పియర్సన్ పీటీఈ ఎగ్జామ్ విదేశీ చదువుల కోసం యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజీలాండ్ వంటి దేశాలకు వెళ్లే విద్యార్థులకు ఉపయోగపడుతుంది. పీటీఈ పరీక్షలో అర్హుత పొందడం ద్వారా ఆయా దేశాలకు చెందిన వీసా మరియు యూనివర్సిటీల యందు అడ్మిషన్ పొందేందుకు సులభతరం చేస్తుంది.
Exam Name | PEARSON - PTE |
Exam Type | English Proficiency Test |
Proficiency In | English Language |
Exam Date | Throughout the year |
Exam Duration | 2 Hours |
Exam Level | International Level |
పియర్సన్ పీటీఈ ప్రయోజనాలు
విద్య, ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు తప్పనిసరిగా ఇంగ్లీష్ బాషా నైపుణ్యాలను కలిగివుండాలి. సాధారణంగా ఇంగ్లీష్ యూనివర్సిటీలు ఆంగ్లభాష నైపుణ్యాలున్న విద్యార్థులకు మొదటి ప్రాధన్యత ఇస్తాయి. ఇంగ్లీష్ దేశాలకు వెళ్ళే విద్యార్థులు తప్పనిసరిగా ఏదైనా ఇంగ్లీష్ ప్రోఫిసెన్సీ పరీక్షలో అర్హుత సాధించి ఉండాలి.
ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీష్ ప్రోఫిసెన్సీ పరీక్షలకు డిమాండ్ పెరుగుతుంది. టోఫెల్, ఐఇఎల్‌టిఎస్ తర్వాత అధిక సంఖ్యలో విద్యార్థులు పీటీఈ పరీక్షకు ప్రాధాన్యత ఇస్తారు. పీటీఈ 2 గంటల నిడివిలో ఇంగ్లీష్ భాషకు సంబంధించి రాయటం, మాట్లాడం, వినటం మరియు చదవటం వంటి నాలుగు అంశాలలో అభ్యర్థుల బాషా సామర్ధ్యాన్ని అంచనా వేస్తుంది. పరీక్ష పూర్తియిన 5 రోజులలో స్కోరును అందిస్తుంది.
వేగం మరియు కచ్చితత్వానికి నిదర్శనంగా నిలిచే పీటీఈ పరీక్ష ప్రపంచ వ్యాప్తంగా 80 పైగా దేశాల్లో 250 కిపైగా గ్లోబల్ టెస్ట్ సెంటర్ల యందు నిర్వహించబడుతుంది. పీటీఈ స్కోరు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూఎస్, యూకే, కెనడా, జర్మనీ, సింగపూర్ మరియు ఐర్లాండ్ వంటి వివిధ దేశాల యూనివర్సిటిలలో చెల్లుబాటు అవుతుంది. అలానే పీటీఈ అర్హుతతో న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా దేశాల వీసా పొందేందుకు వీలుంటుంది.
పియర్సన్ పీటీఈ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్
పీటీఈ అకాడమిక్ పరీక్షకు నమోదు చేసుకోవాలంటే ముందుగా పీటీఈ వెబ్‌సైట్ యందు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఈ అకౌంట్ పీటీఈ స్కోర్లు నిర్వహించేందుకు, పరీక్ష అపాయింట్‌మెంట్ ఏర్పాటు చేసుకునేందుకు, యూనివర్సిటీ సమాచారం శోధించేందుకు, పరీక్షకు సంబంధించిన ప్రిపరేషన్ మెలుకువలు తెలుసుకునేందుకు, గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ సంబంధించి అనుభవజ్ఞుల సలహాలు పొందేందుకు సహాయపడుతుంది.
పీటీఈ అకౌంట్ క్రియేట్ చేసుకున్న 48 గంటల తర్వాత మీ లాగిన్ వివరాలతో కూడిన ఇమెయిల్ మీకు పంపబడుతుంది. మీకు పంపించిన లాగిన్ వివరాలతో పీటీఈ అకౌంటులో లాగిన్ అయ్యి, మీకు అందుబాటులో ఉండే తేదీలో పరీక్ష హాజరకు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. భారతీయ విద్యార్థులు పరీక్ష నమోదు సమయంలో పాసుపోర్టును ప్రాథమిక ఐడీ కార్డుగా అందజేయాల్సి ఉంటుంది.
పాసుపోర్టును పరీక్ష రోజు కూడా మీతోపాటుగా తీసుకువెళ్ళవల్సి ఉంటుంది. భారతదేశంలో పీటీఈ పరీక్షకు సంబంధించి 50 టెస్ట్ సెంటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విశాఖపట్నం మరియు విజయవాడలో మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంది. పీటీఈ దరఖాస్తు ఫీజు 14,700 రూపాయలు.
పియర్సన్ పీటీఈ ఎగ్జామ్ నమూనా
పీటీఈ అకాడమిక్ టెస్ట్ పూర్తి ఆన్‌లైన్ (CBT) విధానంలో నిర్వహించబడుతుంది. 2 గంటల నిడివితో సాగే ఈ పరీక్ష ఇంగ్లీష్ భాషకు సంబంధించి రాయటం, చదవటం, వినటం మరియు మాట్లాడటం వంటి బాషా అంశాల నైపుణ్యాలను అంచనా వేసేందుకు నిర్వహించబడుతుంది.
పీటీఈ పరీక్ష స్పీకింగ్ & రైటింగ్, రీడింగ్ మరియు లిజనింగ్ అంశాలకు సంబంధించి మూడు భాగాలుగా జరుగుతుంది. ప్రతి భాగంలో ఉన్న ప్రశ్నలను వాటికీ నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. పరీక్ష పూర్తి కంప్యూటర్ ఆధారితంగా జరుగుతుంది. ప్రశ్నపత్రంలో భాగాలను అనుసరించి హెడ్ ఫోన్స్ ద్వారా సారాంశాలు వినటంద్వారా లేదా కంప్యూటర్ తెరపై కనిపించే సారాంశాలు చదవడం ద్వారా సంబంధిత ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది.
పరీక్ష మొత్తంలో మూడు భాగాలకు సంబంధించి 20 వేర్వేరు రకాల ప్రశ్నలకు సమాధానం చేయాల్సి ఉంటుంది. హెడ్ ఫోన్స్ ద్వారా వినే సారాంశాలు అమెరికన్ లేదా బ్రిటిష్ స్పీకర్స్ తో చెప్పబడి ఉంటాయి.
పార్ట్ 1 : స్పీకింగ్ & రైటింగ్ | పార్ట్ 2 : రీడింగ్ | పార్ట్ 3 : లిజనింగ్ |
---|---|---|
సమయం 77 - 93 నిమిషాలు
|
సమయం 32 - 40 నిమిషాలు
|
సమయం 45 - 57 నిమిషాలు
|
పియర్సన్ పీటీఈ ఎగ్జామ్ స్కోరింగ్ విధానం
పీటీఈ స్కోరింగ్ ఒక నమ్మకమైన, సమగ్రమైన కృత్రిమ మేధోమధనం ద్వారా లక్కించబడుతుంది. ఫలితాలు మనుషుల ద్వారా కాకుండా కంప్యూటర్ ద్వారా గ్రేడ్ చేయబడతాయి. అభ్యర్థి బాష ఉచ్చారణ మరియు చేసిన సమాధానాల ప్రతిభ ఆధారంగా సరైన సమాధానం చేసిన ప్రశ్నకు 1 పాయింట్ లేదా పార్శ్యంగా స్కోరు చేయబడుతుంది.
పూర్తి తప్పు సమాధానం చేసిన ప్రశ్నకు యెటువంటి స్కోరు ఇవ్వబడదు. పీటీఈ ఫలితాలు పరీక్ష ముగిసిన 5 రోజులలో మీ పీటీఈ అకౌంటులో అందుబాటులో ఉంటాయి. మీ అకౌంట్ లో లాగిన్ అవ్వటం ద్వారా మీ పూర్తి స్కోరు రిపోర్టును పొందవచ్చు.
పీటీఈ అకౌంట్ ద్వారా మీ స్కోరు కార్డును మీరు కోరుకునే యూనివర్సిటీలకు ఎన్నిసార్లు అయినా ఉచితంగా పంపించవచ్చు. పీటీఈ స్కోరు కార్డు పరీక్ష పూర్తయిన రోజు నుండి రెండేళ్ల వరకు చెల్లిబాటు అవుతుంది. పీటీఈ స్కోరును టోఫెల్ మరియు ఐఇఎల్‌టిఎస్ అర్హుత పరీక్షలతో సరిపోల్చినప్పుడు ఈ కింది విధంగా ఉంటాయి.
పీటీఈ | 38 | 42 | 46 | 50 | 53 | 59 | 64 | 72 | 78 | 84 |
---|---|---|---|---|---|---|---|---|---|---|
టోఫెల్ | 44 | 56 | 66 | 75 | 80 | 88 | 94 | 100 | 113 | 120 |
పీటీఈ | 30 | 36 | 42 | 50 | 58 | 65 | 73 | 79 | 83 | 86 |
---|---|---|---|---|---|---|---|---|---|---|
ఐఇఎల్‌టిఎస్ | 4.5 | 5 | 5.5 | 6 | 6.5 | 7 | 7.5 | 8 | 8.5 | 9 |
పియర్సన్ పీటీఈ ఎగ్జామ్ ముఖ్యమైన లింక్స్
పీటీఈ రిజిస్ట్రేషన్ | పీటీఈ స్కోర్స్ |
పీటీఈ టెస్ట్ సెంటర్స్ | పీటీఈ చెల్లుబాటు అయ్యే యూనివర్శిటీలు |
పీటీఈ ప్రిపరేషన్ | పీటీఈ ఆర్టికల్స్ |