Daily Current Affairs Quiz: 30 January 2025
Telugu Current Affairs Quizzes

Daily Current Affairs Quiz: 30 January 2025

నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(30 జనవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.

1. భారత స్పేస్ రీసెర్చ్ డెవలప్‌మెంట్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఎన్ని కోట్లతో మూడో లాంచ్‌ప్యాడ్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది?

  1. 3,585 కోట్లు
  2. 3,985 కోట్లు
  3. 4,232 కోట్లు
  4. 2,555 కోట్లు
సమాధానం
2. 3,985 కోట్లు

2. ఏ రాష్ట్రంలో రతపానీ టైగర్ రిసర్వ్‌ను కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ ఇటీవల దేశంలో 57వ టైగర్ రిసర్వ్‌గా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది?

  1. కర్ణాటక
  2. తెలంగాణ
  3. కేరళ
  4. మధ్యప్రదేశ్
సమాధానం
4. మధ్యప్రదేశ్

3. 2024-25 ఆర్ధిక సంవత్సరం జులై - సెప్టెంబర్ త్రైమాసికంలో ఏ దేశం భారత్‌కు అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) వరుసగా ఆవిర్భవించింది?

  1. సింగపూర్
  2. దుబాయ్
  3. రష్యా
  4. బంగ్లాదేశ్
సమాధానం
1. సింగపూర్

4. ఏ సంవత్సరం నాటికి ప్రపంచ వ్యాప్తంగా పాము కాటు మరణాలను 50 శాతానికి తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)లక్ష్యంగా పెట్టుకుంది?

  1. 2035
  2. 2028
  3. 2032
  4. 2030
సమాధానం
4. 2030

5. దేశంలోనే అతి పెద్ద సైన్స్ వేడుక 'ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్(ఐఐఎస్ఎఫ్)ను 2024, నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు ఎక్కడ నిర్వహించారు?

  1. ఐఐటీ గువాహటి, అస్సాం
  2. ఐఐటీ ఖరగ్పూర్, పశ్చిమ బెంగాల్
  3. ఐఐటీ మద్రాస్, చెన్నై
  4. ఐఐటీ కాన్పూర్, ఉత్తరప్రదేశ్
సమాధానం
1. ఐఐటీ గువాహటి, అస్సాం

6. దేశంలో మొదటి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్‌ను లెహ్‌లో ఏ సంస్థ ప్రారంభించింది?

  1. అమర రాజా ఇన్ ఫ్రా
  2. స్టార్ అగ్రి ఇన్‌ఫ్రా
  3. రిలయన్స్ ఇన్ ఫ్రా
  4. ఏదీకాదు
సమాధానం
1. అమర రాజా ఇన్ ఫ్రా

7. అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం)ను కేంద్ర ప్రభుత్వం ఎప్పటి వరకు పొడిగిచింది?

  1. 2028, మర్చి 31
  2. 2029 ఏప్రిల్ 31
  3. 2027 మే 22
  4. 2028 జూన్ 24
సమాధానం
1. 2028, మర్చి 31

8. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన 100వ ప్రయోగ మైలురాయిని ఏ రోజున దిగ్విజయంగా అందుకుంది?

  1. 2025, జనవరి 23
  2. 2025, జనవరి 25
  3. 2025, జనవరి 27
  4. 2025, జనవరి 29
సమాధానం
4. 2025, జనవరి 29

9. ప్రపంచంలోనే తొలిసారిగా 161 రకాల సేవలతో ఏ రాష్ట్ర ప్రభుత్వం 'మన మిత్ర' పేరుతో వాట్సాప్ పాలనకు శ్రీకారం చుట్టింది?

  1. తెలంగాణ
  2. ఆంధ్రప్రదేశ్
  3. ఒడిశా
  4. తమిళనాడు
సమాధానం
2. ఆంధ్రప్రదేశ్

10. గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) చైర్మన్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?

  1. ఎ.కె ప్రధాన్
  2. ముకేశ్‌ కుమార్‌
  3. అరవింద్. కె
  4. ముఖేశ్ కుమార్ సిన్హా
సమాధానం
1. ఎ.కె.ప్రధాన్‌

11. ప్రధాని నరేంద్ర మోదీ అద్యక్షతన 2025, జనవరి 29న జరిగిన ఆర్ధిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ సమావేశంలో ఏడేళ్ల వ్యవధిలో ఎన్ని కోట్ల వ్యయం అంచనాతో నేషనల్ క్రిటికల్ మినరల్ (ఎన్‌సీఎంఎం)కు ఆమోదముద్ర వేసింది?

  1. 34, 700కోట్లు
  2. 34,300 కోట్లు
  3. 33,200 కోట్లు
  4. 35,300 కోట్లు
సమాధానం
2. 34,300 కోట్లు

12. ప్రపంచంలోనే తొలిసారిగా 161 రకాల సేవలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పేరుతో వాట్సాప్ పాలనకు శ్రీకారం చుట్టింది?

  1. అన్న మిత్ర
  2. వన మిత్ర
  3. మన మిత్ర
  4. చంద్రన్న మిత్ర
సమాధానం
1. మన మిత్ర 

13. భారత ఏవియేషన్ చరిత్రలో తేజస్ తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా ఎవరు నియమితులయ్యారు?

  1. మేఘన అరోరా
  2. శివాంగి సింగ్
  3. రష్మీ శర్మ
  4. మోహనా సింగ్
సమాధానం
4. మోహనా సింగ్

14. 2021తో పోలిస్తే దేశంలో ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలను తట్టుకోగల మడ జాతులు ఎన్ని చదరపు కిలోమీటర్లు తగ్గాయి?

  1. 7.43
  2. 8.42
  3. 9.99
  4. 5.43
సమాధానం
1.7.43

15. 2025, ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎన్నోసారి బడ్జెట్ ప్రవేశ పెట్టి రికార్డ్ సృష్టించారు?

  1. 6వ సారి
  2. 7వ సారి
  3. 8వ సారి
  4. 9వ సారి
సమాధానం
3. 8వ సారి

16. ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు(90)ఇటీవల కన్నుమూశారు, ఆయన ఏ రంగానికి చెందిన వారు?

  1. సాహితీవేత్త
  2. వ్యాపారవేత్త
  3. సినీరంగం
  4. రాజకీయనేత
సమాధానం
1. సాహితీవేత్త

17. ప్రపంచ మృత్తిక(నేలలు) దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటారు?

  1. డిసెంబర్ 2
  2. డిసెంబర్ 3
  3. డిసెంబర్ 4
  4. డిసెంబర్ 5
సమాధానం
4. డిసెంబర్ 5

18. అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారు?

  1. డిసెంబర్ 4
  2. డిసెంబర్ 5
  3. డిసెంబర్ 6
  4. డిసెంబర్ 7
సమాధానం
2. డిసెంబర్ 5

19. డిసెంబర్ 4న భారత నౌకాదళ దినోత్సవాన్ని ఇటీవల ఏ రాష్ట్రంలో నిర్వహించారు?

  1. ఒడిశా
  2. గోవా
  3. విశాఖపట్నం
  4. ముంబై
సమాధానం
1. ఒడిశా

20. 861 ఏళ్ల నాటి చారిత్ర కట్టడం ప్రఖ్యాత 'నోట్రడామ్' చర్చ్ ఇటీవల పునఃప్రారంభమైంది, ఇది ఏ దేశంలో ఉంది?

  1. జర్మనీ
  2. జపాన్
  3. ఫ్రాన్స్
  4. ఇండోనేషియా
సమాధానం
3. ఫ్రాన్స్

21. ఆర్బిటేషన్ - మధ్యవర్తిత్వంపై కామన్‌వెల్త్ సదస్సు 2024 నవంబర్ 22 నుంచి 24వ తేదీ వరకు ఏ నగరంలో జరిగింది?

  1. న్యూఢిల్లీ
  2. హైదరాబాద్
  3. చెన్నై
  4. అమరావతి
సమాధానం
2. హైదరాబాద్

22. 10వ ప్రపంచ ఆయుర్వేద సమావేశం, అరోగ్య ప్రదర్శన డిసెంబర్ 12 నుంచి 15వ తేదీవరకు ఏ నగరంలో జరిగింది?

  1. కేరళ
  2. ఒడిశా
  3. మధ్యప్రదేశ్
  4. డెహ్రాడూన్
సమాధానం
4. డెహ్రాడూన్

23. 'నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్' సదస్సు డిసెంబర్ 6న 'గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్(జిఎప్ఎస్‌టి)' ఆధ్వర్యంలో ఎక్కడ జరిగింది?

  1. అమరావతి
  2. విజయవాడ
  3. హైదరాబాద్
  4. విశాఖపట్నం
సమాధానం
4. విశాఖపట్నం

24. 59వ డీజీపీలు, ఐజీపీల సదస్సు నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఏ నగరంలోని లోక్‌సేవా భవన్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది?

  1. విశాఖపట్నం
  2. చెన్నై
  3. భువనేశ్వర్
  4. భోపాల్
సమాధానం
3. భువనేశ్వర్

25. అంతర్జాతీయ సహకార కూటమి (ఇంటర్నేషనల్ కో ఆపరేటివ్ అలయన్స్-ఐసిఏ) గ్లోబల్ సదస్సు నవంబర్ 25 నుంచి 30వ తేదీ వరకు ఎక్కడ నిర్వహించారు?

  1. హైదరాబాద్
  2. తిరువనంతపురం
  3. న్యూఢిల్లీ
  4. గాంధీనగర్
సమాధానం
3. న్యూఢిల్లీ

26. 11వ అగ్నేషియా దేశాల సంఘం (అసోసియేషన్ అఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్ - ఏఎస్ఈఏఎన్) రక్షణ మంత్రుల సమావేశం - ప్లస్ (ఏడిఎంఎం-ప్లస్) సదస్సు ఇటీవల ఏ దేశంలో జరిగింది?

  1. రష్యా
  2. లావోస్
  3. జర్మనీ
  4. అర్జెంటీనా
సమాధానం
2. లావోస్

27. 2025లో తొలి అంధుల మహిళల టీ20 ప్రపంచకప్ ఏ దేశంలో నిర్వహించనున్నారు?

  1. దుబాయ్
  2. శ్రీలంక
  3. నేపాల్
  4. ఇండియా
సమాధానం
4. ఇండియా

28. ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ ఈవెంట్‌ను తొలిసారిగా 2025 ఆగస్టు 10న ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు?

  1. ఒడిశా
  2. కర్ణాటక
  3. గుజరాత్
  4. హైదరాబాద్
సమాధానం
1. ఒడిశా

29. పన్ను వసూళ్ళలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

  1. తెలంగాణ
  2. ఆంధ్రప్రదేశ్
  3. కర్ణాటక
  4. ఒడిశా
సమాధానం
1. తెలంగాణ

30. 'ఇండియా ప్రైమ్‌సిటీ ఇండెక్స్' 2024, నివేదిక ప్రకారం దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో మొదటి స్థానంలో ఉన్న నగరం ఏది?

  1. ముంబయి
  2. చెన్నై
  3. న్యూఢిల్లీ
  4. హైదరాబాద్
సమాధానం
4. హైదరాబాద్
సమాధానం

Post Comment