ఏపీ లాసెట్ & పీజీఎల్ సెట్ 2023 : ఎలిజిబిలిటీ, దరఖాస్తు ప్రక్రియ
Admissions Andhra Pradesh Ap CETs

ఏపీ లాసెట్ & పీజీఎల్ సెట్ 2023 : ఎలిజిబిలిటీ, దరఖాస్తు ప్రక్రియ

లా కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఏపీ లాసెట్ 2023 షెడ్యూలును ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఏపీ లాసెట్ 2023 పరీక్షలను మే 20వ తేదీన నిర్వహించనున్నట్లు తాత్కాలిక షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ నెలాఖరుకు అన్ని ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసేందుకు సన్నద్ధం అవుతుంది.

Advertisement

కోవిడ్ కారణంగా గత మూడేళ్ళుగా గాడి తప్పిన విద్యా వ్యవస్థను దారిలో పెట్టేందుకు ఈ ఏడాది అన్ని కామన్ ఎంట్రన్స్ పరీక్షలను ముందుగా నిర్వహించి, అంతే త్వరంగా ప్రవేశాలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నట్లు వెల్లడించింది.

ఏపీ లాసెట్ 2023

ఏపీ లాసెట్ & ఏపీ  పీజీఎల్ సెట్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ న్యాయ కళాశాలలో యూజీ మరియు పీజీ కోర్సులలో మొదటి ఏడాది ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఏపీ లాసెట్ పరీక్ష ప్రతి ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మరియు శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.

ఏపీ లాసెట్ & పీజీఎల్ సెట్ పరీక్షల అర్హుతతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లా కాలేజీలు, లా యూనివర్సిటీల యందు న్యాయ విద్యకు సంబంధించే గ్రాడ్యుయేట్ (LLB) మరియు పోస్టుగ్రాడ్యుయేట్ (LLM) కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చు. పూర్తి కంప్యూటర్ ఆధారంగా జరిగే ఈ పరీక్షలో 90 నిముషాలలో 120 ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది.

Exam Name AP LAWCET 2023
Exam Type Entrance Exam
Admission For LLB, LLM
Exam Date 20/05/2023
Exam Duration 3 Hours
Exam Level State Level

ఏపీ లాసెట్ & పీజీఎల్ సెట్ ఎలిజిబిలిటీ

  • అభ్యర్థులు భారతీయ పౌరులయి ఉండాలి.
  • ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ నియమాలకు సంబంధించి లోకల్/నాన్ లోకల్ అంశాలను అంతృప్తి పరచాలి.
  • బ్యాచిలర్ లా కోర్సుల ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్ లేదా 10+2 పూర్తిచేసి ఉండాలి.
  • పోస్టుగ్రాడ్యుయేట్ ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకునే వారు యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ లా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
  • ప్రవేశపరీక్ష రాసేందుకు యెటువంటి గరిష్ఠ వయోపరిమితి లేదు
వివిధ లా కోర్సుల్లో చేరేందుకు అర్హుతలు
కేటగిరి మూడేళ్ళ ఎల్ఎల్‌బి ఐదేళ్ల ఎల్ఎల్‌బి రెండేళ్ల ఎల్ఎల్ఎం
ఓసీ కేటగిరి 45 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ/పీజీ  ఉత్తీర్ణత  45 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత  50 శాతం మార్కులతో LLB/BL ఉత్తీర్ణత
బీసీ కేటగిరి 42 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ/పీజీ  ఉత్తీర్ణత 42 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత 50 శాతం మార్కులతో LLB/BL ఉత్తీర్ణత
ఎస్సీ, ఎస్టీ 40 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ/పీజీ  ఉత్తీర్ణత 40 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత 45 శాతం మార్కులతో LLB/BL ఉత్తీర్ణత

ఏపీ లాసెట్ & పీజీఎల్ సెట్ 2023 షెడ్యూల్

దరఖాస్తు ప్రారంభ తేదీ 23 మార్చి 2023
దరఖాస్తు చివరి తేదీ 22 ఏప్రిల్ 2023
చేర్పులు మార్పులు 11 మే 2023
హాల్ టికెట్ డౌన్‌లోడ్ 15 మే 2023
పరీక్ష తేదీ 20 మే 2023
ఫలితాలు జూన్ 2023
కౌన్సిలింగ్ జులై 2023

ఏపీ లాసెట్ & పీజీఎల్ సెట్ దరఖాస్తు ఫీజు

పరీక్ష పేపర్ రిజిస్ట్రేషన్ ఫీజు
LAWCET 900/- (GN), 850/- (OBC), 800/- (ST/SC)
PGLCET 1000/- (GN), 950/- (OBC), 900/- (ST/SC)

దరఖాస్తు రుసుములు ఏపీ ఆన్‌లైన్‌, టీఎస్ ఆన్‌లైన్‌, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు మరియు నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. దరఖాస్తు సమయంలో ఉండే అదనపు రుసుములు అభ్యర్థులే చెల్లించవల్సి ఉంటుంది.

ఏపీ లాసెట్ & పీజీఎల్ సెట్ 2023 రిజిస్ట్రేషన్

ఆంధ్రప్రదేశ్ లాసెట్ దరఖాస్తు ప్రక్రియ పూర్తి ఆన్‌లైన్‌ పద్దతిలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్  అధికారిక లా సెట్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించే ముందు ఈ కింది వివరాలు అందుబాటులో ఉంచుకోండి.

  • ఉత్తీర్ణత సాధించిన పరీక్ష హాల్ టికెట్ నెంబర్
  • టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్
  • పుట్టిన తేదీ వివరాలు
  • కేటగిరి వివరాలు (ఎస్సీ, ఎస్టీ, బీసీలు)
  • ఆధార్ నెంబర్
  • PH, NCC, Sports సర్టిఫికేట్లు
  • ఆదాయ దృవపత్రం & రేషన్ కార్డు నెంబర్
  • స్టడీ మరియు రెసిడెన్సీ సర్టిఫికెట్లు

దరఖాస్తు ప్రక్రియ మూడు దశలలో పూర్తిచేయాల్సి ఉంటుంది. మొదట దశలో అందుబాటులో ఉన్న పేమెంట్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాలి. రెండవ దశలో అభ్యర్థి యొక్క విద్యా, వ్యక్తిగత, చిరునామా వివరాలు పొందుపర్చడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాలి.

దరఖాస్తు పూర్తిచేసే ముందు మీ వివరాలు పలుమార్లు సరి చూసుకోండి. చివరి దశలో మీ దరఖాస్తును ప్రింటవుట్ తీసుకోవటం ద్వారా మొత్తం దరఖాస్తు ప్రక్రియ  పూర్తివుతుంది. మీరు తీసుకున్న ప్రింటవుట్ పై తాజాగా తీసిన మీ ఫొటోగ్రాఫ్ అతికించి, మీరు చదువుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ లేదా గ్రేజిటెడ్ ఆఫీసర్ తో సంతకం చేయించి పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్ కు అందించవల్సి ఉంటుంది.

ఏపీ లాసెట్ & పీజీఎల్ ఎగ్జామ్ సెంటర్లు

అనంతపురము
చిత్తూరు
తిరుపతి
కడప
కర్నూలు
నంద్యాల్
నెల్లూరు
ఒంగోల్
గుంటూరు
విజయవాడ
కాకినాడ
భీమావరం
రాజమహేంద్రవరం
విశాఖపట్నం
విజయనగరం
శ్రీకాకుళం

ఏపీ లాసెట్ 2023 ఎగ్జామ్ నమూనా

ఏపీ లాసెట్ ప్రధానంగా జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ, కరెంటు అఫైర్స్ మరియు లా అధ్యయనానికి సంబంధించిన అంశంలో అభ్యర్థుల అవగాహనను అంచనా వేసేందుకు రూపొందించబడింది. పూర్తి ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ఈ పరీక్షలో మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి.

90 నిముషాలలో మొత్తం 120 మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 1 మార్కు ఇవ్వబడుతుంది. ఐదేళ్ల LLB కి సంబంధించిన ప్రశ్నపత్రం ఇంటర్మీడియట్ స్థాయి సిలబస్ తో, రెండేళ్ల LLB సంబంధించిన ప్రశ్నపత్రం బ్యాచిలర్ స్థాయిలో సిలబస్ లో యివ్వబడుతుంది.

సెక్షన్ సిలబస్ ప్రశ్నలు మార్కులు
సెక్షన్ A జనరల్ నాలెడ్జ్ &  మెంటల్ అబిలిటీ 30 30
సెక్షన్ B కరెంటు అఫైర్స్ 30 30
సెక్షన్ C ఆప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా 60 60

ఏపీ  పీజీఎల్ సెట్ 2023 ఎగ్జామ్ నమూనా

ఎల్ఎల్ఎం కోర్సులకు సంబంధించి అన్ని కోర్సులకు ఒకే పీజీఎల్ సెట్ నిర్వహించబడుతుంది. పూర్తి ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ఈ పరీక్షలో మొత్తం రెండు పార్టులు ఉంటాయి. పార్ట్ A 40 ప్రశ్నలు ఉండగా, పార్ట్ B లో 80 ప్రశ్నలు ఇవ్వబడతాయి. 90 నిముషాలలో  మొత్తం 120 మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 1 మార్కు ఇవ్వబడుతుంది.

పార్ట్ సిలబస్ ప్రశ్నలు మార్కులు
పార్ట్ A Jurisprudence (20), Constitutional Law (20) 40 40
పార్ట్ B public International Law (16) Mercantile
Law (16), Labor Law (16), Crimes and Torts (16), and IPR & Other Laws (16)
80 80

ఏపీ లాసెట్ 2023 క్వాలిఫై మార్కులు & ర్యాంకింగ్ విధానం

ఏపీ లాసెట్ అర్హుత సాధించాలంటే 35 శాతం కనీస మార్కులు తప్పనిసరి. 120 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 42 మార్కులు సాధించిన వారిని ర్యాంకింగ్ ప్రక్రియలో పరిగణలోకి తీసుకుంటారు. ప్రవేశపరీక్షలో అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా తుది జాబితాను రూపొందిస్తారు.

మార్కులు సమమయ్యే అభ్యర్థులకు సెక్షన్ c లో వచ్చిన మార్కులకు ప్రాధాన్యత ఇస్తారు. ఇంకా సమమైతే అభ్యర్థుల వయోపరిమితి ఆధారంగా చేసుకుని తుదిజాబితాను విడుదల చేస్తారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి కనీస అర్హుత మార్కులు అవసరంలేదు.

పీజీఎల్ సెట్ అర్హుత సాధించాలంటే 25 శాతం కనీస మార్కులు తప్పనిసరి. 120 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 30 మార్కులు సాధించిన వారిని ర్యాంకింగ్ ప్రక్రియలో పరిగణలోకి తీసుకుంటారు. ప్రవేశపరీక్షలో అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా తుది జాబితాను రూపొందిస్తారు.

మార్కులు సమమయ్యే అభ్యర్థులకు పార్ట్ A లో వచ్చిన మార్కులకు ప్రాధాన్యత ఇస్తారు. ఇంకా సమమైతే అభ్యర్థుల వయోపరిమితి ఆధారంగా చేసుకుని తుదిజాబితాను విడుదల చేస్తారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి కనీస అర్హుత మార్కులు అవసరంలేదు.

Advertisement

Post Comment