జీఆర్ఈ ఎగ్జామ్ 2023 | ఎలిజిబిలిటీ, దరఖాస్తు, ఎగ్జామ్ నమూనా
Admissions Exams to study abroad

జీఆర్ఈ ఎగ్జామ్ 2023 | ఎలిజిబిలిటీ, దరఖాస్తు, ఎగ్జామ్ నమూనా

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఏంఎస్ చేయాలనుకునే తెలుగు విద్యార్థులు గ్రాడ్యుయేట్ రికార్డు ఎగ్జామినేషన్ (జీఆర్ఈ ఎగ్జామ్) అర్హుత సాధించటం తప్పనిసరి. ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్) ఆధ్వర్యంలో జరిగే ఈ అర్హుత పరీక్ష దాదాపు 160 దేశాల్లో 1000 కి పైగా పరీక్ష కేంద్రాలలో ఏడాది పొడుగునా నిర్వహించబడుతుంది.

Advertisement

జీఆర్ఈ స్కోరు మేనేజ్‌మెంట్‌ మరియు లా కోర్సులతో పాటుగా కొన్ని వందల కొలది గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ యందు చేరేందుకు ఉపయోగపడుతుంది. జీఆర్ఈ స్కోరు కార్డు, అర్హుత సాధించిన ఏడాది నుండి ఐదేళ్ల వరకు చెల్లుబాటు అవుతుంది. పరీక్ష ఫీజు 205 డాలర్లు (14000 నుండి 15000 రూ).

జీఆర్ఈ జనరల్ టెస్ట్ మరియు జీఆర్ఈ సబ్జెక్ట్స్ టెస్ట్ పేరుతొ జరిగే ఈ అర్హుత పరీక్షలకు ప్రతి యేటా వేలాది మంది తెలుగు విద్యార్థులు పోటీ పడుతుంటారు. అమెరికాలో మాస్టర్స్ చేయాలనుకునే కలను నిజం చేసే జీఆర్ఈ పరీక్ష గురించి పూర్తి వివరాలు తెల్సుకుందాం.

Exam Name GRE
Exam Type Eligibility Test
Eligibility For Graduation Courses In US
Exam Date Throughout the year
Exam Duration 3.45 Hours
Exam Level International Level

జీఆర్ఈ జనరల్ టెస్ట్

జీఆర్ఈ జనరల్ టెస్ట్ ప్రధానంగా అభ్యర్థి యొక్క వెర్బల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ రీజనింగ్ మరియు అనలాటికల్ రైటింగ్ సంబంధిత నైపుణ్యాల అంచనా వేసేందుకు నిర్వహిస్తారు. జీఆర్ఈ జనరల్ స్కోరుతో అమెరికాలోని టాప్ యూనివర్సిటీలలో బిజినెస్ మరియు లా కోర్సులతో పాటుగా మిగతా అన్ని పోస్టుగ్రాడ్యుయేట్  ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పరీక్ష ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఏడాది పొడుగునా, కంప్యూటర్ ప్రోమెట్రిక్ టెస్ట్ సెంటర్స్ ద్వారా జరపబడుతుంది. కంప్యూటర్ ప్రోమెట్రిక్ టెస్ట్ సెంటర్స్ అందుబాటులో లేని దేశాల్లో ఆఫ్‌లైన్‌ లో నిర్వహిస్తారు. ఈ పరీక్షకు ఏడాదిలో గరిష్టంగా 5 సార్లు హాజరయ్యే అవకాశం ఉంటుంది. రెండు వరుస పరీక్షల మధ్య 21 రోజులు నిడివి తప్పనిసరి. పరీక్ష సమయం 3 గంటల 45 నిమిషాలు ఉంటుంది.

సిలబస్ సెక్షన్ / టాస్క్ ప్రశ్నల సంఖ్యా సమయం
అనలాటికల్ రైటింగ్ టాస్క్ 1 1 30 నిమిషాలు
టాస్క్ 2 1 30 నిమిషాలు
వెర్బల్ రీజనింగ్ సెక్షన్ 1 20 ప్రశ్నలు 30 నిమిషాలు
సెక్షన్ 2 20 ప్రశ్నలు 30 నిమిషాలు
క్వాంటిటేటివ్ రీజనింగ్ సెక్షన్ 1 20 ప్రశ్నలు 35 నిమిషాలు
సెక్షన్ 2 20 ప్రశ్నలు 35 నిమిషాలు

అనలాటికల్ రైటింగ్

ఈ సెక్షన్ లో రెండు వ్యాసరూప ప్రశ్నలు ఇవ్వబడతాయి. ప్రతి ప్రశ్నకు 30 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది. ఈ రెండు ప్రశ్నలలో ఒకటి సమస్యని విశ్లేషించేది, రెండవది వాదనను విశ్లేషించేదై ఉంటుంది. ఈ రెండు టాస్క్ ల ద్వారా అభ్యర్థి యొక్క విశ్లేషణ సామర్ధ్యాన్ని, వాదన పూర్వక ఆలోచన సామర్ధ్యాన్ని అంచనా వేస్తారు.

ఈ సెక్షన్ స్కోరింగ్ స్కేల్ 0 నుండి 6 వరకు ఉంటుంది. ఇచ్చిన వ్యాసాన్ని పూర్తిస్థాయిలో వ్రాసిన వారికీ 6 పాయింట్లు, సగటు స్థాయిలో వ్రాసిన వారికీ 5, మాధ్యమంగా వ్రాసిన వారికీ 4, పరిమితంగా వ్రాసిన వారికీ 3, అక్షర దోషాలతో వ్రాసేవారికి 2, అసలు అవగాహన లేకుండా రాసిన వారికీ 1 పాయింట్ ఇవ్వబడుతుంది. 0.5 పాయింట్ ఇంక్రిమెంట్ ఉంటుంది.

వెర్బల్ రీజనింగ్ 

వెర్బల్ రీజనింగ్ రెండు సెక్షన్లుగా ఉంటుంది.. ప్రతి సెక్షన్ లో 20 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ప్రతి సెక్షన్ కు 30 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది. ఈ సెక్షన్ లో వెర్బల్ రీజనింగ్ నుండి రీడింగ్ కంప్రహెన్షన్, టెక్స్ట్ కంప్లీషన్  సెంటెన్స్ ఈక్విలెన్సు సంబంధిత అంశాల నుండి ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఈ సెక్షన్ లో స్కోరింగ్ స్కేల్ 130 నుండి 170 వరకు ఉంటుంది. 1 పాయింట్ ఇంక్రిమెంట్ ఉంటుంది.

క్వాంటిటేటివ్ రీజనింగ్

క్వాంటిటేటివ్ రీజనింగ్ రెండు సెక్షన్లుగా ఉంటుంది. ప్రతి సెక్షన్ లో 20 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ప్రతి సెక్షన్ కు 35 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది. ఈ సెక్షన్ క్వాంటిటేటివ్ కంపేరిజన్, మల్టిఫుల్ ఛాయస్ మరియు న్యూమరిక్ ఎంట్రీ రకానికి చెందిన ప్రశ్నలు ఇవ్వబడతాయి.

ఈ సెక్షన్ లో మ్యాథమెటిక్స్ సంబంధించిన అర్థమెటిక్, ఎలిమెంటరీ ఆల్జీబ్రా, మరియు జామెట్రీ కి సంబంధించిన అంశాల యందు అభ్యర్థి యొక్క క్వాంటిటేటివ్ ఎబిలిటీని పరీక్షిస్తారు. ఈ సెక్షన్ లో స్కోరింగ్ స్కేల్ 130 నుండి 170 వరకు ఉంటుంది. 1 పాయింట్ ఇంక్రిమెంట్ ఉంటుంది.

జీఆర్ఈ సబ్జెక్టు టెస్ట్

జీఆర్ఈ సబ్జెక్టు టెస్ట్ అనేది స్పెషలైజెడ్ సబ్జెక్టుల యందు మాస్టర్స్ చేయాలనుకునే వారి కోసం నిర్వహించబడతాయి. బయాలజీ, కెమిస్ట్రీ, లిటరేచర్ ఇన్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ మరియు సైకాలజీ సబ్జెక్టులకు మాత్రమే జీఆర్ఈ సబ్జెక్టు టెస్ట్ నిర్వహించబడుతుంది.

రాతపరీక్ష(ఆఫ్‌లైన్‌) విధానంలో జరిగే ఈ పరీక్ష ప్రతి యేటా సెప్టెంబర్, అక్టోబర్ మరియు ఏప్రిల్ లో నిర్వహించబడుతుంది.పరీక్ష సమయం 2 గంటల 50 నిమిషాలు. జీఆర్ఈ సబ్జెక్టు టెస్ట్ కు సంబంధించి మరిన్ని వివరాల కోసం www.ets.org/gre/subject/about వెబ్‌సైట్ ను సందర్శించండి.

జీఆర్ఈ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ విధానం

జీఆర్ఈ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మూడు దశలలో పూర్తిచేయాలి. మొదట దశలో ఈటీఎస్ అకౌంటు క్రియేట్ చేసుకోవాలి. రెండవ దశలో అందుబాటులో ఉండే పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవాలి. మూడవ దశలో సదురు పరీక్ష కేంద్రంలో సమయానుసారం పరీక్ష తేదీని రిజిస్టర్ చేసుకోవాలి.

జీఆర్ఈ పరీక్ష నమోదు, స్కోర్లు నిర్వహణ, ప్రిపరేషన్ మెలుకువలు, గ్రాడ్యుయేట్ స్కూళ్ల వివరాలు వంటి వివిధ సేవలు నిర్వహించేందుకు మీదైనా యూజర్‌నేమ్ మరియు పాస్‌వర్డ్‌ తో ఈటీఎస్ వెబ్‌సైట్ లోని జీఆర్ఈ రిజిస్ట్రేషన్  www.ereg.ets.org/ereg/public/signin పేజీ ద్వారా ఈటీఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. రెండవ దశలో మీకు అందుబాటులో ఉండే పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవాలి.

ఎంపిక చేసుకున్న పరీక్ష కేంద్రంలో మీకు కావాల్సిన సమయంలో పరీక్ష నిర్వహణ తేదీలను దృష్టిలో పెట్టుకుని పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోండి. ప్రతి పరీక్ష కేంద్రంలో నెలలో ఒకటి నుండి నాలుగు సార్లు పరీక్ష నిర్వహించబడుతుంది. మూడవ దశలో మీ హాజరయ్యే తేదీని నిర్దారింఛి పరీక్ష నమోదు ప్రక్రియ పూర్తిచేయాలి.

పరీక్ష ఏడాది పొడుగునా జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు తమకు అందుబాటులో లేదా తాము సంసిద్ధమయ్యే సమయాల్లో పరీక్ష రాసేందుకు వీలుంటుంది. కాని పరీక్ష అపాయింట్‌మెంట్‌ షెడ్యూల్ ఏర్పాటు చేసుకునేముందు కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోండి. మొదటిది మీరు అడ్మిషన్ పొందే గ్రాడ్యుయేట్ స్కూల్ యొక్క ప్రవేశ తేదీలను దృష్టిలో పెట్టుకోండి.

రెండు పరీక్ష కు సంసిద్ధమయ్యేందుకు మీకు కావాల్సిన సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక చివరిగా పరీక్ష కేంద్రం ఎంపిక, ఆ సమయంలో ఆ ప్రాంతంలో వసతి సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని పరీక్ష షెడ్యూల్ ను ఏర్పాటు చేసుకోండి.

పరీక్ష షెడ్యూలును మీరు ఆన్‌లైన్‌ ఈటీఎస్ అకౌంట్‌లో, టెలిఫోన్‌లో, పోస్టు మరియు ఫ్యాక్స్ ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చు. జీఆర్ఈ పరీక్షకు ఏడాదిలో గరిష్టంగా 5 సార్లు మాత్రమే హాజరయ్యేందుకు అనుమతి ఉంటుంది. రెండు పరీక్షల మధ్య 21 రోజులు నిడివి తప్పనిసరి.

జీఆర్ఈ ఎగ్జామ్ స్కోరు కార్డు వ్యాలిడిటీ

జీఆర్ఈ ఎగ్జామ్ పూర్తియిన 2 లేదా 3 వారాల తర్వాత అభ్యర్థులకు అధికారక స్కోరు కార్డు అందజేస్తారు. దానికంటే ముందు పరీక్ష రోజున, పరీక్ష పూర్తయిన వెంటనే కంప్యూటర్ స్క్రీన్ పై మీ అనధికారిక అంచనా స్కోరు ప్రదర్శించబడుతుంది. చూపించిన ఫలితాలను మీ సంబంధిత గ్రాడ్యుయేట్ స్కూళ్లకు నివేదించేలా లేదా రద్దు చేసుకుంటారా అనే నిర్ణయం తీసుకునేందుకు 2 నిముషాల సమయం ఇస్తుంది.

మీరు చూపిన ప్రతిభ ఆధారంగా దాన్ని రద్దు చేసుకుంటారా లేదా నివేదిస్తారా అనే నిర్ణయం మీ చేతిలోనే ఉంటుంది. ఒక వేళా మీరు నివేదిస్తే ఆ స్కోరు మీరు కోరుకునే గ్రాడ్యుయేట్ స్కూళ్లకు పంపిస్తుంది. జీఆర్ఈ స్కోర్ కార్డు 5 ఏళ్ళు చెల్లుబాటులో ఉంటుంది.

జీఆర్ఈ స్కోరు రిపోర్టులో అభ్యర్థి చిరునామా, పుట్టిన తేదీ వివరాలు, పరీక్ష తేదీ , జీఆర్ఈ స్కోరు మరియు పెర్సెంటైల్ ర్యాంకులు, గత ఐదేళ్ల జీఆర్ఈ స్కోరు రికార్డు వంటి వివరాలు ముద్రించబడి ఉంటాయి. మీరు సాధించిన స్కోర్లలో మీరు ఎంపిక చేసుకున్న గరిష్ట స్కోరు వివరాలు మాత్రమే గ్రాడ్యుయేట్ స్కూళ్లకు పంపిస్తారు.

Advertisement