గీతం అడ్మిషన్ టెస్ట్ 2023 : నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీ
Admissions Engineering Entrance Exams

గీతం అడ్మిషన్ టెస్ట్ 2023 : నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీ

గాట్ (GAT) ప్రవేశ పరీక్షను గీతం యూనివర్సిటీలో వివిధ యూజీ మరియు పీజీ అడ్మిషన్లు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్ష అర్హుత సాధించడం ద్వారా  బీటెక్, ఎంటెక్ తో పాటుగా ఫార్మసీ, ఆర్కిటెక్చర్, మానేజ్మెంట్, లా, నర్సింగ్ మరియు మరికొన్ని హోమ్ సైన్సెస్ కోర్సులలో సీట్ దక్కించుకోవచ్చు.

Advertisement

గీతం యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్ విశాఖపట్నంతో పాటుగా హైదరాబాద్ మరియు బెంగుళూరులో మరో రెండు అనుబంధ క్యాంపుస్లు కలిగి ఉంది. దేశంలో ఉన్న డ్రీమ్డ్ యూనివర్సిటీలలో దేశీయంగా, అంతర్జాతీయంగా గీతం యూనివర్సిటీకి మంచి గుర్తింపు ఉంది. అంతర్జాతీయంగా దాదాపు 25 యూనివర్సిటీలతో కలిసి పనిచేస్తుంది.

గీతం అడ్మిషన్ టెస్ట్ 2023

Exam Name GAT 2023
Exam Type Admission
Admission For UG & PG Courses
Exam Date NA
Exam Duration 120 Minutes
Exam Level University Level

గీతం అడ్మిషన్ టెస్ట్ వివరాలు

గీతం అందిస్తున్న కోర్సులు & ఫీజులు

గీతం అందిస్తున్న యూజీ కోర్సులు

విశాఖపట్నం బయోటెక్నాలజీ (4 ఏళ్ళు), బీటెక్ (4 ఏళ్ళు), బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (5 ఏళ్ళు), బీఫార్మసీ (4 ఏళ్ళు), బీఎస్సీ హెల్త్ సైన్సెస్ (3 ఏళ్ళు), బీఎస్సీ జనరల్ సైన్సెస్ (3 ఏళ్ళు), బీబీఏ / బీకామ్ (3 ఏళ్ళు), బీఎస్సీ నర్సింగ్ (4 ఏళ్ళు), లా ప్రోగ్రామ్స్ (5 ఏళ్ళు).
హైదరాబాద్ బీటెక్ (4 ఏళ్ళు), బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (5 ఏళ్ళు), బీఫార్మసీ (4 ఏళ్ళు), బీఎస్సీ జనరల్ సైన్సెస్ (3 ఏళ్ళు), బీబీఏ / బీకామ్ (3 ఏళ్ళు).
బెంగుళూరు బీటెక్ (4 ఏళ్ళు). బీఎస్సీ జనరల్ సైన్సెస్ (3 ఏళ్ళు). బీబీఏ / బీకామ్ (3 ఏళ్ళు)

గీతం అందిస్తున్న పీజీ కోర్సులు

విశాఖపట్నం ఎంటెక్, మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఎంఫార్మసీ, మాస్టర్ ఇన్ లా, మానేజ్మెంట్ & ఎంఎస్సీ 
హైదరాబాద్ ఎంటెక్ & మానేజ్మెంట్ 
బెంగుళూరు ఎంటెక్ & మానేజ్మెంట్ 

గీతం ఇంజనీరింగ్ కోర్సుల ఫీజు వివరాలు

B.Tech. CSE, CSBS 2,99,500/-
B.Tech. Aerospace, Biotechnology, Civil, ECE, EEE, Mechanical 2,22,220/-
M.Tech. 1,10,100/-

గాట్ ఎలిజిబిలిటీ

  • జనరల్ యూజీ కోర్సులలో చేరేందుకు 60 శాతం మార్కులతో ఇంటర్/10+2 ఉత్తీర్ణతయి ఉండాలి
  • బీటెక్ కోర్సుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీలో ఉత్తీర్ణతయి ఉండాలి
  • బీఫార్మసీ కోర్సుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ/బైపీసీలో ఉత్తీర్ణతయి ఉండాలి
  • పీజీ కోర్సులలో చేరేందుకు సంబంధిత బ్యాచిలర్ డిగ్రీలలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి

గాట్ 2022 షెడ్యూల్

దరఖాస్తు చివరి తేదీ 26 మార్చి 2023
GAT 2023 31 మార్చి - 3 ఏప్రిల్ 2023
ఫలితాలు మే 2023
కౌన్సిలింగ్ జూన్ 2023

గాట్ దరఖాస్తు ఫీజు & ఎగ్జామ్ సెంటర్లు

దరఖాస్తు రుసుములు పరీక్షా కేంద్రాలు
అప్లికేషన్ ఫీజు : 1,000 /- ఆన్లైన్ హోమ్ టెస్ట్ (నేరుగా మీ ల్యాప్టాప్ లేదా పీసీ ద్వారా ప్రవేశ పరీక్షా రాయాల్సి ఉంటుంది)

 

గాట్ దరఖాస్తు ప్రక్రియ

గాట్ పరీక్షను రాసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు గీతం అధికారిక యూనివర్సిటీ వెబ్సైటు (www.gat.gitam.edu) ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. అప్లికేషన్లో మీ సంబంధిత వ్యక్తిగత, విద్య మరియు చిరునామ వివరాలు ఎటువంటి తప్పులు దొర్లకుండా పొందుపర్చాల్సి ఉంటుంది.

అలానే మీ పొందుపర్చిన వివరాలకు సంబంధించి ధ్రువపత్రాలు, మీ ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత దశలో అందుబాటులో ఉన్న పేమెంట్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది.

గీతం ఆన్‌లైన్ హోమ్ టెస్ట్

కోవిడ్ 19 కారణంగా ఈ ఏడాది విద్యావ్యవస్థలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ అకడమిక్ ఏడాదికి సంబంధించి అడ్మిషన్ ప్రకియలన్ని మొదటి నుండి వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ కారణాలతో గీతం ఈ ఏడాది కాంటాక్ట్ లెస్ అడ్మిషన్ ప్రక్రియకు స్వీకారం చుట్టింది. పరీక్షకు కానీ, కౌన్సిలింగ్ ప్రక్రియకు కానీ అభ్యర్థి నేరుగా హాజరుకాకుండా ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా వచ్చిందే ఆన్లైన్ హోమ్ టెస్ట్.

ఆన్లైన్ హోమ్ టెస్ట్ ద్వారా అభ్యర్థి నేరుగా తమ వ్యక్తిగత కంప్యూటర్ ద్వారా పరీక్షకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసారు. దీనికి సంబంధించి అభ్యర్థి కెమెరా, మైక్ మరియు ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న వ్యక్తిగత కంప్యూటర్ లేదా లాప్టాప్ కలిగి ఉండాలి. ఈ ఎగ్జామినేషన్ ప్రక్రియ పూర్తి భద్రత నియమాల మధ్య  సైబర్ సెక్యూరిటీ మరియు ఆర్టిఫిసియల్ టెక్నాలజీని ఉపయోగించి నిర్వహిస్తున్నారు.

అభ్యర్థి పరీక్షా మొదలు పెట్టాక, అది పూర్తీయ్యేవరకు కెమెరా ముందు నుండి కదిలేందుకు వీలులేకుండా నియమాలు రూపొందిచారు. పరీక్షా మధ్యలో విద్యుత్ అంతరాయం ఏర్పడిన అభ్యర్థులకు మరోమారు అవకాశం కల్పిస్తారు.

GAT (PGT) for M.Tech.

Subjuct  Q.NO Marks
పార్ట్ 1 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 80
పార్ట్ 2 రీజనింగ్ 30 60
పార్ట్ 3 వెర్బల్ ఎబిలిటీ 30 60
మొత్తం 100 200

సిలబస్

Quantitative Aptitude: Data Interpretation, Decimal & Fractions, HCF & LCM, Mensuration – Cylinder, Cone, Sphere, Numerical Reasoning, Probability, Problems on Ages, Profit & Loss, Ratio & Proportion, Percentage, Sequence & Series, Time & Distance, Work & Time.
Reasoning: Alphabet Series, Arithmetical Reasoning, Blood Relations, Clocks & Calendars, Coding-Decoding, Cubes and Dice, Directions, Inserting The Missing Character, Logical Sequence of Words, Number Series
Verbal Ability: Adverb, Antonyms, Articles, Comprehension, Conclusion, Critical reasoning, Grammar, Idioms and Phrases, Synonyms, Verb, Vocabulary, Word groups.

GAT (PGP) for M.Pharmacy

Subjuct  Q.NO Marks
పార్ట్ 1 ఫార్మాస్యూటిక్స్ 25 50
పార్ట్ 2 ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ & క్వాలిటీ అస్యూరెన్స్ 25 50
పార్ట్ 3 ఫార్మకాలజీ 25 50
పార్ట్ 4 ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ 25 50
మొత్తం 100 200

GAT (PGA)

for M.Arch. (Sustainable Architecture) offered at Visakhapatnam Campus
Subjuct  Q.NO Marks
పార్ట్ 1 ఆర్కిటెక్చర్ మరియు డిజైన్ 20 40
పార్ట్ 2 బిల్డింగ్ మెటీరియల్ & కన్స్ట్రక్షన్  మానేజ్మెంట్ 20 40
పార్ట్ 3 అర్బన్ డిజైన్ 20 40
పార్ట్ 4 ఎన్విరాన్మెంట్ 10 20
పార్ట్ 5 హౌసింగ్ 10 20
పార్ట్ 6 బిల్డింగ్ సర్వీసెస్ 20 40
మొత్తం 100 200

GAT (PGL) for 1 Year LLM

Subjuct  Q.NO Marks
పార్ట్ 1 అనలాటికల్ రీజనింగ్ 25 50
పార్ట్ 2 లాజికల్ రీజనింగ్ 25 50
పార్ట్ 3 రీడింగ్ కంప్రహెన్షన్ 25 50
పార్ట్ 4 కన్సిస్ట్యూషనల్ లా 25 50
మొత్తం 100 200

గాట్ అడ్మిషన్ ప్రక్రియ

అడ్మిషన్లు గీతం అడ్మిషన్ టెస్ట్ యందు సాధించిన మెరిట్ ఆధారంగా జరుగుతాయి. ఆన్‌లైన్ టెస్ట్ లేదా ఆన్‌లైన్ హోమ్ టెస్టులో కనీస అర్హుత మార్కులు సాధించిన అభ్యర్థులను అడ్మిషన్ కోసం పరిగణలోకి తీసుకుంటారు. బెంగుళూరు క్యాంపస్'లో 25 శాతం సీట్లు కర్ణాటక రాష్ట్ర విద్యార్థుల కోసం కేటాయించబడి ఉంటాయి. ప్రవేశ పరీక్షలో టాప్ 3000 మంది బీటెక్ ఆశావహులకు మొదటి ఏడాది ట్యూషన్ ఫీజులో రాయితీ కల్పిస్తారు.

1 నుండి 50 మధ్య ర్యాంకుల సాధించిన విద్యార్థులకు పూర్తి ఫీజు, 51 నుండి 250 మధ్య విద్యార్థులకు 75 శాతం, 251 నుండి 1000 మధ్య విద్యార్థులకు 50 శాతం అలానే 1001 నుండి 3000 మధ్య ర్యాంకు సాధించిన విద్యార్థులకు 25 శాతం మొదటి ఏడాది ట్యూషన్ ఫీజు రాయితీ కల్పిస్తారు.

అలానే జేఈఈ మెయిన్ పరీక్షలో 85 నుండి 100 పెర్సెంటైల్ సాధించిన విద్యార్థులకు, ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్ లలో 1 నుండి 25 వేలలోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కూడా మొదటి ఏడాది ట్యూషన్ ఫీజులో 25 నుండి 100 శాతం వరకు రాయితీ అందజేస్తారు.

అంతేకాకుండా అకాడమిక్ పరీక్షలలో 8.0 CGPA నుండి ఆపై స్కోర్ సాధించే టాప్ 2 శాతం విద్యార్థులకు ఏడాదికి 50వేల వరకు స్కాలర్షిప్ అందజేస్తారు. అలానే ఎంటెక్, ఎంఫార్మసీ విద్యార్థులకు టీచింగ్ అసిస్టెన్షిప్ పేరుతో సంబంధిత అర్హుతులు కలిగిన వారికి, ప్రతి ప్రోగ్రాంకు ముగ్గురికి చెప్పున 50 వేల వరకు అవార్డు అందజేస్తారు.

గీతం అదిమిషన్ టెస్ట్ ఇతర వివరాలు

విశాఖపట్నం క్యాంపస్

8880884000 9908035979, 9246476394, 9966001880, 6301986893

హైదరాబాద్ క్యాంపస్

8880884000 9542424256, 9542424266, 9542424259

బెంగుళూరు క్యాంపస్

9108514028, 9108514036, 9108514037

admissions_blrcampus@gitam.edu

 

Advertisement

Post Comment