Advertisement
సోలార్ సిస్టమ్ : గ్రహాలు మరియు ఉపగ్రహాలు
Study Material

సోలార్ సిస్టమ్ : గ్రహాలు మరియు ఉపగ్రహాలు

సౌరవ్యవస్థ గురించి తెలుసుకునే ముందు విశ్వం (యూనివర్స్) అంటే ఏంటో తెలుసుకోవాలి. విశ్వం అంటే అనంతమైన స్పేస్ అని అర్ధం. ఇందులోనే సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, మన గెలాక్సీ మరియు దాదాపు రెండు ట్రిలియన్ల ఇతర గెలాక్సీలు అమరి ఉన్నాయి. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం  ఒక బలమైన విస్ఫోటనం జరగడం ద్వారా విశ్వం ఆరంభమైంది.

ఈ విస్ఫోటనం వలనే సమయం, గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు ఏర్పడ్డాయి. వీటితో పాటుగా విశ్వంలో వివిధ రూపాల్లో ఉండే పదార్థం, శక్తి కూడా ఉద్బవించింది. విశ్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కాస్మొలోజి అంటారు.

ప్రాచీన గ్రీక్ మరియు భారతీయుల తత్వవేత్తల మరింత లోతైన ఆలోచన నుండి భూమి ప్రధాన కేంద్రంగా కొన్ని ఖగోళ పరిశీలనలు జరిగాయి. కొన్ని శతాబ్దాల తర్వాత కోపర్నికస్ సూర్యుడు ఆధారిత సూర్యకేంద్ర  మోడల్ అభివృద్ధి పరిచాడు. ఈ రెండు సిద్ధాంతాలను ఆధారంగా చేసుకుని న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని సృష్టించాడు. దీన్ని ఆధారంగా చేసుకుని గ్రహాల చలనం, సౌరవ్యవస్థ, గెలాక్సీ మరియు విస్వంతరాల గురించి పూర్తిస్థాయి పరిశోదనలు జరిగాయి.

విశ్వం అనేది అపరిమిత గెలాక్సీల సమ్మేళనం. ప్రతి గెలాక్సీలో ఉండే కొన్ని బిలియన్ల నక్షత్రాలలో సూర్యుడు ఒకటి. సూర్యుడు గురుత్వాకర్షణ పరిధిలో 8 గ్రహాలు నిర్దిష్ట కక్ష్యలలో పరిభ్రమిస్తాయి. సూర్యుడు, దాని చుట్టూ తిరిగే గ్రహాలను కలిపి ఒక సౌరకుటుంబం అంటారు.

ఇలాంటి అనేక సౌరకుటుంబాలు కలిసి ఒక గెలాక్సీ ఏర్పడుతుంది. గెలాక్సీలన్నీ కలిసి విశ్వాన్ని సృష్టిస్తాయి. విశ్వం పరిధి 93 బిలియన్ కాంతి సంవత్సరాలు అని అంచనా. ఒక కాంతి సంవత్సరం అనగా ఒక ఏడాదిలో కాంతి ప్రయాణం చేయగలిగిన దూరం అని అర్ధం.  

సౌరకుటుంబంలో గ్రహాలు

గ్రాహం సూర్యుడు చుట్టూ పరిభ్రమణ కాలం స్వీయ భ్రమణ కాలం ఉపగ్రహాల సంఖ్యా ఉపరితలం ఉష్ణోగ్రత
బుధుడు (మెర్క్యురీ) 88 రోజులు 58 రోజుల 15.30 గంటలు 0 +350 డిగ్రీల సెంట్రిగ్రేడ్
శుక్రుడు (వీనస్) 225 రోజులు 243 రోజుల 14 గంటలు 0 +475 డిగ్రీల సెంట్రిగ్రేడ్
భూమి (ఎర్త్) 365 1/4 రోజులు 23.56.49 గంటలు 1 +22 డిగ్రీల సెంట్రిగ్రేడ్
అంగారకుడు (మార్స్) 687 రోజులు 24.37.22 గంటలు 2 -23 డిగ్రీల సెంట్రిగ్రేడ్
గురుడు (జూపిటర్) 11.9 సంవత్సరాలు 9.50.30 గంటలు 63 -123 డిగ్రీల సెంట్రిగ్రేడ్
శని (సాటర్న్) 29.5 సంవత్సరాలు 10.14 గంటలు 61 -180 డిగ్రీల సెంట్రిగ్రేడ్
వరుణుడు (యురేనస్) 84 సంవత్సరాలు 16.10 గంటలు 27 -218 డిగ్రీల సెంట్రిగ్రేడ్
ఇంద్రుడు (నెప్ట్యూన్) 165 సంవత్సరాలు 18 గంటలు 13 -228 డిగ్రీల సెంట్రిగ్రేడ్

సౌరవ్యవస్థ ప్రశ్నలు & సమాదానాలు

ప్రశ్న సమాధానం
మన సౌరకుటుంబంలో గ్రహాల సంఖ్యా 8
సూర్యుడులోని ప్రధాన వాయువు ఏది హైడ్రోజన్
ఉపగ్రహాలు లేని గ్రహాలు మెర్క్యూరీ, వీనస్
సూర్యునికి దగ్గరగా ఉండే గ్రహం మెర్క్యూరీ
తూర్పు నుండి పడమటికి తిరిగే గ్రహాలు వీనస్, యురేనస్
అత్యంత వేడి గ్రహం శుక్రుడు
అతి శీతల గ్రహం నెప్ట్యూన్
ఉదయతార, సాయంత్రతార & వేగుచుక్క శుక్రుడు
అత్యల్ప పగటి కాలం ఉండే గ్రహం గురుడు
అత్యధిక పగటి కాలం ఉండే గ్రహం శుక్రుడు
భూకేంద్ర సిద్ధాంతం & సూర్య కేంద్ర సిద్ధాంతం టాలెమీ & కోపర్నికస్
అంతరిక్ష దూరాలను దేనితో కొలుస్తారు కాంతి సంవత్సరంతో
భూమికి చంద్రుడికి మధ్యనుండి అత్యల్ప దూరాన్ని పెరిజీ అంటారు
కవల గ్రహాలు ఎర్త్ & వీనస్
నీటికంటే తక్కువ సాంద్రత కలిగినాగ్రహం శని గ్రాహం
అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం ఎర్త్
76 సంవత్సరాలకు ఒకసారి కనిపించే చోకచుక్క హేలీ
శుక్రగ్రహంలో అత్యధికంగా ఉండే వాయువు కార్బన్ డయాక్సైడ్
చంద్రుడు కాంతి భూమికి చేరేందుకు పెట్టె సమయం 1.3 సెకండ్లు
సూర్యుని క్రాంతి భూమికి చేరేందుకు పెట్టె సమయం 8.18 నిముషాలు
సూర్యుడిలో ఉన్న భాగాలు (ఫోటోస్పియర్ , క్రోమోస్పియర్, కరోనా) 3
సూర్యగ్రహణంలో మాత్రమే కనిపించే సూర్యుడి భాగం కరోనా
మనకు కనిపించే సూర్యుడు ప్రకాశవంతమైన భాగం ఫొటోస్పియర్
సూర్యుడిలో ఎరుపు రంగులో కనిపించే భాగం క్రోమోస్పియర్
అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం జుపిటర్ (79)
సూర్యుడులో అత్యధికంగా ఉండే రసాయనం హైడ్రోజన్
అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తి యూరి గగారిన్ (1961)
అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మహిళా వాలెంటినా తెరేష్కోవా (1963)
సౌరకుటుంబంలో అతి చిన్న గ్రహం మెర్క్యూరీ
టైటాన్ ఏ గ్రహానికి ఉపగ్రహం శని గ్రహం
రెండు ఉపగ్రహాలను కలిగిన గ్రహం మార్స్
భూమికి దగ్గరగా ఉండే నక్షేత్రం ప్రాక్సిమా సెంటారీ
సూర్యుడు కి దగ్గరగా గల నక్షేత్రం ఆల్ఫా సెంటారీ

Post Comment