August 2023 Current Affairs Questions In Telugu
Current Affairs Bits 2023

August 2023 Current Affairs Questions In Telugu

తెలుగులో కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ ఆగష్టు 2023. సమకాలిన అంశాలకు సంబంధించి 30 ప్రాక్టీస్ ప్రశ్నలు మరియు జవాబులను మీ కోసం అందిస్తున్నాం. వివిధ పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థులు తమ కరెంట్ అఫైర్ సన్నద్ధతను అంచనా వేసేందుకు ఇవి ఉపయోగపడతాయి.

1. కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి ?

  1. దేశంలో మధ్యప్రదేశ్ అత్యధిక పులుల సంఖ్యను కలిగి ఉంది.
  2. మధ్యప్రదేశ్ 8 టైగర్ రిజర్వ్‌లకు నిలయంగా ఉంది
  3. ఆప్షన్ 1 & 2 సరైనవి
  4.  ఆప్షన్ 1 మాత్రమే సరైనది
సమాధానం
4. ఆప్షన్ 1 మాత్రమే సరైనది

2. ఇటీవలే జీఐ ట్యాగ్ పొందిన బికనీర్ కాషిదాకరి క్రాఫ్ట్ ఏ రాష్ట్రానికి చెందినది ?

  1. కర్ణాటక
  2. ఉత్తరప్రదేశ్
  3. గుజరాత్
  4. రాజస్థాన్
సమాధానం
4. రాజస్థాన్

3. మేరీ మట్టి మేరా దేశ్ ప్రచార కార్యక్రమం కింది వాటిలో దేనికి సంబంధించింది ?

  1. అమరవీరులైన సైనికులను గౌరవించే కార్యక్రమం
  2. అయోధ్య నిర్మాణంలో ప్రజల భాగస్వామ్య కార్యక్రమం
  3. నూతన పార్లమెంట్ నిర్మాణంలో ప్రజా భాస్వామ్యం
  4. స్వచ్ఛ భారత్ అనుబంధ కార్యక్రమం
సమాధానం
1. అమరవీరులైన సైనికులను గౌరవించే కార్యక్రమం

4. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవలే ప్రారంభించిన యాప్ పేరు ఏంటి ?

  1. సురక్ష ప్రయాన్
  2. సులబ్ యాత్ర
  3. రాజమార్గయాత్ర
  4. రక్షా మార్గ్
సమాధానం
3. రాజమార్గయాత్ర

5. చాంగ్‌ఖీ కుక్కల జాతి రక్షణ కోసం పర్యవేక్షణ సెంటర్ ఏర్పాటు చేసిన దేశం?

  1. నేపాల్
  2. భూటాన్
  3. ఇండియా
  4. శ్రీలంక
సమాధానం
2.భూటాన్

6. ఢిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ బిల్లు 2023 సంబంధించి నిజం కానిది ఏది ?

  1. ఇది ఢిల్లీ ప్రభుత్వంలోని అధికారుల నియామకం, బదిలీలకు సంబంధించినది
  2. ఈ బిల్లును ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది.
  3. ఈ బిల్లు ఆమోదం వలన ఢిల్లీ స్వయంప్రతిపత్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది.
  4. ఈ బిల్లు ఢిల్లీ ప్రభుత్వ అధికారుల అవినీతిని అరికట్టేందుకు రూపొందించబడింది.
సమాధానం
4. ఈ బిల్లు ఢిల్లీ ప్రభుత్వ అధికారుల అవినీతిని అరికట్టేందుకు రూపొందించబడింది  

7. వివాదాస్పద జ్ఞానవాపి మసీదు ఏ నగరంలో ఉంది ?

  1. న్యూఢిల్లీ
  2. అయోధ్య నగరం
  3. వారణాసి
  4. అలహాబాద్
సమాధానం
3. వారణాసి

8. యూనిఫాం సివిల్ కోడ్ 2023కి వ్యతిరేఖంగా తీర్మానం చేసిన రాష్ట్రం ఏది ?

  1. కర్ణాటక
  2. కేరళ
  3. గోవా
  4. రాజస్థాన్
సమాధానం
2. కేరళ

9. రాజౌరి చిక్రి వుడ్‌క్రాఫ్ట్ ఏ ప్రాంతానికి చెందిన హస్తకళ ఉత్పత్తి ?

  1. పశ్చిమ బెంగాల్
  2. ఉత్తరప్రదేశ్
  3. తెలంగాణ
  4. జమ్మూ & కాశ్మీర్
సమాధానం
4. జమ్మూ & కాశ్మీర్ 

10. ఇందిరా గాంధీ స్మార్ట్ ఫోన్ పథకంను ప్రారంభించిన రాష్ట్రం ఏది ?

  1. కర్ణాటక
  2. రాజస్థాన్
  3. ఉత్తరాఖండ్
  4. మధ్యప్రదేశ్
సమాధానం
2. రాజస్థాన్ 

11. ఏ రాష్ట్రం కోసం రాజ్యాంగ (ఎస్సీ) ఆర్డర్ (సవరణ) బిల్లు 2023 ఆమోదించబడింది ?

  1. జార్ఖండ్
  2. ఛత్తీస్‌గఢ్‌
  3. ఒడిశా
  4. ఉత్తరప్రదేశ్
సమాధానం
2. ఛత్తీస్‌గఢ్‌

12. భారతీయ న్యాయ సంహిత బిల్లు 2023 కింది వాటిలో దేనిని భర్తీ చేస్తుంది ?

  1. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)
  2. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్పీసీ)
  3. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్
  4. పైవి అన్నియూ
సమాధానం
4. పైవి అన్నియూ

13. జీరో ఎఫ్‌ఐఆర్ సంబంధించి సరైన సమాధానం గుర్తించండి ?

  1. పోలీసు స్టేషన్ అధికార పరిధితో సంబంధం లేకుండా దాఖలు చేయగల ఎఫ్‌ఐఆర్
  2. జీరో ఎఫ్‌ఐఆర్ తీవ్రమైన మహిళా నేరాల బాధితులకు మాత్రమే వర్తిస్తుంది.
  3. 2012 నిర్భయ గ్యాంగ్ రేప్ కేసు తర్వాత ఏర్పాటైన జస్టిస్ వర్మ కమిటీ దీనిని సిఫార్సు చేసింది
  4. పైవి అన్ని సరైనవి
సమాధానం
4. పైవి అన్ని సరైనవి

14. భారతదేశపు తోలి అగ్రికల్చరల్ డేటా ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది ?

  1. గుజరాత్
  2. పంజాబ్
  3. తెలంగాణ
  4. ఆంధ్రప్రదేశ్
సమాధానం
3. తెలంగాణ

15. జన్ ఔషధి మాదిరి కేంద్రాల ఏర్పాటుకు సిద్దమౌతున్న దేశం ఏది ?

  1. మయన్మార్
  2. శ్రీలంక
  3. ఇండోనేషియా
  4. బాంగ్లాదేశ్
సమాధానం
3. ఇండోనేషియా

16. ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరం ఏది ?

  1. కోపెన్‌హాగన్
  2. వియన్నా
  3. మెల్‌బోర్న్
  4. వాంకోవర్
సమాధానం
2. వియన్నా

17. ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన ఎల్‌ఐసీ నూతన మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు ?

  1. ఆర్ దొరైస్వామి
  2. దినేష్ కుమార్ ఖరా
  3. డిపి సింగ్
  4. వినీత్ జోషి
సమాధానం
1. ఆర్ దొరైస్వామి

18. ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం నూతన పేరు ఏంటి ?

  1. పీఎం మ్యూజియం & లైబ్రరీ సొసైటీ
  2. పీఎం మెమోరియల్ మ్యూజియం
  3. ఢిల్లీ మెమోరియల్ మ్యూజియం
  4. వాజపేయి మెమోరియల్ మ్యూజియం
సమాధానం
1. పీఎం మ్యూజియం & లైబ్రరీ సొసైటీ

19. ఇస్రో యొక్క మిషన్ ఆదిత్య ఎల్1 దీనికి సంబంధించింది ?

  1. చంద్రుడిపై సూర్యుడు ప్రభావం అధ్యయనం కోసం
  2. ఆదిత్య-L1 అనేది ఒక సోలార్ మిషన్
  3. ఆప్షన్ 1 & 2 సరైనవి
  4. ఆప్షన్ 1 సరైనది, ఆప్షన్ 2 సరైనది కాదు
సమాధానం
4. ఆప్షన్ 1 సరైనది, ఆప్షన్ 2 సరైనది కాదు 

20. భారతదేశపు మొట్టమొదటి లాంగ్ రేంజ్ రివాల్వర్ పేరు ఏంటి ?

  1. ఇండో రివాల్వర్
  2. సుల్తాన్ రివాల్వర్
  3. ప్రబల్ రివాల్వర్
  4. మొఘల్ రివాల్వర్
సమాధానం
3. ప్రబల్ రివాల్వర్

21. ఉద్గామ్ పోర్టల్‌ కింది వాటిలో దేని కోసం రూపొందించబడింది ?

  1. సహారా ఇండియా రిఫండ్ అందించడానికి
  2. జీఎస్టీ బిల్లింగ్ సులభతరం చేయటానికి
  3. క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లను పొందటానికి
  4. ప్రభుత్వ టెండర్లు ట్రాక్ చేయడానికి
సమాధానం
3. క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లను పొందటానికి

22. కుయ్ & దేశియా గిరిజన భాషలు ఏ రాష్టానికి చెందినవి ?

  1. జార్ఖండ్
  2. ఒడిశా
  3. తెలంగాణ
  4. మణిపూర్
సమాధానం
2. ఒడిశా

23. టైలోటోట్రిటన్ జైమెంగ్ అనే కొత్త సాలమండర్ జాతులు ఏ ప్రాంతంలో కనుగొన్నారు ?

  1. జమ్మూ & కాశ్మీర్
  2. మణిపూర్
  3. అస్సాం & అరుణాచల్ ప్రదేశ్
  4. ఉత్తరాఖండ్
సమాధానం
2. మణిపూర్

24. కన్నియాకుమారి మట్టి అరటి ఏ రాష్ట్రం నుండి జిఐ గుర్తింపు పొందింది ?

  1. తమిళనాడు
  2. కేరళ
  3. గోవా
  4. కర్ణాటక
సమాధానం
1.తమిళనాడు

25. ఇటీవలే పెరూలో కనుగొన్న కొత్త సర్పా జాతి శాస్త్రీయ నామం ఏంటి ?

  1. డెండ్రోయాస్పిస్ పాలిలెపిస్
  2. యునెక్టెస్ మురినస్
  3. టాచీమెనోయిడ్స్ హారిసన్‌ఫోర్డి
  4. ఆక్సియురానస్ మైక్రోలెపిడోటస్
సమాధానం
3. టాచీమెనోయిడ్స్ హారిసన్‌ఫోర్డి

26. భారతదేశపు మొట్టమొదటి 3D-ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ నిర్మించారు ?

  1. గాంధీనగర్
  2. హైదరాబాద్
  3. బెంగుళూరు
  4. విశాఖపట్నం
సమాధానం
3. బెంగుళూరు

27. పురుషుల & మహిళల ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచ కప్ గెలిచిన దేశం ఏది ?

  1. జర్మనీ
  2. స్పెయిన్
  3. అర్జెంటీనా
  4. ఆప్షన్  & 2 సరైనవి
సమాధానం
4. ఆప్షన్ 1 & 2 సరైనవి  

28. భారత ఎన్నికల సంఘం నేషనల్ ఐకాన్‌గా ఇటీవలే ఎవరిని నియమించింది ?

  1. రాహుల్ ద్రావిడ్
  2. మహీంద్రా సింగ్ ధోని
  3. పీవీ సింధు
  4. సచిన్ టెండూల్కర్
సమాధానం
4. సచిన్ టెండూల్కర్

29. ఇటీవలే జాతీయ విద్యా విధానం 2020ను రద్దు చేసిన రాష్ట్రం ఏది ?

  1. తెలంగాణ
  2. తమిళనాడు
  3. కర్ణాటక
  4. పంజాబ్
సమాధానం
3. కర్ణాటక 

30. కింది వాటిలో సరైన చంద్రయాన్ లాండింగ్ ప్రదేశాన్ని గుర్తించండి ?

  1. చంద్రయాన్ 1 : జవహర్ పాయింట్
  2. చంద్రయాన్ 2 : తిరంగా పాయింట్
  3. చంద్రయాన్ 3 : శివశక్తి పాయింట్
  4. పైవి అన్నియూ సరైనవి
సమాధానం
4. పైవి అన్నియూ సరైనవి

Post Comment