శాట్ ఎగ్జామ్ 2023 | ఎలిజిబిలిటీ, రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ నమూనా
Admissions Exams to study abroad

శాట్ ఎగ్జామ్ 2023 | ఎలిజిబిలిటీ, రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ నమూనా

శాట్ అనేది యునైటెడ్ స్టేట్స్‌లో కళాశాల ప్రవేశాల కోసం నిర్వహించే ఒకానొక పాపులర్ అడ్మిషన్ టెస్ట్. శాట్ అనగా స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని అర్ధం. ఈ పరీక్షను అమెరికాకు చెందిన కాలేజ్ బోర్డ్ మరియు ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సంస్థలు నిర్వహిస్తాయి. ఈ పరీక్షలో అర్హుత పొందటం ద్వారా అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని యూనివర్శిటీలు మరియు కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల యందు ప్రవేశం పొందొచ్చు.

Advertisement
Exam Name SAT EXAM
Exam Type Admission Test
Eligibility For Under Graduation In US
Exam Date Throughout the year
Exam Duration 3 Hours
Exam Level International Level

శాట్ ప్రవేశ పరీక్ష ఏడాదిలో 7 సార్లు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఈ పరీక్షకు సగటున 1.5 మిల్లియన్ల మంది విద్యార్థులు ఏటా హాజరవుతున్నారు. శాట్ ప్రవేశ పరీక్ష ప్రధానంగా జూనియర్, సీనియర్ హైస్కూల్ విద్యార్థులు, తమ పాఠశాలలో నేర్చుకున్న నైపుణ్యాలను అంచనా వేస్తుంది.

శాట్ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ & ప్రయోజనాలు

  • శాట్ పరీక్షకు నిర్దిష్ట అర్హత ప్రమాణాలు లేవు కాబట్టి ఎవరైనా దీనికి హాజరు కావచ్చు.
  • టెన్త్, ఇంటర్ విద్యార్థులు విదేశాల్లో అండర్ గ్రాడ్యుయేషన్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.
  • కనీస లేదా గరిష్ట వయోపరిమితి ఏదీ లేదు.
  • విశ్వవిద్యాలయాలలో విద్యార్థులు మెరిట్ ఆధారిత స్కాలర్‌షిప్‌లను పొందటానికి శాట్ స్కోర్‌ అవసరం.

శాట్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ విధానం

శాట్ పరీక్ష కోసం ఆన్‌లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యేందుకు కనీసం 30 నిముషాలు పడుతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మూడు దశలలో ఉంటుంది. మొదట దశలో కాలేజీ బోర్డు పోర్టల్ యందు అకౌంటు క్రియేట్ చేసుకోవాలి. రెండవ దశలో విద్యార్థికి అందుబాటులో ఉండే పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవాలి. మూడవ దశలో సదురు పరీక్ష కేంద్రంలో తమకు అందుబాటులో ఉన్న పరీక్ష తేదీని రిజిస్టర్ చేసుకోవాలి.

రిజిస్ట్రేషన్ సమయంలో విద్యార్థి ఫోటోను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. పరీక్ష రోజున, పరీక్షా కేంద్రం సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి ఈ ఫోటోను మీ ఫోటో ఐడీ కార్డుతో సరిపోల్చుతారు. అప్‌లోడ్ చేసే ఫోటో స్పష్టంగా ఉండాలి. లేకుంటే దరఖాస్తు తిరస్కరించబడుతుంది.

శాట్ పరీక్ష నమోదు, స్కోర్లు నిర్వహణ, ప్రిపరేషన్ మెలుకువలు, అండర్ గ్రాడ్యుయేట్ స్కూళ్ల వివరాలు వంటి వివిధ సేవలు నిర్వహించేందుకు మీదైనా యూజర్‌నేమ్ మరియు పాస్‌వర్డ్‌ తో కాలేజీ బోర్డు వెబ్‌సైట్ లోని రిజిస్ట్రేషన్  www.account.collegeboard.org/login/signUp పేజీ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. రెండవ దశలో మీకు అందుబాటులో ఉండే పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవాలి.

ఎంపిక చేసుకున్న పరీక్ష కేంద్రంలో మీకు కావాల్సిన సమయంలో పరీక్ష నిర్వహణ తేదీలను దృష్టిలో పెట్టుకుని పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోండి. ప్రతి పరీక్ష కేంద్రంలో నెలలో ఒకటి నుండి నాలుగు సార్లు పరీక్ష నిర్వహించబడుతుంది. మూడవ దశలో మీ హాజరయ్యే తేదీని నిర్దారింఛి పరీక్ష నమోదు ప్రక్రియ పూర్తిచేయాలి.

పరీక్ష ఏడాది పొడుగునా జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు తమకు అందుబాటులో లేదా తాము సంసిద్ధమయ్యే సమయాల్లో పరీక్ష రాసేందుకు వీలుంటుంది. కాని పరీక్ష అపాయింట్‌మెంట్‌ షెడ్యూల్ ఏర్పాటు చేసుకునేముందు కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోండి. మొదటిది మీరు అడ్మిషన్ పొందే అండర్ గ్రాడ్యుయేట్ స్కూల్ యొక్క ప్రవేశ తేదీలను దృష్టిలో పెట్టుకోండి.

రెండు పరీక్ష కు సంసిద్ధమయ్యేందుకు మీకు కావాల్సిన సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక చివరిగా పరీక్ష కేంద్రం ఎంపిక, ఆ సమయంలో ఆ ప్రాంతంలో వసతి సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని పరీక్ష షెడ్యూల్ ను ఏర్పాటు చేసుకోండి. పరీక్ష షెడ్యూలును మీరు ఆన్‌లైన్‌ కాలేజీ బోర్డు అకౌంట్‌లో, టెలిఫోన్‌లో, పోస్టు మరియు ఫ్యాక్స్ ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చు.

శాట్ ఎగ్జామ్ ఫీజులు

శాట్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఫీజు $60 యూఎస్ డాలర్లు ఉంటుంది. యూఎస్ నిరుపేద విద్యార్థులకు ఈ ఫీజు మినహాయింపు ఉంటుంది. విదేశీ విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటుగా $43 యూఎస్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. వీటిలో పాటుగా శాట్ ప్రవేశ పరీక్ష ఇతర సేవలు పొందేందుకు అదనపు రుసుములు చెల్లించాల్సి ఉంటుంది.

  • పరీక్ష కేంద్రాన్ని మార్చడం కోసం - $25 యూఎస్ డాలర్లు.
  • గడువులోగా మీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసేందుకు - $25 డాలర్లు.
  • గడువు తర్వాత రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడం కోసం - $35 డాలర్లు.
  • గడువు తర్వాత రిజిస్ట్రేషన్ కోసం ఆలస్య రుసుము - $30 డాలర్లు.
  • నాలుగు ఉచిత స్కోర్ నివేదికల తర్వాత అదనపు స్కోర్ నివేదిక కోసం - $12 డాలర్లు.
  • ఫోన్ ద్వారా స్కోర్‌లను పొందేందుకు ఒక కాల్ కోసం - $15 డాలర్లు.

శాట్ ఎగ్జామ్ నమూనా

శాట్ ప్రవేశ పరీక్ష పూర్తి సీబీటీ విధానంలో జరుపుతారు. పరీక్షను పూర్తి చేసేందుకు 3 గంటల సమయం పడుతుంది. రీడింగ్, లాంగ్వేజ్ మరియు మ్యాథమెటిక్స్ అంశాలతో శాట్ పరీక్షను మూడు అంచెలలో నిర్వహిస్తారు.

  1. శాట్ రీడింగ్ టెస్ట్ : రీడింగ్ టెస్ట్ యందు ఐదు రీడింగ్ పాసేజ్‌లు ఉంటాయి. ప్రతి పాసేజ్ గురించి బహుళ-ఎంపిక ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షను పూర్తి చేయడానికి 65 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఇందులో మొత్తం 52 ప్రశ్నలు ఉంటాయి. ఎకనామిక్స్, సైకాలజీ, సోషియాలజీ, ఏర్త్ సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ లేదా ఫిజిక్స్‌, సోషల్ స్టడీస్ నుండి ప్రశ్నలు ఇవ్వబడతయి.
  2. శాట్ రైటింగ్ & లాంగ్వేజ్ టెస్ట్ : రైటింగ్ మరియు లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ పరీక్ష, దీనిలో పాసేజ్‌లను చదివి, తప్పులను కనుగొని పరిష్కరించల్సి ఉంటుంది. ఈ భాగం 35 నిమిషాలు కేటాయిస్తారు. మొత్తం 4 భాగాలుగా 44 బహుళ-ఎంపిక ప్రశ్నలు ఇవ్వబడతాయి.
  3. మ్యాథమెటిక్స్ టెస్ట్ : గణిత పరీక్ష రెండు భాగాలుగా ఉంటుంది. ఇందులో కాలిక్యులేటర్ లేని భాగం మరియు కాలిక్యులేటర్ భాగం ఉంటుంది. మెజారిటీ ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. కొన్ని ప్రశ్నలకు సమాదానాలు రాయాల్సి ఉంటుంది. ప్రశ్నలు బీజగణితం, ప్రాబ్లమ్ సాల్వింగ్ మరియు డేటా విశ్లేషణ అంశాల నుండి ఇవ్వబడతాయి.

రీడింగ్ టెస్టులో పాసేజ్‌లు స్పష్టంగా పలకాలి. అలా అని కష్టమైన పదజాలం పదాలను నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అడగబడే పదాలు కళాశాల స్థాయి పఠనం మరియు వృత్తి జీవితంలో తరచుగా వచ్చే పదాలను నేర్చుకుంటే సరిపోతుంది. తప్పు సమాధానాలకు ఎటువంటి నెగిటివ్ మార్కులు లేవు.

శాట్ ఎగ్జామ్ సిలబస్ ప్రశ్నలు/ టాస్కులు సమయం కేటాయింపు
రీడింగ్ టెస్ట్ 52 ప్రశ్నలు/ టాస్కులు 65 నిముషాలు
రైటింగ్ టెస్ట్ & లాంగ్వేజ్ టెస్ట్ 44 ప్రశ్నలు/ టాస్కులు 35 నిముషాలు
మ్యాథమెటిక్స్ టెస్ట్ 58 ప్రశ్నలు/ టాస్కులు 80 నిముషాలు
మొత్తం 154  ప్రశ్నలు/ టాస్కులు 180 నిముషాలు

శాట్ ఎగ్జామ్ స్కోర్

శాట్ ఎగ్జామ్ స్కోర్ యూఎస్ అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీలలో అడ్మిషన్ పొందేందుకు ఉపయోగపడుతుంది. శాట్ స్కోరు కనిష్టంగా 400 – 1600 మధ్య ఉంటుంది. స్కోర్ రెండు భాగాలగా లెక్కిస్తారు. అందులో ఎవిడెన్స్-బేస్డ్ రీడింగ్ & రైటింగ్ మరియు మ్యాథమెటిక్స్ ఉంటాయి. ఈ రెండు సెక్షన్ స్కోర్‌లలో ప్రతి దానిలో 200 – 800 వరకు స్కోర్ పొందే అవకాశం ఉంటుంది.

అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీలలో అడ్మిషన్ పొందేందుకు సగటున 1050 శాట్ ఎగ్జామ్ స్కోర్ పొందాల్సి ఉంటుంది. 1350 దాటి శాట్ స్కోరు పొందిన విద్యార్థులు టాప్ యూనివర్శిటీలలో అడ్మిషన్ సొంతం చేసుకోవచ్చు. శాట్ స్కోరు మెరుగుపరుచుకునేందుకు విద్యార్థులు పరీక్షకు పలు మార్లు హాజరు కావొచ్చు.

శాట్ ఎగ్జామ్ పూర్తియిన 2 లేదా 3 వారాల తర్వాత అభ్యర్థులకు అధికారక స్కోరు కార్డు అందజేస్తారు. దానికంటే ముందు పరీక్ష రోజున, పరీక్ష పూర్తయిన వెంటనే కంప్యూటర్ స్క్రీన్ పై మీ అనధికారిక అంచనా స్కోరు ప్రదర్శించబడుతుంది. చూపించిన ఫలితాలను మీ సంబంధిత అండర్ గ్రాడ్యుయేట్ స్కూళ్లకు నివేదించేలా లేదా రద్దు చేసుకుంటారా అనే నిర్ణయం తీసుకునేందుకు 2 నిముషాల సమయం ఇస్తుంది.

మీరు చూపిన ప్రతిభ ఆధారంగా దాన్ని రద్దు చేసుకుంటారా లేదా నివేదిస్తారా అనే నిర్ణయం మీ చేతిలోనే ఉంటుంది. ఒక వేళా మీరు నివేదిస్తే ఆ స్కోరు మీరు కోరుకునే అండర్ గ్రాడ్యుయేట్ స్కూళ్లకు పంపిస్తుంది.

శాట్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ శాట్ ఎగ్జామ్ షెడ్యూల్
శాట్ ఎగ్జామ్ ప్రిపరేషన్  శాట్ ఎగ్జామ్ లాగిన్ 
శాట్ ఎగ్జామ్ సెంటర్ సెర్చ్ శాట్ ఎగ్జామ్ అప్రూవ్డ్ కాలేజీలు

Advertisement

Post Comment