January 2023 Current Affairs Questions In Telugu
Current Affairs Bits 2023 Telugu Current Affairs

January 2023 Current Affairs Questions In Telugu

కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ ప్రశ్నలను తెలుగులో సాధన చేయండి. ఈ ఆర్టికల్ యందు జనవరి 2023 నెలలో  చోటుచేసుకున్న సమకాలిన అంశాలకు సంబంధించి 30 ప్రాక్టీస్ ప్రశ్నలు మరియు జవాబులను అందిస్తున్నాం. వివిధ పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థులు తమ కరెంట్ అఫైర్ సన్నద్ధతను అంచనా వేసేందుకు ఇవి ఉపయోగపడతాయి.

కరెంట్ అఫైర్స్ క్విజ్ | జనవరి 2023

1. వింటేజ్ వాహనాల కోసం ప్రత్యేక రిజిస్ట్రేషన్ ప్రారంభించిన రాష్ట్రం ?

  1. హిమాచల్ ప్రదేశ్
  2. గుజరాత్
  3. రాజస్థాన్
  4. ఒడిశా
సమాధానం
4. ఒడిశా 

2. ప్రస్తుతం ఆసియా పసిఫిక్ పోస్టల్ యూనియన్‌కు అధ్యక్షత వహిస్తున్న దేశం ?

  1. ఇండియా
  2. జపాన్
  3. చైనా
  4. థాయిలాండ్‌
సమాధానం
1. ఇండియా 

3. దేశంలో మొదటి జీనోమ్ ఎడిటింగ్ & ట్రైనింగ్ సెంటర్‌ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసారు ?

  1. కర్ణాటక
  2. పంజాబ్
  3. తమిళనాడు
  4. మహారాష్ట్ర
సమాధానం
2. పంజాబ్ 

4. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ప్రకారం దేశంలో అత్యంత కాలుష్య నగరం ?

  1. జోధాపూర్
  2.  పాట్నా
  3. ఢిల్లీ
  4. ఫరీదాబాద్
సమాధానం
3. ఢిల్లీ 

5. క్రింది వాటిలో ఈయూ సభ్య దేశం కానిది ఏది ?

  1. బల్గేరియా
  2. లిథువేనియా
  3. హంగరీ
  4. లెబనాన్
సమాధానం
4. లెబనాన్  

6. 2023 అంతర్జాతీయ విద్యా దినోత్సవం ఎవరికి అంకితం చేయబడింది ?

  1. ఆఫ్ఘనిస్తాన్‌ బాలికలకు
  2. సుడాన్ విద్యార్థులకు
  3. ఉక్రెయిన్ బాలికలకు
  4. పాకిస్తాన్ బాలికలకు
సమాధానం
1. ఆఫ్ఘనిస్తాన్‌  

7. తెలంగాణ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించింది ఎవరు ?

  1. తమిళిసై సౌందరరాజన్
  2. ఆర్ శోభ
  3. శాంతి కుమారి
  4. జువ్వాడి శ్రీదేవి
సమాధానం
3. శాంతి కుమారి  

8. మిస్ యూనివర్స్ 2022 విజేత ఎవరు ?

  1. దివితా రాయ్
  2. ఆర్‌బోని గాబ్రియేల్
  3. వనేసా స్వేడోవా
  4. హర్నాజ్ కౌర్ సంధు
సమాధానం
2. ఆర్‌బోని గాబ్రియేల్  

9. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని ఏ ఏడాదిని జరుపుకోనున్నారు ?

  1. 2023
  2. 2024
  3. 2025
  4. 2022
సమాధానం
1. 2023 

10. అంధత్వ నియంత్రణ పాలసీ అమలు చేసిన తొలి రాష్ట్రం ఏది ?

  1. తెలంగాణ
  2. ఒడిశా
  3. తమిళనాడు
  4. రాజస్థాన్
సమాధానం
4. రాజస్థాన్ 

11. యూనివర్శిటీ విద్యార్థినులకు రుతుక్రమ సెలవులు ప్రకటించిన రాష్ట్రం ?

  1. హిమాచల్ ప్రదేశ్
  2. గుజరాత్
  3. రాజస్థాన్
  4. కేరళ
సమాధానం
4. కేరళ 

12. కింది వాటిలో భారత పర్యాటక రైళ్లు ఏవి ?

  1. వందే భారత్ ఎక్సప్రెస్లు
  2. భారత్ గౌరవ్ రైళ్లు
  3. శతాబ్ది రైళ్లు
  4. దురంతో ఎక్స్‌ప్రెస్లు
సమాధానం
2. భారత్ గౌరవ్ రైళ్లు  

13. చెర్ చేరా ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు ?

  1. ఛత్తీస్‌గఢ్‌
  2. జార్ఖండ్
  3. ఒడిశా
  4. అరుణాచల్ ప్రదేశ్
సమాధానం
1. ఛత్తీస్‌గఢ్‌  

14. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నూతన సీఈఓ ఎవరు ?

  1. సురీందర్ చావ్లా
  2. వికాస్ పురోహిత్‌
  3. రవి కుమార్
  4. అజయ్ కుమార్ శ్రీవాస్తవ
సమాధానం
4. అజయ్ కుమార్ శ్రీవాస్తవ  

15. మహిళల ఐపీఎల్ మీడియా హక్కులను సొంతం చేసుకున్న సంస్థ ఏది ?

  1. డిస్నీ+ హాట్‌స్టార్
  2. సోనీ
  3. జియో నెటవర్క్
  4. వయాకామ్18
సమాధానం
4. వయాకామ్18  

16. ఇటీవలే ప్రారంభించిన స్వదేశీ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏది ?

  1. తరంగ్ ఓఎస్
  2. భరోస్‌
  3. భారత్ ఓఎస్
  4. ఇండోఎస్
సమాధానం
2. భరోస్‌  

17. సియాచిన్‌లో మోహరించిన మొదటి మహిళా అధికారి ఎవరు ?

  1. ఫైటర్ పైలట్ అవని ​​చతుర్వేది
  2. ఎయిర్ మార్షల్ పద్మ బందోపాధ్యాయ
  3. కెప్టెన్ శివ చౌహాన్
  4. లెఫ్టినెంట్ జనరల్ పునీత అరోరా
సమాధానం
3. కెప్టెన్ శివ చౌహాన్  

18. క్రింది వాటిలో ఇండియా, ఫ్రాన్స్ ద్వైపాక్షిక వ్యాయామం ఏది ?

  1. సైక్లోన్ ఎక్సర్‌సైజ్
  2. వరుణ ఎక్సర్‌సైజ్
  3. వీర్ గార్డియన్ ఎక్సర్‌సైజ్
  4. ట్రోపెక్స్ ఎక్సర్‌సైజ్
సమాధానం
2. వరుణ ఎక్సర్‌సైజ్  

19. ఇటీవలే రక్షిత మొక్కల జాబితాలో చేర్చిన మొక్క ఏది?

  1. నెపెంథెస్ ఖాసియానా
  2. బెడ్‌డోమ్స్ సైకాడ్
  3. స్ట్రోబిలాంతస్ కుంతియానస్
  4. డేలియా రెవర్చోని
సమాధానం
3. స్ట్రోబిలాంతస్ కుంతియానస్  

20. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2023 ఏ నగరంలో నిర్వహిచారు ?

  1. నాగపూర్
  2. హైదరాబాద్
  3. ఢిల్లీ
  4. భూపాల్
సమాధానం
4. భూపాల్ 

21. కింది వాటిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న భారతీయ గీతం ఏది ?

  1. నాటు నాటు (ఆర్ఆర్ఆర్)
  2. తేరి మిట్టి (కేసరి)
  3. ధీర ధీర (కేజిఎఫ్)
  4. ఫిర్ నా ఐసీ రాత్ ఆయేగీ (లాల్ సింగ్ చద్దా)
సమాధానం
1. నాటు నాటు (ఆర్ఆర్ఆర్)  

22. సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ ఎవరికి అందిస్తారు ?

  1. ఉత్తమ ఐఏఎస్ ఆఫీసర్లకు
  2. ఉత్తమ విపత్తు నిర్వహణ వ్యక్తులు/సంస్థలు
  3. ఉత్తమ ప్రజాసేవకులకు
  4. ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు
సమాధానం
2. ఉత్తమ విపత్తు నిర్వహణ వ్యక్తులు/సంస్థలు  

23. ఈ ఏడాది మరణానంతరం పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నది ఎవరు ?

  1. ములాయం సింగ్ యాదవ్‌
  2. దిలీప్ మహలనోబిస్‌
  3. బాలకృష్ణ దోషికి
  4. పై అందరూ
సమాధానం
4. పై అందరూ 

24. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2023 వార్షిక సమ్మిట్ ఎక్కడ నిర్వహించారు ?

  1. స్విట్జర్లాండ్‌ (జెనీవా)
  2. జపాన్ (టోక్యో)
  3. స్విట్జర్లాండ్‌ (దావోస్)
  4. ఇండియా (న్యూఢిల్లీ)
సమాధానం
3. స్విట్జర్లాండ్‌ (దావోస్)  

25. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2023లో భారత ర్యాంకు ?

  1. 3వ స్థానం
  2. 4వ స్థానం
  3. 8వ స్థానం
  4. 10వ స్థానం
సమాధానం
2. 4వ స్థానం  

26. అంతర్జాతీయ వన్డేలలో డబల్ సెంచరీ చేసిన అతి పిన్న క్రికెటరు ఎవరు ?

  1. ఇషాన్ కిషన్
  2. రోహిత్ శర్మ
  3. ఫఖర్ జమాన్
  4. శుభ్‌మన్ గిల్
సమాధానం
4. శుభ్‌మన్ గిల్  

27. ఆస్ట్రేలియా ఓపెన్ 2023 పురుషుల సింగిల్స్ టైటిల్‌ విజేత ?

  1. రాఫెల్ నాదల్
  2. స్టెఫానోస్ సిట్సిపాస్‌
  3. నోవాక్ జకోవిచ్‌
  4. డేనియల్ మెద్వెదేవ్
సమాధానం
3. నోవాక్ జకోవిచ్‌  

28. అండర్ 19 మహిళా టీ20ఐ ప్రపంచ కప్ విజేత ?

  1. పాకిస్తాన్
  2. ఇంగ్లాండ్
  3. ఆస్ట్రేలియా
  4. ఇండియా
సమాధానం
4. ఇండియా 

29. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2022 ఎవరు ?

  1. బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్)
  2. సూర్యకుమార్ యాదవ్ (ఇండియా)
  3. బాబర్ ఆజం (పాకిస్తాన్)
  4. మార్కో జాన్సెన్ (దక్షిణ ఆఫ్రికా)
సమాధానం
3. బాబర్ ఆజం (పాకిస్తాన్)  

30. నేషనల్ ఓటర్స్ డే ఏ తేదీన నిర్వహిస్తారు ?

  1. జనవరి 12
  2. జనవరి 20
  3. జనవరి 25
  4. జనవరి 30
సమాధానం
3. జనవరి 25 

Post Comment