజ్

Candidates’ ability to understand basic English/ Hindi and his basic comprehension would be tested.

Advertisement

Post Comment