Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 24 ఫిబ్రవరి 2024
February Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 24 ఫిబ్రవరి 2024

తెలుగులో 24 ఫిబ్రవరి 2024 కరెంట్ అఫైర్స్ అంశాలను చదవండి. వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాం.

అమూల్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాన మంత్రి

ఫిబ్రవరి 22న గుజరాత్‌లో నిర్వహించిన అమూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకలలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మోటేరాలోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారతదేశ పాడి పరిశ్రమకు అమూల్ అందించిన 50 సంవత్సరాల సహకారాన్ని గుర్తు చేసింది. ఈ కార్యక్రమాన్ని అమూల్ యొక్క గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ నిర్వహించింది.

ఆనంద్‌లోని ఒక చిన్న సహకార సంస్థగా ప్రారంభమై, ప్రపంచ డెయిరీ దిగ్గజంగా ఎదిగిన అమూల్ ప్రయాణాన్ని ప్రధాని మోడీ తన ప్రసంగంలో ప్రశంసించారు. పాల ఉత్పత్తిదారులకు, ముఖ్యంగా చిన్న రైతులకు, మరియు మిలియన్ల మంది భారతీయులకు ఆహార భద్రత కల్పించడంలో ఈ సంస్థ యొక్క పాత్రను ఆయన హైలైట్ చేశారు.

ఇదే వేదిక ద్వారా మోదీ ఐదు కొత్త డెయిరీ ప్రాజెక్టులను కూడా  ప్రారంభించారు. ఇందులో సబర్ డెయిరీ యొక్క ఆధునిక చీజ్ ప్లాంట్, ఆనంద్‌లోని అమూల్ డెయిరీకి చెందిన లాంగ్-లైఫ్ టెట్రా పాక్ మిల్క్ ప్లాంట్ మరియు సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో ప్రభుత్వ పథకాల కింద వివిధ డెయిరీ అభివృద్ధి పనులతో పాటు ముంబైలో భరూచ్ డెయిరీ యూనిట్, కచ్‌లోని సర్హాద్ డెయిరీ యొక్క 50,000-లీటర్ల ఐస్‌క్రీమ్ ప్లాంట్‌ ఉన్నాయి.

  • అమూల్ అనేది గుజరాత్‌లోని ఆనంద్‌లో ఉన్న గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అనే సహకార సంఘం యొక్క సంక్షిప్త రూపం.
  • అమూల్ అనగా ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అని అర్ధం.
  • అమూల్ 1946లో త్రిభువందాస్ కిషీభాయ్ ద్వారా స్థాపించబడింది. 1970లలో ఆయన పదవీ విరమణ చేసే వరకు దాని ఛైర్మన్‌గా పనిచేశారు.
  • ప్రస్తుతం ఇది గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ మరియు గుజరాత్ ప్రభుత్వం యాజమాన్యంలో ఉంది.
  • అమూల్ భారతదేశం యొక్క మొదటి తరం శ్వేత విప్లవాన్ని ప్రోత్సహించింది. ఇది ఇండియాను ప్రపంచంలోనే అతిపెద్ద పాలు మరియు పాల ఉత్పత్తుల ఉత్పత్తిదారుగా చేసింది.
  • ప్రస్తుతం అమూల్ 3.6 మిలియన్ పాల ఉత్పత్తిదారులచే నియంత్రించబడుతుంది.
  • ఇది 3.6 మిలియన్ పాల ఉత్పత్తిదారులచే నియంత్రించబడుతుంది.
  • అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ : జయేన్ మెహతా.

మహిళల భద్రతపై అంబ్రెల్లా పథకం 2026 వరకు కొనసాగింపు

మహిళా భద్రతకు సంబంధించి అంబ్రెల్లా పథకం అమలు కొనసాగింపు కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 1179.72 కోట్లతో 2021-22 నుండి 2025 మధ్య కాలంలో అమలు చేసేందుకు ప్రతిపాదించిన ఈ పథకం 2026 వరకు కొనసాగిస్తున్నట్లు కేంద్ర మంత్రివర్గం వెల్లడించింది.

ఈ కేటాయించిన మొత్తం బడ్జెట్‌లోని రూ.885.49 కోట్లను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన సొంత బడ్జెట్ నుండి అందజేస్తుంది, మిగిలిన రూ.294.23 కోట్లను నిర్భయ ఫండ్ నుండి నిధులు సమకూర్చనున్నారు.

దేశంలో మహిళల భద్రత సంబంధించి కేంద్ర ప్రభుత్వం కఠినమైన చట్టాలను, నిబంధనలను తీసుకొచ్చింది. మహిళా నేరాలకు సంబంధించి సమర్థవంతమైన న్యాయాన్ని అందించడం, ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడం మరియు బాధితులకు సులభంగా అందుబాటులో ఉండే సంస్థాగత మద్దతు నిర్మాణాలు అందుబాటులో ఉంచడం వంటి కార్యక్రమాలు చేపట్టింది.

భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లలో సవరణల ద్వారా మహిళలపై నేరాలకు సంబంధించిన విషయాలలో కఠినమైన నియమాలు చొప్పించింది. మహిళల భద్రత కోసం చేస్తున్న కృషిలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో భారత ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను ప్రారంభించింది.

ఈ ప్రాజెక్టుల లక్ష్యాలలో మహిళలపై నేరాల విషయంలో సకాలంలో జోక్యం మరియు దర్యాప్తు వంటివి ఉన్నాయి. మహిళల భద్రతకు సంబంధించి ఈ అంబ్రెల్లా పథకం కింద కింది ప్రాజెక్టులను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

  • దేశ వ్యాప్తంగా 112 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు.
  • నేషనల్ ఫోరెన్సిక్ డేటా సెంటర్ ఏర్పాటుతో సహా సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్సెస్ లేబొరేటరీల అప్‌గ్రేడ్.
  • డిఎన్ఏ విశ్లేషణను బలోపేతం చేయడం కోసం స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీస్ యందు సైబర్ ఫోరెన్సిక్ సామర్థ్యాల పెంపు.
  • మహిళలు మరియు పిల్లలకు సంబంధించి సైబర్ నేరాల నివారణ
  • మహిళలు మరియు పిల్లలపై లైంగిక వేధింపుల కేసులను నిర్వహించడంలో పరిశోధకులు మరియు ప్రాసిక్యూటర్ల సామర్థ్యాన్ని పెంపొందించడం.
  • ఉమెన్ హెల్ప్ డెస్క్ & యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ల ఏర్పాటు.

ఘనంగా ముగిచిన సమ్మక్క సారలమ్మ ఉత్సవాలు 2024

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం అయిన సమ్మక్క సారలమ్మ ఉత్సవాలు (మేడారం జాతర) ఘనంగా నిర్వహించబడింది. ఫిబ్రవరి 21 నుండి 24 మధ్య జరిగిన ఈ గిరిజన పండగకు దేశం నలుమూలల నుండి కోట్లాది మంది భక్తులు మరియు యాత్రికులు హాజరయ్యారు. ఈ సంవత్సరం తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో ఈ పండగ నిర్వహించబడింది.

ఈ గిరిజన పండగ తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా, తాడ్వాయి మండలంలోని మేడారంలో నిర్వహించబడుతుంది. సమ్మక్క సారలమ్మ అనే గిరిజన దేవతలకు సంబంధించి స్థానిక కోయ తెగలు ఈ పండగ రెండేళ్లకో సారి నిర్వహిస్తారు. ఈ వేడుకల సందర్బంగా గిరిజనలు స్థానికంగా బంగారం అని పిలువబడే బెల్లంను దేవతలకు సమర్పిస్తారు.

సమ్మక్క సారలమ్మ జాతరకు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ మరియు పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుండి సుమారు 15 మిలియన్ల మంది గిరిజనులు హాజరవుతారు. కాకతీయుల అన్యాయమైన చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన సమ్మక్క మరియు సారలమ్మ అనే గిరిజన తల్లీకూతుర్ల జ్ఞాపకార్థం దీనిని నిర్వహిస్తారు.

  • మేడారం జాతర, కుంభమేళా తర్వాత భారతదేశంలోని రెండవ అతిపెద్ద జాతర.
  • ఇది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది.
  • మేడారం జాతర ఇది రెండు సంవత్సరాలకు ఒకసారి 'మాఘ' (ఫిబ్రవరి) పౌర్ణమి రోజున జరుపుకుంటారు.
  • సారలమ్మ సమ్మక్క విగ్రహాలు మేడారం సమీపంలోని చిన్న గ్రామమైన కన్నెపల్లిలోని ఒక ఆలయంలో ప్రతిష్టించడంతో ఈ వేడుక ప్రారంభం అవుతుంది.
  • దీని తర్వాత ఈ విగ్రహాలను స్థానిక జంపన్న వాగులోని ఎర్రటి నీటిలో పవిత్ర స్నానం చేపిస్తారు.
  • జంపన్న వాగు అనేది గోదావరి నదికి ఉపనది.
  • స్థానిక చరిత్ర ప్రకారం జంపన్న అనే గిరిజన యోధుడు, సమ్మక్క యొక్క కుమారుడు.
  • ఈ వాగు ప్రవాహంలో కాకతీయ సైన్యంతో జరిగిన యుద్ధంలో ఆయన మరణించినందున ఇది జంపన్న వాగుగా పేరు పొందింది.
  • మేడారం జాతర 1998లో రాష్ట్ర పండుగగా ప్రకటించబడింది.
  • తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక 2016 నుండి ఈ పండగను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది.
  • మేడారం గ్రామం ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యంలోని ఒక మారుమూల ప్రాంతం.

రిలయన్స్ మద్దతుతో హనూమాన్ అనే చాట్‌జిపిటి స్టైల్ ఏఐ మోడల్ అభివృద్ధి

భారత్‌జిపిటి గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు 8 టాప్ ఐఐటీల మద్దతుతో హనూమాన్ పేరుతో చాట్‌జిపిటి-శైలి సేవను ప్రారంభించేందుకు సిద్ధమౌతున్నారు. ఈ ఏఐ మోడల్ ఆరోగ్య సంరక్షణ, పాలన, ఆర్థిక మరియు విద్యా రంగాలకు ఉపయోగపడే విదంగా 11 స్థానిక భాషలలో అభివృద్ధి చేస్తున్నారు.

హనూమాన్ భారతీయ ఏఐ ల్యాండ్‌స్కేప్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. గ్లోబల్ ఏఐ రేసులో ప్రధాన వాటాదారునిగా మారాలనే భారతదేశ ఆశయాలకు ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా భావించవచ్చు. ఇది భారతదేశం యొక్క విభిన్న భాషా మరియు సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి నిబద్ధతను నొక్కి చెబుతుంది.

హనూమాన్ ఏఐ మోడల్ ఆరోగ్య సంరక్షణ, పాలన, ఆర్థిక సేవలు మరియు విద్య వంటి నాలుగు రంగాలలో సేవలు అందించేందుకు 11 స్థానిక భాషల ద్వారా పని చేస్తుంది. హనూమాన్ స్పీచ్-టు-టెక్స్ట్ సామర్థ్యాలను కూడా అందించనుంది.

ఇది రిలయన్స్ జియో నిర్దిష్ట ప్రయోజనాల కోసం రూపొందుతున్నట్లు తెలుస్తుంది. దీనిని ఆ సంస్థ యొక్క 450 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌ల నెట్‌వర్క్‌లో చేర్చేందుకు ఉంచేందుకు జియో బ్రెయిన్ ద్వారా అందుబాటులోకి తేనున్నారు.

అమెరికా తర్వాత భారత్‌లో రెండో అతిపెద్ద హైవే నెట్‌వర్క్ అందుబాటులోకి

1.45 లక్షల కి.మీల పొడవుతో భారతదేశం యొక్క జాతీయ రహదారుల నెట్‌వర్క్ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్దదిగా అవతరించింది. గత తొమ్మిదేళ్లలో ప్రభుత్వం చేపడుతున్న రహదారి అభివృద్ధి పనుల్లో భాగంగా భారతదేశ రోడ్ నెట్‌వర్క్ 59 శాతం వృద్ధి చెంది ప్రపంచంలోనే రెండవ అతిపెద్దదిగా అవతరించిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

గత తొమ్మిదేళ్లలో ఈ రంగంలో భారత్‌ ఏడు ప్రపంచ రికార్డులు సృష్టించిందని, అమెరికా తర్వాత భారత్‌ రోడ్‌ నెట్‌వర్క్‌ ప్రపంచంలోనే రెండో అతిపెద్దదని ఆయన అన్నారు. 2013-14 నాటికి భారత్ రహదారి టోల్‌ల ఆదాయం రూ. 4,770 కోకోట్లు ఉండగా, ప్రస్తుతం ఇది ₹ 4,1342 కోట్లకు పెరిగినట్లు మంత్రి తెలిపారు. అలానే 2030 నాటికి టోల్ ఆదాయాన్ని ₹ 1,30,000 కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు.

టోల్ గేట్ల వద్ద ఫాస్ట్‌ట్యాగ్‌ల వినియోగం వలన వాహనాల వేచి ఉండే సమయాన్ని 47 సెకన్లకు తగ్గిందని, రాబోయే రోజుల్లో దీన్ని 30 సెకన్ల కంటే తక్కువకు తగ్గించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు.

అలానే భారతదేశం ప్రస్తుతం దాదాపు 64 లక్షల కి.మీ మొత్తం రోడ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఈ విభాగంలో కూడా యూఎస్ తర్వాత భారత్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశంగా ఉంది. ఈ విజయం ఇటీవలి సంవత్సరాలలో దేశం యొక్క ముఖ్యమైన మౌలిక సదుపాయాల పురోగతిని హైలైట్ చేస్తుంది.

ఈ విస్తారమైన రోడ్డు నెట్‌వర్క్ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది వస్తు రవాణా కదలికను సులభతరం చేస్తుంది, ప్రయాణీకుల రద్దీని తగ్గిస్తుంది. ఈ సమర్థవంతమైన రవాణా వ్యవస్థ వివిధ రంగాలకు మద్దతునిస్తుంది, తద్వారా దేశ ఆర్థిక వృద్ధికి ఆజ్యం పోస్తుంది.

రైల్వేలో ఫుడ్ డెలివరీ కోసం స్విగ్గీతో ఐఆర్‌సిటీసీ ఒప్పందం

ప్రముఖ ఇండియన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ అయిన స్విగ్గీ మరియు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటీసీ) రైళ్లలో ముందస్తు ఆర్డర్ చేసిన ఆహారాన్ని డెలివరీ చేసేందుకు ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందంపై ఐఆర్‌సిటీసీ చైర్మన్ & ఎండీ సంజయ్ కుమార్ జైన్ మరియు స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ సీఈఓ రోహిత్ కపూర్‌ సంతకం చేశారు.

ఈ ఎంఓయూలో భాగంగా, స్విగ్గీ తన విస్తృతమైన రెస్టారెంట్ నెట్‌వర్క్ నుండి బెంగళూరు, భువనేశ్వర్, విశాఖపట్నం మరియు విజయవాడల నుండి ప్రారంభమయ్యే భారతీయ రైల్వేలోని ప్రయాణికులకు ఆహారాన్ని అందజేస్తుంది. ఈ సేవలు రాబోయే వారాల్లో 59 అదనపు సిటీ స్టేషన్లకు కూడా విస్తరించే అవకాశం ఉన్నట్లు స్విగ్గీ తెలిపింది.

ప్రయాణికులు తమ పిఎన్ఆర్ నెంబర్ మరియు ప్రారంభ స్టేషన్ వివరాలు పొందుపర్చడం ద్వారా ఈ సేవలు వినియోగించుకోవచ్చు. తద్వారా స్విగ్గీ రెస్టారెంట్ల యొక్క విస్తృతమైన జాబితా నుండి వెచ్చని. తాజా భోజనాన్ని ప్రయాణీకులకు డెలివరీ చేస్తారు.

  • స్విగ్గి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ బెంగుళూర్ కేంద్రంగా 2014లో స్థాపించబడింది.
  • ఇది పట్టణ వినియోగదారులకు స్థానిక రెస్టారెంట్ల నుండి తాజా ఫుడ్ ఎంపికలను డెలివరీ చేస్తుంది.
  • స్విగ్గి దేశ వ్యాప్తంగా దాదాపు 280,000 మంది రెస్టారెంట్ భాగస్వాములతో వినియోగదారులను కలుపుతుంది.
  • అలానే దీని యొక్క శీఘ్ర వాణిజ్య కిరాణా సేవ అయిన ఇనస్టామార్ట్ కూడా ప్రస్తుతం 25 నగరాల్లో అందుబాటులో ఉంది.
  • ఈ సంస్థ ప్రోసస్ (31%), సాఫ్ట్‌బ్యాంక్ (8%), యాక్సెల్ (6.3) యాజమాన్యంలో ఉంది.
  • స్విగ్గి వ్యవస్థాపకులు : శ్రీహర్ష మెజెటి, నందన్ రెడ్డి, రాహుల్ జైమిని

Post Comment