Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 13 జనవరి 2024
January Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 13 జనవరి 2024

January 13, 2024 Current affairs in Telugu. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో పొందండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షల కొరకు సిద్దమవుతున్న ఆశావహుల కోసం వీటిని అందిస్తున్నాం.

ట్రిప్ అడ్వైజర్ ట్రావెలర్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో దుబాయ్ అగ్రస్థానం

ట్రిప్ అడ్వైజర్ యొక్క 2024 ట్రావెలర్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో ఈ ఏడాది కూడా దుబాయ్ అత్యున్నత గౌరవనీయమైన నెంబర్ 1 గ్లోబల్ డెస్టినేషన్ ర్యాంకింగ్‌ను నిలబెట్టుకుంది. ఈ దుబాయ్ ఈ గౌరవం దక్కించుకోవడం వరుసగా ఇది మూడవసారి. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రావెల్ గైడెన్స్ ప్లాట్‌ఫారమ్ అయిన ట్రిప్ అడ్వైజర్ వెల్లడించిన ఈ ప్రశంస ప్రత్యేకంగా చెప్పుకోదగినది, ఎందుకంటే ట్రిప్ అడ్వైజర్ కమ్యూనిటీలోని మిలియన్ల మంది గ్లోబల్ ప్రయాణికుల సమీక్షల ద్వారా విజేతలు నిర్ణయించబడతారు.

ఈ సమీక్షలు అక్టోబర్ 1, 2022 నుండి సెప్టెంబరు 30, 2023 వరకు 12 నెలల వ్యవధిలో పరిగణలోకి తీసుకోబడ్డాయి. ఈ సమీక్షలు ప్రతి గమ్యస్థానంలోని హోటళ్లు, రెస్టారెంట్‌లు మరియు అనుభవాలపై ఫీడ్‌బ్యాక్ నాణ్యత మరియు పరిమాణాన్ని అంచనా వేయబడతాయి. ప్రపంచంలోని ఇష్టమైన గమ్యస్థానంగా దుబాయ్ పదే పదే గుర్తించబడడం, దాని శక్తివంతమైన పర్యాటక గొప్పతనాన్ని నొక్కి చెబుతుంది.

దుబాయ్ ప్రభుత్వం యొక్క అసాధారణమైన పర్యాటక మద్దతు, ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాల మధ్య నగరం యొక్క నిరంతర సహకారం, అంతర్జాతీయ పెట్టుబడులతో స్థానిక ప్రతిభను కలపడం, నగరం యొక్క జీడీపీలో 10% పర్యాటక వాటా కలిగి ఉండటం ఈ గొప్ప గౌరవం పొందేందుకు కారణం కావొచ్చు.

ఇది మాత్రమే కాకుండా దుబాయ్ ఈ ఏడాది యూరోమానిటర్ ఇంటర్నేషనల్ యొక్క టాప్ 100 సిటీ డెస్టినేషన్స్ ఇండెక్స్ 2023లో ప్రపంచంలోనే నం. 2 స్థానాన్ని దక్కించుకుంది. గ్లోబల్ పవర్ సిటీ ఇండెక్స్‌లోని టాప్ 10 నగరాల్లో కూడా ఇది జాబితా చేయబడింది. నంబియో ఆన్‌లైన్ డేటాబేస్ ప్రకారం యూఏఈ (దుబాయ్‌) 2023లో ప్రపంచవ్యాప్తంగా రెండవ అత్యంత సురక్షితమైన దేశంగా గుర్తించబడింది.

దుబాయ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం ప్రచురించిన తాజా డేటా ప్రకారం, జనవరి మరియు నవంబర్ 2023 మధ్య 15.37 మిలియన్ల అంతర్జాతీయ పర్యాటకులు దుబాయ్ నగరాన్ని సందర్శించారు. ఇది 2022 ఏడాదితో సరిపోల్చితే 20% వృద్ధి నమోదు చేసింది.

శ్రీలంకలోని క్యాండీలో ఐఐటీ మద్రాస్ కొత్త క్యాంపస్‌ ఏర్పాటు

ఐఐటీ మద్రాస్ కొత్త క్యాంపస్‌ను శ్రీలంకలోని క్యాండీలో ప్రారంభించనున్నట్లు శ్రీలంక విద్యాశాఖ మంత్రి డాక్టర్ సుసిల్ ప్రేమజయంత తెలిపారు. ఆర్థిక మంత్రి హోదాలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే సమర్పించిన బడ్జెట్ 2024లో ఈ ప్రతిపాదన ఒక భాగమని ఆయన పేర్కొన్నారు. గత నెలలో తన భారత్ పర్యటనలో మద్రాస్‌ ఐఐటీలో డైరెక్టర్‌, డీన్స్‌ ఆఫ్‌ ఫ్యాకల్టీలతో చర్చలు జరిపినట్లు ఆయన వెల్లడించారు.

2024 చివరిలోపు ఈ క్యాంపస్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఐఐటీ మద్రాస్ బృందం శ్రీలంకను సందర్శించే ముందు, తమ విద్యావేత్తల బృందాన్ని ఐఐటీ మద్రాస్‌కు పంపుతామని డాక్టర్ ప్రేమజయంత వెల్లడించారు.

ఐఐటీ మద్రాస్ గత సంవత్సరం నవంబర్‌లో టాంజానియాలోని జాంజిబార్‌లో కూడా అంతర్జాతీయ క్యాంపస్‌ను స్థాపించడానికి ముందుకొచ్చింది. అలానే ఐఐటీ ఢిల్లీ కూడా అబుదాబిలో తన గ్లోబల్ క్యాంపస్ ఏర్పాటు చేస్తుంది. ఈ చర్యలు ప్రపంచవ్యాప్తంగా భారతీయ విద్యా నైపుణ్యాన్ని విస్తరించే సమగ్ర వ్యూహంలో భాగంగా భావించాలి. విదేశాలలో క్యాంపస్‌లను తెరవడం ఐఐటీలకు ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌గా ఉపయోగపడుతుందది.

ఇతర దేశాల్లోని తెలివైన విద్యార్థులకు వారి స్వంత దేశాల్లో అత్యున్నత స్థాయి విద్యను పొందేందుకు ఇవి అవకాశం కల్పిస్తాయి. విదేశీ క్యాంపస్‌ల స్థాపన ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఖ్యాతిని పెంపొందిస్తుంది, తద్వారా దౌత్య సంబంధాలను బలోపేతం చేస్తుంది. అలానే విద్యార్థుల మరియు అధ్యాపకుల జనాభా వైవిధ్యానికి, అంతర్జాతీయ పరిశోధన సహకారాలను పెంపొందించడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.

ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2023

ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్) 2023 యొక్క 9 వ ఎడిషన్ 2024 జనవరి 17 నుండి 20 వ తేదీ వరకు హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు భారత్ ప్రభుత్వం నిర్వహించాయి. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్-ఇండియా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ మరియు ఫరీదాబాద్ లోని ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ ఈ గ్రాండ్ ఈవెంట్‌ను హోస్ట్ చేసాయి.

ఈ ఈవెంట్ ఈ ఏడాది “అమృత్ కాల్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ ఔట్రీచ్” అనే థీమ్‌తో నిర్వహించారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం సాధించిన విజయాలను జరుపుకోవడం ఈ సైన్స్ ఫెస్టివల్ యొక్క ప్రధాన లక్ష్యం. ఈ ఈవెంట్‌ సైన్స్ ఔత్సాహికుల విజయాలను గుర్తించడం మరియు యువ విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం మరియు భారతీయ పౌరులలో దానిని వ్యాప్తి చేయడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ఏడాది ఐఐఎస్ఎఫ్ 2023లో 22 దేశాలు కూడా పాల్గొన్నాయి. వీటిలో అర్జెంటీనా, ఆర్మేనియా, ఆస్ట్రేలియా, కంబోడియా, ఫ్రెంచ్, జర్మనీ, ఇండోనేషియా, జపాన్, కెన్యా, లావో పీపుల్స్ డెమోక్రటిక్, మలేషియా, మయన్మార్, నమీబియా, ఫిలిప్పీన్స్, రువాండా, సింగపూర్, సౌత్ ఆఫ్రికా, థాయిలాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వియత్నాం మరియు జింబాబ్వే దేశాలు ఉన్నాయి.

ఐఐఎస్ఎఫ్ 2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర సైన్స్ & టెక్నాలజీ రాష్ట్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు. తక్కువ సమయంలో డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ను తయారు చేసిన మొదటి దేశం భారత్ అని ఆయన అన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఇప్పుడు ఐదో స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు. సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ యొక్క బలంతో భారతదేశం ప్రపంచ ఖ్యాతిని పొందే దేశంగా మారిందని తెలిపారు.

అయోధ్య మ్యాపింగ్ హక్కులు దక్కించుకున్న జెనెసిస్ ఇంటర్నేషనల్

అయోధ్య నగరం యొక్క అధికారిక మ్యాపింగ్ హక్కులను భారతదేశంలోని ప్రముఖ మ్యాపింగ్ కంపెనీ అయిన జెనెసిస్ ఇంటర్నేషనల్ దక్కించుకుంది. అయోధ్య నగరానికి సంబంధించి 3డి డిజిటల్ ట్విన్ మరియు 2డి నావిగేషనల్ మ్యాప్‌లు రూపొందించేందుకు అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ నుండి ఈ సంస్థ అనుమతులు దక్కించుకుంది.

జెనెసిస్ యొక్క అధునాతన 3డీ మ్యాపింగ్ పర్యాటకులకు నగరానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడంతో పాటుగా ట్రాఫిక్ నిర్వహణ, విపత్తు నిర్వహణ మరియు అత్యవసర ప్రతిస్పందన కోసం కూడా ఉపయోగపడనున్నాయి. ఈ మ్యాపింగ్ సాంకేతికత అయోధ్య యొక్క నావిగేషనల్ ల్యాండ్‌స్కేప్‌ను మార్చడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.

3డీ డిజిటల్ ట్విన్ టెక్నాలజీ అయోధ్యను అన్వేషించడానికి వాస్తవిక మరియు ఇంటరాక్టివ్ మార్గాన్ని అందిస్తుంది. యాత్రికులు, పౌరులు మరియు అధికారులు అయోధ్యలోని మార్గాలు, స్థానాలు మరియు ఆసక్తికర ప్రదేశాలపై ఇక మీదట ఖచ్చితమైన మరియు నవీకరించబడిన సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు. ఈ మ్యాప్‌లో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేక ఫీచర్లు అందుబాటులోకి తెస్తున్నారు. ఇది పర్యావరణ సుస్థిరతకు అయోధ్య యొక్క నిబద్ధతకు మద్దతు ఇస్తుంది.

అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో తమ అధికారిక యాప్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది,. ఇది జెనెసిస్ మ్యాపింగ్ ఇంటర్‌ఫేస్ ద్వారా నగరాన్ని పూర్తి వైభవంగా అన్వేషించడానికి పౌరులను ఆహ్వానిస్తుంది. సౌదీ అరేబియాలోని జెనెసిస్ ఇంటర్నేషనల్ యొక్క అనుబంధ సంస్థ ఇటీవల సౌదీ అరేబియా ద్వారా పవిత్ర నగరం మక్కా యొక్క 3డీ డిజిటల్ ట్విన్ మ్యాపింగ్ కోసం కాంట్రాక్టును పొందింది.

దేశంలో త్రీ-డైమెన్షనల్ (3డి) డిజిటల్ ట్విన్-మ్యాపింగ్ ప్రోగ్రామ్ కోసం సర్వే ఆఫ్ ఇండియాతో కూడా ఈ కంపెనీ వ్యూహాత్మక టై-అప్‌ను గత నవంబర్‌లో ప్రకటించింది. ఆసియాలోని అతిపెద్ద మురికివాడ అయిన ధారవిని డిజిటల్ మ్యాపింగ్ చేసే కాంట్రాక్టును కూడా ఈ సంస్థనే దక్కించుకుంది.

బెంగాలీ రచయిత శీర్షేందు ముఖోపాధ్యాయకు కువెంపు రాష్ట్రీయ పురస్కారం

ప్రఖ్యాత బెంగాలీ రచయిత శిర్షేందు ముఖోపాధ్యాయ 2023 ఏడాదికి గాను కువెంపు రాష్ట్రీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ జాతీయ అవార్డు దివంగత కన్నడ కవి కువెంపు గౌరవార్థం స్థాపించబడింది. భారతీయ భాషలకు విశేష కృషి చేసిన రచయితలకు దీనిని యేటా అందిస్తారు. విజేతకు జ్ఞాపిక మరియు 5 లక్షల నగదు బహుమతి అందించబడుతుంది.

ముఖోపాధ్యాయ తన పేరు మీద 90కి పైగా పుస్తకాలను రచించారు. అతని రచనలలో నవలలు, చిన్న కథలు, ప్రయాణ కథనాలు మరియు బాల సాహిత్యం ఉన్నాయి. ముఖోపాధ్యాయ రచనలు మానవ సంబంధాల యొక్క అంతర్దృష్టి చిత్రణలను సృశిస్తాయి. సాంఘిక మరియు రాజకీయ, ప్రకృతి దృశ్యం యొక్క అతని చురుకైన పరిశీలనలకు ఈ రచనలు ప్రసిద్ధి చెందాయి.

ముఖోపాధ్యాయ యొక్క అత్యంత ప్రసిద్ధ రచనలలో కొన్ని ఛాయాసతి (1971), భలోబాసా భలోబాస (1973), గుల్పోగులి" (1985) వంటివి ఉన్నాయి. అలానే ఆయన రాసిన యాత్ర మరియు చిన్న కథా సంకలనాలలో దుయ్ కొతప్కోథోన్ (1963), శ్రీజనర్ మేయే (1981), ప్రాంతిక్ (1970) మరియు ధోరోనర్ అబేగ్ (1991) వంటివి ఉన్నాయి.

ముఖోపాధ్యాయ యొక్క రచనలు ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్ మరియు జపనీస్‌తో సహా అనేక భాషలలోకి అనువదించబడ్డాయి. ఈయన 1985లో బాల సాహిత్యానికి ఆయన చేసిన కృషికి గాను విద్యాసాగర్ అవార్డు, 1973 & 1990 లో ఆనంద పురస్కార్, 1989లో ఆయన మనబ్జమిన్ నవలకు సాహిత్య అకాడమీ అవార్డు, 2012లో బంగా బిభూషణ్ అవార్డు, 2021లో సాహిత్య అకాడమీ ఫెలోషిప్ మరియు అబీపీ ఆనంద సెరా బంగాలీ అవార్డు (సెరార్ సెరా) సహా అనేక అవార్డులను అందుకున్నారు.

10 స్టార్‌లైనర్ మానవరహిత ఏరియల్ వెహికల్ ఆవిష్కరణ

ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ దేశీయంగా తయారు చేసిన మొదటి దృష్టి (Drishti) 10 స్టార్‌లైనర్ మానవరహిత వైమానిక వాహనం (యూఏవీ)ని ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యాక్రమం జనవరి 10న హైదరాబాద్ లోని అదానీ డిఫెన్స్ & ఏరోస్పేస్‌ యందు జరిగింది.

అదానీ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ చేత తయారు చేయబడిన ఈ డ్రోన్ భారతదేశ రక్షణ సాంకేతికతలో ఆత్మనిర్భర్త (స్వయం-విశ్వాసం) దిశగా ఒక ప్రధాన అడుగును సూచిస్తుంది. దృష్టి 10 స్టార్‌లైనర్ అనేది 36 గంటల నిడివితో, 450 కిలోల పేలోడ్ సామర్థ్యంతో కూడిన అధునాతన ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్ మరియు రికనైసెన్స్ ప్లాట్‌ఫారమ్.

ఇది నాటో యొక్క స్టానాగ్ 4671 (స్టాండర్డైజేషన్ ఒప్పందం 4671) సర్టిఫికేషన్‌తో మానవరహిత వైమానిక వాహనం యొక్క ఎయిర్‌వర్తీనెస్‌తో ఉన్న ఏకైక ఆల్-వెదర్ మిలటరీ ప్లాట్‌ఫారమ్. ఇది వేరు చేయబడిన మరియు వేరు చేయని గగనతలంలో ప్రయాణించే సమర్థం కలిగి ఉంటుంది. ఈ 10 స్టార్‌లైనర్ మానవరహిత వైమానిక వాహనం, పోర్ బందర్‌లోని నావికాదళ సముద్ర కార్యకలాపాల కోసం ఉపయోగించబడుతుంది.

ఈ డ్రోన్ విమానం ఇంటెలిజెన్స్, నిఘా మిషన్ల కోసం అధునాతన సెన్సార్లు మరియు కెమెరాలతో అమర్చబడి ఉంది. ఇది భారత నౌకాదళం యొక్క సముద్ర నిఘా మరియు భద్రత సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు. అరేబియా మరియు హిందూ మహాసముద్రంలో సముద్ర గస్తీ మరియు నిఘా కోసం దీనిని మోహరించాలని భావిస్తున్నారు.

అదానీ ఏరోస్పేస్ పార్క్ అనేది మిలిటరీ గ్రేడ్ మానవరహిత వ్యవస్థలు, వ్యూహాత్మక మరియు లాటరింగ్ డ్రోన్‌ల కోసం ప్రైవేట్ సెక్టార్‌లో దేశంలోని మొట్టమొదటి చివరి అసెంబ్లీ లైన్ మరియు కార్బన్ ఏరోస్ట్రక్చర్స్ తయారీ యూనిట్. ఇది ఎలక్ట్రానిక్స్ మరియు ఏవియానిక్స్ యూనిట్ మరియు ఎలక్ట్రో ఆప్టికల్/ఇన్‌ఫ్రా-రెడ్ పేలోడ్‌లతో ఏకీకృతం చేయబడింది. తద్వారా ఈ యూనిట్ 70% కంటే ఎక్కువ స్వదేశీీకరణకు దోహదపడింది. అదానీ గ్రూప్‌లో భాగమైన అదానీ డిఫెన్స్ & ఏరోస్పేస్ ప్రస్తుతం దేశీయ అత్యాధునిక రక్షణ ఉత్పత్తుల రూపకల్పన, అభివృద్ధి మరియు తయారీలో అగ్రగామిగా ఉంది.

నయీ సోచ్ నయీ కహానీ పేరుతో రేడియో కార్యక్రమం ప్రారంభించిన స్మృతి ఇరానీ

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆల్ ఇండియా రేడియోలో నయీ సోచ్ నయీ కహానీ - ఎ రేడియో జర్నీ విత్ స్మృతి ఇరానీ అనే రేడియో షోను హోస్ట్ చేయడం ప్రారంభించారు. ఈ వారాంతర కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు ఢిల్లీలోని ఆకాశవాణి గోల్డ్ 100.1 MHzలోప్రసారం కానుంది. అలానే అన్ని ఆకాశవాణి స్టేషన్ల ద్వారా దేశవ్యాప్తంగా ప్రసారం కానుంది. ఇది అధికారికంగా గత  నవంబర్ 15వ తేదీన ప్రారంభమైంది.

ఈ కార్యక్రమం ద్వారా అసమానతలకు వ్యతిరేకంగా గొప్ప విషయాలను సాధించిన సాధారణ వ్యక్తుల కథలను పంచుకోవడం ఆమె లక్ష్యంగా పెట్టుకుంది. ఇది వ్యవస్థాపకత, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, ఆరోగ్యం మరియు ఆర్థిక రంగాలలో మహిళల విజయ గాథలను వెలుగులోకి తీసుకురావడానికి ఉద్దేశించబడింది. ప్రారంభ ఎపిసోడ్‌లో స్టార్టప్‌లు మరియు స్వీయ-నిర్మిత వ్యాపార నేపథ్యాల నుండి మహిళలు, వారి ప్రయాణాలు మరియు ప్రభుత్వ కార్యక్రమాల వినియోగాన్ని సమీక్షించారు.

ఫ్రాన్స్ యొక్క అతి పిన్న వయస్కుడైన పీఎంగా గాబ్రియేల్ అట్టల్

ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దేశం యొక్క కొత్త ప్రధాన మంత్రిగా గాబ్రియేల్ అట్టల్‌ను జనవరి 9న నియమించారు. దీనితో గాబ్రియేల్ అట్టల్ 34 సంవత్సరాల వయస్సులో ఫ్రాన్స్ యొక్క అతి పిన్న వయస్కుడైన ప్రధాన మంత్రిగా చరిత్ర సృష్టించాడు. అలానే గాబ్రియేల్ అటల్‌ ఫ్రాన్స్‌ యొక్క మొట్టమొదటి బహిరంగ స్వలింగ సంపర్కుడైన ప్రధాన మంత్రిగా కూడా చరిత్రకెక్కారు.

ఇటీవలే ఈ పదివికి రాజీనామా చేసిన ఎలిసబెత్ బోర్న్ నుండి అతను ఈ బాధ్యతలు స్వీకరిస్తాడు. గాబ్రియేల్ అట్టల్‌ ప్రస్తుతం ప్రపంచంలోనే దేశాధినేతగా లేదా ప్రభుత్వాధినేతగా పనిచేసిన అతి పిన్న వయస్కుడిగా కూడా నిలిచాడు. ప్రధాని ప్రదవిని స్వీకరించాక ముందు ఆయన ఫ్రెంచ్ ఎడ్యుకేషన్ మినిస్టరుగా ఉన్నారు.

గాబ్రియేల్ అట్టల్‌ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు సన్నిహిత మిత్రుడుగా భావిస్తున్నారు. అట్టల్ అత్యంత ప్రజాదరణ పొందిన ప్రభుత్వ మంత్రి అని స్థానిక పోల్స్ సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఫ్రెంచ్ మైనారిటీ ప్రభుత్వానికి ఆయన నాయకత్వం వహిస్తారు. ఫ్రాన్స్‌లో ప్రధానమంత్రి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారు. ప్రధాని అధ్యక్షునిచే నేరుగా నియమించబడతారు, కానీ నేరుగా తొలగించబడలేరు.

ఫ్రాన్స్ యూరోపియన్ యూనియన్‌లో అతిపెద్ద దేశం. ఐరోపాలో ఇది రెండవ అతిపెద్ద దేశం. ఇది అనేక శతాబ్దాలుగా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటిగా ఉంది. ఫ్రాన్స్ తన సరిహద్దులను ఎనిమిది దేశాలతో పంచుకుంటుంది. ఫ్రాన్స్ ఈశాన్యంలో బెల్జియం మరియు లక్సెంబర్గ్, తూర్పున జర్మనీ, స్విట్జర్లాండ్ మరియు ఇటలీ, దక్షిణాన మధ్యధరా సముద్రం, మొనాకో, స్పెయిన్, అండోరా సరిహద్దులుగా ఉన్నాయి. యునైటెడ్ కింగ్‌డమ్‌తో కూడా ఫ్రాన్స్ సముద్ర సరిహద్దులను పంచుకుంటుంది.

  • దేశం : ఫ్రాన్స్
  • రాజధాని :పారిస్
  • అధికారిక భాష : ఫ్రెంచ్
  • అధికారిక కరెన్సీ : యూరో
  • అధ్యక్షుడు : ఇమ్మాన్యుయేల్ మాక్రాన్
  • ప్రధాన మంత్రి : గాబ్రియేల్ అట్టాల్

Post Comment