బిట్‌శాట్‌ 2023 : నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీ
Admissions Engineering Entrance Exams

బిట్‌శాట్‌ 2023 : నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీ

బిట్‌శాట్‌ 2023 నోటిఫికేషన్ వెలువడింది. బిట్స్ క్యాంపస్ల యందు ఇంజనీరింగ్, ఎంఎస్సీ, ఫార్మసీ కోర్సులలో అడ్మిషన్లు నిర్వహించేందుకు జరిపే ఈ సీబీటీ పరీక్షను రెండు సెషన్లలో ఈ ఏడాది మే మరియు జూన్ నెలలో జరిపేందుకు షెడ్యూల్ విడుదల చేశారు.

బిట్‌శాట్‌ పరీక్షను బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ యందు ఇంజనీరింగ్ మరియు ఇతర గ్రాడ్యుయేషన్ కోర్సుల యందు అడ్మిషన్లు కల్పించేందుకు నిర్వహిస్తారు.  ప్రైవేట్ రంగంలో ఇంజనీరింగ్ విద్య అంటే టక్కున గుర్తొచ్చేది బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్). దేశంలో ఒకానొక గొప్ప డ్రీమ్డ్ యూనివర్సిటీగా వర్థిల్లుతున్న బిట్స్ యందు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఈ పరీక్ష రాయాల్సిందే.

బిట్స్ క్యాంపస్లు దేశవ్యాప్తంగా పిలానీ, గోవా, హైదరాబాద్‌తో సహా దుబాయ్ యందు కూడా అందుబాటులో ఉన్నాయి. బిట్స్ ఇంజనీరింగులో అత్యుత్తమ విద్యకు, పరిశోధనలకు పెట్టింది పేరు. ఐఐటీలు, ఎన్ఐటీల తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు బిట్స్ యందు ఇంజనీరింగ్ చేసేందుకు మక్కువ చూపిస్తారు.

ఈ కారణంగానే బిట్స్ కాంపస్ యందు అడ్మిషన్లకు దేశవ్యాప్తంగా తీవ్ర పోటీ ఉంటుంది. బిట్స్ యందు అడ్మిషన్ పొందాలంటే బిట్‌శాట్‌ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. 2022 కి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ వెలువడిన నేపధ్యలో ఈ ప్రవేశ పరీక్ష గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

బిట్‌శాట్‌ 2023

Exam Name BITSAT 2023
Exam Type Entrance
Admission For BE, B.Pharmacy, M.Sc
Exam Date 21 May 2023 O/W
Exam Duration 3 Hours
Exam Level University Level

బిట్‌శాట్‌ 2023 వివరాలు

బిట్స్ క్యాంపస్లు & అందిస్తున్న కోర్సులు

బిట్స్ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో బీఈ, బీఫార్మసీ, ఎమ్యెస్సీ కోర్సుల యందు బిట్‌శాట్‌ ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు కలిపిస్తుంది.

  1. బిట్స్ పిలానీ క్యాంపస్: బీఈ /బీటెక్: కంప్యూటర్ సైన్స్, సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మ్యానుఫ్యాక్టరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్.  బీఫార్మసీఎమ్యెస్సీ : బయోలాజికల్ సైన్స్ , కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్. (d) ఎమ్యెస్సీ: జనరల్ స్టడీస్.
  2. బిట్స్ గోవా క్యాంపస్ :  బీఈ /బీటెక్ : కంప్యూటర్ సైన్స్, సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మ్యానుఫ్యాక్టరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్.  ఎమ్యెస్సీ : బయోలాజికల్ సైన్స్ , కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.
  3. బిట్స్ హైదరాబాద్ క్యాంపస్ : బీఈ /బీటెక్ : కంప్యూటర్ సైన్స్, సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మ్యానుఫ్యాక్టరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్.  బీఫార్మసీ,  ఎమ్యెస్సీ :బయోలాజికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.

బిట్‌శాట్‌ 2023 ముఖ్యమైన తేదీలు

బిట్‌శాట్‌ 2023 మొదటి సెషన్ షెడ్యూల్
దరఖాస్తు ప్రారంభం 31 జనవరి 2023
దరఖాస్తు చివరి తేదీ 09 ఏప్రిల్ 2023
చేర్పులు మార్పులు 16 ఏప్రిల్ 2023
హాల్ టికెట్ డౌన్‌లోడ్ 10 మే 2023
పరీక్ష తేదీ 21-26 మే 2023
బిట్‌శాట్‌ 2023 2వ సెషన్ షెడ్యూల్
దరఖాస్తు ప్రారంభం 22 మే 2023
దరఖాస్తు చివరి తేదీ 12 జూన్ 2023
చేర్పులు మార్పులు 09 జూన్ 2023
హాల్ టికెట్ డౌన్‌లోడ్ 16 జూన్ 2023
పరీక్ష తేదీ 18-22 జూన్ 2023
కౌన్సిలింగ్ 2-23 జూన్ 2023

బిట్‌శాట్‌ 2023 ఎలిజిబిలిటీ

  • బీఫార్మసీ కోర్సులకు మినహా , పైన ఉన్న అన్ని కోర్సులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులలో  60% మార్కులతో 10+2 లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అయి ఉండాలి. అలానే ఇదే సబ్జెక్టులలో BITSAT లో 75% స్కోర్ సాధించి ఉండాలి.
  • బీఫార్మసీ కోర్సులలో చేరేందుకు పైన చెప్పిన వారితో పాటు ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక సబ్జెక్టులుగా చదువుకునే బయాలజీ గ్రూపు వారు కూడా అర్హులే.
  • 2020 మరియు 2021 లో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన వారు మాత్రమే BITSAT రాసేందుకు అర్హులు.
  • BITSAT లో అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా మాత్రమే అడ్మిషన్లు కల్పించబడతాయి.

బిట్‌శాట్‌ 2023 దరఖాస్తు ఫీజు

బిట్‌శాట్‌ 2023 రాసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు బిట్స్ అధికారిక అడ్మిషన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో అక్కడ ఉన్న నియమ నిబంధనలు ఒకసారి నిశితంగా పరిశీలించి దరఖాస్తు చేయటం మొదలు పెట్టండి. పూర్తి చేసేముందు మరో సారి మీరు నింపిన సమాచారం పునఃపరిశీలించి ముగించండి. ఒకసారి పరీక్ష రుసుము చెల్లించక అది ఎట్టి పరిస్థితిలో తిరిగి చెల్లింపబడదు.

దరఖాస్తు ఫీజు పురుషులు మహిళలు
సెషన్ I 3,400/- 2,900/-
సెషన్ I  & సెషన్ II 5,400/- 4,400/-

తెలుగు రాష్ట్రాలలో బిట్‌శాట్‌ పరీక్ష కేంద్రాలు

  • హైద్రాబాదు బిట్స్ క్యాంపస్
  • హైదరాబాద్ సిటీ
  • రాజమండ్రి
  • విజయవాడ
  • విశాఖపట్నం
  • తిరుపతి

బిట్‌శాట్‌ 2023 రిజిస్ట్రేషన్

బిట్‌శాట్‌ దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. బిట్‌శాట్‌ 2023 అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు సంబంధిత సర్టిఫికేట్లు అన్ని అందుబాటులో ఉంచుకోవాలి. దరఖాస్తు సమయంలో అందించే సమాచారంకు పూర్తి జవాబుదారీ మీరే కాబట్టి ఇచ్చే సమాచారంలో తప్పులు దొర్లకుండా చూసుకోండి.

దరఖాస్తు సమర్పించే ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీలు, రిజర్వేషన్ కేటగిరి, భాష ఎంపిక, పరీక్ష కేంద్రం వంటి వివరాలు దరఖాస్తు పూర్తిచేసేముందు పునఃపరిశీలించుకోండి. దరఖాస్తు పూర్తిచేసాక మూడు లేదా నాలుగు కాపీలు ప్రింట్ తీసి భద్రపర్చండి.

  • వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఈమధ్య కాలంలో తీసుకున్న పాసుపోర్టు సైజు ఫోటో అందుబాటులో ఉంచుకోండి. కంప్యూటర్ లో డిజైన్ లేదా ఎడిట్ చేసిన ఫోటోలు అనుమతించబడవు.
  • మీ సొంత దస్తూరితో చేసిన సంతకాన్ని అప్‌లోడ్ చేయండి. కాపిటల్ లేటర్స్ తో చేసిన సంతకం చెల్లదు.
  • ఫొటోగ్రాఫ్, సంతకం వాటికీ సంబంధించిన బాక్సుల్లో మాత్రమే అప్‌లోడ్ చేయండి. అవి తారుమారు ఐతే దరఖాస్తు పరిగణలోకి తీసుకోరు. ఈ ఫైళ్ల సైజు 10-200 కేబీల మధ్య ఉండేలా చూసుకోండి.
  • దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటోగ్రాఫ్ కు సమానమైనది ఇంకో ఫొటోగ్రాఫ్ ను పరీక్ష రోజు ఆయా పరీక్షకేంద్రంలో ఇవ్వాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు అందుబాటులో ఉండే తేదిలో పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోండి.
  • పరీక్ష రోజు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
  • అడ్మిట్ కార్డు, ఫొటోగ్రాఫ్ తో పాటు వ్యక్తిగత ఐడెంటి కార్డుతో పరీక్షకు హాజరవ్వాలి.
  • నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిల్లో అనుమతించబడవు.

బిట్‌శాట్‌ 2023 ఎగ్జామ్ నమూనా

బిట్‌శాట్‌ 2023 ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్ (సీబీటీ) విధానంలో జరుగుతుంది. మూడు గంటల నిడివితో 390 మార్కులకు జరిగే ఈపరీక్ష లో మొత్తం నాలుగు భాగాల నుండి 130 ప్రశ్నలు ఉంటాయి. సరైన సమాధానం ఇచ్చిన ప్రశ్నకు 3 మార్కులు, తప్పు సమాధానం ఇచ్చిన ప్రశ్నకు -1 మార్కు ఇవ్వబడతాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ (మల్టిఫుల్ ఛాయస్) విధానంలో ఉంటాయి. మరిన్ని వివరాలు ఈ కింది పట్టికలో చూడండి.

సబ్జెక్ట్/సిలబస్ ప్రశ్నలు మార్కులు
పార్ట్ 1 ఫిజిక్స్ 30 90
పార్ట్ 2 కెమిస్ట్రీ 30 90
పార్ట్ 3 ఇంగ్లీష్ ప్రోఫిసిఎన్సీ + లాజికల్ రీజనింగ్ 10+20 90
పార్ట్ 4 మ్యాథ్స్ / బయాలజీ (బీఫార్మసీ వారికీ) 40 120
130 390

బిట్‌శాట్‌ అడ్మిషన్ ప్రక్రియ

బిట్స్ క్యాంపసులలో బిట్‌శాట్‌ ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు జరుపుతారు. బిట్‌శాట్‌ ర్యాంకింగ్ విధానం పారదర్శికంగా ఉంటుంది. అభ్యర్థుల బిట్‌శాట్‌ స్కోర్ సమమయ్యేటప్పుడు మ్యాథమెటిక్స్/బయాలజీ లో సాధించిన స్కోర్ ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారుచేస్తారు.

ఈ విధానంలో సాధ్యంకాకుంటే తర్వాత ప్రాధాన్యత వరుసగా ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు ఇస్తారు. అప్పటికి కూడా తేలకుంటే అభ్యర్థి 10+2 లేదా ఇంటర్మీడియట్ లో సాధించిన మెరిట్ ఆధారంగా ర్యాంకులు విభజిస్తారు.

Post Comment