Advertisement
కెనడాలో హయ్యర్ ఎడ్యుకేషన్ : కోర్సులు, వీసా ప్రక్రియ, స్కాలర్‌షిప్‌లు
Abroad Education

కెనడాలో హయ్యర్ ఎడ్యుకేషన్ : కోర్సులు, వీసా ప్రక్రియ, స్కాలర్‌షిప్‌లు

విదేశీ విద్యార్థును రోజుకో కొత్త నిబంధనతో బెంబేలెత్తిస్తున్న అమెరికాను చూసి, చాలా మట్టుకు విదేశీ విద్యార్థులు మనసు మార్చుకుంటున్నారు. గత మూడు, నాలుగేళ్లుగా ఉన్నత విద్య కోసం కెనడాకు వెళ్లే విద్యార్థుల సంఖ్యా క్రమంగా పెరుగుతూ వస్తుంది. గత మూడేళ్ళలో కెనడాకు 4 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యకోసం వెళ్లగా, అందులో 50 నుండి 60 వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు.

ఈ ఒక్క కారణమే కాకుండా యూఎస్, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలతో పోల్చుకుంటే తక్కువ ట్యూషన్ ఫీజులు, సులభతరమైన స్టడీ పర్మిషన్ విధానం, స్కాలర్‌షిప్‌లు, ఉద్యోగ అవకాశాలు, అక్కడే సెటిల్ అయ్యే సౌలభ్యం ఉండటం వంటి అనేక అంశాలు భారతీయ విద్యార్థులను కెనడా వైపు ఆకర్షితం అయ్యేందుకు దోహదం చేస్తున్నాయి.

కెనడాలో ఉన్నత విద్య

ఇటీవలే కాలంలో కెనడా ప్రభుత్వం తీసుకొచ్చిన Canadim’s International Student Program, ఉన్నత విద్య కోసం వచ్చే విద్యార్థులకు స్టడీ పర్మిట్ నుండి శాశ్వత కెనడినుగా మారేంతలా సహాయ సహకారాలు అందిస్తున్నది. వాటికీ సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందా. ఈ ప్రక్రియ మొత్తం మూడు దశల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది.

  1. Choose a Program (కోర్సు ఎంపిక)
  2. Apply to the School (అడ్మిషన్ కోసం దరఖాస్తు)
  3. Apply for a Study Permit (వీసా కోసం దరఖాస్తు)

Choose a Program

దేశం విడిచి, విదేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్తున్నాము అంటే, దానికి సంబంధించి బలమైన కారణం ఉండాలి. అందులో ప్రధానమైనది మీరు ఎంపిక చేసుకునే స్టడీ ప్రోగ్రాం. మెజారిటీ విదేశీ యూనివర్సిటీలు స్పెషలైజ్డ్ కోర్సులను ఎంపిక చేసుకునే విద్యార్థులకు మాత్రమే త్వరితగతిన అడ్మిషన్లు కల్పిస్తాయి. ఈ కోర్సు కోసం ఇంత దూరం వస్తున్నాడా అనే కోర్సులకు అడ్మిషన్లు కల్పించావు. వీసా జారీచేసే అధికారులు కూడా దీని కోసమే ఎక్కువ వాకాబు చేస్తారు. ఇదంతా ఉన్నత విద్య పేరుతో, విహారానికి వచ్చే విద్యార్థులను జల్లెడపట్టే ప్రక్రియలో భాగం. కావున మీరు ఎంపిక చేసుకునే కోర్సు. దానికి చెందిన భవిష్యత్ ప్రణాళిక పై మీకు స్ఫష్టమైన అవగాహనా ఉండాలి.

Apply to the School

కోర్సు ఎంపిక జరిగాక విదేశీ విద్యార్థులకు కోర్సులు అందించే యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకోవాలి. Designated learning institutions list లో ఉండే యూనివర్శిటీలు మాత్రమే విదేశీ విద్యార్థులకు అడ్మిషన్లు కలిపించే అనుమతి కలిగి ఉంటాయి. అడ్మిషన్ పొందిన విద్యార్థులకు యూనివర్శిటీలు కోర్సు అంగీకార లేఖ అందిస్తాయి. వీసా లేదా స్టడీ పర్మిట్ పొందేందుకు ఈ యూనివర్సిటీ అంగీకార లేఖ (Letter of acceptance) ఉండాలి.

ప్రవేశ పరీక్షలు

ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ ఉత్తీర్ణత తప్పనిసరి

యూనివర్సిటీల నుండి Letter of acceptance పొందాలంటే విద్యార్థి IELTS (International English Language Testing System), TOEFL (Test of English as a Foreign Language), PTE (Pearson Test of English) వంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అర్హుత పరీక్షలలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. మెజారిటీ కెనడా యూనివర్సిటీలు IELTS స్కోరును ప్రామాణికంగా తీసుకుంటాయి.  6 to 7.5 మధ్య IELTS స్కోరు సాధించిన విద్యార్థులకు అడ్మిషన్ దొరికే అవకాశం ఉంటుంది.

Apply for a Study Permit

యూనివర్శిటీ నుండి Letter of acceptance అందిన వెంటనే స్టడీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత ధ్రువపత్రాలతో కెనడా ఇమ్మిగ్రేషన్ పోర్టల్ లేదా దగ్గరలో ఉండే వీసా అప్లికేషన్ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసే వారు ఇమిగ్రేషన్ పోర్టల్ యందు రిజిస్టర్ అవ్వాలి. దరఖాస్తు అందిన తర్వాత బయోమెట్రిక్ మరియు ఇమిగ్రేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ కోసం కబురు చేస్తారు. ఇదే సందర్భలో వీసా అధికారి దరఖాస్తు పరిశీలన చేస్తారు. దరఖాస్తులో ఉండే అంశాలు, విద్యార్థి చెప్పే సమాదానాలు ద్వారా వీసా అధికారి సంతృప్తి పొందితే 3 నుండి 4 వారాలలో స్టడీ పర్మిట్ జారీచేస్తారు.

భారతీయ విద్యార్థులకు  Student Direct Stream (SDS) ద్వారా దరఖాస్తు చేసిన 20 రోజులలోపు స్టడీ పర్మిట్ అందిస్తున్నారు. స్టడీ పర్మిట్ కేవలం యూనివర్సిటీ యందు కోర్సు చేసేందుకు మాత్రమే ఉపయోగ పడుతుంది. దీనికి అదనంగా ట్రావెల్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం గాబరా పడాల్సిన అవసరంలేదు. స్టడీ పర్మిట్ పొందిన విద్యార్థులకు వీసా అధికారుల ద్వారా ట్రావెల్ వీసా అందిస్తారు.

క్యూబిక్ సిటీ యూనివర్శిటీలలో అడ్మిషన్ కోసం ప్రయత్నించేవారు ఆ దేశ యూనివర్సిటీల నుండి Certificat d’acceptation du Quebec (CAQ) పొందాల్సి ఉంటుంది. ఈ అంగీకార పత్రం ద్వారా ఆ దేశ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ దేశంలో ఉన్నత విద్య పూర్తిచేయాలంటే ప్రెంచ్ బాష మాట్లాడటం, చదవడం, రాయడం తెలిసి ఉండాలి.

వీసా టైప్ స్టడీ పర్మిట్ ఫీజు వీసా కాలపరిమితి Quebec visa fee
స్టడీ పర్మిట్ $ 160 5 Years $ 117

స్టడీ పర్మిట్ ఆమోదం పొందేందుకు కావాల్సిన డాక్యూమెంట్స్

  • ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేసుకున్న యూనివర్సిటీ నుండి Acceptance Letter.
  • కోర్సు పూర్తిచేసినందుకు అవసరమయ్యే ఆర్థిక వనరులు కలిగి ఉన్నట్లు ఖచ్చితమైన లెక్కలతో ఫైనాన్స్ రిపోర్టు.
  • ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
  • ఆధార్/ పుట్టిన తేదీ ధ్రువపత్రం, పెళ్ళైన వారు మ్యారేజ్ సర్టిఫికెట్.
  • 6 నెలల ముందుగా ఆమోదం పొందినా పాసుపోర్టు.
  • నేర చరిత్ర లేనట్లు police certificates.

5 Most recognized schools in canada

  1. University of Toronto (UofT)
  2. University of British Columbia (UBC)
  3. McGill University
  4. Université de Montreal (UdeM)
  5. McMaster University

Cost of study in canada

యూఎస్, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలతో పోల్చుకుంటే కెనడా స్టడీ బడ్జెట్ 30% నుండి 40% తక్కువ ఉంటుంది. కెనడాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను $13,000 నుండి $20,000 డాలర్ల వరకు, పోస్టుగ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ $17,000 నుండి  $25,000 డాలర్లతో పూర్తిచేయొచ్చు. వీసా చార్జీలు కూడా ఇతర దేశాలతో పోల్చుకుంటే చాల తక్కువ, అలానే నెలవారీ జీవన వ్యయాల బడ్జెట్ కూడా $15,000 నుండి $17,000 డాలర్లకు మధ్యలోనే వుంటుంది. సాధారణ ఇండియన్ ప్రీమియం ఇనిస్టిట్యూట్ పెట్టె ఖర్చుతో కెనడాలో ఉన్నత విద్య పూర్తిచేయొచ్చు.

విదేశీ విద్యార్థులకు యూనివర్సిటీ పరిధిలో వారానికి 20 గంటల వరకు పార్ట్ టైమ్ జాబ్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. వేసవి సెలవులు, ఇతర సెలవు దినాలలో పూర్తిస్థాయి ఉద్యోగం చేసే అవకాశం కూడా ఉంటుంది. అలానే కెనడా ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్‌లు, ఇతర విద్యా రాయితీలు, విదేశీ విద్యార్థులకు కొంతలో కొంత ఉపశమనం కల్గిస్తాయి.

Study program Average annual fee
Undergraduate program $13,000 to $20,000
Postgraduate master's degree $17,000 to $25,000
Doctoral degree $7,000 to $15,000
Management programs $30,000 to $40,000
Living expenses Average Budget 
Accommodation $400 to $700 pm
Living costs Up to $15,000 pm
visa and permit $150
Health & insurance $600 and $900 per year

Scholarships & Education Loans

Post Comment