సింబియోసిస్ అడ్మిషన్ టెస్ట్ 2023 : నోటిఫికేషన్, పరీక్ష తేదీ
Admissions Engineering Entrance Exams

సింబియోసిస్ అడ్మిషన్ టెస్ట్ 2023 : నోటిఫికేషన్, పరీక్ష తేదీ

సింబియోసిస్ అడ్మిషన్ టెస్టును సింబియోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఈ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షతో పాటుగా మానేజ్మెంట్, లా, మాస్ కమ్యూనికేషన్, ఎకనామిక్స్, లిబరల్ ఆర్ట్స్, కంప్యూటర్ స్టడీస్ మరియు కలినరీ ఆర్ట్స్ వంటి యూజీ, పీజీ కోర్సులలో అడ్మిషన్లు కల్పించేందుకు సింబియోసిస్ ఎంట్రన్స్ టెస్ట్ (SET-A, SET-B) మరియు SLAT పేరుతో  పరీక్షలు నిర్వహిస్తుంది.

యూనివర్సిటీ దేశంలో పూణే, నోయిడా, బెంగుళూరు, నాశిక్, హైదరాబాదా మరియు నాగపూర్లో కలిపి మొత్తం ఆరు క్యాంపుస్లు నిర్వహిస్తుంది. ఇండియాలో ఒకానొక గొప్ప ప్రైవేట్ యూనివెర్సిటీగా చెప్పుకునే సింబియోసిస్ నిర్వహించే ఈ నాలుగు ప్రవేశ పరీక్షాల తీరుతెన్నులు ఇప్పుడు తెలుసుకుందాం.

సింబియోసిస్ అడ్మిషన్ టెస్టు 2023

Exam Name SITEEE 2023
Exam Type Admission
Admission For Engineering
Exam Date 6 May 2023
Exam Duration 90 Minutes
Exam Level University Level

సింబియోసిస్ అడ్మిషన్ టెస్టు సమాచారం

సింబియోసిస్ నిర్వహిస్తున్న వివిధ ప్రవేశ పరీక్షలు

SITEEE (సింబియోసిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్)

సింబియోసిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్ ( కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్)

SLAT (సింబియోసిస్ లా అడ్మిషన్ టెస్ట్)

సింబియోసిస్ లా స్కూల్ - పూణే BA LLB, BBA LLB
సింబియోసిస్ లా స్కూల్ - హైదరాబాద్ BA LLB, BBA LLB
సింబియోసిస్ లా స్కూల్ - నోయిడా BA LLB, BBA LLB
సింబియోసిస్ లా స్కూల్ - నాగపూర్ BA LLB, BBA LLB

SET-A జనరల్ సింబియోసిస్ ఎంట్రన్స్ టెస్ట్)

సింబియోసిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంప్యూటర్ స్టడీస్ & రీసెర్చ్ BCA, BBA
సింబియోసిస్ సెంటర్ ఫర్ మీడియా & కమ్యూనికేషన్ B.A. (M.C)
సింబియోసిస్ స్కూల్ ఫర్ ఎకనామిక్స్ B.Sc.(Economics Hons
సింబియోసిస్ స్కూల్ ఫర్ లిబరల్ ఆర్ట్స్ Bachelore of Arts/Science (B.A/B.Sc - Liberal Arts) Hons.
సింబియోసిస్ స్కూల్ ఆఫ్ కలినరీ ఆర్ట్స్ B.Sc. (Culinary Arts) B.Sc. (Hospitality Management)

SET-B జనరల్ సింబియోసిస్ ఎంట్రన్స్ టెస్ట్)

సింబియోసిస్ సెంటర్ ఫర్ మానేజ్మెంట్ స్టడీస్ - పూణే BBA
సింబియోసిస్ సెంటర్ ఫర్ మానేజ్మెంట్ స్టడీస్ - నోయిడా BBA
సింబియోసిస్ సెంటర్ ఫర్ మానేజ్మెంట్ స్టడీస్ - నాగపూర్ BBA

సింబియోసిస్ అడ్మిషన్ టెస్ట్ ఎలిజిబిలిటీ

  • జనరల్ యూజీ కోర్సులలో చేరేందుకు 50 శాతం మార్కులతో ఇంటర్/10+2 ఉత్తీర్ణతయి ఉండాలి
  • బీటెక్ కోర్సుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు 50 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీలో ఉత్తీర్ణతయి ఉండాలి

సింబియోసిస్ అడ్మిషన్ టెస్ట్ 2023 షెడ్యూల్

దరఖాస్తు చివరి తేదీ 12 ఏప్రిల్ 2023
ఎగ్జామ్ తేదీ 6 & 14 మే 2023
ఫలితాలు 24 మే 2023
కౌన్సిలింగ్ జూన్ 2023

సింబియోసిస్ అడ్మిషన్ టెస్ట్ ఎగ్జామ్ ఫీజు & ఎగ్జామ్ సెంటర్లు

దరఖాస్తు రుసుములు పరీక్ష కేంద్రాలు
SET General, SLAT : 1950 /-
SITEEE : 2000/-
విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్

 

సింబియోసిస్ అడ్మిషన్ టెస్ట్ రిజిస్ట్రేషన్ & స్లాట్ బుకింగ్

సింబియోసిస్ అడ్మిషన్ టెస్ట్ రాసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు సింబియోసిస్ అధికారిక వెబ్సైటు (www.set-test.org) ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. అప్లికేషన్లో మీ సంబంధిత వ్యక్తిగత, విద్య మరియు చిరునామ వివరాలు ఎటువంటి తప్పులు దొర్లకుండా పొందుపర్చాల్సి ఉంటుంది.

అలానే మీ పొందుపర్చిన వివరాలకు సంబంధించి ధ్రువపత్రాలు, మీ ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత దశలో అందుబాటులో ఉన్న పేమెంట్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది.

మీ అప్లికేషన్ ఐడీతో పరీక్షకు సంబంధించి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ లాగిన్ వివరాలతో వెబ్సైటు లాగిన్ అవ్వగానే అందుబాటులో ఉన్న ఎగ్జామ్ తేదీలు మరియు సమయాలను మీకు సూచిస్తుంది. వాటిలో మీకు అనుకూలంగా ఉండే తేదీని, సమయాన్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

స్లాట్ బుకింగ్ పూర్తిచేసే ముందు అక్కడ కనిపించే మీ ప్రొఫైల్ వివరాలు సరిపోలి ఉన్నాయోలేదో గమనించడం మరవకండి. స్లాట్ బుక్ చేసుకున్నాక ప్రవేశ పరీక్షకు సంబందించిన తాజా వివరాల కోసం తరుసు యూనివర్సిటీ వెబ్సైటును సందర్శిస్తూ ఉండండి.

స్లాట్ బుకింగ్ అందుబాటులో ఉండే సమయాలు

SITEEE (Engineering) - Morning Session 10.00 am to 11.30 am
SLAT (LAW) - Morning Session 09.30 am to 11.15am
SETA - Available from 11 to 14 June 2020
SETA - Available from 11 to 14 June 2020
Afternoon Session 03.00 pm to 04.45 pm

సింబియోసిస్ అడ్మిషన్ టెస్ట్ ఇంటర్నెట్ బేస్డ్ అసెస్మెంట్ టెస్ట్

కోవిడ్ 19 కారణంగా ఈ ఏడాది విద్యావ్యవస్థలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ అకడమిక్ ఏడాదికి సంబంధించి అడ్మిషన్ ప్రకియలన్ని మొదటి నుండి వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ కారణాలతో సింబియోసిస్ ఈ ఏడాది కాంటాక్ట్ లెస్ అడ్మిషన్ ప్రక్రియకు స్వీకారం చుట్టింది. పరీక్షకు కానీ, కౌన్సిలింగ్ ప్రక్రియకు కానీ అభ్యర్థి నేరుగా హాజరుకాకుండా ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా వచ్చిందే ఇంటర్నెట్ బేస్డ్ అసెస్మెంట్ టెస్ట్ .

ఇంటర్నెట్ బేస్డ్ అసెస్మెంట్ టెస్ట్ ద్వారా అభ్యర్థి నేరుగా తమ వ్యక్తిగత కంప్యూటర్ ద్వారా పరీక్షకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసారు. దీనికి సంబంధించి అభ్యర్థి కెమెరా, మైక్ మరియు ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న వ్యక్తిగత కంప్యూటర్ లేదా లాప్టాప్ కలిగి ఉండాలి. ఈ ఎగ్జామినేషన్ ప్రక్రియ పూర్తి భద్రత నియమాల మధ్య  సైబర్ సెక్యూరిటీ మరియు ఆర్టిఫిసియల్ టెక్నాలజీని ఉపయోగించి నిర్వహిస్తున్నారు.

అభ్యర్థి పరీక్షా మొదలు పెట్టాక, అది పూర్తీయ్యేవరకు కెమెరా ముందు నుండి కదిలేందుకు వీలులేకుండా నియమాలు రూపొందిచారు. పరీక్షా మధ్యలో విద్యుత్ అంతరాయం ఏర్పడిన అభ్యర్థులకు మరోమారు అవకాశం కల్పిస్తారు.

సింబియోసిస్ అడ్మిషన్ టెస్ట్ నమూనా

సింబియోసిస్ ప్రవేశ పరీక్షలు ఈ ఏడాది ఆన్‌లైన్ మరియు ఇంటర్నెట్ బేస్డ్ ఆన్‌లైన్ ప్రొటెక్టెడ్ టెస్ట్ విధానంలో నిర్వహించబడుతుంది. SLAT 105 నిముషాల నిడివితో 90 మార్కులకు, SET జనరల్ 105 నిముషాల నిడివితో 75 మార్కులకు, SITEEE 90 నిముషాల నిడివితో 120 మార్కులకు నిర్వహిస్తారు. క్వశ్చన్ పేపర్లో ఎంపిక చేసుకున్న కోర్సు సంబంధిత గ్రూపుల నుండి మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతయి.

ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షనల్ సమాధానాలు ఉంటాయి. వాటిలో నుండి ఒక సరైన సమాధానాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. సరైన జవాబు గుర్తించిన ప్రశ్నలకు 1 (SITEEE పేపర్ 2 మార్కులు) మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నలకు, సమాధానం చేయండి ప్రశ్నలకు ఎటువంటి మార్కులు ఇవ్వబడవు. పరీక్షా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

SLAT (LAW)

(Internet Based Online Proctored Test)
వ్యవధి : 105 నిముషాలు (75 MCQ + 30 WAT ) | ఎగ్జామ్ తేదీ : 26 / 27 / 28 July 2020 | సమయం : 09.30 am to11.15am
Subjuct  Q.NO Marks
పార్ట్ 1 లాజికల్ రీజనింగ్ 15 15
పార్ట్ 2 లీగల్ రీజనింగ్ 15 15
పార్ట్ 3 అనలిటికల్ రీజనింగ్ 15 15
పార్ట్ 4 రీడింగ్ కంప్రెహెన్షన్ 15 15
పార్ట్ 5 జనరల్ నాలెడ్జ్ 15 15
పార్ట్ 6 రిటన్ ఎబిలిటీ టెస్ట్ (WAT) - -
మొత్తం 90 90

SITEEE (Engineering)

(Internet Based Online Proctored Test)
Subjuct  Q.NO Marks
పార్ట్ 1 ఫిజిక్స్ 15 30
పార్ట్ 2 కెమిస్ట్రీ 15 30
పార్ట్ 3 మ్యాథ్స్ 30 60
మొత్తం 60 120

SET (General)

(Internet Based Online Proctored Test)
Subjuct  Q.NO Marks
పార్ట్ 1 ఇంగ్లీష్ 20 20
పార్ట్ 2 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 20 20
పార్ట్ 3 జనరల్ అవెర్నెస్ 20 20
పార్ట్ 4 అనలిటికల్ & లాజికల్ రీజనింగ్ 15 15
పార్ట్ 5 రిటన్ ఎబిలిటీ టెస్ట్ (WAT) - -
మొత్తం 75 75

సింబియోసిస్ అడ్మిషన్ టెస్ట్ ఇతర వివరాలు

7709328908
18001231454
info@set-test.org

Post Comment