నేటి కరెంట్ అఫైర్స్ క్విజ్(3 ఫిబ్రవరి 2025): నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. ఈ రోజు జరిగిన ప్రముఖ సంఘటనలు, నియామకాలు, పురస్కారాలు మరియు ఇతర ముఖ్యమైన విషయాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతిరోజూ ఈ క్విజ్ ప్రయత్నించడం ద్వారా మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు.
1. కోవిడ్ సంక్షోభం తర్వాత రాష్ట్రాలకు మూలధన వ్యయం కింద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తోంది. 2023-24 లో అత్యధిక మొత్తంలో నిధులు పొందిన రాష్ట్రాలు?
- ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్
- ఉత్తర్రప్రదేశ్, రాజస్థాన్, అస్సాం
- మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్
- బీహార్, రాజస్థాన్, అస్సాం
సమాధానం
1. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్
2. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్డివో అభివృద్ధి చేసిన ఏ క్షిపణిని తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్లో రక్షణ శాఖ ప్రదర్శించింది?
- నాగస్త్ర
- బ్రహ్మోస్
- ప్రళయ్
- పృద్వి
సమాధానం
3. ప్రళయ్
3. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఫ్లెమింగో ఫెస్టివల్‌ను జనవరి18 నుండి 20 వరకు ఏ జిల్లాలో నిర్వహించారు?
- తిరుపతి
- నెల్లూరు
- తూర్పుగోదావరి
- పశ్చిమ గోదావరి
సమాధానం
1. తిరుపతి
4. 2022-23 ఏడాదికి సంబంధించి ఫైనాన్షియల్ ర్యాంకింగ్స్‌ను నీతి అయోగ్ ఇటీవల విడుదల చేసింది. దీనిలో మొదటి మూడు స్థానాలలో నిలిచిన రాష్ట్రాలను గుర్తించండి?
- ఒడిశా,ఛత్తీస్‌గఢ్, గోవా
- ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్
- ఒడిశా, తెలంగాణ, గుజరాత్
- ఒడిశా, పంజాబ్, పశ్చిమబెంగాల్
సమాధానం
1. ఒడిశా,ఛత్తీస్‌గఢ్, గోవా
5. కేంద్ర ఎన్నికల సంఘం 2025 జనవరి 22న విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దేశంలో ఓటర్ల సంఖ్య?
- 98.1 కోట్లు
- 97.1 కోట్లు
- 99.1 కోట్లు
- 96.1 కోట్లు
సమాధానం
3. 99.1 కోట్లు
6. 97 వ ఆస్కార్ నామినేషన్లలో 2025లో మన దేశం నుంచి ఎంపికైన లఘు చిత్రం పేరు?
- అనూజ
- కంగువా
- ది గోట్ అఫ్ లైఫ్
- గర్విలీ బీ గర్ల్స్
సమాధానం
1. అనూజ
7. భారత పర్వతారోహకురాలు భావనాదేహారియా దక్షిణ అమెరికా ఖండంలోని అత్యంత ఎత్తైన “అకోన్ కాగ్వా పర్వతాన్ని అధిరోహించారు. అయితే దీని యొక్క ఎత్తు ఎంత?
- 6,961 మీటర్లు
- 9,661 మీటర్లు
- 6,691 మీటర్లు
- 9,561 మీటర్లు
సమాధానం
1. 6,961 మీటర్లు
8. ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలుచేస్తున్న తొలిరాష్ట్రం ఏది?
- ఉత్తరప్రదేశ్
- ఉత్తరఖాండ్
- పశ్చిమబెంగాల్
- రాజస్థాన్
సమాధానం
2. ఉత్తరఖాండ్
9. దేశంలో అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డ్ ఎవరి పేరున ఉంది ?
- మొరార్జీ దేశాయ్
- నిర్మలా సీతారామన్
- చిదంబరం
- సి.డి.దేశ్‌ముఖ్
సమాధానం
1. మొరార్జీ దేశాయ్
10. కేంద్ర బడ్జెట్ 2025-26 తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు ఎన్ని కోట్లు కేటాయించారు?
- 5,233 కోట్లు
- 5,333 కోట్లు
- 5,337 కోట్లు
- 6,446 కోట్లు
సమాధానం
3. 5,337 కోట్లు
11. ఏ రాష్ట్రానికి చెందిన ప్రముఖ హస్తకళ 'ఘర్చోలా'కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగ్‌ను మంజూరు చేసింది?
- తమిళనాడు
- గుజరాత్
- మహారాష్ట్ర
- కేరళ
సమాధానం
2. గుజరాత్
12. 'హారిమౌ శక్తి' పేరిట ఇటీవల ఏ రెండు దేశాల సంయుక్త సైనిక దళ విన్యాసాల నాలుగో ఎడిషన్‌ను నిర్వహించారు?
- భారత్ - మలేసియా
- భారత్ - ఇటలీ
- భారత్ - సింగపూర్
- భారత్ - నేపాల్
సమాధానం
1. భారత్ - మలేసియా
13. ఘానా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
- జాన్ ద్రామని మహామా
- మహాముడు బావుమియా
- డింగా సిస్సే
- క్వామే న్క్రుమా
సమాధానం
1. జాన్ ద్రామని మహామా
14. యూబీఎస్ బిలియనీర్ యాంబిషన్స్ నివేదిక ప్రకారం బిలియనీర్ల సంఖ్యలో భారత్ ప్రపంచంలో ఎన్నో స్థానంలో నిలిచింది?
- రెండో స్థానం
- మూడో స్థానం
- నాలుగో స్థానం
- ఐదో స్థానం
సమాధానం
2. మూడో స్థానం
15. 2000, ఏప్రిల్ నుంచి 2024, సెప్టెంబర్ వరకు భారత దేశానికి ఎంత మొత్తం విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చినట్లు అధికారక గణాంకాలు వెల్లడించాయి?
- ఒక ట్రిలియన్ డాలర్లు
- ఒక మిలియన్ డాలర్లు
- ఒక బిలియన్ డాలర్లు
- రెండు బిలియన్ డాలర్లు
సమాధానం
1. ఒక ట్రిలియన్ డాలర్లు
16. భారతదేశంలోని మొట్టమొదటి చిన్న తరహా ద్రవీకృత సహజ వాయువు (SSLNG) యూనిట్‌ను కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రి ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
- కర్ణాటక
- మధ్యప్రదేశ్
- ఒడిశా
- గుజరాత్
సమాధానం
2. మధ్యప్రదేశ్
17. ఇటీవల, మహారాష్ట్రలోని ఏ నగరం భారతదేశంలో మొట్టమొదటి నగర-నిర్దిష్ట జీరో కార్బన్ భవనాల కార్యాచరణ ప్రణాళిక (ZCBAP)ను ప్రారంభించింది?
- నాసిక్
- బొంబాయి
- పూణే
- నాగ్‌పూర్
సమాధానం
4. నాగ్‌పూర్
18. 'కోచ్‌రబ్ ఆశ్రమం(సత్యాగ్రహ ఆశ్రమం)' ఈ చారిత్రాత్మక ప్రదేశం మరియు మ్యూజియం ఏ రాష్ట్రంలో ఉంది?
- కర్ణాటక
- గుజరాత్
- పశ్చిమ బెంగాల్
- ఉత్తరప్రదేశ్
సమాధానం
2. గుజరాత్
19. ఇటీవల ఏ రాష్ట్రంలో తక్కువ పోలింగ్ శాతం ఉన్న 414 పోలింగ్ స్టేషన్‌లను లక్ష్యంగా చేసుకుని ఎన్నికల సంఘం "మిషన్ 414"ను ప్రారంభించింది?
- మధ్యప్రదేశ్
- అరుణాచల్ ప్రదేశ్
- హిమాచల్ ప్రదేశ్
- ఒడిశా
సమాధానం
3. హిమాచల్ ప్రదేశ్
20. ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏ జిల్లాలో మొట్టమొదటి గాజు స్కైవాక్ వంతెనను నిర్మించింది?
- అయోధ్య
- చిత్రకూట్
- వారణాసి
- సహరన్‌పూర్
సమాధానం
2. చిత్రకూట్
21. ఇటీవల వార్తల్లో కనిపించిన హక్కీ పిక్కీ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది?
- గుజరాత్
- జార్ఖండ్
- కర్ణాటక
- ఒడిశా
సమాధానం
3. కర్ణాటక
22. ఏ భారతీయ సంస్థ వినూత్నమైన 3D ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్‌ను అభివృద్ధి చేసింది?
- ఐఐటీ రూర్కీ
- ఐఐటి గౌహతి
- ఐఐటీ కాన్పూర్
- ఐఐటీ ఢిల్లీ
సమాధానం
2. ఐఐటి గౌహతి
23. భారతదేశంలోని బార్ అసోసియేషన్ కమిటీలో మహిళలకు ఎంత రిజర్వేషన్లు కల్పించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది?
- 22%
- 25%
- 30%
- 33%
సమాధానం
4. 33%
24. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగాలలో మహిళలకు 33% రిజర్వ్ చేసింది?
- మహారాష్ట్ర
- కర్ణాటక
- గుజరాత్
- ఒడిశా
సమాధానం
2. కర్ణాటక
25. భారతదేశ 35వ విదేశాంగ కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
- విక్రమ్ మిస్రీ
- అజయ్ బిసారియా
- అమితాబ్ కాంత్
- పంకజ్ సరన్
సమాధానం
1. విక్రమ్ మిస్రీ
26. క్రీడా ప్రతిభను ప్రోత్సహించడానికి వికలాంగుల కోసం దేశంలో మొట్టమొదటి 'సమ్మిళిత క్రీడా మాన్యువల్'ను ఇటీవల ఏ రాష్ట్రం రూపొందించింది?
- కేరళ
- మధ్యప్రదేశ్
- గుజరాత్
- పశ్చిమబెంగాల్
సమాధానం
1. కేరళ
27. దేశంలో అతిపెద్ద స్థాపిత పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన రాష్ట్రాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
- కేరళ
- తమిళనాడు
- ఆంధ్రప్రదేశ్
- మహారాష్ట్ర
సమాధానం
2. తమిళనాడు
28. పునరుత్పాదక శక్తి సామర్థ్యంలో భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
- రాజస్థాన్
- గుజరాత్
- కర్ణాటక
- తెలంగాణ
సమాధానం
1. రాజస్థాన్
29. ఏ రాష్ట్రంలో 'కోజికోడ్'ను భారతదేశపు మొట్టమొదటి యునెస్కో 'సిటీ ఆఫ్ లిటరేచర్' (సాహిత్య నగరం)'గా ప్రకటించింది?
- హర్యానా
- ఒడిశా
- కర్ణాటక
- కేరళ
సమాధానం
4. కేరళ
30. దేశంలోనే మొదటిసారిగా 24/7 పనిచేసే ధాన్యం ఏటీఎంను 'అన్నపూర్తి గ్రెయిన్ ఏటీఎం' పేరుతో ఇటీవల ఏ నగరంలో ప్రారంభించారు?
- చెన్నై
- కోల్‌కతా
- భువనేశ్వర్
- హైదరాబాద్
సమాధానం
3. భువనేశ్వర్