Advertisement
ఫెలోషిప్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2023 : ఎలిజిబిలిటీ, రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ ఫార్మేట్
Admissions Medical Entrance Exams

ఫెలోషిప్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2023 : ఎలిజిబిలిటీ, రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ ఫార్మేట్

ఫెలోస్ ఆఫ్ నేషనల్ బోర్డు (ఎఫ్ఎన్‌బీ) కోర్సులలో అడ్మిషన్ కల్పించేందుకు ఫెలోషిప్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎఫ్‌ఈటీ) నిర్వహించబడుతుంది. ఈ టెస్టు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎన్‌బీఈ దేశ వ్యాప్తంగా దాదాపు 700 పైగా హాస్పిటళ్లలో 80 పైగా మెడికల్ విభాగాల్లో ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ అందిస్తుంది. ఈ 700 హోస్పిటళ్లలో ఎన్‌బీఈ గుర్తింపు కలిగిన 9500 పైగా డీఎన్‌బీ & ఎఫ్ఎన్‌బీ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Exam Name NBE FET 2023
Exam Type Entrance Exam
Admission For FNB Courses
Exam Date 10 Feb 2023
Exam Duration 1.45 Hours
Exam Level National Level

ఎఫ్ఎన్‌బీ కోర్సులలో అడ్మిషన్ పొందేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు డీఎన్‌బీ/ఎండీ/ఎంఎస్/ఎంసీహెచ్/డీఎం కోర్సులలో ఏదోకటి పూర్తిచేసి ఉండాలి. ఫెలోషిప్ ఎంట్రన్స్ టెస్టులో అభ్యర్థులు చూపిన మెరిట్ ఆధారంగా ఎఫ్ఎన్‌బీ కోర్సుల కోసం ఎంపిక చేస్తారు.

ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ ప్రోగ్రాం అందిస్తారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో వివిధ సందర్భాలలో అభ్యర్థులు చూపే ప్రతిభను నమోదుచేస్తారు. ట్రైనింగ్ విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు ఏటా జరిగే నేషనల్ బోర్డు ఎగ్జామినేషన్ కాన్వాకేషన్ లో ఎఫ్ఎన్‌బీ ఫెలోషిప్ అవార్డు అందజేస్తారు.

ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ నిడివి రెండేళ్లు ఉంటుంది. కోర్సు ఫీజు ఏడాదికి 1,25,000/- రూపాయలు. ఎంపికైన అభ్యర్థులకు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ స్టైపెండ్ అందిస్తుంది. మొదటి ఏడాది 41,000 రూపాయలు, రెండవ ఏడాది 43,000 రూపాయలు అందజేస్తుంది.

భారతీయ విద్యార్థుల కోసం ఎఫ్ఎన్‌బీ ప్రోగ్రామ్స్

  • ఆర్థ్రోప్లాస్టీ
  • బ్రెస్ట్ ఇమేజింగ్
  • బారియాట్రిక్ సర్జరీ
  • కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజీ
  • ఫెటల్ రేడియాలజీ
  • హ్యాండ్ అండ్ మైక్రో సర్జరీ
  • హెడ్ & నెక్ ఆంకాలజీ
  • హైరిస్క్ ప్రెగ్నెన్సీ అండ్ పెరినాటాలజీ
  • ఇన్ఫెక్షియస్ డీసీజస్
  • ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ
  • లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
  • మెటర్నల్ & ఫీటల్ మెడిసిన్
  • మినిముల్ యాక్సెస్ సర్జరీ
  • మినిమల్ యాక్సెస్ యూరాలజీ
  • ఓంకో-అనస్థీషియా
  • న్యూరోవాస్కులర్ ఇంటర్వెన్షన్
  • పెయిన్ మెడిసిన్
  • పీడియాట్రిక్ అనస్థీషియా
  • పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజీ
  • పీడియాట్రిక్ నెఫ్రాలజీ
  • పీడియాట్రిక్ హేమాటో ఆంకాలజీ
  • పీడియాట్రిక్ యూరాలజీ
  • రెనాల్ ట్రాన్స్‌ప్లాంటేషన్
  • రేప్రొడ్యూక్టీవ్ సర్జరీ
  • స్పైన్ సర్జరీ
  • స్పోర్ట్స్ మెడిసిన్
  • ట్రాన్స్‌ప్లాంట్ అనస్థీషియా
  • ట్రామా & అక్యూట్ కేర్ సర్జరీ
  • ట్రామా అనస్థీషియా & క్రిటికల్ కేర్
  • విట్రియో రెటినాల్ సర్జరీ

విదేశీ విద్యార్థుల కోసం ఎఫ్ఎన్‌బీ ప్రోగ్రామ్స్

  • ఆర్థ్రోప్లాస్టీ
  • హ్యాండ్ మరియు మైక్రో సర్జరీ
  • ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ
  • మెటర్నల్ & ఫీటల్ మెడిసిన్
  • న్యూరోవాస్కులర్ ఇంటర్వెన్షన్
  • మినిమల్ యాక్సెస్ సర్జరీ
  • పీడియాట్రిక్ హెమటో ఆంకాలజీ
  • రేప్రొడ్యూక్టీవ్ మెడిసిన్
  • స్పైన్ సర్జరీ
  • ట్రామా & అక్యూట్ కేర్ సర్జరీ
  • విట్రియో రెటినాల్ సర్జరీ

ఫెలోషిప్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 ముఖ్యమైన తేదీలు

ఎఫ్‌ఈటీ రిజిస్ట్రేషన్ ప్రారంభం 6 జనవరి 2023
ఎఫ్‌ఈటీ దరఖాస్తు గడువు 27 జనవరి 2023
ఎఫ్‌ఈటీ ఎగ్జామ్ తేదీ 10 ఫిబ్రవరి 2023
ఎఫ్‌ఈటీ ఫలితాలు 28 ఫిబ్రవరి 2023

ఫెలోషిప్ ఎంట్రన్స్ టెస్ట్ ఎలిజిబిలిటీ

  • దరఖాస్తు చేసే అభ్యర్థులు డీఎన్‌బీ/ఎండీ/ఎంఎస్/ఎంసీహెచ్/డీఎం కోర్సులలో గుర్తింపు కలిగిన పోస్టుగ్రాడ్యుయేషన్ మెడికల్ డిగ్రీ కలిగి ఉండాలి.
  • పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ మెడికల్ కౌన్సిళ్లలో రిజిస్టర్ చేసుకుని దానికి తగిన గుర్తింపు కార్డు కలిగివుండాలి.
  • పరీక్షకు హాజరయ్యేందుకు ఎటువంటి గరిష్ట వయో పరిమితి లేదు.

ఫెలోషిప్ ఎంట్రన్స్ టెస్ట్ రిజిస్ట్రేషన్

ఫెలోషిప్ ఎంట్రన్స్ టెస్టుకు హాజరయ్యే అభ్యర్థులు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ (www.nbe.edu.in) వెబ్సైటు ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. బోర్డు నియమాలను అనుసరించి అభ్యర్థుల విద్య మరియు వ్యక్తిగత వివరాలను దరఖాస్తులో పొందుపర్చాలి.

వీటికి సంబంధించిన డూప్లికేట్ ధ్రువపత్రాలను దరఖాస్తుతో పాటుగా అందజేయాలి. అందుబాటులో ఉండే పేమెంట్ విధానంలో దరఖాస్తు రుసుము చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది. ఆమోదం పొందిన అభ్యర్థులకు పరీక్షకు వారం రోజుల ముందు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచుతారు.

ఎఫ్‌ఈటీ ఎగ్జామ్ ఫీజు & ఎగ్జామ్ సెంటర్లు

దరఖాస్తు ఫీజు (ఇండియన్ స్టూడెంట్స్) Rs 4250 + 18% GST
దరఖాస్తు ఫీజు (విదేశీ స్టూడెంట్స్) Rs 37500 + 18% GST
ఎగ్జామ్ సెంటర్లు విశాఖపట్నం, హైదరాబాద్

ఫెలోషిప్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ ఫార్మేట్

ఫెలోషిప్ ఎంట్రన్స్ టెస్ట్ సీబీటీ విధానంలో జరుగుతుంది. పరీక్ష వ్యవధి గంట 45 నిముషాలు ఉంటుంది. పరీక్ష పూర్తి ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో మొత్తం 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు 2 భాగాలుగా ఉంటాయి. పార్ట్ A లో 40 ప్రశ్నలు 45 నిముషాలలో పూర్తిచేయాల్సి ఉంటుంది.

పార్ట్ B లో 60 ప్రశ్నలు 60 నిముషాలలో పూర్తిచేయాల్సి ఉంటుంది. సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు 4 మార్కులు ఇవ్వబడతాయి. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నకు 1 మార్కు తొలగించబడుతుంది. సమాధానం చేయని ప్రశ్నలకు ఎటువంటి మార్కులు కేటాయించబడవు. ఒకదానికి మించి సమాధానాలు గుర్తించిన ప్రశ్నలను లెక్కించారు.

సబ్జెక్టు / సిలబస్ ప్రశ్నలు మార్కులు సమయం
పార్ట్ - A (సూపర్ స్పెషాలిటీ సబ్జెక్టు) 40 160 45 నిముషాలు
పార్ట్ - B (ఫెలోషిప్ కోర్సు సంబంధించి) 60 240 60 నిముషాలు
మొత్తం 100 400 105 నిముషాలు
మరిన్ని వివరాల కోసం
Helpline Number +91-22-61087595
Email helpdesknbeexam@gmail.com
Official Website www.nbe.edu.in

Post Comment