Advertisement
పెస్ శాట్ ఎగ్జామ్ 2023 : రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ తేదీ, ఎగ్జామ్ ఫార్మేట్
Admissions Engineering Entrance Exams MBA Entrance Exams

పెస్ శాట్ ఎగ్జామ్ 2023 : రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ తేదీ, ఎగ్జామ్ ఫార్మేట్

పెస్ శాట్ పరీక్షను పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ యూనివర్సిటీలో వివిధ యూజీ, పీజీ కోర్సుల యందు అడ్మిషన్లు కల్పించేందుకు నిర్వహిస్తారు. పెస్ శాట్ అనగా పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని అర్ధం.

బెంగుళూరు ప్రధాన కేంద్రగా నడుస్తున్న ఈ యూనివర్సిటీ, ఉన్నత విద్యను అందిస్తున్న ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించి కర్ణాటకలో నెంబర్ వన్ స్థానంలో ఉంది.  ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, మానేజ్మెంట్, ఫార్మసీ, లా, డిజైనింగ్ వంటి విభిన్న యూజీ, పీజీ కోర్సులు అందిస్తుంది.

పెస్ శాట్ 2023

Exam Name PESSAT 2023
Exam Type Admission
Admission For UG & PG Courses
Exam Date May 17th, 2023 O/W
Exam Duration 3 Hours
Exam Level University Level

పెస్ యూనివర్సిటీ అడ్మిషన్ టెస్ట్

పెస్ యూనివర్సిటీ అందిస్తున్న ఇంజనీరింగ్ కోర్సులు

సివిల్ ఇంజనీరింగ్
మెకానికల్ ఇంజనీరింగ్
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
బయోటెక్నాలజీ
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

పెస్ శాట్ 2022 షెడ్యూల్

పెస్ శాట్ రిజిస్ట్రేషన్ గడువు 16 మే 2023
పెస్ శాట్ ఎగ్జామ్ తేదీ 17 మే - 04 జూన్ 2023
పెస్ శాట్ ఫలితాలు 07 జులై 2023
పెస్ శాట్ కౌన్సిలింగ్ 17 జూన్ 2023 O/W

పెస్ శాట్ ఎలిజిబిలిటీ

  • జనరల్ యూజీ కోర్సులలో చేరేందుకు 60 శాతం మార్కులతో ఇంటర్/10+2 ఉత్తీర్ణతయి ఉండాలి
  • బీటెక్ కోర్సుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీలో ఉత్తీర్ణతయి ఉండాలి
  • బయోటెక్నాలజీ కోర్సుల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ/ఎంపీసీలో ఉత్తీర్ణతయి ఉండాలి
  • పీజీ కోర్సులలో చేరేందుకు సంబంధిత బ్యాచిలర్ డిగ్రీలలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి

పెస్ శాట్ దరఖాస్తు ఫీజు & ఎగ్జామ్ సెంటర్లు

దరఖాస్తు రుసుములు పరీక్షా కేంద్రాలు
అప్లికేషన్ ఫీజు : 1050 /- బెంగుళూరు, చెన్నై, విజయవాడ & హైదరాబాద్

పెస్ శాట్ దరఖాస్తు ప్రక్రియ

పెస్ శాట్ పరీక్ష రాసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు పీఈఎస్ యూనివర్సిటీ అధికారిక వెబ్సైటు (www.pessat.com/) ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. అప్లికేషన్లో మీ సంబంధిత వ్యక్తిగత, విద్య మరియు చిరునామ వివరాలు ఎటువంటి తప్పులు దొర్లకుండా పొందుపర్చాల్సి ఉంటుంది.

అలానే మీ పొందుపర్చిన వివరాలకు సంబంధించి ధ్రువపత్రాలు, మీ ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత దశలో అందుబాటులో ఉన్న పేమెంట్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తివుతుంది.

పెస్ శాట్ ఎగ్జామ్ నమూనా

పెస్ శాట్ ప్రవేశ పరీక్ష ఆన్లైన్ విధానంలో నిర్వహించబడుతుంది. పరీక్షా 180 నిముషాల నిడివితో 180 మార్కులకు జరుగుతుంది. క్వశ్చన్ పేపర్లో ఎంపిక చేసుకున్న కోర్సు సంబంధిత గ్రూపుల నుండి మొత్తం 180 మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు ఇవ్వబడతయి. ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షనల్ సమాధానాలు ఉంటాయి.

వాటిలో నుండి ఒక సరైన సమాధానాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. సరైన జవాబు గుర్తించిన ప్రశ్నలకు 1 మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానం గుర్తించిన ప్రశ్నలకు, సమాధానం చేయని ప్రశ్నలకు ఎటువంటి మార్కులు ఇవ్వబడవు. పరీక్షా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

సబ్జెక్టు/సిలబస్ ప్రశ్నలు మార్కులు
పార్ట్ 1 ఇంగ్లీష్ 20 20
పార్ట్ 2 ఫిజిక్స్ 60 60
పార్ట్ 3 కెమిస్ట్రీ 40 40
పార్ట్ 4 మ్యాథ్స్ 60 60
మొత్తం 180 180

పెస్ శాట్ హెల్ప్ లైన్ సమాచారం

PES University
100 Feet Ring Road
BSK III Stage, Bangalore – 560085
+91 80 26721983, +91 80 26722108
admissions@pes.edu

Post Comment