Advertisement
కేఎల్ఈఈఈ 2023 : రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ ఫార్మేట్, ఎగ్జామ్ తేదీ
Admissions Engineering Entrance Exams MBA Entrance Exams

కేఎల్ఈఈఈ 2023 : రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ ఫార్మేట్, ఎగ్జామ్ తేదీ

కేఎల్ఈఈఈ పరీక్షను కేఎల్ యూనివర్సిటీ యందు ఇంజనీరింగ్ ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించబడుతుంది. హైదరాబాద్ మరియు విజయవాడ కేంద్రంగా ఉన్నత విద్య అందిస్తున్న కేఎల్ యూనివర్సిటీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రైవేట్ కాలేజీల్లో మొదటి వరుసలో ఉంటుంది.

కేఎల్ యూనివర్సిటీ  ఇంజనీరింగ్ కోర్సులు కాకుండా ఆర్కిటెక్చర్, ఫార్మసీ, బయోటెక్నాలజీ, మానేజ్మెంట్, లా, కామర్స్ మరియు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వంటి విభిన్న విభాగాల్లో పదుల సంఖ్యలో కోర్సులను అందిస్తుంది.

కేఎల్ఈఈఈ 2022

Exam Name KLEEE 2023
Exam Type Admission
Admission For Engineering
Exam Date 18/04/2023
Exam Duration  3 Hours
Exam Level University Level

కేఎల్ అడ్మిషన్ టెస్ట్ వివరాలు

కేఎల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కోర్సులు & ఫీజులు

బయోటెక్నాలజీ
సివిల్ ఇంజనీరింగ్
కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్ & కంప్యూటర్ ఇంజనీరింగ్
ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
మెకానికల్ ఇంజనీరింగ్
ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ & డేటా సైన్స్
కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

KLEEE

కేఎల్ఈఈఈ ఎలిజిబిలిటీ

  • 60 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ/10+2 ఉత్తీర్ణతయి ఉండాలి
  • బయోటెక్నాలజీ కోర్సుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ/బైపీసీ ఉత్తీర్ణతయి ఉండాలి

కేఎల్ఈఈఈ 2023 ఎగ్జామ్ షెడ్యూల్

కేఎల్ఈఈఈ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ 12 ఏప్రిల్ 2023 (LD)
కేఎల్ఈఈఈ ఎగ్జామ్ తేదీ 18 ఏప్రిల్ 2023
కేఎల్ఈఈఈ ఫలితాలు ఏప్రిల్ 2023
కేఎల్ఈఈఈ కౌన్సిలింగ్ మే & జూన్ 2023

కేఎల్ఈఈఈ దరఖాస్తు ఫీజు & పరీక్ష కేంద్రాలు

దరఖాస్తు రుసుములు పరీక్షా కేంద్రాలు
అప్లికేషన్ ఫీజు : 1000 /- ఆన్లైన్ ప్రొటెక్టెడ్ ఎగ్జామ్  (నేరుగా మీ ల్యాప్టాప్ లేదా పీసీ ద్వారా ప్రవేశ పరీక్షా రాయాల్సి ఉంటుంది)

కేఎల్ఈఈఈ దరఖాస్తు ప్రక్రియ

కేఎల్ఈఈఈ పరీక్షను రాసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు గీతం అధికారిక యూనివర్సిటీ వెబ్సైటు (www.kluniversity.in) ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. అప్లికేషన్లో మీ సంబంధిత వ్యక్తిగత, విద్య మరియు చిరునామ వివరాలు ఎటువంటి తప్పులు దొర్లకుండా పొందుపర్చాల్సి ఉంటుంది.

అలానే మీ పొందుపర్చిన వివరాలకు సంబంధించి ధ్రువపత్రాలు, మీ ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత దశలో అందుబాటులో ఉన్న పేమెంట్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది.

కేఎల్ఈఈఈ ఆన్‌లైన్ హోమ్ ప్రొటెక్టెడ్ టెస్ట్

కోవిడ్ 19 కారణంగా ఈ ఏడాది విద్యావ్యవస్థలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ అకడమిక్ ఏడాదికి సంబంధించి అడ్మిషన్ ప్రకియలన్ని మొదటి నుండి వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ కారణాలతో కేఎల్ యూనివర్సిటీ ఈ ఏడాది కాంటాక్ట్ లెస్ అడ్మిషన్ ప్రక్రియకు స్వీకారం చుట్టింది. పరీక్షకు కానీ, కౌన్సిలింగ్ ప్రక్రియకు కానీ అభ్యర్థి నేరుగా హాజరుకాకుండా ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా వచ్చిందే ఆన్లైన్ హోమ్ ప్రొటెక్టెడ్ టెస్ట్.

ఆన్లైన్ హోమ్ ప్రొటెక్టెడ్ టెస్ట్ ద్వారా అభ్యర్థి నేరుగా తమ వ్యక్తిగత కంప్యూటర్ ద్వారా పరీక్షకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసారు. దీనికి సంబంధించి అభ్యర్థి కెమెరా, మైక్ మరియు ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న వ్యక్తిగత కంప్యూటర్ లేదా లాప్టాప్ కలిగి ఉండాలి.

ఈ ఎగ్జామినేషన్ ప్రక్రియ పూర్తి భద్రత నియమాల మధ్య  సైబర్ సెక్యూరిటీ మరియు ఆర్టిఫిసియల్ టెక్నాలజీని ఉపయోగించి నిర్వహిస్తున్నారు. అభ్యర్థి పరీక్షా మొదలు పెట్టాక, అది పూర్తీయ్యేవరకు కెమెరా ముందు నుండి కదిలేందుకు వీలులేకుండా నియమాలు రూపొందిచారు. పరీక్షా మధ్యలో విద్యుత్ అంతరాయం ఏర్పడిన అభ్యర్థులకు మరోమారు అవకాశం కల్పిస్తారు.

కేఎల్ఈఈఈ ఎగ్జామ్ నమూనా

కేఎల్ఈఈఈ ప్రవేశ పరీక్ష ఈ ఏడాది ఆన్లైన్ హోమ్ టెస్ట్ విధానంలో నిర్వహించబడుతుంది. పరీక్షా 3 గంటల నిడివితో 160 మార్కులకు జరుగుతుంది. క్వశ్చన్ పేపర్లో  మొత్తం 160 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతయి. ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షనల్ సమాధానాలు ఉంటాయి. వాటిలో నుండి ఒక సరైన సమాధానాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది.

సరైన జవాబు గుర్తించిన ప్రశ్నలకు 1 మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నలకు, సమాధానం చేయండి ప్రశ్నలకు ఎటువంటి మార్కులు ఇవ్వబడవు. పరీక్షా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

సబ్జెక్టు/సిలబస్  ప్రశ్నల సంఖ్య మార్కులు
పార్ట్ 1 ఫిజిక్స్ 40 40
పార్ట్ 2 కెమిస్ట్రీ 40 40
పార్ట్ 3 మ్యాథ్స్/బయాలజీ 80 80
మొత్తం 160 160

కేఎల్ఈఈఈ అడ్మిషన్ ప్రక్రియ స్కాలర్షిప్లు

కేఎల్ అడ్మిషన్ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా జరుగుతాయి. ఆన్లైన్ హోమ్ ప్రొటెక్టెడ్ టెస్టులో కనీస అర్హుత మార్కులు సాధించిన అభ్యర్థులను అడ్మిషన్ కోసం పరిగణలోకి తీసుకుంటారు. ప్రవేశ పరీక్షలో టాప్ 3000 మంది బీటెక్ ఆశావహులకు మొదటి ఏడాది ట్యూషన్ ఫీజులో రాయితీ కల్పిస్తారు.

1 నుండి 100 మధ్య ర్యాంకుల సాధించిన విద్యార్థులకు పూర్తి ఫీజు, 101 నుండి 300 మధ్య విద్యార్థులకు 50 శాతం, 301 నుండి 700 మధ్య విద్యార్థులకు 25 శాతం, 701 నుండి 1000 మధ్య ర్యాంకు సాధించిన విద్యార్థులకు 15 శాతం అలానే 1001 నుండి 1200 మధ్య ర్యాంకు సాధించిన విద్యార్థులకు 10 శాతం మొదటి ఏడాది ట్యూషన్ ఫీజు రాయితీ కల్పిస్తారు.

అలానే జేఈఈ మెయిన్ పరీక్షలో 93 నుండి 100 పెర్సెంటైల్ సాధించిన విద్యార్థులకు, ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్ లలో 1 నుండి వెయ్యి లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కూడా మొదటి ఏడాది ట్యూషన్ ఫీజులో 25 నుండి 100 శాతం వరకు రాయితీ అందజేస్తారు.

KLEEE

ప్రవేశాలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం కేఎల్ యూనివర్సిటీ వెబ్సైటును సంప్రదించండి www.kluniversity.in/hdesk.aspx