డా.ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మెడికల్, డెంటల్, నర్సింగ్, ఆయుష్, ఫీజియోథెరఫీ మరియు పారామెడికల్ విభాగాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు అందిస్తుంది. ఈ కోర్సుల ప్రవేశాల కోసం డా.యన్.టి.ఆర్ యూనివర్సిటీ ఎటువంటి ప్రవేశ పరీక్ష నిర్వహించదు. నీట్ పీజీ, నీట్ ఎండిఎస్, AIAPGET మరియు అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తుంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
పీజీ మెడికల్ కోర్సుల అడ్మిషన్లు
పీజీ మెడికల్ కోర్సుల అడ్మిషన్ ప్రక్రియ నీట్ పీజీ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా జరుగుతుంది. నీట్ పీజీ ఫలితాలు విడుదల అయ్యాక దీనికి సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ మొదలవుతుంది. నీట్ పీజీ కౌన్సిలింగు ప్రక్రియలో పాల్గోవడం ద్వారా అడ్మిషన్ పొందొచ్చు.
ఎలిజిబిలిటీ | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎంబీబీఎస్ ఉత్తీర్ణత |
---|---|
క్వాలిఫై ఎగ్జామ్ | పీజీ మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ పొందాలంటే నీట్ (పీజీ) పరీక్షలో తప్పక అర్హుత సాధించాలి. కేటగిరి వారీగా నీట్ పీజీ పరీక్షలో సాధించాల్సిన కట్ ఆఫ్ మార్కులు ఈ కింది విధంగా నిర్ణయించారు. |
యూనివర్సిటీ ఫీజు | 23,500/- |
రిజర్వేషన్ల వారీగా కట్ఆఫ్ మార్కులు
జనరల్ కేటగిరి అభ్యర్థులు | 50% మార్కులు |
బీసీ అభ్యర్థులు | 40% మార్కులు |
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు | 40% మార్కులు |
PH అభ్యర్థులు | 40% మార్కులు |
పీజీ డెంటల్ కోర్సుల అడ్మిషన్లు
పీజీ డెంటల్ కోర్సుల అడ్మిషన్ ప్రక్రియ నీట్ ఎండీఎస్ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా జరుగుతుంది.
ఎలిజిబిలిటీ | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బిడిఎస్ ఉత్తీర్ణత |
---|---|
క్వాలిఫై ఎగ్జామ్ | పీజీ డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్ పొందాలంటే నీట్ (MDS) పరీక్షలో తప్పక అర్హుత సాధించాలి |
యూనివర్సిటీ ఫీజు | 23,500/- |
రిజర్వేషన్ల వారీగా కట్ ఆఫ్ మార్కులు
జనరల్ కేటగిరి అభ్యర్థులు | 50% మార్కులు |
బీసీ అభ్యర్థులు | 40% మార్కులు |
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు | 40% మార్కులు |
PH అభ్యర్థులు | 40% మార్కులు |
పీజీ ఆయుష్ కోర్సుల అడ్మిషన్లు
పీజీ AYUSH MD (AYUR), MD (HOMOEO) అడ్మిషన్ ప్రక్రియ BAMS, BHMS Degree కోర్సులల్లో సాధించిన మెరిట్ ఆధారంగా జరుగుతుంది. దీనికి సంబంధించిన అడ్మిషన్ ప్రకటన ఆగష్టు లేదా సెప్టెంబరు నెలల యందు వెలువడుతుంది.
ఎలిజిబిలిటీ | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి BAMS, BHMS డిగ్రీ కోర్సులల్లో ఉత్తీర్ణత |
---|---|
క్వాలిఫై ఎగ్జామ్ | పీజీ ఆయుష్ కోర్సుల్లో అడ్మిషన్ పొందాలంటే BAMS, BHMS Degree కోర్సులల్లో ఉత్తీర్ణత సాధించాలి |
యూనివర్సిటీ ఫీజు | 10,000/- |
రిజర్వేషన్ల వారీగా కట్ ఆఫ్ మార్కులు
జనరల్ కేటగిరి అభ్యర్థులు | 50% మార్కులు |
బీసీ అభ్యర్థులు | 45% మార్కులు |
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు | 40% మార్కులు |
PH అభ్యర్థులు | 40% మార్కులు |
పీజీ నర్సింగ్ కోర్సుల అడ్మిషన్లు
పీజీ నర్సింగ్ కోర్సుల అడ్మిషన్ ప్రక్రియ బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ కోర్సులల్లో సాధించిన మెరిట్ ఆధారంగా జరుగుతుంది. దీనికి సంబంధించిన అడ్మిషన్ ప్రకటన ఏటా ఆగష్టు లేదా సెప్టెంబరు నెలలలో వెలువడుతుంది.
ఎలిజిబిలిటీ | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ కోర్సులల్లో ఉత్తీర్ణత |
---|---|
క్వాలిఫై ఎగ్జామ్ | పీజీ నర్సింగ్ కోర్సుల్లో అడ్మిషన్ పొందాలంటే బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ కోర్సులల్లో ఉత్తీర్ణత సాధించాలి |
యూనివర్సిటీ ఫీజు | 12,800/- |
రిజర్వేషన్ల వారీగా కట్ ఆఫ్ మార్కులు
జనరల్ కేటగిరి అభ్యర్థులు | 55% మార్కులు |
బీసీ అభ్యర్థులు | 55% మార్కులు |
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు | 50% మార్కులు |
PH అభ్యర్థులు | 50% మార్కులు |
పీజీ ఫీజియోథెరఫీ కోర్సుల అడ్మిషన్లు
పీజీ ఫీజియోథెరఫీ కోర్సుల అడ్మిషన్ ప్రక్రియ బ్యాచిలర్ ఆఫ్ ఫీజియోథెరఫీ కోర్సులల్లో సాధించిన మెరిట్ ఆధారంగా జరుగుతుంది. దీనికి సంబంధించి అడ్మిషన్ ప్రకటన ఆగష్టు లేదా సెప్టెంబరు నెలలలో వెలువడుతుంది.
ఎలిజిబిలిటీ | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఫీజియోథెరఫీ కోర్సులల్లో ఉత్తీర్ణత |
---|---|
క్వాలిఫై ఎగ్జామ్ | పీజీ ఫీజియోథెరఫీ కోర్సుల్లో అడ్మిషన్ పొందాలంటే బ్యాచిలర్ ఆఫ్ ఫీజియోథెరఫీ కోర్సులల్లో ఉత్తీర్ణత సాధించాలి. |
యూనివర్సిటీ ఫీజు | 12,800/- |
రిజర్వేషన్ల వారీగా కట్ ఆఫ్ మార్కులు
జనరల్ కేటగిరి అభ్యర్థులు | 50% మార్కులు |
బీసీ అభ్యర్థులు | 40% మార్కులు |
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు | 40% మార్కులు |
PH అభ్యర్థులు | 40% మార్కులు |