ఏపీ పాలీసెట్ 2023 నోటిఫికేషన్ వెలువడింది. ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులలో అడ్మిషన్ కల్పించే ఈ ప్రవేశ పరీక్షను 10 మే 2023 న నిర్వహించేందుకు ఏపీ సాంకేతిక విద్యా మండలి ఏర్పాటు చేస్తుంది. ఏపీ పాలీసెట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఫిబ్రవరి 16 నుండి ఏప్రిల్ 30వ తేదీల మధ్య చేపట్టనున్నారు.
ఏపీ పాలీసెట్ పరీక్షను టెన్త్ పూర్తిచేసిన విద్యార్థులకు ఇంజనీరింగ్ లేదా నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులలో అడ్మిషన్ కల్పించేందుకు నిర్వహిస్తారు. పాలీసెట్ అనగా పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అర్ధం. ఈ పరీక్షను ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ & ట్రైనింగ్ నిర్వహిస్తుంది.
పాలీసెట్ పరీక్షలో అర్హుత పొందిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రభుత్వ అన్ ఎయిడెడ్ మరియు ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజీల్లో మూడేళ్ళ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.
Exam Name | AP POLYCET 2023 |
Exam Type | Entrance Test |
Entrance For | Polytechnic Diploma |
Exam Date | 10/05/2023 |
Exam Duration | 2 Hours |
Exam Level | State Level (AP) |
గమనిక : తెలంగాణ ప్రభుత్వ పరిధిలోని యూనివర్సిటీ అనుబంధ కాలేజీల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారు తెలంగాణ పాలీసెట్ పరీక్షను రాయాల్సి ఉంటుంది.
ఏపీలో 3ఏళ్ళ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు
|
|
ఏపీలో 3.5 ఏళ్ళ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు
|
|
ఏపీ పాలీసెట్ 2023 ముఖ్యమైన తేదీలు
ఏపీ పాలీసెట్ దరఖాస్తు ప్రారంభం | 17 ఫిబ్రవరి 2023 |
ఏపీ పాలీసెట్ 2023 దరఖాస్తు గడువు | 30 ఏప్రిల్ 2023 |
ఏపీ పాలీసెట్ అడ్మిట్ కార్డు | మే 2023 |
ఏపీ పాలీసెట్ పరీక్ష తేదీ | 10 మే 2023 |
ఏపీ పాలీసెట్ ఫలితాలు | 25 మే 2023 |
ఏపీ పాలీసెట్ 2023 ఎలిజిబిలిటీ
- ఏపీ మరియు తెలంగాణ విద్యార్థులు అర్హులు
- విద్యార్థి ఏపీ లేదా తెలంగాణ స్టేట్ బోర్డు నుండి 35% మార్కులతో టెన్త్ పూర్తిచేసి ఉండాలి.
- పాలీసెట్ పరీక్షకు హాజరయ్యేందుకు ఎటువంటి వయోపరిమితి లేదు.
ఏపీ పాలీసెట్ దరఖాస్తు ఫీజు & పరీక్ష కేంద్రాలు
దరఖాస్తు రుసుములు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా ఈ చలానా విధానంలో చెల్లించవచ్చు. చెల్లింపు సమయంలో సర్వీస్ చార్జీలు , జీఎస్టీ వంటి అదనపు చార్జీలు ఉంటె అభ్యర్థులనే భరించాలి.
జనరల్ కేటగిరి | Rs 400/- |
---|---|
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు | Rs 250/- |
ఏపీ పాలీసెట్ కోసం ఏపీ అన్ని జిల్లాలో పరిధిలో దాదాపు 400 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులు తమకు అందుబాటులో ఉండే పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
ఏపీ పాలీసెట్ రిజిస్ట్రేషన్
పాలీసెట్ కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ యొక్క అధికారిక వెబ్సైటు www polycetap.nic.in ద్వారా ఆన్‌లైన్ విధానంలో చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి ఆదశలో విద్యార్థి టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్, వ్యక్తిగత మరియు అడ్రెస్స్ వివరాలు నింపాల్సి ఉంటుంది.
తరువాత దశలో ఆధార్ నెంబరుతో పాటుగా, రిజర్వేషన్ కేటగిరి, పరీక్ష కేంద్రం ఎంపిక, లాంగ్వేజ్ ఎంపిక వంటి వివరాలు అందించాల్సి ఉంటుంది. చివరిగా చివరిగా ఎగ్జామ్ రుసుమును చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. చివరిగిగా దరఖాస్తు సమర్పించే ముందు మీ వివరాలు మరోసారి సరిచూసుకోవడం మరవొద్దు.
ఏపీ పాలీసెట్ ఎగ్జామ్ నమూనా
ఏపీ పాలీసెట్ ప్రవేశ పరీక్ష ఆఫ్‌లైన్ విధానంలో 120 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష 2 గంటల నిడివితో ఉంటుంది. ప్రశ్నపత్రం మొత్తం మూడు సెక్షన్లుగా ఉంటుంది. ప్రశ్నలు పూర్తి ఆబ్జెక్టివ్ విధానంలో టెన్త్ క్లాస్ ఆధారిత మాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుండి ఇవ్వబడతాయి.
ఇందులో మ్యాథ్స్ నుండి 50 ప్రశ్నలు, ఫిజిక్స్ నుండి 40 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుండి 30 ప్రశ్నలు ఇవ్వబడతాయి. నెగిటివ్ మార్కులు ఉండవు. ప్రశ్నపత్రం తెలుగు/ఇంగ్లీష్ లేదా ఉర్దూ/ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది.
సెక్షన్ | సిలబస్ | ప్రశ్నలు | మార్కులు |
---|---|---|---|
సెక్షన్ I | మ్యాథమెటిక్స్ | 50 ప్రశ్నలు | 50 మార్కులు |
సెక్షన్ II | ఫిజిక్స్ | 40 ప్రశ్నలు | 40 మార్కులు |
సెక్షన్ III | కెమిస్ట్రీ | 30 ప్రశ్నలు | 30 మార్కులు |
120 ప్రశ్నలు | 120 మార్కులు |
ఏపీ పాలీసెట్ ర్యాంకింగ్ విధానం
పాలీసెట్ ర్యాంకింగ్ ఇంజనీరింగ్ మరియు నాన్ ఇంజినీరింగ్ కోర్సులకు విడివిడిగా అందిస్తారు. ఇంజనీరింగ్ కోర్సులు అందించే పాలిటెక్నిక్స్ కోసం ఎంపీసీ ర్యాంకింగ్ సహాపడుతుంది. ఇందులో కేవలం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సెక్షన్లను మాత్రమే లెక్కిస్తారు. వీటిలో ఒక్కోదానిలో కనీసం 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
రిజర్వేషన్ నియమాలు
ఈ పరీక్షను తెలంగాణ మరియు ఏపీ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు రాసేందుకు అనుమతి ఉంది. కానీ మెజారిటీ అడ్మిషన్లు లోకల్ అభ్యర్థులకు కల్పిస్తారు. అనగా అందుబాటులో సీట్లలో 85% సీట్లు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కేటాయిస్తారు. ఇందులో కేటగిరి వారీగా ఎస్సీలకు 15 శాతం సీట్లు, ఎస్టీలకు 6 శాతం సీట్లు మరియు బీసీలకు 29% శాతం సీట్లు కల్పిస్తారు.
తెలంగాణ (85 శాతం సీట్లు) | ఆంధ్రప్రదేశ్ (15 శాతం సీట్లు) | |
---|---|---|
బీసీలకు | 29 శాతం సీట్లు | 29 శాతం సీట్లు |
ఎస్సీలకు | 15 శాతం సీట్లు | 15 శాతం సీట్లు |
ఎస్టీలకు | 6 శాతం సీట్లు | 6 శాతం సీట్లు |
కోర్సు ట్యూషన్ ఫీజులు & ఇతర రుసుములు
యూనివర్సిటీ / పాలిటెక్నిక్ | ఏడాదికి ఫీజు మొత్తం |
---|---|
ప్రభుత్వ & ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ | Rs 4,700/- |
ప్రైవేటు పాలిటెక్నిక్స్ | Rs 25,000/- |