ఆసియా, ఆఫ్రికా తర్వాత ఉత్తర అమెరికా విస్తీర్ణంలో మూడవ అతిపెద్ద ఖండం. ఆసియా, ఆఫ్రికా మరియు ఐరోపా తర్వాత జనాభా ప్రకారం నాల్గవది. దాదాపు 24,709,000 చదరపు కిలోమీటర్లు (9,540,000 చదరపు మైళ్లు), మొత్తం భూభాగంలో 16.5% మరియు దాని మొత్తం ఉపరితలంలో 4.8% విస్తీర్ణంలో ఉంది. ఉత్తర అమెరికా టెక్టోనిక్ ప్లేట్‌లో ఉన్నందున, గ్రీన్‌ల్యాండ్ భౌగోళికంగా ఉత్తర అమెరికాలో భాగంగా చేర్చబడింది.
ఉత్తర అమెరికా తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం, ఆగ్నేయంలో దక్షిణ అమెరికా మరియు కరేబియన్ సముద్రం మరియు పశ్చిమం మరియు దక్షిణాన పసిఫిక్ మహాసముద్రం సరిహద్దులుగా కలిగిఉంది. ఈ ఖండంలో మొత్తం 23 సౌర్వభౌమా దేశాలు ఉన్నాయి. అంతే సంఖ్యలో సార్వభౌమాధికారం లేని భూభాగాలు ఉన్నాయి. సెయింట్ కిట్స్ మరియు నెవిస్ ఉత్తర అమెరికాలో అతి చిన్న దేశంగా ఉంది. కెనడా అతిపెద్ద దేశంగా ఉంది.
ఉత్తర అమెరికా దేశాలు & రాజధానులు
నెం | దేశం | రాజధాని | కరెన్సీ | అధికారిక భాష |
---|---|---|---|---|
1 | అంగుయిల్లా | వ్యాలీ | డాలర్ (XCD) | ఇంగ్లీష్ |
2 | ఆంటిగ్వా & బార్బుడా | సెయింట్ జాన్స్ | డాలర్ (XCD) | ఇంగ్లీష్ |
3 | అరుబా | ఆరంజ్ఎస్తాడ్ | అరుబాన్ ఫ్లోరిన్ (AWG) | డచ్ & పాపిమెంటో |
4 | బహామాస్ | నసావు | డాలర్ (BSD) | ఇంగ్లీష్ |
5 | బార్బడోస్ | బ్రిడ్జ్‌టౌన్ | డాలర్ (BBD) | ఇంగ్లీష్ |
6 | బెలిజ్ | బెల్మోపాన్ | డాలర్ (BZD) | ఇంగ్లీష్ & క్రియోల్ |
7 | బెర్ముడా | హామిల్టన్ | డాలర్ (BMD) | ఇంగ్లీష్ |
8 | బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్ | రోడ్ టౌన్ | డాలర్ (USD) | ఇంగ్లీష్ |
9 | కెనడా | ఒట్టావా | డాలర్ (CAD) | ఇంగ్లీష్ & ఫ్రెంచ్ |
10 | కేమాన్ | జార్జ్ టౌన్ | డాలర్ (KYD) | ఇంగ్లీష్ |
11 | కోస్టా రికా | శాన్ జోస్ | రికాన్ (CRC) | స్పానిష్ |
12 | క్యూబా | హవానా | క్యూబన్ పెసో (CUP) | స్పానిష్ |
13 | కురాకావో | విల్లెంస్టాడ్ | గిల్డర్ (ANG) | పాపిమెంటు, డచ్, ఇంగ్లీష్ |
14 | డొమినికా | రోజౌ | డాలర్ (XCD) | ఇంగ్లీష్ |
15 | డొమినికన్ రిపబ్లిక్ | శాంటో డొమింగో | పెసో ( PDO) | స్పానిష్ |
16 | ఈ ఎల్ సాల్వడార్ | శాన్ సాల్వడార్ | డాలర్ (USD) | స్పానిష్ |
17 | గ్రెనడా | సెయింట్ జార్జ్ | డాలర్ (XCD) | ఇంగ్లీష్ |
18 | గ్వాటెమాల | అలెజాండ్రో | క్వెట్జల్ (GTQ ) | స్పానిష్ |
19 | హైతీ | పోర్ట్ - ప్రిన్స్ | గౌర్డే (HTG) | ఫ్రెంచ్ & క్రియోల్ |
20 | హోండురాస్ | టెగుసిగల్ప | లెంపిరా ( HNL) | స్పానిష్ |
21 | జమైకా | కింగ్స్టన్ | డాలర్ (JMD) | ఇంగ్లీష్ |
22 | మెక్సికో | మెక్సికో సిటీ | మెక్సికన్ పెసో (MXN) | స్పానిష్ |
23 | మోంట్సెరాట్ | ప్లైమౌత్ | డాలర్ (XCD) | ఇంగ్లీష్ |
24 | నికరాగువా | మనగువా | కార్డోబా (NIO) | ఇంగ్లీష్ & స్పానిష్ |
25 | పనామా | పనామా సిటీ | PAB & USD | స్పానిష్ |
26 | ప్యూర్టో రికో | శాన్ జువాన్ | డాలర్ (USD) | స్పానిష్ & ఇంగ్లీష్ |
27 | సెయింట్ బార్తోలోమెవ్ | గుస్తావియా | యూరో (EUR) | ఫ్రెంచ్ |
28 | సెయింట్ కిట్స్ & నెవిస్ | బాసెటెర్ | డాలర్ (XCD) | ఇంగ్లీష్ |
29 | సెయింట్ లూసియా | కాస్ట్రీస్ | డాలర్ (XCD) | ఇంగ్లీష్ |
30 | సెయింట్ మార్టిన్ | మేరిగోట్ | EUR & USD | ప్రెంచ్ |
31 | సెయింట్ విన్సెంట్ & గ్రెనడిన్స్ | కింగ్స్టౌన్ | డాలర్ (XCD) | ఇంగ్లీష్ |
32 | సెయింట్ పియరీ & మిక్వెలాన్ | సెయింట్-పియరీ | EUR & USD | ఫ్రెంచ్ |
33 | ట్రినిడాడ్ & టొబాగో | పోర్ట్ ఆఫ్ స్పెయిన్ | డాలర్ (TTD) | ఇంగ్లీష్ |
34 | టర్క్స్ & కైకోస్ ఐలాండ్స్ | కాక్‌బర్న్ టౌన్ | డాలర్ (USD) | ఇంగ్లీష్ |
35 | యునైటెడ్ స్టేట్స్ (యూఎస్) | వాషింగ్టన్ డిసి | డాలర్ (USD) | ఇంగ్లీష్ |
36 | యూఎస్ వర్జిన్ ఐలాండ్స్ | షార్లెట్ అమాలీ | డాలర్ (USD) | ఇంగ్లీష్ |