Daily Current affairs in Telugu 24 December 2023. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం
తెలంగాణ ప్రభుత్వం మహిళలు, బాలికలు మరియు ట్రాన్స్‌జెండర్ల కోసం టిఎస్‌ఆర్‌టిసిలో ఉచిత బస్సు ప్రయాణ సేవను డిసెంబర్ 9న ప్రారంభించింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇటీవలే తెలంగాణాలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ, తమ ఎన్నికల హామీలో భాగంగా దీనిని అందుబాటులోకి తెచ్చింది.
మహాలక్ష్మి జీరో-టికెట్ పేరుతొ అమలు చేస్తున్న ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వహించే నాన్-లగ్జరీ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. దీని కోసం మహిళలు కేవలం ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. వారికి సంబంధిత జీరో-టికెట్ జారీ చేయబడుతుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో మహాలక్ష్మి పథకం ప్రధానమైనది. ఇది మహిళా సాధికారిత లక్ష్యంతో రూపొందించబడింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని కుటుంబ పెద్దలైన మహిళలకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సహాయం అందించడంతో పాటుగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ మరియు తెలంగాణ అంతటా ఉచిత టిఎస్‌ఆర్‌టిసి బస్సు ప్రయాణం కల్పించేందుకు ఇది హామీ ఇచ్చింది.
తెలంగాణాలో చేయూత పథకం ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేందుకు చేయూత పథకాన్నిఅందుబాటులోకి తెచ్చింది. ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న దీనిని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అన్ని ఎంపానెల్డ్ ఆసుపత్రుల్లో ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించబడుతుంది.
ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి వైద్య చికిత్స కోసం 10 లక్షల ఆర్థిక కవరేజీ కల్పించబడుతుంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 90.10 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతాయని అంచనా. శారీరక రుగ్మతలతో బాధపడుతున్న రోగులకు 21 ప్రత్యేక సేవలతో పాటుగా 1,672 విభిన్న వైద్య ప్యాకేజీలు కూడా ఈ పథకం కింద అందుబాటులో ఉన్నాయి.
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య చికిత్స పరిమితిని ₹25 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 18న దీనికి సంబందించి అధికారిక ప్రకటనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఈ పునరుద్ధరించిన పథకం ఇప్పుడు రాష్ట్రంలోని సుమారు 4.25 కోట్ల మందికి కవరేజీని విస్తరింపజేస్తుండగా, ₹25 లక్షల వరకు ఉచిత చికిత్సను అందజేస్తుంది.
ఈ పథకం కింద ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 2,513 ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీనితో పాటుగా లబ్దిదారులకు ఈ కొత్త ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేసేందుకు సిద్దమవుతుంది. అలానే చికిత్స అనంతరం నెలకు 5,000 సహాయం అందించే అనుబంధ పథకం, ఆరోగ్య ఆసరా కూడా దీనితో పాటుగా అమలు చేయబడుతోంది. ఈ పథకం కింద కూడా 25 నుండి 27 లక్షలకు కవర్ చేయబడుతుంది. ఇప్పటివరకు ఈ పథకం కోసం 1,300 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
గుండె మార్పిడి, క్యాన్సర్ మరియు స్టెమ్ సెల్ థెరపీతో సహా మరెన్నో పెద్ద వ్యాధులనుఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని గ్రామ ఆరోగ్య క్లినిక్‌ల నుంచి 105 రకాల మందులు పంపిణీ చేయడంతో పాటుగా, 14 రకాల రోగనిర్ధారణ పరీక్షలను కూడా అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ఈ కొత్త ఫీచర్లు డిసెంబర్ 19 నుండి, అప్‌గ్రేడ్ చేసిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అమలు చేయనున్నారు.
జనవరి 1, 2024 నుండి, అర్హులైన వ్యక్తులకు ఉచిత మందులు కూడా నేరుగా సరఫరా చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీని కోసం ప్రభుత్వం తపాలా శాఖతో కలిసి పని చేసేందుకు సిద్దమవుతుంది. ఆరోగ్య పథకం సురక్ష 2వ దశ కూడా జనవరి 1 నుండి ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.. ఇందులో భాగంగా ప్రతి మండలంలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నారు, ఇది ప్రతి ఆరు నెలలకు ఒకసారి పునరావృతమవుతుంది.
ఆర్కిటిక్‌కు మొదటి శీతాకాల యాత్రను ప్రారంభించిన ఇండియా
నార్వేలోని స్వాల్‌బార్డ్‌లోని నై-అలెసుండ్ పరిశోధనా స్థావరంలో భారతదేశం తన మొట్టమొదటి శీతాకాల యాత్రను ప్రారంభించింది. ఆర్కిటిక్ ప్రాంతంలో భారత్ నిర్వహిస్తున్న ఈ మొదటి శీతాకాలపు యాత్రలో బెంగుళూరుకు చెందిన రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పాల్గొంటుంది. నలుగురు భారత శాస్త్రవేత్తల బృందం -40 డిగ్రీల ఉష్ణోగ్రతలో వచ్చే మార్చి వరకు ఇక్కడ పరిశోధనలో పాల్గొంటారు. నార్వేజియన్ ప్రభుత్వం ఆర్కిటిక్ చలికాలంలో భారతదేశానికి లాజిస్టిక్స్ మరియు పరిశోధన కార్యకలాపాలతో మద్దతునిస్తోంది.
భారతదేశం 2007 నుండి ఆర్కిటిక్ ప్రాంతంలో వేసవి యాత్రలను చేపడుతుంది. 2008 ఇక్కడ శాశ్వత పరిశోధనా స్థావరం అయిన హిమాద్రిని ఏర్పాటు చేసింది. ఇది నార్వేలో ఉన్న భారతదేశపు మొదటి పరిశోధనా కేంద్రం. ఇది ఉత్తర ధ్రువం నుండి 1,200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 8 మంది శాస్త్రవేత్తల బృందంతో వాతావరణ, జీవ, భూగర్భ, పర్యావరణ అంశాలపై పరిశీలనలు మరియు అధ్యయనాలు నిర్వహింహిస్తుంది.
భారతదేశం 1920లో పారిస్‌లో స్వాల్‌బార్డ్ ఒప్పందంపై సంతకం చేసింది. ఇది నార్వే సార్వభౌమాధికారం కింద స్వాల్‌బార్డ్ ద్వీపసమూహంలో పరిశోధన కార్యకలాపాలకు అనుమతిస్తుంది. భారతదేశం 1981 లో అంటార్కిటికా మరియు 2007లో ఆర్కిటిక్‌కు తన మొట్టమొదటి ధ్రువ అన్వేషణ సాహసయాత్ర ప్రారంభించింది. అంటార్కిటికాలో భారతదేశం మైత్రి మరియు భారతి అనే రెండు పరిశోధనా కేంద్రాలను కలిగి ఉంది. మైత్రిస్టేషన్ 1989లో స్థాపించబడింది. కొత్త స్టేషన్ భారతి 2013లో స్థాపించబడింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 2023
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 2023 డిసెంబర్ 4 నుండి 19 వరకు 18 రోజులలో 14 సమావేశాలు నిర్వహించారు. ఈ 14 రోజుల్లో 12 బిల్లులు లోక్‌సభలో ప్రవేశపెట్టబడ్డాయి. పాతవి కలుపుకుని మొత్తం 18 బిల్లులను లోక్‌సభ ఆమోదించింది. మరో 3 బిల్లులు లోక్‌సభ ఉపసంహరించుకుంది. అలానే 17 బిల్లులను రాజ్యసభ ఆమోదించింది. ఒక బిల్లును ఉపసంహరించుకుంది. ఈ సెషన్‌లో పార్లమెంటు ఉభయ సభలు మొత్తం 19 బిల్లులకు ఆమోదం తెలిపాయి.
లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లులు
- కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లు, 2023
- ది అప్రాప్రియేషన్ (నం. 3) బిల్లు, 2023
- ది అప్రాప్రియేషన్ (నం. 4) బిల్లు, 2023
- భారతీయ న్యాయ (రెండవ) సంహిత, 2023
- భారతీయ నాగరిక్ సురక్ష (రెండవ) సంహిత, 2023
- రిక్రూట్‌మెంట్ సాక్ష్యా (రెండవ) బిల్లు, 2023
- జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (రెండవ సవరణ) బిల్లు, 2023
- కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ (సవరణ) బిల్లు, 2023
- కేంద్ర వస్తువులు మరియు సేవల పన్ను (రెండవ సవరణ) బిల్లు, 2023
- పన్నుల తాత్కాలిక సేకరణ బిల్లు, 2023
- ఢిల్లీ యొక్క నేషనల్ క్యాపిటల్ టెరిటరీ చట్టాలు (ప్రత్యేక నిబంధనలు) రెండవ (సవరణ) బిల్లు, 2023
- టెలికమ్యూనికేషన్స్ బిల్లు, 2023
లోక్ సభ ఆమోదించిన బిల్లులు
- న్యాయవాదుల (సవరణ) బిల్లు, 2023 .
- జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు, 2023.
- జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2023
- కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లు, 2023
- ది అప్రాప్రియేషన్ (నం. 3) బిల్లు, 2023
- ది అప్రాప్రియేషన్ (నం. 4) బిల్లు, 2023
- జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (రెండవ సవరణ) బిల్లు, 2023
- కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ (సవరణ) బిల్లు, 2023
- పోస్ట్ ఆఫీస్ బిల్లు, 2023
- ఢిల్లీ యొక్క నేషనల్ క్యాపిటల్ టెరిటరీ చట్టాలు (ప్రత్యేక నిబంధనలు) రెండవ (సవరణ) బిల్లు, 2023
- కేంద్ర వస్తువులు మరియు సేవల పన్ను (రెండవ సవరణ) బిల్లు, 2023
- పన్నుల తాత్కాలిక సేకరణ బిల్లు, 2023
- భారతీయ న్యాయ సంహిత, 2023
- భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, 2023
- రిక్రూట్‌మెంట్ సాక్ష్యా బిల్లు, 2023
- టెలికమ్యూనికేషన్స్ బిల్లు, 2023
- ప్రధాన ఎన్నికల కమీషనర్ మరియు ఇతర ఎన్నికల కమీషనర్ల బిల్లు, 2023
- ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు, 2023
పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన బిల్లులు
- న్యాయవాదుల (సవరణ) బిల్లు, 2023 .
- జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు, 2023.
- జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2023
- కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లు, 2023
- రద్దు మరియు సవరణ బిల్లు, 2023
- జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (రెండవ సవరణ) బిల్లు, 2023
- కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ (సవరణ) బిల్లు, 2023
- పోస్ట్ ఆఫీస్ బిల్లు, 2023
- ది అప్రాప్రియేషన్ (నం. 3) బిల్లు, 2023
- ది అప్రాప్రియేషన్ (నం. 4) బిల్లు, 2023
- ఢిల్లీ యొక్క నేషనల్ క్యాపిటల్ టెరిటరీ చట్టాలు (ప్రత్యేక నిబంధనలు) రెండవ (సవరణ) బిల్లు, 2023
- కేంద్ర వస్తువులు మరియు సేవల పన్ను (రెండవ సవరణ) బిల్లు, 2023
- పన్నుల తాత్కాలిక సేకరణ బిల్లు, 2023
- భారతీయ న్యాయ సంహిత, 2023
- భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, 2023
- రిక్రూట్‌మెంట్ సాక్ష్యా బిల్లు, 2023
- టెలికమ్యూనికేషన్స్ బిల్లు, 2023
- ప్రధాన ఎన్నికల కమీషనర్ మరియు ఇతర ఎన్నికల కమీషనర్లు బిల్లు, 2023
- ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు, 2023
లోక్‌సభలో ఉపసంహరించుకున్న బిల్లులు
- భారతీయ న్యాయ సంహిత, 2023
- భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, 2023
- రిక్రూట్‌మెంట్ సాక్ష్యా బిల్లు, 2023
రాజ్యసభలోఉపసంహరించుకున్న బిల్లులు
- టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (సవరణ) బిల్లు, 2008