డిఫెన్స్ & సెక్యూరిటీ అఫైర్స్ : మార్చి 2022 | తెలుగు కరెంటు అఫైర్స్
Telugu Current Affairs

డిఫెన్స్ & సెక్యూరిటీ అఫైర్స్ : మార్చి 2022 | తెలుగు కరెంటు అఫైర్స్

ఎయిర్ మార్షల్ ప్రభాకరన్'కు ఐఏఎఫ్ పశ్చిమ కమాండ్ బాధ్యతలు

ఎయిర్ మార్షల్ శ్రీకుమార్ ప్రభాకరన్ ఢిల్లీకి చెందిన వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ (డబ్ల్యుఎసి) కమాండ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రభాకరన్ డిసెంబర్ 22, 1983న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యందు ఫైటర్ పైలట్‌గా కెరీర్ ప్రారంభించారు.

వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ అనేది న్యూ ఢిల్లీలో ప్రధాన కార్యాలయం ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ప్రాంతీయ కమాండ్. ఇది పదహారు వైమానిక స్థావరాలను కలిగి ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క అతిపెద్ద మరియు అత్యంత ముఖ్యమైన ఎయిర్ కమాండుగా సేవలు అందిస్తుంది. ఇది ప్రధానంగా ఉత్తర భారతదేశం యొక్క వైమానిక రక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

ఎయిర్ ఫోర్స్ అకాడమీ కమాండెంట్‌గా - బి చంద్ర శేఖర్

ఎయిర్ మార్షల్ బి చంద్ర శేఖర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్ అకాడమీ కమాండెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఎయిర్ మార్షల్ బి చంద్ర శేఖర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాడు. ఈయన 1984 లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో నియమితులయ్యారు. అయన కెరీరులో పైలట్'గా సుమారు 5400 గంటల విమానయానం చేసారు. అలానే ఈయన పేరట సియాచిన్ గ్లేసియర్‌లో మొదటి ఏంఎల్హెచ్ క్లాస్ హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసిన రికార్డు ఉంది. ఈయన సేవలకు గాను అతి విశిష్ట సేవా మెడల్ (AVSM) కూడా అందుకున్నారు.

నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీని ప్రారంభించిన ప్రధాని మోదీ

లావాడ్‌లోని రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం (RRU) యొక్క కొత్త క్యాంపస్ భవన సముదాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో దాని మొదటి స్నాతకోత్సవంలో మోడీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా. గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ మరియు గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

జనరల్ బిపిన్ రావత్'కు యూఎస్ఐ 'చైర్ ఆఫ్ ఎక్సలెన్స్' అంకితం

దివంగత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జనరల్ బిపిన్ రావత్ 65వ పుట్టినరోజు సందర్భంగా, భారత సైన్యం యునైటెడ్ సర్వీస్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా (యుఎస్‌ఐ)లో ఆయన జ్ఞాపకార్థం ఛైర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను అంకితం చేసింది.

భారతదేశపు మొదటి సీడీఎస్ మరియు 27వ భారత ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన దివంగత జనరల్ బిపిన్ రావత్, అత్యుత్తమ డిఫెన్సు నిపుణుడుగా మరియు భారత సైన్యంలోని అత్యంత సమూలమైన పరివర్తనలో మెలిగిన వ్యక్తిగా కీర్తిపొందారు. జనరల్ బిపిన్ రావత్ మెమోరియల్ చైర్ ఆఫ్ ఎక్సలెన్స్ జాయింట్‌నెస్ మరియు ఇంటిగ్రేషన్ రంగంపై దృష్టి పెడుతుంది. ఛైర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది జనరల్ యొక్క తెలివైన నాయకత్వం మరియు వృత్తి నైపుణ్యానికి తగిన నివాళి.

డిఫెన్స్ మినిస్ట్రీ సలహాదారునిగా లెఫ్టినెంట్ జనరల్ వినోద్ జి. ఖండారే

లెఫ్టినెంట్ జనరల్ వినోద్ జి .ఖాండారే (రిటైర్డ్) భారత రక్షణ మంత్రిత్వ శాఖలో సలహాదారుగా నియమితులయ్యారు. 31 జనవరి 2018 లో క్రియాశీల సైనిక సేవ నుండి పదవీ విరమణ పొందిన వినోద్ జి .ఖాండారే, ఆ తర్వాత నుండి 2021 వరకు భారత జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్‌కు సైనిక సలహాదారుగా ఉన్నారు.

Post Comment