Advertisement
నేషనల్ డిజిటల్ లైబ్రరీ : ప్రాంతీయ భాషల్లో డాకుమెంట్స్, జర్నల్స్
Online Education Useful websites

నేషనల్ డిజిటల్ లైబ్రరీ : ప్రాంతీయ భాషల్లో డాకుమెంట్స్, జర్నల్స్

నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాను 2016 లో భారత ప్రభుత్వం యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రూపొందించింది. విద్యార్థులకు అపరితమైన డిజిటల్ విద్యా వనరులను అందించేందుకు, జాతీయ మరియు అంతర్జాతీయ డిజిటల్ లైబ్రరీల నుండి అపరిమితమైన విజ్ఙానాన్ని శోధించి, సేకరించి దీన్ని రూపొందించారు.

సేకరించిన విజ్ఞాన్ని పాఠ్యపుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, ఆడియో పుస్తకాలు, ఉపన్యాసాలు, అనుకరణలు, ఫిక్షన్ మొదలగు కేటగిరీలుగా విభజించి డిజిటల్ టెక్స్ట్ ఫార్మేట్ లోకి మార్చారు. 2016 లో జాతీయ ఎడ్యుకేషనల్ పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ లైబ్రరీని 2018 లో అప్పటి కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్ విద్యార్థులకు అంకితం చేశారు.

నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ప్రస్తుతం 6 కోట్లకు పైగా డిజిటల్ టెక్స్ట్ ఫైల్స్ ను కలిగి ఉంది. ఇందులో స్కూల్ మరియు ఉన్నత విద్యకు సంబంధించిన సాధారణ అకాడమిక్ పుస్తకాలతో పాటుగా, జర్నల్స్, స్కాలర్ పబ్లికేషన్స్, డేటా సెట్స్, ఐడియాస్, రీసెర్చ్ పేపర్స్, డాకుమెంట్స్, వీడియోలు కూడా అందుబాటులో ఉంచారు.

స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి స్టేట్, CBSC, NCERT బోర్డులకు చెందిన వీడియో పాఠాలు, పాఠ్య పుస్తకాల, క్వశ్చన్ పేపర్లు, వర్క్ షీట్లు అందుబాటులో ఉంచారు. అకాడమిక్ కంటెంటుతో పాటుగా జేఈఈ వంటి పోటీ పరీక్షకు సంబంధించి ప్రేపరషన్ మెటీరియల్స్ కూడా దీనిలో పొందుపర్చారు.
NDL

హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంజనీరింగ్, సైన్స్, హ్యుమానిటీస్, లిటరేచర్ మరియు లా అండ్ మానేజ్మెంట్ విభాగాలకు చెందిన పూర్తిస్థాయి డిజిటల్ టెక్స్ట్ లైబ్రరీని కలిగి ఉంది. ఈ విజ్ఞాన సంపదంతా ఇంగీషుతో పాటుగా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు వంటి మరో 8 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంచింది.

ఉర్దూ వంటి కొన్ని భారతీయ భాషలను డిజిటల్ రూపంలోకి మార్చడానికి 'ఆప్టికల్ క్యారెక్టర్ రెకగ్నిషన్' సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి పర్చింది. నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా రూపంలో ఏర్పాటు చేసిన, ఈ డిజిటల్ విజ్ఞాన సంపదను భారతీయ విద్యార్థులకే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల విద్యార్థులకు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంచింది.

ఓపెన్ యూజర్ రిజిస్ట్రేషన్ ద్వారా అన్ని దేశాల విద్యార్థులు వీటిని ఉపయోగించుకోవచ్చు. కాకుంటే వరల్డ్ ఈ బుక్ లైబ్రరీ, సౌత్ ఆసియ ఆర్చివ్, ఓఈసిడీ లైబ్రరీ మరియు సత్యజిత్ రాయ్ సొసైటీ ప్రముఖ కంటెంట్ సౌర్సేస్ కోసం విద్యార్థులు తప్పక రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది.