భారతీయ విద్యార్థుల కోసం టాప్ 10 యూఎస్ యూనివర్శిటీలు
Abroad Education

భారతీయ విద్యార్థుల కోసం టాప్ 10 యూఎస్ యూనివర్శిటీలు

ఉన్నత విద్య కోసం అమెరికాకు పోయే భారతీయ విద్యార్థుల కోసం ఆ దేశంలో ఉండే టాప్ యూనివర్శిటీల జాబితాను అందిస్తున్నాం. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నివేదిక ప్రకారం యునైటెడ్ స్టేట్స్‌లో, సుమారు 5,300 కళాశాలలు మరియు 160కి పైగా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇందులో విదేశీ విద్యార్థులకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫర్ చేసే యూనివర్శిటీల కోసం తెలుసుకుందాం.

యూస్‌లో టాప్ 10 యూనివర్శిటీలు

  1. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.
  2. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం.
  3. హార్వర్డ్ విశ్వవిద్యాలయం.
  4. కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.
  5. చికాగో విశ్వవిద్యాలయం.
  6. ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం
  7. కార్నెల్ విశ్వవిద్యాలయం.
  8. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం.
  9. కొలంబియా యూనివర్సిటీ.
  10. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం.

1. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)

మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమెరికాలోని కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్‌లో ఉంది. 1861 లో ప్రారంభించబడిన ఈ విశ్వవిద్యాలయం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ ప్రపంచ అత్యుత్తమ సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఉంది. ప్రధానంగా ఇంజనీరింగ్ మరియు ఫిజికల్ సైన్సెస్‌లో ఇది వరల్డ్ టాప్ యూనివర్శిటీగా వర్థిల్లుతుంది.

క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగులో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రథమస్థానంలో ఉంది. ఎంఐటీ అడ్మిషన్ కోసం అమెరికాతో పాటుగా ప్రపంచ అన్ని దేశాల నుండి అధిక పోటీ ఉంటుంది. వెబ్‌సైట్ : web.mit.edu.

2. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ

స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయాన్ని 1885 లొ లేలాండ్, జేన్ స్టాన్ ఫోర్డ్ దంపతులు స్థాపించారు. ఈ విశ్వవిద్యాలయం యునైటెడ్ స్టేట్స్ లోని కాలిఫోర్నియా రాష్ట్రంలొ ఉంది. ఇది ప్రపంచంలోనే పేరుపొందిన ప్రైవేటు పరిశోధన విశ్వవిద్యాలయాలలో ఒకటిగా వర్థిల్లుతుంది. అడ్మిషన్లు ఆమోదం పొందేందుకు కష్టతరమైన యూనివర్శిటీలలో స్టాన్‌ఫోర్డ్ ఒకటి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగులో స్టాన్ ఫోర్డ్ 3వ స్థానంలో ఉంది.

ఇంటర్నెట్ ప్రపంచ స్థితి గతులను మార్చిన గూగుల్ ప్రయాణం స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో లారీ పేజ్ ఇంకా సర్జీ బ్రిన్ పీహెచ్‌డీ విద్యార్థులుగా ఉన్నప్పుడు ప్రారంభమైంది. ఇదే యూనివర్శిటీ నుండి హ్యూలెట్-ప్యాకార్డ్, సిలికాన్ గ్రాఫిక్స్, సన్ మైక్రోసిస్టమ్స్, సిస్కో, లింక్డ్‌ఇన్, ఇన్‌స్టాగ్రామ్, కోర్స్ఎరా, యాహూ, స్నాప్ చాట్ వంటి కంపెనీలు ప్రారంభమయ్యాయి. వెబ్‌సైట్ : www.stanford.edu

3. హార్వర్డ్ యూనివర్శిటీ

ప్రపంచ అతి పురాతన యూనివర్శిటీలలో హార్వర్డ్ ఒకటి. ఈ విశ్వవిద్యాలయం మసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జ్‌లోని ఒక ప్రైవేట్ ఐవీ లీగ్ పరిశోధనా విశ్వవిద్యాలయంగా 1636లో స్థాపించబడింది. హార్వర్డ్ ప్రతిభావంతులైన విద్యావేత్తలకు, పరిశోధకులకు, ప్రొఫెసర్లకు పుట్టినిల్లు వంటిది. ఈ యూనివర్శిటీ నుండి 48 మంది పులిట్జర్ ప్రైజ్ విజేతలు, 30 మంది దేశాధినేతలు మరియు 45 మందికి పైగా నోబెల్ గ్రహీతలు ఉన్నాయి.

గత 100 ఏళ్ళలో ప్రపంచ టాప్ 5 యూనివర్శిటీలలో జాబితాలో చోటు దక్కించుకున్న యూనివర్శిటీలలో ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ మాత్రమే ఆ ఘనత దక్కించుకున్నాయి. హార్వర్డ్ 50 అండర్ గ్రాడ్యుయేట్,134 గ్రాడ్యుయేట్, 32 కి పైగా ప్రొఫెషనల్ డిగ్రీలను అందించే అతి పెద్ద రెసిడెన్సియల్ పరిశోధనా విశ్వవిద్యాలయంగా ఉంది. ప్రపంచ అతిపెద్ద సోషల్ మీడియా నెట్వర్క్ ఫేస్‌బుక్‌, హార్వర్డ్ యూనివర్సిటీలోనే పురుడుపోసుకుంది. వెబ్‌సైట్ : www.harvard.edu

4. కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది కాలిఫోర్నియాలోని పసాదేనాలో ఉన్న ఒక ప్రైవేట్ పరిశోధనా విశ్వవిద్యాలయం. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థలలో ఇది కూడా ఒకటి. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ ప్రకారం విధానాన్ని ప్రారంభించిన తర్వాత 2011లో మొదటిసారి హార్వర్డ్‌ను ఓడించి అగ్రస్థానంలో నిలిచింది.

కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏరోస్పేస్, అప్లైడ్ మరియు కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, ఆస్ట్రోఫిజిక్స్, బయో ఇంజనీరింగ్, జీవశాస్త్రం, బిజినెస్, ఎకనామిక్స్ మరియు మానేజ్మెంట్, కెమికల్ ఇంజనీరింగ్ వంటి విభిన్న కోర్సులను అందిస్తుంది. అడ్మిషన్లు ఆమోదం పొందేందుకు కష్టతరమైన యూనివర్శిటీలలో కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా ఒకటి. వెబ్‌సైట్ : www.caltech.edu

5. చికాగో యూనివర్శిటీ

యూనివర్శిటీ ఆఫ్ చికాగో అమెరికాలోని ఒక ప్రైవేట్ పరిశోధనా విశ్వవిద్యాలయంగా 1890లో స్థాపించబడింది. యూనివర్శిటీ ఆఫ్ చికాగో ప్రతి సంవత్సరం దరఖాస్తు చేసుకునే మొత్తం దరఖాస్తుదారులలో, కేవలం 6.5% మందికి మాత్రమే అడ్మిషన్లు కల్పిస్తుంది. ప్రపంచ టాప్ 10 యూనివర్శిటీలలో ఇది ఒకటి.

యూనివర్శిటీ ఆఫ్ చికాగోలో అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ సైన్సెస్, బయోలాజికల్ అండ్ బయోమెడికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, కంప్యూటర్ మరియు ఇన్ఫర్మేషన్ సైన్సెస్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ సర్వీస్ ప్రొఫెషన్స్, విదేశీ భాషలు మరియు లిటరేచర్ వంటి విభాగాల్లో విభిన్న కోర్సులను అందిస్తుంద. వెబ్‌సైట్ : www.uchicago.edu

6. ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం

ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్‌లో ఉంది. ఇది 1746లో ఎలిజబెత్‌లో కాలేజ్ ఆఫ్ న్యూజెర్సీగా స్థాపించబడింది. ప్రిన్స్‌టన్ యునైటెడ్ స్టేట్స్‌లో నాల్గవ-పురాతనమైన ఉన్నత విద్యా సంస్థ. అమెరికన్ విప్లవానికి ముందు చార్టర్డ్ చేయబడిన తొమ్మిది కలోనియల్ కాలేజీలలో ఇది ఒకటి. ప్రిన్స్‌టన్‌ బోధన మరియు పరిశోధన విద్యకు పుట్టినిళ్లు.

ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం ఈశాన్య యునైటెడ్ స్టేట్స్‌లోని ఎనిమిది ప్రైవేట్ పరిశోధనా విశ్వవిద్యాలయాల (ఐవీ లీగ్) గ్రూపులో ఉండటంతో అమెరికన్ విద్యార్థుల నుండి సహజంగానే ఈ యూనివర్సిటీ అడ్మషన్ల కోసం పోటీ ఎక్కువ ఉంటుంది.

ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం బయో ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, మెటీరియల్స్ & ప్రొడక్ట్ ఇంజనీరింగ్, ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఆఫ్రికన్ అమెరికన్ స్టడీస్, ఆంత్రోపాలజీ, ఆర్కిటెక్చర్, ఆర్ట్ & ఆర్కియాలజీ, ఆస్ట్రోఫిజికల్ సైన్సెస్, కెమికల్ మరియు బయోలాజికల్ ఇంజనీరింగ్, రసాయన శాస్త్రం, సివిల్ మరియు ఇతర సోషల్ సైన్సెస్ విభాగాల్లో కోర్సులు అందిస్తుంది. వెబ్‌సైట్ : www.princeton.edu

7. కార్నెల్ విశ్వవిద్యాలయం

కార్నెల్ విశ్వవిద్యాలయం న్యూయార్క్‌లో ఉన్న ఒక ప్రైవేట్ ఐవీ లీగ్ పరిశోధన విశ్వవిద్యాలయం. ఇది అండర్ గ్రాడ్యుయేట్‌ మరియు పోస్టుగ్రాడ్యుయేట్ మరియు ప్రొఫెషనల్ కోర్సులకు ప్రసిద్ధి. యూఎస్ ప్రధాన యూనివర్సిటీలలో అడ్మిషన్లు దొరకని విద్యార్థులకు ఆప్షనల్ ఎంపికగా ఉంటుంది. కార్నెల్ విశ్వవిద్యాలయం కూడా ఈశాన్య యునైటెడ్ స్టేట్స్‌లోని ఎనిమిది ప్రైవేట్ పరిశోధనా విశ్వవిద్యాలయాల (ఐవీ లీగ్) గ్రూపులో ఉంది.

కార్నెల్ విశ్వవిద్యాలయం సోషల్ సైన్సెస్ కోర్సులకు ప్రసిద్ధి. ఆఫ్రికనా స్టడీస్, అగ్రికల్చరల్ సైన్సెస్, అమెరికన్ స్టడీస్, యానిమల్ సైన్స్, ఆంత్రోపాలజీ, అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ మేనేజ్‌మెంట్, సోషియాలజీ, ఫ్యాషన్ డిజైన్, హోటల్ మానేజ్మెంట్ వంటి విభిన్న కోర్సులో ఆఫర్ చేస్తుంది. వెబ్‌సైట్ : www.cornell.edu

8. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం

యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ఫిలడెల్ఫియాలోని ఒక ప్రైవేట్ ఐవీ లీగ్ పరిశోధనా విశ్వవిద్యాలయం. ఇది యునైటెడ్ స్టేట్స్‌లో నాల్గవ-పురాతనమైన ఉన్నత విద్యా సంస్థగా గుర్తించబడింది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా 443 అమెరికా జాతీయ విశ్వవిద్యాలయాలలో 7 స్థానంలో ఉంది. పరిశోధన, ఇంటర్న్‌షిప్‌లు మరియు ప్రీ-ప్రొఫెషనల్ అనుభవాలకు ఇది ప్రసిద్ధి.

అత్యధిక మంది విదేశీ విద్యార్థులు అడ్మిషన్ కోసం ప్రయత్నించే యూనివర్శిటీలలో పెన్సిల్వేనియా ఏటా అగ్రస్థానంలో ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ఇంజినీరింగ్, మెడిసిన్, ఎడ్యుకేషన్, లా, సోషల్ సైన్సెస్ కోర్సులకు ప్రసిద్ధి. వెబ్‌సైట్ : www.upenn.edu

9. కొలంబియా యూనివర్సిటీ

కొలంబియా విశ్వవిద్యాలయం న్యూయార్క్ నగరంలోని ఒక ప్రైవేట్ ఐవీ లీగ్ పరిశోధనా విశ్వవిద్యాలయం. 1754లో మాన్‌హట్టన్‌లోని ట్రినిటీ చర్చి మైదానంలో కింగ్స్ కాలేజ్‌గా స్థాపించబడింది.  యూఎస్ యూనివర్సిటీ ర్యాంకింగులో టాప్ 10 లో ఉండగా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగులో ఇది టాప్ 20 జాబితాలో ఉంటుంది.

కొలంబియా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్, ఎకనామెట్రిక్స్ మరియు క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, అకౌంటింగ్ & ఫైనాన్స్, ఆర్ట్స్ & మ్యూజిక్, బిజినెస్, మానేజ్మెంట్, మార్కెటింగ్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, నర్సింగ్ & హెల్త్ వంటి విభాగాల్లో విభిన్న కోర్సులను అందిస్తుంది. వెబ్‌సైట్ : www.columbia.edu

10. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ

జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లోని ఒక ప్రైవేట్ పరిశోధనా విశ్వవిద్యాలయం. ఇది 1876లో స్థాపించబడింది. ఇది అమెరికాలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో ఒకటి.

జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రదానంగా మెడిసిన్ మరియు ఇంజినీరింగ్ కోర్సులకు ప్రసిద్ధి. అయినప్పటికీ సోషల్ సైన్సెస్ మరియు ఆర్ట్స్ అండ్ మ్యూజిక్, లిటరేచర్ విభాగాల్లో విభిన్న కోర్సులను ఆఫర్ చేస్తుంది. వెబ్‌సైట్ : www.jhu.edu

Post Comment