యూజీసీ కలిగిన ఇండియన్ యూనివర్సిటీలలో ఎంఫిల్, పీహెచ్డీ చేసే డిజాబిలిటీ పరిశోధన విద్యార్థులకు ఫెలోషిప్ చేసే అవకాశాన్ని, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ మరియు డిపార్టుమెంటు ఆఫ్ ఎంపవర్మెంట్ అఫ్ పర్సన్స్ విత్ డిజాబిలిటీస్ సంయుక్తంగా అందిస్తున్నాయి. ఈ ఫెలోషిప్ స్కీమ్ తరుపున ఏడాదికి 200 మంది విద్యార్థులకు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) ప్రోగ్రాంలో జాయిన్ అయ్యే అదృష్టాన్ని కల్పిస్తుంది. రెండేళ్ల జూనియర్ ఫెలోషిప్'లో ఉత్తమ ఫలితాలు కనబరిస్తే మరో మూడేళ్లు సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఆఫర్ చేస్తుంది.
స్కాలర్షిప్ పేరు | నేషనల్ ఫెలోషిప్ ఫర్ డిజాబిలిటీ స్టూడెంట్స్ (NFPwD) |
ఎవరు అర్హులు | ఎంఫిల్/పీహెచ్డీ అడ్మిషన్ పొందిన డిజాబిలిటీ విద్యార్థులు |
అకాడమిక్ ఇయర్ | 2022-2023 |
దరఖాస్తుకు ఆఖరు తేదీ | 15-01-2022 |
కోర్సు పేరు | కోర్సు వ్యవధి | JRF & SRF వ్యవధి | |
JRF | SRF | ||
ఎంఫిల్ | రెండేళ్లు | రెండేళ్లు | - |
పీహెచ్డీ | ఐదేళ్లు | రెండేళ్లు | మరో మూడేళ్లు |
పీహెచ్డీ + ఎంఫిల్ | ఐదేళ్లు | రెండేళ్లు | మరో మూడేళ్లు |
ఫెలోషిప్ చేజెక్కించుకున్న విద్యార్థులు ఒకరకంగా నక్కతోక తొక్కినట్లే. ఒకవైపు ఎంఫిల్/పీహెచ్డీ చదువుతో పాటుగా మరో వైపు జెఆర్ఎఫ్ ద్వారా పరిశోధన సంస్థల్లో లేదా యూనివర్సిటీలో పనిచేసే అవకాశం లభిస్తుంది. ఇంకో వైపు ప్రభుత్వం అందించే అలోవెన్సులు, గ్రాంట్లులతో కెరీర్లో ఉన్నత స్థాయికి అవకాశం దొరుకుతుంది. జెఆర్ఎఫ్ కోసం ఎంపికయ్యే పరిశోధన విద్యార్థులకు ప్రభుత్వం అందించే వివిధ ఫైనాన్సియల్ అసిస్టెన్సులు కింద చూడండి.
Fellowship | JRF చేస్తున్న రెండేళ్లు నెలకు 25,000/- అందిస్తారు. SRF కు ఎంపిక అయ్యాక నెలకు 28,000/- అందిస్తారు. |
Contingency for humanities and social sciences | మొదటి రెండేళ్లు ఏడాదికి 10,000/-, తర్వాత మూడేళ్లు ఏడాదికి 20,500/- |
Contingency for Science, Engineering & Technology | మొదటి రెండేళ్లు ఏడాదికి 12,000/-, తర్వాత మూడేళ్లు ఏడాదికి 25,000/- |
Departmental Assistance (For All Subjects) | నెలకు 3,000/- రూపాయలు |
Escort/Reader Assistance | నెలకు 2,000/- (ఫీజికల్ & విజువల్ డిజాబిలిటీ విద్యార్థులకు) |
ఎవరు అర్హులు
యూజీసీ గుర్తింపు పొందిన ఇండియన్ యూనివర్సిటీలలో ఎంఫిల్ లేదా పీహెచ్డీ అడ్మిషన్ ప్రక్రియ పూర్తిచేసుకున్న డిజాబిలిటీ విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు అర్హులు. విద్యార్థులు ఆధార్ లింక్డ్ బ్యాంకు అకౌంట్, డిజాబిలిటీ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డు, అకాడమిక్ సర్టిఫికెట్స్ వంటివి దరఖాస్తు సమయానికి అందుబాటులో ఉంచుకోవాలి.
దరఖాస్తు ఎలాచేయాలి
ఈ ఫెలోషిప్ సంబంధించిన దరఖాస్తు నోటిఫికేషన్, నేషనల్ వార్తాపత్రికలు మరియు న్యూస్ పోర్టల్స్ ద్వారా యూజీసీ విడుదల చేస్తుంది. NFPwD నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి విద్యార్థి ఏదైనా యూనివర్సిటీలో ఎంఫిల్/పీహెచ్డీ అడ్మిషన్ పొందిఉండాలి. ఫెలోషిప్'కు (NFPwD) దరఖాస్తు చేసేందుకు ఎటువంటి కనీస అకాడమిక్ మెరిట్ అవసరం లేదు. అలానే నెట్ /స్లేట్ వంటి అర్హుత పరీక్షలలో ఎలిజిబిలిటీ పొందాల్సిన అవసరం కూడా లేదు. యూజీసీ పోర్టల్ ద్వారా మీరు పంపించిన దరఖాస్తులను యూజీసీ మరియు డిపార్టుమెంటు ఆఫ్ ఎంపవర్మెంట్ అఫ్ పర్సన్స్ విత్ డిజాబిలిటీస్'కు చెందిన కమిటీ సభ్యులు వెరిఫై చేసి, అర్హులకు ఫెలోషిప్ ప్రకటిస్తారు.