ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ ఫర్ స్టేట్ పోలీస్ & యూటీ పోలీస్
Scholarships

ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ ఫర్ స్టేట్ పోలీస్ & యూటీ పోలీస్

ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ స్కీమ్ 2006-07 విద్యాసంవత్సరం నుండి ప్రారంభించబడింది. నేషనల్ డిఫెన్స్ ఫండ్ ఆధ్వర్యంలో అమలుచేస్తున్న స్కాలర్షిప్ పథకాన్ని విధి నిర్వహణలో చనిపోయిన లేదా గాయపడిన రాష్ట్ర మరియు కేంద్రపాలిత పోలీస్ కుటుంబాలకు చెందిన విడో మహిళలకు లేదా వారి పిల్లలకు, ఉన్నత విద్య ప్రోత్సహంలో భాగంగా దీన్ని అమలుచేస్తున్నారు.

ఈ పథకం కింద మహిళలకు నెలకు 3,000/- రూపాయలు, పురుషులకు 2,500/- రూపాయలు అందజేస్తున్నారు. ఈ స్కీమ్ కింద ఏడాదికి గరిష్టంగా 2000 స్కాలర్షిప్'లు ప్రకటిస్తున్నారు. ఇందులో 50 శాతం స్కాలర్షిప్'లు మహిళలకు కేటాయిస్తారు.

స్కాలర్షిప్ పేరు ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ ఫర్ స్టేట్ పోలీస్ & యూటీ పోలీస్
ఎవరు అర్హులు  స్టేట్ పోలీస్ & యూటీ పోలీస్ కుటుంబాలకు
దరఖాస్తు ముగింపు తేదీ 15-04-2022
ఢిఫెక్టీవ్ వెరిఫికేషన్ 22-04-2022
ఇనిస్టిట్యూట్ వెరిఫికేషన్ 22-04-2022

ఎలిజిబిలిటీ

నక్సల్స్, ఉగ్రదాడులు లేదా ఎన్నికలు వంటి ప్రభుత్వ సంబంధిత విధి నిర్వహణలో మృతి చెందిన మరియు త్రీవంగా గాయపడిన రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు కుటుంబాలకు చెందిన విడో మహిళలకు లేదా వారి పిల్లలు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అలానే శౌర్య పురస్కారాలు అందుకున్న పోలీస్ ఫోర్సెస్ కుటుంబాలకు చెందిన పిల్లలు, ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ ఫోర్సెస్ కుటుంబాలకు చెందిన పిల్లలు మరియు ప్రస్తుతం విధి నిర్వహణలో ఉండే పోలీస్ ఫోర్సెస్ కుటుంబాలకు చెందిన పిల్లలు కూడా ఈ పథకం కింద అర్హులు.

ఈ పథకం ఇంజనీరింగ్, మెడిసిన్, డెంటల్, వెటర్నరీ, ఫార్మసీ, ఏంసిఏ, ఎంబీఏ, బీఎస్సీ నర్సింగ్ వంటి కోర్సులలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు మాత్రమే వర్తింపజేస్తారు. విద్యార్థి 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి. ఈ పథకం గరిష్టంగా ఐదేళ్లు అందిస్తారు. దీనికోసం అభ్యర్థి ప్రతి ఏడాది రెన్యువల్ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు రెన్యువల్ అయ్యేందుకు, ముందటి ఏడాది అకాడమిక్ పరీక్షలలో 55 శాతం మార్కులు పొంది ఉండాలి.

ఎలా దరఖాస్తు చేయాలి

అర్హులైన విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నుండి ఆన్‌లైన్ విధానంలో  సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఈ కింది ధ్రువపత్రాలను అందుబాటులో ఉండుచుకోవాలి.

  • అకాడమిక్ పాస్ సర్టిఫికెట్లు
  • PPO/డిశ్చార్జ్ సర్టిఫికెట్ (కేటగిరి A నుండి F వరకు)
  • డిజాబిలిటీ సర్టిఫికెట్ (కేటగిరి B & D వాళ్లకు)
  • డెర్త్ సర్టిఫికెట్ (కేటగిరి A & C వాళ్లకు)
  • శౌర్య పురస్కార అవార్డు సర్టిఫికెట్ (కేటగిరి E విద్యార్థులకు)

వివిధ స్థాయిల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం, అర్హులైన విద్యార్థులకు కింది కేటగిరిల ప్రాధాన్యత ఆధారంగా స్కాలర్షిప్ ఆమోదిస్తారు. స్కాలర్షిప్ కోసం ఎంపికైన విద్యార్థులకు ప్రధానమంత్రి రాసిన వ్యక్తిగత లెటర్ అందజేస్తారు.

కేటగిరి A ఉగ్రదాడులలో చనిపోయిన ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ ఫ్యామిలీస్
కేటగిరి B యుద్ధంలో గాయపడిన ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ ఫ్యామిలీస్
కేటగిరి C ప్రభుత్వ సంబంధిత విధి నిర్వహణలో మృతి చెందిన ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ ఫ్యామిలీస్
కేటగిరి D ప్రభుత్వ సంబంధిత విధి నిర్వహణలో గాయపడిన పోలీస్ ఫోర్సెస్ ఫ్యామిలీస్
కేటగిరి E శౌర్య పురస్కారాలు అందుకున్న పోలీస్ ఫోర్సెస్ ఫ్యామిలీస్
కేటగిరి F ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ ఫోర్సెస్ ఫ్యామిలీస్
కేటగిరి G డ్యూటీలో ఉండే పోలీస్ ఫోర్సెస్ ఫ్యామిలీస్

Post Comment