Advertisement
ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ 2023 : నోటిఫికేషన్, పరీక్ష తేదీ, ఎలిజిబిలిటీ
Admissions MBA Entrance Exams NTA Exams

ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ 2023 : నోటిఫికేషన్, పరీక్ష తేదీ, ఎలిజిబిలిటీ

ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ 2023 నోటిఫికేషన్ వెలువడింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ఈ పరీక్షను 14 మే 2023 న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను ఫిబ్రవరి 2 నుండి ఏప్రిల్ 27వ తేదీల మధ్య చేపడుతున్నారు.

ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ పరీక్షను బీఎస్సీ హాస్పిటాలిటీ & హోటల్ అడ్మినిస్ట్రేషన్ మరియు వాటి అనుబంధ కోర్సులలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఎన్సీహెచ్ఎమ్-జేఈఈ అనగా నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మానేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని అర్ధం.

ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ 2023

Exam Name NCHM JEE 2023
Exam Type Entrance Exam
Admission For Hotel Management
Exam Date 14 May 2023
Exam Duration 3 Hours
Exam Level National Level

ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ పరీక్షను నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ & క్యాటరింగ్ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్ఎమ్ & సిటీ) సహాయంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఎన్‌సీహెచ్ఎమ్ & సిటీ అనేది ఒక స్వయంప్రతిపత్త సంస్థ. ఇది  భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బీఎస్సీ హాస్పిటాలిటీ & హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులను నిర్వహిస్తుంది.

ఈ పరీక్షలో అర్హుత సాధించడం ద్వారా 21 సెంట్రల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మానేజ్మెంట్, 25 స్టేట్ గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మానేజ్మెంట్, ఒక పబ్లిక్ సెక్టార్ ఇనిస్టిట్యూట్ మరియు మరో 24 ప్రైవేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మానేజ్మెంట్ ఇనిస్టిట్యూట్లలో బీఎస్సీ హాస్పిటాలిటీ & హోటల్ అడ్మినిస్ట్రేషన్ ప్రవేశాలు పొందొచ్చు.

ఈ ఇనిస్టిట్యూట్లు నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ & క్యాటరింగ్ టెక్నాలజీ నియమాల మేరకు విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్'తో పాటుగా ప్రొఫిసనల్ ట్రైనింగ్ అంజేస్తాయి.

ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ వివరాలు

బీఎస్సీ హాస్పిటాలిటీ & హోటల్ అడ్మినిస్ట్రేషన్

బీఎస్సీ హాస్పిటాలిటీ & హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును ఎన్‌సీహెచ్ఎమ్ & సిటీ మరియు ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీ ఉమ్మడిగా అందిస్తున్నాయి. ఈ కోర్సు 3 ఏళ్ళ నిడివితో 6 సెమిస్టర్లుగా ఉంటుంది. ఈ కోర్సు హాస్పిటాలిటీ సెక్టరుకు సంబంధించి విభిన్న అంశాలతో కూడిన పూర్తి ప్రొఫిషినల్ నాలెడ్జ్జ అందిస్తుంది.

కోర్సు పూర్తిఅయ్యే సరికి సదురు అభ్యర్థి మానసికంగా, ప్రాక్టికల్'గా ఆ రంగానికి సంబంధించి పూర్తి నైపుణ్యాన్ని సొంతం చేసుకున్నారు. ప్రాక్టికల్ శిక్షణలో భాగంగా ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ బేవరేజ్ సర్వీస్, ఫాంట్ ఆఫీస్ ఆపరేషన్ మరియు హౌస్ కీపింగ్ అంశాల యందు పూర్తిస్థాయి నైపుణ్యాన్ని అందిస్తారు.

అంతే కాకుండా హోటల్ అకౌంటెన్సీ, ఫుడ్ సేఫ్టీ & క్వాలిటీ, హ్యూమన్ రిసోర్సు మానేజ్మెంట్, ఫెసిలిటీ ప్లానింగ్, ఫైనాన్సిల్ మానేజ్మెంట్, స్ట్రాటజిక్ మానేజ్మెంట్ మరియు టూరిజం మార్కెటింగ్ & మానేజ్మెంట్ అంశాల యందు కూడా శిక్షణ అందిస్తారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ (ఎన్‌సీహెచ్ఎమ్) ఇనిస్టిట్యూట్లలో మొత్తం 6,734 సీట్లు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. ఎన్సీహెచ్ఎమ్-జేఈఈ ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఈ సీట్లు భర్తీ చేస్తారు. తెలుగు రాష్ట్రాల పరిధిలో ఏయే ఇనిస్టిట్యూట్లలో ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయో చూద్దాం.

ఐహెచ్ఏం హైదరాబాద్
వైఎస్ఆర్ నిథమ్
తిరుపతి  ఐహెచ్ఏం
సంగారెడ్డి ఐహెచ్ఏం
శ్రీశక్తి ఐహెచ్ఏం
లియో అకాడమీ
300 సీట్లు
127 సీట్లు
64 సీట్లు
64 సీట్లు
126 సీట్లు
105 సీట్లు

బీఎస్సీ హాస్పిటాలిటీ & హోటల్ అడ్మినిస్ట్రేషన్ కెరీర్ అవకాశాలు

  • మానేజ్మెంట్ ట్రైనీ ఇన్ హోటల్ అండ్ అల్లైడ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ
  • కిచెన్ మానేజ్మెంట్/ హౌస్ కీపింగ్ మానేజ్మెంట్ ట్రైనీ
  • ఫ్లైట్ కిచెన్స్ & ఆన్ బోర్డు ఫ్లైట్ సర్వీసెస్
  • ఇండియన్ నేవీ హాస్పిటాలిటీ సర్వీసెస్
  • గెస్ట్ & కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ ఇన్ హోటల్
  • మానేజ్మెంట్ ట్రైనీ & ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇంటర్నేషనల్ & నేషనల్ ఫాస్ట్ ఫుడ్ చైన్స్
  • హాస్పిటల్ & ఇనిస్టిట్యూషనల్ కేటరింగ్
  • ఫాకల్టీ ఇన్ హోటల్ మానేజ్మెంట్ / ఫుడ్ క్రాఫ్ట్ ఇనిస్టిట్యూట్స్
  • మార్కెటింగ్ & సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇన్ హోటల్స్
  • రైల్వే హాస్పిటాలిటీ & కేటరింగ్ సర్వీసెస్
  • స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్స్
  • షిప్పింగ్ అండ్ కరుయిజ్ లైన్స్
  • రిసార్ట్ మానేజ్మెంట్
  • సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ త్రు ఎంటర్ప్రెన్యూర్షిప్
  • హాస్పిటాలిటీ సర్వీసెస్ ఇన్ మల్టి నేషనల్ కంపెనీస్

ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ ఎలిజిబిలిటీ

  • ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా ఇంటర్/10+2 ఉత్తీర్ణతయి ఉండాలి
  • ఈ కోర్సులకు దరఖాస్తు చేసేందుకు అభ్యర్థుల గరిష్ట వయస్సు 25 ఏళ్ళు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 3 ఏళ్ళ సడలింపు ఉంటుంది
  • దరఖాస్తు చేసే అభ్యర్థులు శారీరకంగా ఫిట్'గా ఉన్నట్లు ఫీజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ అందించాల్సి ఉంటుంది

ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ 2023 మైఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభం 02 ఫిబ్రవరి 2023
దరఖాస్తు చివరి తేదీ 27 ఏప్రిల్ 2023
పరీక్ష తేదీ 14 మే 2023
ఫలితాలు జూన్ 2023

ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ దరఖాస్తు ఫీజు

జనరల్ కేటగిరి 1000/-
ఈడబ్ల్యూఎస్ 700/-
ఎస్సీ, ఎస్టీ, దివ్యంగులు 450/-

పరీక్ష కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ
తిరుపతి హైదరాబాద్, సికంద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్,

ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ దరఖాస్తు ప్రక్రియ

ఎన్‌సీహెచ్ఎమ్ జేఈఈ దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎన్‌సీహెచ్ఎమ్ వెబ్సైటు (www.nchm.nta.nic.in.) ద్వారా దరఖాస్తు సమర్పించాలి. ఎగ్జామ్ బోర్డు కోరిన విద్య, వ్యక్తిగత మరియు చిరునామా సమాచారం ఎటువంటి తప్పులు దొర్లకుండా దరఖాస్తులో పొందుపర్చాలి.

దరఖాస్తు యందు సమర్పించే ఆధార్, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ వివరాలు ఖచ్చితంగా పూరించండి. రిజర్వేషన్ కేటగిరి మరియు పరీక్షా కేంద్రం ఎంపికలో జాగ్రత వహించండి. సంబంధిత అన్ని వివరాలు పొందుపర్చి, అప్లికేషన్ రుసుము చెల్లించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది.

దరఖాస్తు ప్రక్రియ విజయవంతంగా పూర్తియ్యేక వాటిని ప్రింట్ తీసి భద్రపర్చండి. పరీక్షకు వారం రోజుల ముందు ఎన్‌సీహెచ్ఎమ్ లేదా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్సైటులో అడ్మిట్ కార్డు అందుబాటులో ఉంచుతారు.

ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ ఎగ్జామ్ నమూనా

ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ ప్రవేశ పరీక్షా ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారంగా నిర్వహిస్తారు. పరీక్షా ఆబ్జెక్టివ్ పద్దతిలో 200 మార్కులకు జరుగుతుంది. పరీక్షా నిడివి 3 గంటలు ఉంటుంది. ప్రశ్నపత్రంలో మొత్తం 200 ప్రశ్నలు ఐదు సెక్షన్లుగా ఇవ్వబడతాయి. ప్రతి ప్రశ్న నాలుగు ఆప్షనల్ సమాధానాలను కలిగి ఉంటుంది.

సరైన సమాధానం గుర్తించిన ప్రశ్నకు 1 మార్కులు ఇవ్వబడతయి. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నకు 1/4 మార్కు తొలగించబడుతుంది. ప్రశ్నలు న్యూమరికాల్ ఎబిలిటీ & అనలిటికల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ & లాజికల్ డేడిక్షన్, జనరల్ నాలెడ్జ్ & కరెంటు అఫైర్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ సంబంధిత అంశాల నుండి ఇవ్వబడతాయి. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలో అందుబాటులో ఉంటుంది.

సెక్షన్ & సిలబస్ ప్రశ్నల సంఖ్యా మార్కులు సమయం
న్యూమరికాల్ ఎబిలిటీ & అనలిటికల్ ఆప్టిట్యూడ్ 30 30 3 గంటలు
రీజనింగ్ & లాజికల్ డేడిక్షన్ 30 30
జనరల్ నాలెడ్జ్ & కరెంటు అఫైర్స్ 30 30
ఇంగ్లీష్ లాంగ్వేజ్ 60 60
ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ 50 50
మొత్తం ప్రశ్నలు &  మార్కులు 200 200

ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ అడ్మిషన్ విధానం

ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ పరీక్ష పూర్తియిన వారం నుండి పదిరోజుల్లో ఫలితాలు నేషనల్ టెస్టింగ్ వెబ్సైటులో అందుబాటులో ఉంటాయి. NCHM JEE కంప్యూటర్ ఆధారిత పరీక్షలో కనీస అర్హుత మార్కులు సాధించిన వారిని మెరిట్ జాబితా కోసం పరిగణలోకి తీసుకుంటారు.

అభ్యర్థుల షార్ట్ లిస్టులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెక్షన్ యందు ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత అందిస్తారు. ఇంగ్లీష్ సెక్షన్లో మార్కులు సమమైతే ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ సెక్షన్లో అధిక మార్కులు సాధించిన వారికీ ప్రాధాన్యత ఇస్తారు. అప్పటికి సమమైతే ఎక్కువ వయస్సు ఉండే అభ్యర్థులను జాబితాలో అవకాశం కల్పిస్తారు.

మరిన్ని వివరాల కోసం

Contact No. : 0120-6895200
Email : nchm-nta@nic.in

Post Comment