జేఈఈ మెయిన్ మరియు జేఈఈ అడ్వాన్సుడ్ మధ్య ప్రధాన తేడాలు
Admissions Engineering Entrance Exams NTA Exams

జేఈఈ మెయిన్ మరియు జేఈఈ అడ్వాన్సుడ్ మధ్య ప్రధాన తేడాలు

జేఈఈ మెయిన్ మరియు జేఈఈ అడ్వాన్సుడ్ మధ్య తేడాలు తెలియాలంటే ఈ రెండు పరీక్షలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఈ పరీక్షను ఇంజనీరింగ్ మరియు ఆర్కిటెక్చర్ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆద్వర్యం జరిగే ఈ పరీక్షలు జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్సడ్ పేర్లతో ఏటా రెండేసి సార్లు నిర్వహిస్తారు.

Advertisement

జేఈఈ మెయిన్ vs జేఈఈ అడ్వాన్సుడ్

జేఈఈ చరిత్ర

జేఈఈ పరీక్షకు యేటా దాదాపు పది నుండి పదమూడు లక్షల మంది విద్యార్థులు హాజరౌతున్నారు. ప్రతీ యేటా ఏదొక మార్పుతో విద్యార్థుల ముందుకు వచ్చే ఈ పరీక్ష 2012 కు ముందు అఖిల భారత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షగా (ఏఐఈఈఈ) జరిపేవారు. 2012 తర్వాత సెంట్రల్ బోర్డు అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఆధ్వర్యంలో ఏఐఈఈఈ పరీక్షను జేఈఈ మెయిన్స్ మరియు ఐఐటీ-జేఈఈ గా రెండేళ్లు నిర్వహించారు.

2014 నుండి ఐఐటీ కౌన్సిల్ ఆమోదంతో జేఈఈ రెండు దశల పద్దతని కొనసాగిస్తూ మొదటి ఫేజ్ యందు జేఈఈ మెయిన్స్ పరీక్షను NITలు, IIITలు, CFTI లలో ఇంజనీరింగ్ ప్రవేశాలు కోసం నిర్వహిస్తూ, రెండవ ఫేజ్ యందు జేఈఈ అడ్వాన్స్ పరీక్షను ఐఐటీ యందు ప్రవేశాల కోసం జరుపుతున్నారు. 2018 లో ఇంకొంచెం ముందడుగు వేచి జేఈఈ మెయిన్స్ లో క్వాలిఫై అయిన మొదటి 224,000 మందిని మాత్రమే జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.

2018 లో భారత మానవ వనరుల శాఖ విస్తృత సమీక్షల అనంతరం దేశమంతటా ఒకే ఇంజనీరింగ్ పరీక్ష ఉండాలనే ఉద్దేశంతో  దేశంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల అన్నింటా జేఈఈ మెయిన్స్ ద్వారా ప్రవేశం పొందే అవకాశం కల్పించారు. ఇదే కాకుండా ఏడాదిలో రెండు మార్లు ఈ పరీక్ష జరిపేందుకు నిర్ణయం తీసుకున్నారు.

2018 వరకు సీబీఎస్ఈ అధీనంలో జరుగుతూ వస్తున్నా ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను, 2019 నుండి NTA (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) కి బదిలీ చేసారు . జేఈఈ ప్రతి ఏడాది జనవరి మరియు ఏప్రిల్ లో జరుగుతుంది. రెండు మార్లు జరిగే పరీక్షలో అభ్యర్థుల ప్రతిభ లెక్కించి రెండిటిలో దేనిలో ఎక్కువ స్కోర్ సాధిస్తే దాన్నే మెరిట్ స్కోర్ గా పరిగణిస్తారు.

జేఈఈ మెయిన్

జేఈఈ మెయిన్స్ పరీక్షను దేశంలో ఉండే ఎన్ఐటీలు , ట్రిపుల్ ఐటీలు, మరియు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడిసే టెక్నికల్ ఇనిస్టిట్యూట్ల యందు ఇంజనీరింగ్ ప్రవేశాలు కల్పిస్తారు. అంతే కాకుండా జేఈఈ మెయిన్స్ స్కోరుతో దేశవ్యాప్తంగా  ఉన్న టాప్ ర్యాంకింగ్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ సాంకేతిక విద్యాసంస్థలలో ఇంజనీరింగ్ ప్రవేశాలు పొందేందుకు అవకాశం కల్పిస్తారు.

జేఈఈ మెయిన్స్ జనవరి, ఏప్రిల్ రెండు దశలు ముగిసాక తుది ర్యాంకులు ప్రకటిస్తారు. ఇందులో  క్వాలిఫై అయిన వారిలో రిజర్వేషన్ల కోటా ఆధారంగా టాప్ 250000 అభ్యర్థులకు జేఈఈ అడ్వాన్సడ్ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు.

  • Purpose: జేఈఈ మెయిన్స్ ను దేశంలో ఉన్న NITs, IIITs, CFTIs లలో ఇంజనీరింగ్ తో పాటు బ్యాచిలర్ అఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ ప్రవేశాలకోసం నిర్వహిస్తారు. వీటితో పాటు దేశంలో ఉన్న ఇతర అన్ని కాలేజీలలో కూడా అడ్మిషన్ పొందొచ్చు
  • Eligibility: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లతో 10+2 లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అయి ఉండాలి. కాని NITs, IIITs, CFTI లలో అడ్మిషన్ పొందాలంటే 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత అయి ఉండాలి లేదా మీ సంబంధిత బోర్డు నుండి టాప్ 20% పెర్సెంటైల్ లిస్ట్ లో ఉండాలి.
  • Age Limit: జేఈఈ మెయిన్స్ రాసేందుకు ఎటువంటి వయోపరిమితి లేదు. కానీ 10+2 లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అయిన ఏడాది నుండి వరుసగా మూడు పర్యాయాలు మాత్రమే హాజరయ్యేందుకు అవకాశం ఉంది.
  • Exam Pattern: జేఈఈ మెయిన్స్ బహుళఐచ్చిక ( మల్టీఫుల్ చాయిస్) విధానంలో జరుగుతుంది. 3 గంటల సమయంలో 75 ప్రశ్నలు పూర్తిచేయాలి. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1 BE /B.Tech లలో అడ్మిషన్ కోసం, పేపర్ 2 బ్యాచిలర్ అఫ్ ఆర్కిటెక్చర్ కోసం, పేపర్ 3 బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ లలో  అడ్మిషన్ కోసం జరుగుతాయి. ప్రశ్నపత్రాలు ఇంగ్లీష్, హిందీ, మరియు గుజరాతీ భాషల్లో అందుబాటులో ఉంటాయి.
  • Syllabus: 10+2 / ఇంటర్మీడియట్ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. జేఈఈ అడ్వాన్సడ్ తో పోల్చుకుంటే ప్రశ్నల స్థాయి కొంచెం సరళంగా ఉంటాయి. (జేఈఈ మెయిన్ పూర్తి వివరాలు )

జేఈఈ అడ్వాన్సడ్

జేఈఈ అడ్వాన్స్ పరీక్షను దేశ అత్యుత్తమ  సాంకేతిక విద్యాసంస్థలైన ఐఐటీల్లో  ఇంజనీరింగ్ ప్రవేశాల కొరకు నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు హాజరవ్వాలంటే జేఈఈ మెయిన్స్ పరీక్షలో క్వాలిఫై పొందాల్సి ఉంటుంది. జేఈఈ అడ్వాన్సడ్ పరీక్ష మే నెలలో జరపబడుతుంది.  ప్రస్తుతం ఉన్న 23 ఐటీల్లో ఏదో ఒక ఐఐటీ ఈ బాధ్యతను నిర్వర్తిస్తుంది.

  • Purpose: దేశంలో ఉన్న ఐఐటీ ల్లో ఇంజనీరింగ్ తో పాటు బ్యాచిలర్ అఫ్ ఆర్కిటెక్చర్ మరియు బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ ప్రవేశాలకోసం నిర్వహిస్తారు.
  • Eligibility: జేఈఈ మెయిన్స్ క్వాలిఫై అయిన వారిలో టాప్ 2,24,000 మంది కి మాత్రమే జేఈఈ అడ్వాన్సడ్ పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. అలానే 10+2 లేదా ఇంటర్మీడియట్ లో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత అయి ఉండాలి లేదా మీ సంబంధిత బోర్డు నుండి టాప్ 20% పెర్సెంటైల్ లిస్ట్ లో ఉండాలి.
  • Age Limit: జేఈఈ మెయిన్స్ రాసేందుకు ఎటువంటి వయోపరిమితి లేదు. కానీ 10+2 లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అయిన ఏడాది నుండి వరుసగా రెండు పర్యాయాలు మాత్రమే హాజరయ్యేందుకు అవకాశం ఉంది.
  • Exam Pattern: జేఈఈ మెయిన్స్ బహుళఐచ్చిక ( మల్టీఫుల్ చాయిస్) విధానంలో జరుగుతుంది. 3 గంటల సమయంలో 90 ప్రశ్నలు పూర్తిచేయాలి.
  • ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1 BE /B.Tech లలో అడ్మిషన్ కోసం, పేపర్ 2 బ్యాచిలర్ అఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోసం జరుపుతారు. ప్రశ్నపత్రాలు ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటాయి.
  • Syllabus: 10+2 / ఇంటర్మీడియట్ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. జేఈఈ మెయిన్స్ తో పోల్చుకుంటే కొన్ని అదనపు టాపిక్స్ తో పాటు ప్రశ్నల స్థాయి కొంచెం క్లిష్టంగా ఉంటాయి. ( జేఈఈ అడ్వాన్సుడ్ పూర్తి వివరాలు )

Advertisement

Post Comment