డిఫెన్స్ & సెక్యూరిటీ అఫైర్స్ | ఫిబ్రవరి 2022
Telugu Current Affairs

డిఫెన్స్ & సెక్యూరిటీ అఫైర్స్ | ఫిబ్రవరి 2022

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ డైరెక్టర్‌గా జిఎ శ్రీనివాస మూర్తి

సీనియర్ శాస్త్రవేత్త జిఎ శ్రీనివాస మూర్తి హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) యొక్క డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ (డిఆర్‌డిఎల్) డైరెక్టర్‌గా నియమితులయ్యారు. మాజీ డైరెక్టర్ డాక్టర్ దశరథ్ రామ్ పదవీ విరమణతో ఈ నియామకం చోటుచేసుకుంది. జిఎ శ్రీనివాస మూర్తి 1987లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీలో చేరారు. ఈయన స్ట్రక్చరల్ డైనమిక్స్, గ్రౌండ్ రెసొనెన్స్ టెస్టింగ్, ఎలక్ట్రికల్ ఇంటిగ్రేషన్ రంగాలలో గణనీయమైన కృషి చేశారు.

ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్'గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే

భారత్ సైన్యంలోని అత్యున్నత స్థాయి మార్పుల పరంపరలో, లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే జనవరి 31న పదవీ విరమణ చేసిన లెఫ్టినెంట్ జనరల్ సీపీ మొహంతి నుండి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. దీనికి ముందు, లెఫ్టినెంట్ జనరల్ పాండే తూర్పు ఆర్మీ కమాండర్‌గా బాధ్యతలు నిర్వహించేవారు.

డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కొత్త హెడ్‌గా లెఫ్టినెంట్ జనరల్ జిఎవి రెడ్డి

డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కొత్త హెడ్‌గా లెఫ్టినెంట్ జనరల్ జిఎవి రెడ్డి నియమితులయ్యారు. లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ తర్వాత జనరల్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ భారత సైన్యంలో తన 39 ఏళ్ల కెరీర్‌లో వివిధ వ్యూహాత్మక స్థానాల్లో పనిచేసి పదవీ విరమణ చేశారు.

ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి పదవీ బాధ్యతలను స్వీకరించారు. 1992 బ్యాచ్‌కు చెందిన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇదివరకు రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ డీజీగా ఉన్నారు. ఆయన 1994లో ఉమ్మడి ఏపీలో నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ అదనపు ఎస్పీగా విధుల్లో చేరారు. ప్రస్తుత ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేసి ఆయన స్థానంలో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి నియమించింది.

ఒమన్ నేవీ కమాండర్ అల్ రహ్బీ భారత పర్యటన

రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ (సిఆర్‌ఎన్‌ఓ) కమాండర్ రియర్ అడ్మిరల్ సైఫ్ బిన్ నాసర్ బిన్ మొహ్సిన్ అల్ రహ్బీ భారత్ పర్యటనకు విచ్చేసారు.భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేయడమే లక్ష్యంగా ఆయన పర్యటన ఉండనుంది. రహ్బీ నేతృత్వంలోని నలుగురు సభ్యుల ప్రతినిధి బృందం ఫిబ్రవరి 16 మరియు 17 తేదీల్లో ముంబైలోని వెస్ట్రన్ నేవల్ కమాండ్ హెడ్‌క్వార్టర్‌ను సందర్శించినట్లు నేవీ వర్గాలు వెల్లడించాయి.

ముంబైకి చేరుకోవడానికి ముందు, రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ ప్రతినిధి బృందం న్యూఢిల్లీని సందర్శించి, జాతీయ రక్షణ మరియు అంతర్జాతీయ భద్రతకు సంబంధించిన సీనియర్ అధికారులతో భేటీ అయినట్లు ప్రకటించారు.

ఇండోర్ సెంట్రల్ జైల్లో  'జైల్ వాణి' ఎఫ్ఎం రేడియో ఛానెల్ ప్రారంభం

మధ్యప్రదేశ్‌లోని, ఇండోర్ సెంట్రల్ జైలు తమ సొంత రేడియో ఛానల్ 'జైల్ వాణి-ఎఫ్ఎం 18.77'ని ప్రారంభించింది. ఈ రేడియో ఛానెల్ ద్వారా, జైలు ఖైదీలు రోజువారీ వార్త సమాచారంను తెలుసుకోవడంతో పాటుగా, వారికి సామాజిక సమస్యల సమాచారాన్ని అందించేందుకు ఉపయోగపడనుంది.

సౌదీ అరేబియా ల్యాండ్ ఫోర్స్ కమాండర్ భారత పర్యటన

రాయల్ సౌదీ ల్యాండ్ ఫోర్సెస్ కమాండర్ , లెఫ్టినెంట్ జనరల్ ఫహద్ బిన్ అబ్దుల్లా మొహమ్మద్ అల్-ముటైర్ భారత పర్యటనకు విచ్చేసారు. రాయల్ సౌదీ ల్యాండ్ ఫోర్సెస్ కమాండర్ భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని పెంపొందించడంలో భాగంగా ఈ పర్యటన ఉండనుంది.

ఇండియా ఫస్ట్ 'నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటరుగా' జి అశోక్ కుమార్

భారతదేశం వైస్ అడ్మిరల్ (రిటైర్డ్) జి అశోక్ కుమార్‌ భారతదేశం యొక్క మొదటి జాతీయ సముద్ర భద్రతా సమన్వయకర్తగా నియమితులయ్యారు. ఇది 26/11 ముంబై ఉగ్రదాడి జరిగిన 14 ఏళ్ల తర్వాత సముద్ర భద్రతను పెంపొందించుకోవడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నంగా భావించవచ్చు.

బంగాళాఖాతంలో భారత నావికాదళపు మిలాన్ ఎక్సరసైజ్ 2022

భారత నావికాదళం యొక్క తాజా ఎడిషన్ MILAN 2022 యొక్క బహుపాక్షిక వ్యాయామం విశాఖపట్నంలోని 'సిటీ ఆఫ్ డెస్టినీ'లో ఫిబ్రవరి 25 న ఘనంగా ప్రారంభమైంది. మిలాన్ 22 రెండు దశల్లో 9 రోజుల వ్యవధిలో నిర్వహించబడుతోంది, హార్బర్ దశ ఫిబ్రవరి 25 నుండి 28 వరకు మరియు సీ ఫేజ్ 01 నుండి 04 మార్చి వరకు జరగనున్నాయి. మిలాన్ ఎక్సరసైజ్ 1995లో మొదటిసారి ప్రారంభమైంది. భారత నావికాదళం ప్రారంభించిన ద్వైవార్షిక బహుపాక్షిక నౌకాదళ వ్యాయామ ప్రారంభ కార్యక్రమంలో ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక మరియు థాయ్‌లాండ్ దేశాలు మాత్రమే పాల్గున్నాయి. ప్రస్తుతం ఈ కార్యక్రమంలో 40కి పైగా దేశాలు పాల్గునంటున్నాయి.

One Comment

Post Comment