టెరిటోరియల్ ఆర్మీ జాబ్స్ | ఎలిజిబిలిటీ, నియామక విధానం
Defence Jobs Latest Jobs

టెరిటోరియల్ ఆర్మీ జాబ్స్ | ఎలిజిబిలిటీ, నియామక విధానం

టెరిటోరియల్ ఆర్మీ రెగ్యులర్ ఆర్మీ కాదు. ఉద్యోగం, ఉపాధిని కల్పించే నియామక సంస్థ అంతకంటే కాదు..సాధారణ సైన్యాన్ని స్థిరమైన విధుల నుండి ఉపశమనం కల్పించేందుకు ఏర్పడ్డ ద్వితీయ శ్రేణి మాజీ సైనిక దళం ఇది. మాజీ సైనిక ఆఫీసర్లు ఇందులో సభ్యులుగా ఉంటారు. వీరు సాధారణ సైన్యం నిర్వహించే విధులేవి నిర్వర్తించారు. ఇది ఒకరకమైన వాలెంటీరరీ సైన్యం.

Advertisement

దేశ అత్యవసర సమయంలో లేదా ప్రకృతి విపత్తుల సమయంలో వీరు యూనిఫామ్ ధరించి దేశం కోసం సేవ చేస్తారు. మిగతా సమయాల్లో ఏడాదిలో కొన్ని రోజులు సాధారణ అడ్మినిస్ట్రేషన్ విధులు, రెండు నెలల సాధారణ ట్రైనింగ్ మినహా ఎటువంటి అదనపు విధులు నిర్వర్తించారు.

టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్లకు 7th పే స్కేల్ ఆధారంగా హోదాను అనుసరించి లెవెల్ 10 నుండి 13A పరిధిలో చెల్లిస్తారు. మిలటరీ తరుపున 15 వేల గౌరవ వేతనం కూడా అందిస్తారు. అలోవెన్సులు, ఇతర చెల్లింపు రెగ్యులర్ ఆర్మీ మాదిరిగానే చెల్లిస్తారు. పెన్షన్ గ్యారెంటీ ఉండదు. ఎంపికైన అధికారులకు కమిషన్ లెఫ్టినెంట్ హోదా కల్పిస్తుంది. ప్రమోషన్ ద్వారా లెఫ్టినెంట్ స్థాయి నుండి లెఫ్టినెంట్ కల్నల్ చేరుకోవచ్చు. కల్నల్ మరియు బ్రిగేడియర్ ప్రమోషన్ అధికారిక ఎంపిక ద్వారా అందజేస్తారు.

Territorial Army Pay Scales (VIIth CPC)
ర్యాంకు లెవెల్ పే మాట్రిక్స్ మిలిటరీ పే స్కేల్
Lieutenant Level 10 56,100 - 1,77,500 15500/-
Captain Level 10A 6,13,00 - 1,93,900 15500
Major Level 11 6,94,00 - 2,07,200 15500
Lt Colonel Level 12A 1,21,200 - 2,12400 15500
Colonel Level 13 1,30,600 - 2,15,900 15500
Brigadier Level 13A 1,39,600 - 2,17,600 15500

టెరిటోరియల్ ఆర్మీ ఎలిజిబిలిటీ

  • Ex సర్వీస్ అధికారులు మాత్రమే దరఖాస్తు చేసేందుకు అర్హులు.
  • జాతీయత: భారతీయ పౌరులయి ఉండాలి.
  • వయోపరిమితి: దరఖాస్తు చేసే సమయానికి 18 నుండి 42 ఏళ్ళ మధ్య ఉండాలి.
  • విద్య అర్హుత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్
  • శారీరక ప్రమాణాలు: అభ్యర్థులు ఫీజికల్'గా మెంటల్'గా అంది విధాలుగా ఫిట్'గా ఉండాలి.
  • ఎంప్లాయిమెంట్ : ఇతర లాభదాయక ఉద్యోగాలు చేసే వారుకూడా అర్హులు.

టెరిటోరియల్ ఆర్మీ దరఖాస్తు ప్రక్రియ

అర్హుత కల్గిన Ex సర్వీస్ అధికారులు www.jointerritorialarmy.gov.in వెబ్సైటు ద్వారా (IAF (TA)-9 (Revised) Part - 1) ఫోరం డౌన్లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటుగా ఫోటో కాపీ మారియు సంబంధిత మెడికల్ వివరాలు అందజేస్తూ Directorate General Territorial Army, Integrated Headquarters of Ministry of Defence, ‘L’ Block, Church Road, New Delhi – 110 001.

అడ్రెస్సుకు పోస్టు ద్వారా దరఖాస్తు అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తు పరిశీలన తర్వాత అర్హుత ఉన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ కాల్ లెటర్ పంపిస్తారు. ఒకసారి ఇంటర్వ్యూ తేదీ ప్రకటించాక దాన్ని మార్చేందుకు అవకాశం ఉండదు.

టెరిటోరియల్ ఆర్మీ ఎంపిక ప్రక్రియ

ఇంటర్వ్యూ లెటర్ అందజేచిన Ex సర్వీస్ అధికారులకు ఢీల్లీ ‘ఎల్’ బ్లాక్, చర్చి రోడ్ లోఉన్న ఇంటిగ్రేటెడ్ అదనపు డైరెక్టరేట్ జనరల్ టెరిటోరియల్ ఆర్మీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో ఆర్మీ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ చేస్తుంది. సిఫార్సు చేసిన అభ్యర్థులకు దగ్గరలో ఉండే ఆర్మీ హాస్పిటల్లో మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.

చివరిగా పోలీస్ వెరిఫికేషన్ అనంతరం అభ్యర్థులను విధుల్లోకి తీసుకుంటారు. ఎంపికైన అధికారులకు నెల రోజుల పాటు ప్రాథమిక ఆర్మీ ట్రైనింగ్ అందజేస్తారు. తర్వాత ఏడాది నుండి ప్రతి ఏడాది రెండు నెలల పాటు సాధారణ ట్రైనింగ్ క్యాంపు నిర్వహిస్తారు.

Advertisement