Daily Current Affairs Quiz: 1 February 2025
Telugu Current Affairs Quizzes

Daily Current Affairs Quiz: 1 February 2025

నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(1 ఫిబ్రవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.

1. రక్షణ మరియు భధ్రత కోసం సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ మరియు ఇటాలియన్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ఫర్ ఏరోస్పేస్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీల మధ్య అవగాహన ఒప్పందం ఏ రెండు దేశాల మధ్య జరిగింది?

  1. భారత్ - ఇరాన్
  2. భారత్ - ఇటలీ
  3. భారత్ - ఇజ్రాయెల్
  4. భారత్ - ఇరాక్
సమాధానం
2. భారత్ - ఇటలీ

2. 2024 డిసెంబర్ 3న యునైటెడ్ స్టేట్స్‌కు కొన్ని అరుదైన ఖనిజాలను ఎగుమతి చేయడంపై ఏ దేశం నిషేధాన్ని ప్రకటించింది?

  1. చైనా
  2. రష్యా
  3. ఇటలీ
  4. ఇండియా
సమాధానం
1. చైనా

3. ట్రాన్స్‌జెండర్లకు గౌరవప్రదమైన, సరైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు దేశంలోనే తొలిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం 'మైత్రి ట్రాన్స్ క్లినిక్‌'లు ఏర్పాటు చేసింది?

  1. ఆంధ్రప్రదేశ్
  2. పశ్చిమ బెంగాల్
  3. తెలంగాణ
  4. కేరళ
సమాధానం
3. తెలంగాణ

4. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో(స్టేయినబిలిటి) ఐఐటీ ఢిల్లీ ఎన్నో స్థానంలో నిలిచింది?

  1. 151
  2. 161
  3. 165
  4. 171
సమాధానం
4. 171

5. అణ్వాస్త్ర సామర్ధ్యమున్న 'కె4 బాలిస్టిక్ క్షిపణి'ని అణుశక్తితో నడిచే 'ఐఎన్ఎస్ అరిఘాత్' అనే జలాంతర్గామి నుంచి ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది?

  1. చైనా
  2. అమెరికా
  3. ఉత్తర కొరియా
  4. ఇండియా
సమాధానం
4. ఇండియా

6. 9వ ఆసియా శీతాకాల క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది?

  1. చైనా
  2. ఇండోనేషియా
  3. ఇండియా
  4. కెనడా
సమాధానం
1. చైనా

7. భారతీయ భాషా పుస్తక్ పథకం ప్రాథమిక లక్ష్యం ఏమిటి?

  1. ఆంగ్ల భాషా అభ్యాసాన్ని ప్రోత్సహించడం
  2. విదేశీ భాషా విద్యను ప్రోత్సహించడం
  3. కొత్త విశ్వవిద్యాలయాలను స్థాపించడం
  4. భారతీయ భాషలలో డిజిటల్ పాఠ్యపుస్తకాలను అందించడం
సమాధానం
4. భారతీయ భాషలలో డిజిటల్ పాఠ్యపుస్తకాలను అందించడం

8. 'హారమౌ శక్తి' పేరిట ఇటీవల ఏ రెండు దేశాల సంయుక్త సైనికదళ విన్యాసాల నాలుగో దశ ఎడిషన్‌ను నిర్వహించారు?

  1. భారత్ - రష్యా
  2. భారత్ - సింగపూర్
  3. భారత్ - మలేసియా
  4. భారత్ - నేపాల్
సమాధానం
3. భారత్ - మలేషియా

9. ఏ రాష్ట్రానికి చెందిన ప్రముఖ హస్తకళ 'ఘర్చోలా'కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగ్‌ను మంజూరు చేసింది?

  1. కర్ణాటక
  2. గుజరాత్
  3. మధ్యప్రదేశ్
  4. మహారాష్ట్ర
సమాధానం
2. గుజరాత్

10. మొక్కల ఆరోగ్య నిర్వహణను ప్రోత్సహించడం ద్వారా ఉద్యానవన ఉత్పాదకతను పెంచడానికి భారతదేశం ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) నుంచి ఇటీవల ఎంత రుణం పొందింది?

  1. 92 మిలియన్ డాలర్లు
  2. 94 మిలియన్ డాలర్లు
  3. 96 మిలియన్ డాలర్లు
  4. 98 మిలియన్ డాలర్లు
సమాధానం
4. 98 మిలియన్ డాలర్లు

11. 2024, డిసెంబర్ 4 నుంచి 6 వరకు వరల్డ్ మారిటైమ్ కాన్ఫరెన్స్‌ను ఎక్కడ నిర్వహించారు?

  1. హైదరాబాద్
  2. బెంగుళూరు
  3. చెన్నై
  4. విశాఖపట్నం
సమాధానం
3. చెన్నై

12. యునెస్కో ఇటీవల ఏ రాష్ట్రాన్ని అగ్ర వారసత్వ పర్యాటక గమ్యస్థానంగా ప్రకటించింది?

  1. కేరళ
  2. పశ్చిమ బెంగాల్
  3. కర్ణాటక
  4. ఒడిశా
సమాధానం
2. పశ్చిమ బెంగాల్

13. మహా సముద్రాల వాతావరణ సమాచారాన్ని పది రోజుల ముందే గుర్తించే వ్యవస్థను ఇటీవల ఏ నగరంలో 'ఇన్‌కాయిస్' అందుబాటులోకి తెచ్చింది?

  1. చెన్నై
  2. ముంబయి
  3. హైదరాబాద్
  4. భువనేశ్వర్
సమాధానం
3. హైదరాబాద్

14. కేంద్ర బడ్జెట్ 2025-26లో ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు కేటాయించింది?

  1. 9,417 కోట్లు
  2. 9,102 కోట్లు
  3. 8,302 కోట్లు
  4. 6,405 కోట్లు
సమాధానం
1. 9,417 కోట్లు

15. సెమికండక్టర్ భవిష్యత్తును రూపొందించటానికి సెమికాన్ ఇండియా 2024, కింది ఏ నగరంలో నిర్వహించబడింది?

  1. హైదరాబాద్
  2. అహ్మదాబాద్
  3. బెంగుళూరు
  4. గ్రేటర్ నోయిడా
సమాధానం
4. గ్రేటర్ నోయిడా

16. ఆంకోసెర్సియాసిస్‌ను నిర్మూలించిన మొదటి ఆఫ్రికన్ దేశం ఏది?

  1. నైజర్
  2. కెన్యా
  3. అల్జీరియా
  4. లిబియా
సమాధానం
1. నైజర్

17. 55వ అంతర్జాతీయ భారత్ చిత్రోత్సవం (ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా -ఐఎఫ్ఎఫ్ఐ) వేడుకలు ఏ రాష్ట్రంలో జరిగాయి?

  1. కేరళ
  2. తెలంగాణ
  3. మహారాష్ట్ర
  4. గోవా
సమాధానం
4. గోవా

18. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2025 మెగా వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడు ఎవరు?

  1. మిచెల్ స్టార్క్
  2. రిషబ్ పంత్
  3. బట్లర్
  4. విరాట్ కోహ్లీ
సమాధానం
2. రిషబ్ పంత్

19. ప్లాస్టిక్ ఉత్పత్తి పరిమితుల ప్రతిపాదనపై అంతర్‌ప్రభుత్వ సంప్రదింపుల కమిటీ ఐదో సదస్సు ఇటీవల ఏ దేశంలో జరిగింది?

  1. దక్షిణ కొరియా
  2. ఉత్తర కొరియా
  3. అర్జెంటీనా
  4. ఇండోనేషియా
సమాధానం
1. దక్షిణ కొరియా

20. ఇటీవల ఏ దేశంలో అతి భారీ స్థాయిలో బంగారం నిల్వలు బయటపడ్డాయి?

  1. ఇండియా
  2. చైనా
  3. దుబాయ్
  4. సింగపూర్
సమాధానం
2. చైనా

21. ప్రపంచ ప్రీ మెట్యూరిటీ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు?

  1. నవంబర్ 11
  2. నవంబర్ 14
  3. నవంబర్ 16
  4. నవంబర్ 17
సమాధానం
4. నవంబర్ 17

22. కంప్యూటర్ భద్రతా దినోత్సవం(సైబర్ సెక్యూరిటీ డే)ను ఏ రోజు జరుపుకుంటారు?

  1. నవంబర్ 25
  2. నవంబర్ 27
  3. నవంబర్ 29
  4. నవంబర్ 30
సమాధానం
4. నవంబర్ 30

23. ఏటా ప్రపంచ పర్వతాల దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు?

  1. డిసెంబర్ 9
  2. డిసెంబర్ 11
  3. డిసెంబర్ 13
  4. డిసెంబర్ 15
సమాధానం
2. డిసెంబర్ 11

24. జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఏటా ఏ రోజున నిర్వహిస్తారు?

  1. డిసెంబర్ 22
  2. డిసెంబర్ 24
  3. డిసెంబర్ 26
  4. డిసెంబర్ 27
సమాధానం
2. డిసెంబర్ 24

25. అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం(ఇంటర్నేషనల్ హ్యూమన్ సాలిడారిటీ డే)?

  1. డిసెంబర్ 20
  2. డిసెంబర్ 23
  3. డిసెంబర్ 25
  4. డిసెంబర్ 26
సమాధానం
1. డిసెంబర్ 20

26. ఇటీవల గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆదిమ గిరిజనులు యొక్క ఏ నృత్యానికి గిన్నిస్ బుక్‌లో చోటు దక్కింది?

  1. దింసా నృత్యం
  2. కోలాట నృత్యం
  3. దండారీ నృత్యం
  4. గుస్సాడీ నృత్యం
సమాధానం
4. గుస్సాడీ నృత్యం

27. 2025 క్వాడ్ శిఖరాగ్ర సదస్సు ఏ దేశంలో నిర్వహించనున్నట్లు ఇటీవల క్వాడ్ విదేశాంగ మంత్రులు ప్రకటించారు?

  1. ఇండియా
  2. అమెరికా
  3. రష్యా
  4. ఆస్టేలియా
సమాధానం
1. ఇండియా

28. ఇటీవల నీతిఆయోగ్ విడుదల చేసిన ఆర్థిక ఆరోగ్య సూచికలో మొదటి స్థానాన్ని సాధించిన రాష్ట్రం ఏది?

  1. తెలంగాణ
  2. కర్ణాటక
  3. ఒడిశా
  4. ఆంధ్రప్రదేశ్
సమాధానం
1. ఒడిశా

29. 2025, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా (ఎగ్జిక్యూటివ్ చైర్మన్- ఈసీ) ఎవరు నియమితులయ్యారు?

  1. జస్టిస్ రావినాథ్ తిల్హారి
  2. చాగరి ప్రవీణ్ కుమార్
  3. జితేంద్ర కుమార్ మహేశ్వరి
  4. ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా
సమాధానం
1. జస్టిస్ రావినాథ్ తిల్హారి

30. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ యాక్షన్ సమ్మిట్- 2025 ఎక్కడ జరగనున్నది ?

  1. జర్మనీ
  2. ఫ్రాన్స్
  3. ఇండియా
  4. అమెరికా
సమాధానం
2. ఫ్రాన్స్

Post Comment