Daily Current Affairs Quiz: 31 January 2025
Telugu Current Affairs Quizzes

Daily Current Affairs Quiz: 31 January 2025

నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(31 జనవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.

1. నమీబియా దేశ మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు?

  1. నెటుంబో నంది నైత్వా
  2. మెర్వాట్ ఎల్-తల్లావీ
  3. సామ్ నుజోమా
  4. శామ్యూల్ షఫీషునా డేనియల్ నుజోమా
సమాధానం
1. నెటుంబో నంది నైత్వా

2. ఏటా డిసెంబర్ 6న ఎవరి వర్ధంతి సందర్భంగా భారత్‌లో మహా పరినిర్వాణ్ దివస్‌ను నిర్వహిస్తారు?

  1. మహాత్మా గాంధీ
  2. రాజీవ్ గాంధీ
  3. డా. భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్
  4. సరోజినీ నాయుడు
సమాధానం
3. డా. భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్

3. ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారంను మధ్యప్రదేశ్‌లోని ఏ నగరంలో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు?

  1. భోపాల్
  2. ఉజ్జయిని
  3. గ్వాలియర్
  4. ఇండోర్
సమాధానం
2. ఉజ్జయిని

4. మొట్టమొదటి నీటి అడుగున మెట్రో రైలు సర్వీస్‌ను ఇటీవల ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

  1. ఉత్తరప్రదేశ్
  2. గుజరాత్
  3. కర్ణాటక
  4. కోల్‌కత
సమాధానం
4. కోల్‌కత

5. సీనియర్ నేషనల్ పురుషుల హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్ 2024 టైటిల్‌ను ఏ రాష్ట్రం గెలుచుకుంది?

  1. కేరళ
  2. హర్యానా
  3. గుజరాత్
  4. గోవా
సమాధానం
1. కేరళ

6. ఇటీవల అమెరికాలో అత్యున్నత పౌర పురస్కారం అయిన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను పొందిన ఫుట్‌బాల్ ఆటగాడు ఎవరు?

  1. లియోనెల్ రోనాల్డ్
  2. లియోనెల్ మెస్సీ
  3. క్రిస్టియానో ​​రొనాల్డో
  4. కైలియన్ ఎంబప్పే
సమాధానం
2. లియోనెల్ మెస్సీ

7. ఇటీవల, ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు?

  1. మనోజ్ గోవిల్
  2. తుహిన్ కాంత పాండే
  3. అరుణిష్ చావ్లా
  4. అంకిత్ జలాన్
సమాధానం
2. తుహిన్ కాంత పాండే

8. భారతదేశం మరియు విదేశాలలోని పరిశోధకులకు జన్యు(జీనోమ్) డేటాను అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం ప్రారంభించిన పోర్టల్ పేరు ఏమిటి?

  1. ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్ (ఐబిడిసి) పోర్టల్
  2. ఇండియన్ జెనోమిక్ రిపోజిటరీ (ఐజిసి) పోర్టల్
  3. జీనోమ్ యాక్సెస్ పోర్టల్
  4. లైఫ్ సైన్స్ డేటా బ్యాంక్
సమాధానం
1. ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్ (ఐబిడిసి) పోర్టల్

9. భారతదేశంలోని మొట్టమొదటి వాణిజ్య యుటిలిటీ-స్కేల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బిఈఎస్ఎస్) ఎక్కడ ఉంది?

  1. అమర్‌సర్, జైపూర్
  2. కిలోకారి- ఢిల్లీ
  3. ప్రయాగ్‌రాజ్, ఉత్తర ప్రదేశ్
  4. పోఖ్రాన్, జైసల్మేర్
సమాధానం
2. కిలోకారి- ఢిల్లీ

10. ప్రపంచంలోనే అతిపెద్ద కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ (CAES) టెక్నాలజీని ఏ దేశం ప్రారంభించింది?

  1. రష్యా
  2. ఇండియా
  3. చైనా
  4. అమెరికా
సమాధానం
3. చైనా

11. భారత రాజ్యాంగం 75వ వసంతోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ. ఏ నాణెం విడుదల చేసింది?

  1. రూ. 65 వెండి నాణెం
  2. రూ. 75 వెండి నాణెం
  3. రూ. 80 వెండి నాణెం
  4. రూ. 70 వెండి నాణెం
సమాధానం
2. రూ. 75 వెండి నాణెం

12. రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి "నో హెల్మెట్, నో ఇంధనం" విధానాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది?

  1. ఒడిశా
  2. హర్యానా
  3. ఉత్తరప్రదేశ్
  4. గోవా
సమాధానం
3. ఉత్తరప్రదేశ్

13. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఎఫ్ఐడీఈ) 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ 2024 టైటిల్‌ను ఎవరు కైవసం చేసుకున్నారు

  1. దొమ్మరాజు గుకేశ్
  2. ఆర్యన్ చోప్రా
  3. నిహాల్ సరిన్
  4. హారిక ద్రోణవల్లి
సమాధానం
1. దొమ్మరాజు గుకేశ్

14. 2025- ఖోఖో మొదటి ప్రపంచ కప్‌ను పురుషులు మరియు మహిళల విభాగాలలో ఏ దేశం గెలుచుకుంది?

  1. నేపాల్
  2. మయన్మార్
  3. ఇండియా
  4. శ్రీలంక
సమాధానం
3. ఇండియా

15. 2024 ఏడాది జీ-20 వార్షిక శిఖరాగ్ర సదస్సు యొక్క థీమ్ ఏమిటి?

  1. Building a just world and a sustainable planet
  2. Building a Fair World and a Sustainable Planet
  3. పై రెండూ
  4. ఏదీ కాదు
సమాధానం
1. Building a just world and a sustainable planet

16. ఇటీవల నైజీరియా ప్రభుత్వం తమ దేశ రెండో అత్యున్నత పురష్కారం 'ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ అఫ్ ది నైజర్'తో ఏ దేశ ప్రధానిని సత్కరించింది?

  1. చైనా
  2. నైజీరియా
  3. ఇండియా
  4. అర్జెంటీనా
సమాధానం
3. ఇండియా (నరేంద్ర మోడీ)

17. ఇటీవల 2024 జార్ఖండ్ ఎన్నికలలో ఏ కూటమి విజయం సాధించింది?

  1. మహా కూటమి
  2. ఇండియా కూటమి
  3. బీజేపీ కూటమి
  4. కాంగ్రెస్ కూటమి
సమాధానం
2. ఇండియా కూటమి

18. సంయుక్త పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?

  1. మధాబి పూరీ బుచ్‌
  2. పీపీ చౌదరి
  3. సి.ఎం రమేష్
  4. వి. బాలశౌరి
సమాధానం
2. పీపీ చౌదరి

19. ఇటీవల వార్తల్లో చుసిన కలరిపయట్టు ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ యుద్ధ కళ?

  1. కర్ణాటక
  2. ఒడిశా
  3. గుజరాత్
  4. కేరళ
సమాధానం
4. కేరళ

20. 21వ శతాబ్దంలోనే అత్యంత దారుణమైన పోరుగా నిలిచిన రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం 2024 నవంబర్ 19వ తేదీ నాటికి ఎన్ని రోజులు పూర్తిచేసుకుంది?

  1. 1199 రోజులు
  2. 999 రోజులు
  3. 1010 రోజులు
  4. 1000 రోజులు
సమాధానం
4. 1000 రోజులు

21. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్‌స్పెక్ట్స్ (GEP) నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది?

  1. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం
  2. అంతర్జాతీయ ద్రవ్య నిధి
  3. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం
  4. ప్రపంచ బ్యాంకు
సమాధానం
4. ప్రపంచ బ్యాంకు

22. ప్రాన్స్ దేశ నూతన ప్రధానిగా ఇటవల ఎవరు నియమితులయ్యారు?

  1. ఫ్రాంకోయిస్ హోలాండే
  2. ఫ్రాంకోయిస్ బైరూ
  3. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్
  4. జాక్వెస్ చిరాక్ జీన్-మేరీ
సమాధానం
2. ఫ్రాంకోయిస్ బైరూ

23. ఇటీవల ఏ దేశం 16 ఏండ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా చట్టం చేసింది?

  1. అమెరికా
  2. చైనా
  3. జపాన్
  4. ఆస్ట్రేలియా
సమాధానం
4. ఆస్ట్రేలియా

24. 2025, జనవరి 20-21 తేదీలలో 3వ జాతీయ గనుల మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?

  1. కోణార్క్ - ఒడిశా
  2. హైదరాబాద్ - తెలంగాణ
  3. బెంగుళూరు - కర్ణాటక
  4. చెన్నై - తమిళనాడు
సమాధానం
1. కోణార్క్ - ఒడిశా

25. జనవరి 2025లో మిషన్ విక్షిత్ భారత్ పై 67వ జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది?

  1. భోపాల్
  2. న్యూఢిల్లీ
  3. లక్నో
  4. హైదరాబాద్
సమాధానం
2. న్యూఢిల్లీ

26. మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు మైకేల్ కవెలాష్విలి డిసెంబర్ 14న ఏ దేశ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు?

  1. నమీబియా
  2. పోలాండ్
  3. జార్జియా
  4. అర్జెంటీనా
సమాధానం
3. జార్జియా

27. ఇటీవల ఏ రోజును 'ప్రపంచ ధ్యాన దినోత్సవం'(వరల్డ్ మెడిటేషన్ డే)గా ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ) నిర్ణయించింది?

  1. డిసెంబర్ 21
  2. డిసెంబర్ 22
  3. డిసెంబర్ 23
  4. డిసెంబర్ 24
సమాధానం
1. డిసెంబర్ 21

28. భారత్‌కు ఇచ్చిన అత్యంత సానుకూల దేశ హోదా(ఎంఎఫ్ఎన్)ను ఇటీవల ఏ దేశ ప్రభుత్వం రద్దు చేసింది?

  1. దుబాయ్
  2. రష్యా
  3. స్విట్జర్లాండ్
  4. బంగ్లాదేశ్
సమాధానం
3. స్విట్జర్లాండ్

29. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మిలిటరీ విమానాల నిర్వహణ సామర్ధ్యం పెంపు దిశగా ఏ రెండు దేశాల ఒప్పందం కుదిరింది?

  1. భారత్ - ఆస్ట్రేలియా
  2. భారత్ - రష్యా
  3. భారత్ - స్విట్జర్లాండ్
  4. భారత్ - ఇజ్రాయెల్
సమాధానం
1. భారత్ - ఆస్ట్రేలియా

30. బీమా సేవలందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసి) ఇటవల మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది?

  1. ఎల్ఐసి బీమా సఖీ యోజన
  2. ఎల్ఐసి జీవితకాల ఆశ
  3. ఎల్ఐసి బీమా శ్రీ
  4. ఎల్ఐసి కొత్త మనీ బ్యాక్ ప్లాన్
సమాధానం
1. ఎల్ఐసి బీమా సఖీ యోజన

Post Comment