Daily Current Affairs Quiz: 4 February 2025
Telugu Current Affairs Quizzes

Daily Current Affairs Quiz: 4 February 2025

నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(4 ఫిబ్రవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.

1. అంతర్జాతీయ సైబర్ నేరాల దర్యాప్తునకు సంబంధించి మరింత సులభతరం చేయడానికి ఏ రెండు దేశాల మధ్య కీలక పరస్పర అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదిరింది?

  1. భారత్-నేపాల్
  2. భారత్- రష్యా
  3. భారత్-అమెరికా
  4. భారత్-ఇటలీ
సమాధానం
3. భారత్- అమెరికా

2. అమెరికాలోని ఏ రాష్ట్రం ఇటీవల డిసెంబర్ 6ని మహాత్మాగాంధీ సంస్కరణ దినంగా ప్రకటించింది?

  1. నెబ్రాస్కా
  2. అలస్కా
  3. టెక్సాస్
  4. ఫ్లోరిడా
సమాధానం
1. నెబ్రాస్కా

3. ఏ దేశంలో 50 ఏళ్లకు పైగా కొనసాగిన అసద్ రాజవంశ పాలన ఇటీవల పతనమైంది?

  1. సిరియా
  2. టర్కీ
  3. ఇరాక్
  4. ఇరాన్
సమాధానం
1. సిరియా

4. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) ఇటీవల ఏ రోజును ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది?

  1. డిసెంబర్ 15
  2. డిసెంబర్ 17
  3. డిసెంబర్ 19
  4. డిసెంబర్ 21
సమాధానం
4. డిసెంబర్ 21

5. అమెరికా ఐటీ కంపెనీ వర్చూసా కార్పొరేషన్ అధ్యక్షుడు, సీఈఓగా భారత సంతతికి చెందిన ఎవరు నియమితులయ్యారు?

  1. సంతోష్ థామస్
  2. నితీష్ బంగా
  3. కిరణ్ అహుజా
  4. జస్మీత్ బెయిన్స్
సమాధానం
2. నితీష్ బంగా

6. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)విభాగంలో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది?

  1. చైనా
  2. భారతదేశం
  3. అమెరికా
  4. రష్యా
సమాధానం
3. అమెరికా

7. 2024లో 'మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్'ను కింది వారిలో ఎవరు గెలుచుకున్నారు?

  1. హర్మన్‌ప్రీత్ సింగ్
  2. నవనీత్ కౌర్
  3. సవితా పునియా
  4. సుశీల చాను
సమాధానం
1. హర్మన్‌ప్రీత్ సింగ్

8. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2024లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినందుకు ఏ యూనివర్సిటీని MAKA ట్రోఫీతో సత్కరించారు?

  1. చండీగఢ్ యూనివర్సిటీ
  2. ఆంధ్ర యూనివర్సిటీ
  3. పంజాబ్ యూనివర్సిటీ
  4. సెంట్రల్ యూనివర్సిటీ
సమాధానం
1. చండీగఢ్ యూనివర్సిటీ

9. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)విభాగంలో ఏ దేశం రెండవ స్థానంలో నిలిచింది?

  1. ఇండియా
  2. చైనా
  3. జపాన్
  4. ఆస్ట్రేలియా
సమాధానం
2. చైనా

10. 2024-25 మహిళల హాకీ ఇండియా లీగ్‌లో ఏ జట్టు విజయం సాధించింది?

  1. ఒడిశా వారియర్స్
  2. డిల్లీ ఎస్‌జీ పైపర్స్
  3. శ్రాచీ రార్ బెంగాల్ టైగర్స్
  4. జెఎస్‌డబ్ల్యూ సూర్మా హాకీ క్లబ్
సమాధానం
1. ఒడిశా వారియర్స్

11. 2023 సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి(UN) మిలటరీ జెండర్ అడ్వకేట్ ది ఇయర్ పురస్కార గ్రహీత?

  1. మేజర్ రాధికా సేన్‌
  2. మేజర్ సుమన్ గవానీ
  3. మేజర్ సిసిలియా
  4.  మేజర్ ఆంటోనియో
సమాధానం
1. మేజర్ రాధికా సేన్‌

12. డెలాయిట్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2025లో భారత ఆర్థిక వ్యవస్థకు అంచనా వేసిన వృద్ధి రేటు ఎంత?

  1. 6.5-6.8 శాతం
  2. 6.0-6.2 శాతం
  3. 7.5-7.8 శాతం
  4. 7.0-7.3 శాతం
సమాధానం
1. 6.5-6.8 శాతం

13. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ గరిష్ఠ పరిమితిని 25 శాతం పెంచాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. దాని గరిష్ఠ పరిమితి ఎంత ?

  1. రూ. 15 లక్షలు
  2. రూ. 22 లక్షలు
  3. రూ. 20 లక్షలు
  4. రూ. 25 లక్షలు
సమాధానం
4. రూ. 25 లక్షలు

14. దేశంలో రీ ఇన్సూరెన్స్ శాఖను స్థాపించడానికి దోహా ఇన్సూరెన్స్ గ్రూప్‌లో ఏ దేశ రెగ్యులేటరీ అథారిటీ అనుమతిని మంజూరు చేసింది?

  1. దుబాయ్ ఫైనాన్షియల్ మార్కెట్
  2. ఖతార్ సెంట్రల్ బ్యాంక్
  3. ఆర్బీఐ (ఇండియా)
  4. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
సమాధానం
2. ఖతార్ సెంట్రల్ బ్యాంక్

15. 2025, జనవరి నుంచి 2026, జనవరి వరకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు ఏ సంస్థ ' గ్రేట్ ప్లేస్ టు వర్క్' సర్టిఫికేషన్‌ను అందించింది?

  1. మినిస్ట్రీ ఆఫ్ స్టీల్
  2. గ్రేట్ ప్లేస్ టు వర్క్ఇన్‌స్టిట్యూట్, ఇండియా
  3. నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్
  4. వరల్డ్ స్టీల్ అసోసియేషన్
సమాధానం
2. గ్రేట్ ప్లేస్ టు వర్క్ఇన్‌స్టిట్యూట్, ఇండియా

16. 5. పాకిస్థాన్ న్యూక్లియర్ రెగ్యులేటరీ అథారిటీ చష్మా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యూనిట్ 5 నిర్మించడానికి లైసెన్స్ జారీ చేసింది. ఇది అణుశక్తి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి 9. చేసే అతిపెద్ద ప్లాంట్. చష్మా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యూనిట్ సామర్థ్యం ఎంత?

  1. 1700 మెగావాట్లు
  2. 1500 మెగావాట్లు
  3. 1200 మెగావాట్లు
  4. 1000 మెగావాట్లు
సమాధానం
3. 1200 మెగావాట్లు

17. తమ తొలి సీనియర్ నేషనల్ పురుషుల హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌లో గెలుచుకోవడానికి కేరళ ఏ రోజున ఓడించింది?

  1. ఇండియన్ రైల్వేస్
  2. చండీగఢ్
  3. సర్వీసెస్
  4. హర్యానా
సమాధానం
2. చండీగఢ్

18. రూ.1,990 కోట్ల విలువైన డీఆర్‌డీవో నిర్మిత ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఏ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది?

  1. మజగావ్ డాక్ షిప్‌ బిల్డర్స్
  2. హిందుస్థాన్ షిప్‌యార్డ్
  3. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్
  4. ఏబీజీ షిప్ యార్డ్
సమాధానం
1. మజగావ్ డాక్ షిప్‌ బిల్డర్స్

19. ఇటీవల ఏ సంస్థ నొప్పి లేకుండా, సూది రహిత షాక్ సిరంజీలను అభివృద్ధి చేసింది?

  1. ఐఐటీ బాంబే
  2. ఐఐటీ మద్రాస్
  3. ఐఐటీ గువాహటి
  4. ఐఐటీ కాన్పూర్
సమాధానం
1. ఐఐటీ బాంబే

20. ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎన్ని దేశాల నుంచి వస్తున్న డిజిటల్ ఆఫ్ సెట్ ప్రింటింగ్ ప్లేట్‌లపై కచ్చితమైన యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది?

  1. 3
  2. 4
  3. 5
  4. 6
సమాధానం
3. 5

21. స్పేస్ డాకింగ్ మిషన్‌ను ఏ అంతరిక్ష సంస్థ విజయవంతంగా ప్రారంభించింది?

  1. ఇస్రో
  2. నాసా
  3. ఈఎస్ఏ
  4. సీఎన్ఎస్ఏ
సమాధానం
1. ఇస్రో

22. వివాద్ సే విశ్వాస్ పథకం కాలక్రమం ఎంతవరకు పొడిగించారు?

  1. 2025, జులై 31
  2. 2025, మర్చి 31
  3. 2025, జనవరి 31
  4. 2025, డిసెంబర్ 31
సమాధానం
3. 2025, జనవరి 31

23. ఇటీవల మోటార్ సైకిల్ డ్రాగ్ రేసింగ్‌లో 15వ జాతీయ టైటిల్‌ను గెలుచుకొని చరిత్ర సృష్టించింది ఎవరు?

  1. సారికా మెహత
  2. శంకర్ శరత్ కుమార్
  3. ఐశ్వర్య పిస్సె
  4. హేమంత్ ముద్దప్ప
సమాధానం
4. హేమంత్ ముద్దప్ప

24. భారత్ ఇప్పుడు 700 బిలియన్ యూఎస్ డాలర్లకు పైగా పెరిగిన విదేశీ మారక నిల్వలతో ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది?

  1. 2
  2. 3
  3. 4
  4. 5
సమాధానం
3. 4

25. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన రైలు నమూనాను ఏ దేశం ప్రవేశపెట్టింది?

  1. బ్రెజిల్
  2. చైనా
  3. జపాన్
  4. రష్యా
సమాధానం
2. చైనా

26. ప్రపంచ శాంతి దినోత్సవం ఏటా ఏ రోజున జరుపుకొంటారు?

  1. డిసెంబర్ 31
  2. జనవరి 1
  3. జనవరి 2
  4. జనవరి 3
సమాధానం
2. జనవరి 1

27. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?

  1. విటుల్ కుమార్
  2. బిపిన్ కుమార్
  3. కమలేశ్ యాదవ్
  4. సురేష్ ప్రసాద్
సమాధానం
1. విటుల్ కుమార్

28. టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన భారత ఆటగాడు ఎవరు?

  1. జస్ప్రిత్ బుమ్రా
  2. రవీంద్ర జడేజా
  3. రవిచంద్రన్ అశ్విన్
  4. రవిచంద్రన్ అశ్విన్
సమాధానం
1. జస్ప్రిత్ బుమ్రా

29. 2024, అక్టోబర్‌లో భారత సేవల పరిశ్రమ నుంచి నెలవారీ ఎగుమతులు ఆల్‌టైం ఎంత గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి?

  1. 31.62 బిలియన్ డాలర్లు
  2. 32.84 బిలియన్ డాలర్లు
  3. 33.17 బిలియన్ డాలర్లు
  4. 34.31 బిలియన్ డాలర్లు
సమాధానం
4. 34.31 బిలియన్ డాలర్లు

30.  స్వమిత్వ యోజన (SVAMITVA) పథకం కింద పీఎం మోదీ 2024, డిసెంబర్‌లో ఎన్ని ప్రాపర్టీ కార్డ్‌లను జారీ చేశారు?

  1. రూ.20 లక్షలు
  2. రూ. 10 లక్షలు
  3. రూ.30 లక్షలు
  4. రూ.50 లక్షలు
సమాధానం
4. రూ.50 లక్షలు

Post Comment