Daily Current Affairs Quiz 2: February 2025
Telugu Current Affairs Quizzes

Daily Current Affairs Quiz 2: February 2025

నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(2 ఫిబ్రవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.

1. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికో దిగుమతులపై ఎంత శాతం సుంకాలు విధించే దస్త్రంపై ఇటీవల సంతకం చేశారు?

  1. 20 శాతం
  2. 25 శాతం
  3. 30 శాతం
  4. 40 శాతం
సమాధానం
2. 25 శాతం

2. దక్షిణార్ధగోళములో అతి పెద్ద హిందూ ఆలయం, దక్షిణాఫ్రికాలోని ఏ నగరంలో ఇటీవల ప్రారంభమైంది?

  1. జోహన్నెస్‌బర్గ్‌
  2. డర్బన్
  3. ప్రిటోరియా
  4. కేప్ టౌన్
సమాధానం
1. జోహన్నెస్‌బర్గ్‌

3. అత్యధిక సమయం స్పేస్వాకింగ్ చేసిన తొలి మహిళా వ్యోమగామిగా భారత సంతతికి చెందిన 'సునీతా విలియమ్స్' రికార్డ్ సృష్టించారు. ఆమె ఎన్ని గంటలపాటు స్పేస్వాక్ చేశారు?

  1. 60 గంటల 6 నిమిషాలపాటు
  2. 61 గంటల 6 నిమిషాలపాటు
  3. 62 గంటల 6 నిమిషాలపాటు
  4. 63 గంటల 6 నిమిషాలపాటు
సమాధానం
3. 62 గంటల 6 నిమిషాలపాటు

4. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గూగుల్ మ్యాప్స్ ఇకపై గల్ఫ్ ఆఫ్ ఏ దేశంగా చూపించనుంది?

  1. కెనడా
  2. అమెరికా
  3. మెక్సికో
  4. టెక్సాన్
సమాధానం
2. అమెరికా

5. 2025, మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'తో పాటు 'ప్లేయర్ ఆఫ్ సిరీస్' అవార్డులు గెలుచుకున్న ప్లేయర్ ఎవరు?

  1. వైష్ణవి శర్మ
  2. త్రిష గొంగాడి
  3. జెమ్మ బోథా
  4. డేవినా పెర్రిన్
సమాధానం
2.  త్రిష గొంగాడి

6. 2025, మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ విజేత ఎవరు?

  1. దక్షిణాఫ్రికా
  2. ఆస్ట్రేలియా
  3. ఇంగ్లాండ్
  4. ఇండియా
సమాధానం
4. ఇండియా

7. ప్రజలకు త్వరితగతిన మొబైల్ ద్వారా సేవలు అందించేందుకు ఉద్దేశించిన ఈ గవర్నెన్స్ వాట్సాప్ సేవలను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది?

  1. ఆంధ్రప్రదేశ్
  2. తెలంగాణ
  3. కర్ణాటక
  4. మధ్యప్రదేశ్
సమాధానం
1. ఆంధ్రప్రదేశ్

8. రిపబ్లిక్‌డే వేడుకలలో దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన పరేడ్‌లో ఏ రాష్ట్రం నిర్వహించిన 'ఏటికొప్పాక బొమ్మల శకటాని'కి మూడో స్థానం లభించింది?

  1. తెలంగాణ
  2. తమిళనాడు
  3. కేరళ
  4. ఆంధ్రప్రదేశ్
సమాధానం
4. ఆంధ్రప్రదేశ్

9. 2025, కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి పోలవరం ప్రాజెక్టు కోసం ఎన్ని కోట్లను కేటాయించారు?

  1. రూ.5336 కోట్లు
  2. రూ.5936 కోట్లు
  3. రూ.5236 కోట్లు
  4. రూ.5916 కోట్లు
సమాధానం
2. రూ.5936 కోట్లు

10. 2025, కేంద్ర బడ్జెట్‌లో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఎన్ని కోట్లను కేటాయించారు?

  1.  రూ. 3,291 కోట్లు
  2. రూ. 3,293 కోట్లు
  3. రూ. 3,295 కోట్లు
  4. రూ. 3,297 కోట్లు
సమాధానం
3. రూ. 3,295 కోట్లు

11. దేశంలో మొదటిసారిగా ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది?

  1. ఉత్తరాఖండ్
  2. ఉత్తరప్రదేశ్
  3. హర్యానా
  4. కేరళ
సమాధానం
1. ఉత్తరాఖండ్

12. 2025, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శ్రీహరికోట లోని షార్ నుంచి జీఎస్ఎల్వీ రాకెట్-15 తో ఎన్నో ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసి చరిత్ర సృష్టించింది?

  1. 75వ
  2. 100వ
  3. 125వ
  4. 130వ
సమాధానం
2. 100వ

13. పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య కోర్సుల అడ్మిషన్లలో నివాసం ఆధారంగా రిజర్వేషన్ల కోటాను ఇటీవల ఏ కోర్టు రద్దు చేసింది?

  1. సుప్రీంకోర్టు
  2. హైకోర్టు
  3. జిల్లాకోర్టు
  4. తాలూకా కోర్టు
సమాధానం
1. సుప్రీంకోర్టు

14. ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టపరిచే చర్యలలో భాగంగా 2020 నుంచి నిలిపివేసిన కైలాశ్ మానస్ సరోవర్ యాత్రను 2025 వేసవి నుంచి పునరుద్దరించాలని ఏ రెండు దేశాలు నిర్ణయించాయి?

  1. భారత్ - నేపాల్
  2. భారత్ - చైనా
  3. భారత్ - బంగ్లాదేశ్
  4. భారత్ - ఇండోనేషియా
సమాధానం
2. భారత్ - చైనా

15. ఇటీవల కెనడా ప్రధానమంత్రి జసిస్ ట్రూడో తన రాజీనామాను ప్రకటించారు. అయితే ట్రూడో ఏ సంవత్సరంలో కెనడా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు?

  1. 2014
  2. 2012
  3. 2016
  4. 2015
సమాధానం
4. 2015

16. హెచ్ఎంపివి(HMPV) వైరస్‌కు సంబంధించిన కేసులను జనవరి 6, 2025 న భారతదేశంలో ఈ రాష్ట్రాలలో గుర్తించడం జరిగింది?

  1. గుజరాత్, కేరళ
  2. గుజరాత్, కర్ణాటక
  3. మహారాష్ట్ర, కర్ణాటక
  4. కేరళ, కర్ణాటక
సమాధానం
2. గుజరాత్, కర్ణాటక

17. సీనియర్ జర్నలిస్ట్ ఎన్. వి. ఆర్స్వామి రాసిన పుస్తకం "దిఆడిసిఆఫ్యాన్ ఇండియన్ జర్నలిస్ట్" పుస్తకంలో ఈ క్రింది వారిలో ఏ భారత ప్రధానమంత్రి గురించి ప్రస్తావించడం జరిగింది?

  1. ఇందిరాగాంధీ
  2. మొరార్జీ దేశాయ్
  3. రాజీవ్ గాంధీ
  4. నరేంద్ర మోడీ
సమాధానం
2. మొరార్జీ దేశాయ్

18. యువశక్తి “ విజన్ ఫర్ వికసిత్ భారత్ - 2047 అను పుస్తకాన్ని ఇటీవల ఎవరు ఆవిష్కరించారు?

  1. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
  2. కేంద్ర హోం మంత్రి అమిత్ షా
  3. రాష్ట్రపతి ద్రౌపది మురుము
  4. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
సమాధానం
1. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

19. భారత అటవీ స్థితిగతులు నివేదిక -2023 ప్రకారం దేశంలో మడ అడవులు ఎక్కువగా విస్తరించిన ప్రాంతాలలో మొదటి మూడు స్థానాలలో ఉన్న ప్రాంతాలను గుర్తించండి?

  1. పశ్చిమ బెంగాల్, కేరళ, గుజరాత్
  2. గుజరాత్, పశ్చిమబెంగాల్, అండమాన్ నికోబార్
  3. పశ్చిమబెంగాల్, గుజరాత్, అండమాన్ నికోబార్
  4. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్
సమాధానం
2. గుజరాత్, పశ్చిమబెంగాల్, అండమాన్ నికోబార్

20. క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025 లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత?

  1. మొదటి ర్యాంక్
  2. రెండవ ర్యాంక్
  3. మూడవ ర్యాంక్
  4. నాల్గవ ర్యాంక్
సమాధానం
2. రెండవ ర్యాంక్

21. హేండ్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారత్ ర్యాంక్ ఎంత?

  1. 95
  2. 85
  3. 75
  4. 45
సమాధానం
2. 85

22. న్యూఢిల్లీలోని భారత మండపంలో రూరల్ ఇండియా మహోత్సవం - 2025ను ఏ తేదీన ప్రారంభించారు?

  1. జనవరి 4, 2025
  2. జనవరి 12, 2025
  3. జనవరి 3, 2025
  4. జనవరి 15, 2025
సమాధానం
1. జనవరి 4, 2025

23. ఇటీవల పంచాయత్ సే పార్లమెంట్ 2.0 కార్యక్రమంను లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ప్రారంభించారు. దీనికి 22 రాష్ట్రాల నుంచి పంచాయతీరాజ్ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంతమంది గిరిజన మహిళా ప్రతినిధులు హాజరయ్యారు?

  1. 300
  2. 500
  3. 245
  4. 375
సమాధానం
2. 500

24. ఇటీవల పురావస్తు శాఖ అధికారులు సింధు నాగరికత నాటి ఆనవాళ్లను ఏ రాష్ట్రంలో గుర్తించారు?

  1. గుజరాత్
  2. తమిళనాడు
  3. తెలంగాణ
  4. బీహార్
సమాధానం
2. తమిళనాడు

25. ఇటీవల వార్తల్లో నిలిచిన 'గ్వాదర్ అంతర్జాతీయ విమానాశ్రయం' ఏ దేశంలో కలదు?

  1. పాకిస్తాన్
  2. బలూచిస్తాన్
  3. ఆఫ్ఘనిస్తాన్
  4. చైనా
సమాధానం
2. బలూచిస్తాన్

26. 47వ అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును 'గల్ఫ్ ఆఫ్ అమెరికా'గా మారుస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేశారు. అయితే గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఎన్ని లక్షల చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉంది?

  1. 12 లక్షల చరుపు కిలోమీటర్లు
  2. 14 లక్షల చరుపు కిలోమీటర్లు
  3. 16 లక్షల చరుపు కిలోమీటర్లు
  4. 18 లక్షల చరుపు కిలోమీటర్లు
సమాధానం
3. 16 లక్షల చరుపు కిలోమీటర్లు

27. 2025లో క్వాడ్ దేశాల సదస్సును భారత్‌లో నిర్వహించనున్నారు. ఈ క్రింది వాటిలో క్వాడ్‌లో గల దేశాల జాబితాను గుర్తించండి?

  1. అమెరికా, ఆస్ట్రేలియా, భారత్, చైనా
  2. అమెరికా, భారత్, బ్రెజిల్, ఆస్ట్రేలియా
  3. ఆస్ట్రేలియా, అమెరికా, భారత్, జపాన్
  4. ఆస్ట్రేలియా, భారత్, ఈజిప్టు, రష్యా
సమాధానం
3. ఆస్ట్రేలియా, అమెరికా, భారత్, జపాన్

28. ఇటీవల స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన దేశం ఏది?

  1. సింగపూర్
  2. థాయిలాండ్
  3. చైనా
  4. తైవాన్
సమాధానం
2. థాయిలాండ్

29. ముడి జనపనార (జూట్) కనీస మద్దతు ధరను 2025-26 మార్కెటింగ్ సీజన్లో క్వింటాలకు ఎంత మేర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది?

  1. రూ. 315
  2. రూ. 300
  3. రూ. 435
  4. రూ. 475
సమాధానం
1. రూ. 315

30. 'బేటి బచావో  బేటీ పడావో' అనే పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

  1. 2015 జనవరి
  2. 2016 జనవరి
  3. 2017 జనవరి
  4. 2014 జనవరి
సమాధానం
1. 2015 జనవరి

Post Comment