మణిపాల్ మెట్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ వెలువడింది. ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కోర్సుల అడ్మిషన్ కోసం నిర్వహించే ఈ పరీక్షను ఏప్రిల్ 28 నుండి 30వ తేదీల మధ్య నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
మెట్ (MET) పరీక్షను మణిపాల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మరియు ఫార్మసీకి సంబంధించిన యూజీ, పీజీ కోర్సులలో అడ్మిషన్లు చేపట్టేందుకు నిర్వహిస్తారు. దేశీయంగా అంతర్జాతీయ వసతులతో ఉన్నత విద్యను అందించే ప్రైవేట్ యూనివర్సిటీలలో మణిపాల్ ముందు వరుసలో ఉంటుంది.
మణిపాల్ యూనివర్సిటీ పరిశోధనాత్మక ఉన్నత విద్యకు పెట్టింది పేరు. ఈ యూనివర్సిటీ అందించే ఇంజనీరింగ్, మెడికల్ మరియు ఫార్మసీ కోర్సులకు విద్యార్థుల నుండి భారీ డిమాండ్ ఉంటుంది. మణిపాల్ ప్రధాన క్యాంపస్ కర్ణాటకలోని ఉడిపిలో ఉండగా, జైపూర్, సిక్కింలో అనుబంధ క్యాంపసులను కలిగి ఉంది. అలానే ఇండియాలోనే కాకుండా మణిపాల్ మలేషియా, దుబాయిలలో బ్రాంచులను కలిగిఉంది.
మణిపాల్ మెట్ 2023
Exam Name | MET 2023 |
Exam Type | Entrance |
Admission For | B.Tech & Pharmacy |
Exam Date | 21-24 April 2023 |
Exam Duration | 1 to 2 Hours |
Exam Level | University Level |
మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ వివరాలు
మణిపాల్ యూనివర్సిటీలో యూజీ, పీజీ కోర్సులు
మణిపాల్ ఇనిస్టిట్యూట్ | యూజీ & పీజీ ప్రోగ్రామ్స్ |
---|---|
మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) | బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (B.Tech) ప్రోగ్రామ్స్ (యూజీ) మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (M.Tech) ప్రోగ్రామ్స్ (పీజీ) |
మణిపాల్ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ (MSOIS) | మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ (ME) ప్రోగ్రామ్స్ (పీజీ) |
మణిపాల్ స్కూల్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్సెస్ (MCOPS) | బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ (B.Pharm) (యూజీ) డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (ఫార్మాడీ) (యూజీ) మాస్టర్ ఆఫ్ ఫార్మసీ (M.Pharm) (పీజీ) ఫార్మాడీ పోస్ట్ బాకలారియేట్ (పీజీ) |
మెట్ ఎలిజిబిలిటీ
- యూజీ కోర్సులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఇంటర్/10+2 ఉత్తీర్ణతాయి ఉండాలి.
- పీజీ కోర్సుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు కలిగిన యూనివర్సిటీ నుండి సంబంధిత బ్యాచిలర్ డిగ్రీల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి
మణిపాల్ మెట్ 2023 ముఖ్యమైన తేదీలు
మెట్ 2023 మొదటి సెషన్ | |
దరఖాస్తు చివరి తేదీ | 15 మార్చి 2023 |
ఆన్‌లైన్ టెస్ట్ స్లాట్ బుకింగ్ | 21-24 ఏప్రిల్ 2023 |
మెట్ ఎగ్జామ్ | 28-30 ఏప్రిల్ 2023 |
ఫలితాలు | జూన్ 2023 (2nd వీక్) |
కౌన్సిలింగ్ | జూన్ 2023 (2nd వీక్) |
మెట్ 2023 2వ సెషన్ | |
దరఖాస్తు చివరి తేదీ | మే 2023 |
ఆన్‌లైన్ టెస్ట్ స్లాట్ బుకింగ్ | 19-22 మే 2023 |
మెట్ ఎగ్జామ్ | 27-28 మే 2023 |
ఫలితాలు | జూన్ 2023 (2nd వీక్) |
కౌన్సిలింగ్ | జూన్ 2023 (2nd వీక్) |
మెట్ దరఖాస్తు ఫీజు & ఎగ్జామ్ సెంటర్లు
దరఖాస్తు రుసుములు | పరీక్ష కేంద్రాలు |
ఎగ్జామ్ ఫీజు : 1400/- | విశాఖపట్నం, గుంటూరు, కడప, నెల్లూరు, విజయవాడ, కర్నూలు, కాకుండా, తిరుపతి, రాజమండ్రి హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ |
మేట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ
మేట్ రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్ విధానంలో మణిపాల్ యూనివర్సిటీకి చెందిన అధికారిక వెబ్‌సైట్ (www.apply.manipal.edu) ద్వారా చేసుకోవాలి. దరఖాస్తు మొదటి దశలో మొబైల్ మరియు ఇమెయిల్ ఐడీతో రిజిస్టర్ అవ్వాల్సి అంటుంది. రెండవ దశలో విద్యార్థి వ్యక్తిగత, విద్యా, చిరునామా వివరాలు పొందుపర్చి, పరీక్ష ఫీజు చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది.
దరఖాస్తు సమర్పించే ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసేముందు పునఃపరిశీలించుకోండి. దరఖాస్తు పూర్తిచేసాక ఒకటి లేదా రెండు కాపీలు ప్రింట్ తీసి భద్రపర్చండి.
- వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు.
- మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు.
- ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో మాత్రమే అప్‌లోడ్ చేయండి. అవి తారుమారు ఐతే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-200 కేబీల మధ్య ఉండేలా చూసుకోండి.
- దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటోగ్రాఫ్ కు సమానమైనది ఇంకో ఫొటోగ్రాఫ్ ను పరీక్ష రోజు ఆయా పరీక్షకేంద్రంలో ఇవ్వాల్సి ఉంటుంది.
- అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి.
- పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
- అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి.
- నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు.
మణిపాల్ మెట్ ఎగ్జామ్ నమూనా
మెట్ ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్ (సీబీటీ) విధానంలో జరుగుతుంది. అభ్యర్థి ఎంపిక చేసుకున్న ప్రవేశ పరీక్షను అనుచరించి గంట నుండి మూడు గంటల నిడివితో 400 నుండి 800 మార్కులకు జరుగుతుంది.
ఈపరీక్ష లో మొత్తం నాలుగు భాగాల నుండి 100 నుండి 200 ప్రశ్నలు ఉంటాయి. సరైన సమాధానం ఇచ్చిన ప్రశ్నకు 4 మార్కులు, తప్పు సమాధానం ఇచ్చిన ప్రశ్నకు -1 మార్కు ఇవ్వబడతాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ (మల్టిఫుల్ ఛాయస్) విధానంలో ఉంటాయి. మరిన్ని వివరాలు ఈ కింది పట్టికలో చూడండి.
Subjuct | Q.NO | Marks | |
పార్ట్ 1 | ఫిజిక్స్ | 50 | 200 |
పార్ట్ 2 | కెమిస్ట్రీ | 50 | 200 |
పార్ట్ 3 | మ్యాథ్స్ / బయాలజీ | 70 | 280 |
పార్ట్ 4 | ఇంగ్లీష్ + జనరల్ ఆప్టిట్యూడ్ | 30 | 120 |
200 | 800 |
మరిన్ని వివరాలు కోసం మణిపాల్ అడ్మిషన్ మానేజ్మెంట్'ని సంప్రదించండి
admissions@manipal.edu
9243777700
www.manipal.edu