Advertisement
తెలుగు విద్యార్థుల కోసం 20 ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు 2023
Admissions Engineering Entrance Exams MBA Entrance Exams

తెలుగు విద్యార్థుల కోసం 20 ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు 2023

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులకు అందుబాటులో ఉండే టాప్ 20 ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల వివరాలు తెలుసుకోండి. జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ పరీక్షతో పాటుగా వివిధ ప్రైవేట్ మరియు డ్రీమ్డ్ యూనివర్సిటీలు నిర్వహించే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు అలానే రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే ఎంసెట్ తో పాటుగా ఇతర ఇంజనీరింగ్ ప్రవేశపరీక్షల వివరాలు పొందండి.

1. జేఈఈ మెయిన్ ఎగ్జామ్

JEE Main - Exam Date, Eligibility, Registrationదేశంలో నిర్వహించే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలలో ఆదరణ పరంగా, క్లిష్టత పరంగా జేఈఈ మెయిన్ ప్రధమ స్థానంలో ఉంటుంది. దేశంలో ఉన్న ఎన్ఐటీలు, ఐఐఐటీలు, సీఎఫ్ఐటీలలో చేరేందుకు జేఈఈ మెయిన్ పరీక్షలో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష ద్వారా  ప్రధానంగా  బీఈ/బీటెక్, బ్యాచలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మరియు బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఎన్ఐటీలు, ఐఐఐటీలు, సీఎఫ్ఐటీలలో మాత్రమే కాకుండా జేఈఈ మెయిన్ అర్హుతతో దేశంలో ఉండే అన్ని ప్రముఖ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో అడ్మిషన్ పొందొచ్చు. అలానే జేఈఈ అడ్వాన్సడ్ రాయాలనుకునే వారు జేఈఈ మెయిన్స్ క్వాలిఫై అవ్వటం తప్పనిసరి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ప్రవేశ పరీక్ష గురించి సవివరంగా తెలుసుకుందాం.

2. జేఈఈ అడ్వాన్సుడ్ ఎగ్జామ్

JEE Advanced - Exam Date, Eligibility, Registrationజేఈఈ అడ్వాన్సుడ్ పరీక్షను ఐఐటీల్లో ఇంజనీరింగ్ మరియు ఆర్కిటెక్చర్ ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించబడుతుంది. యేటా మే లేదా జూన్ లో జరిగే ఈ ప్రవేశ పరీక్షకు దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయస్థాయిలో డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయస్థాయి మౌళిక సదుపాయాలతో అత్యున్నత సాంకేతిక విద్యని అందిస్తున్న ఐఐటీల్లో చేరేందుకు ఆశావాహుల సంఖ్యా లక్షల్లో ఉంటుంది.

జేఈఈ అడ్వాన్సుడ్ ద్వారా ఐఐటీల్లో చదివే విద్యార్థులు నాణ్యమైన సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవటమే కాకుండా కెరీర్ పరంగా టాప్ అంతర్జాతీయ సంస్థలలో పని చేసే అవకాశం ఉన్నందున ఐఐటీల్లో చేరేందుకు యేటా విద్యార్థులు తీవ్రమైన పోటీతత్వంతో సన్నద్ధమౌతారు.

3. గేట్ ఎగ్జామ్

GATE 2023 Exam Date, Application, Notificationగేట్ పరీక్షను గ్రాడ్యుయేట్ స్థాయిలో ఉండే ఇంజనీరింగ్ పాఠ్యాంశాల యందు విద్యార్థుల యొక్క విషయ పరిజ్ఞానం మరియు వాటి యందు వారికున్న అవగహన సామర్ధ్యాన్ని పరీక్షించేందుకు నిర్వహిస్తారు. గేట్ అనగా గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ అని అర్ధం.

గేట్ పరీక్షను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (IISc) మరియు దేశంలో ఉండే ఎనిమిది అత్యున్నత ఐఐటీలు అయినా బెంగళూరు, బొంబై, ఢీల్లీ, కాన్పూర్, గౌహతి , ఖరగపూర్, మద్రాస్, రూర్కీ కలిసి ఉమ్మడిగా జాతీయస్థాయిలో నిర్వహిస్తాయి.

దేశ వ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉన్నా ఈ అర్హుత పరీక్ష లో అర్హుత సాధిస్తే ఇంజనీరింగ్ విద్యార్థుల ఉజ్వల భవితకు పునాది వేసినట్లు అవుతుంది. ఇలాంటి ఎన్నో బహుళ ప్రయోజనాలను సమకూర్చే ఈ ఇంజనీరింగ్ అర్హుత పరీక్ష కోసం వివరంగా తెల్సుకుందాం.

10. ఏయూఈఈటీ ఎగ్జామ్

AUEET Exam Date, Application, Notificationఏయూఈఈటీ పరీక్షను ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్ క్యాంపసులో మరియు అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆరేళ్ళ ఇంజనీరింగ్ డ్యూయల్ డిగ్రీ కోర్సులల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఈ కోర్సులో మొదటి నాలుగేళ్లు బీటెక్, చివరి రెండేళ్లు ఎంటెక్ డిగ్రీ అందిస్తారు.

నాలుగేళ్ళ ఇంజీనిరింగ్ కోర్సు పూర్తిచేసి బయటకు పోయే విద్యార్థులకు బీటెక్ పట్టా మాత్రమే అందిస్తారు. ఇంటర్మీడియట్ ఎంపీసీ యందు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు దరఖాస్తు చేసుందుకు అర్హులు. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

11. బిట్‌శాట్‌ ఎగ్జామ్

BITSAT Exam Date, Application, Notificationబిట్‌శాట్‌ పరీక్షను బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ యందు ఇంజనీరింగ్ మరియు ఇతర గ్రాడ్యుయేషన్ కోర్సుల యందు అడ్మిషన్లు కల్పించేందుకు నిర్వహిస్తారు.  ప్రైవేట్ రంగంలో ఇంజనీరింగ్ విద్య అంటే టక్కున గుర్తొచ్చేది బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్). దేశంలో ఒకానొక గొప్ప డ్రీమ్డ్ యూనివర్సిటీగా వర్థిల్లుతున్న బిట్స్ యందు ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఈ పరీక్ష రాయాల్సిందే.

బిట్స్ క్యాంపస్లు దేశవ్యాప్తంగా పిలానీ, గోవా, హైదరాబాద్‌తో సహా దుబాయ్ యందు కూడా అందుబాటులో ఉన్నాయి. బిట్స్ ఇంజనీరింగులో అత్యుత్తమ విద్యకు, పరిశోధనలకు పెట్టింది పేరు. ఐఐటీలు, ఎన్ఐటీల తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు బిట్స్ యందు ఇంజనీరింగ్ చేసేందుకు మక్కువ చూపిస్తారు.

12. వీటీఈ ఎగ్జామ్

VITEEE Exam Date, Application, Notificationవీటీఈ ప్రవేశ పరీక్షను వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) లో ఇంజనీరింగ్ మరియు ఇతర అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల యందు అడ్మిషన్ కల్పించేందుకు నిర్వహిస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విన్నూత పరిశోధనాత్మక ఇంజనీరింగ్ కోర్సులకు వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నెలవు.

వెల్లూరు ఇనిస్టిట్యూట్, నాణ్యమైన ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యను అందిస్తున్న ప్రైవేట్ ఇంజనీరింగ్ యూనివర్సిటీలలో ముందు వరుసలో ఉంటుంది. విట్ అంతర్జాతీయంగా వందల సంస్థలతో సంబంధాలు కలిగిఉండటమే కాకుండా ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు క్యాంపస్ ప్లేసెమెంట్స్ కల్పించటంలో దేశంలోనే నెంబర్ 1 ఇనిస్టిట్యూటుగా ప్రసిద్ధికెక్కింది.

వరుసగా 7 ఏళ్ళు అత్యధిక ఉద్యోగాలు కల్పించిన ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూటుగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ యందు  ప్రవేశించింది. వెల్లూరు ఇనిస్టిట్యూటుకు దేశవ్యాప్తంగా వెల్లూరు (కర్నాటక), చెన్నై (తమిళనాడు), అమరావతి (ఆంధ్రప్రదేశ్) మరియు భోపాల్ (మధ్యప్రదేశ్) లో  క్యాంపసులు ఉన్నాయి. ఈ నాలుగు క్యాంపస్ల యందు వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (విట్ఈఈఈ) ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు.

13. ఎస్ఆర్ఎం జేఈఈఈ ఎగ్జామ్

SRM JREEE notification, B.Tech Admission Openశ్రీ రామస్వామి మెమోరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహించే ఎస్ఆర్ఎం జేఈఈఈ 2023 నోటిఫికేషన్ వెలువడింది. ఇంజనీరింగ్ మరియు ఇతర అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల యందు అడ్మిషన్ కల్పించేందుకు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు.

బిట్స్ పిలానీ, వెల్లూరు ఇనిస్టిట్యూట్ తర్వాత తెలుగు విద్యార్థులు అధిక ప్రధాన్యత ఇచ్చే ప్రైవేటు యూనివర్సిటీల జాబితాలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంటుంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అంతర్జాతీయ వసతులతో నాణ్యమైన సాంకేతిక విద్యని అందించటంతో పాటుగా, తమ విద్యార్థులకు ఉన్నత కొలువులు కల్పించడంలో ఇతర యూనివర్సిటీలతో పోటీపడుతోంది.

ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 80 శాతం విద్యార్థులు బయట రాష్ట్రాలు, బయట దేశాల నుండి వచ్చిన వారే ఉన్నారంటే, ఈ యూనివర్సిటీ ఉన్న ప్రాధాన్యతను అర్ధం చేసుకోవచ్చు. ఎస్ఆర్ఎంకు  దేశవ్యాప్తంగా చెన్నై, అమరావతి, హర్యానా మరియు సిక్కిం నగరాల యందు క్యాంపస్లు ఉన్నాయి. అన్ని క్యాంపసులలో కలిపి మొత్తం 7000 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

14. మణిపాల్ మెట్ ఎగ్జామ్

Manipal MET - Registration, Eligibility, Exam Dateమెట్ (MET) పరీక్షను మణిపాల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మరియు ఫార్మసీకి సంబంధించిన యూజీ, పీజీ కోర్సులలో అడ్మిషన్లు చేపట్టేందుకు నిర్వహిస్తారు. దేశీయంగా అంతర్జాతీయ వసతులతో ఉన్నత విద్యను అందించే ప్రైవేట్ యూనివర్సిటీలలో మణిపాల్ ముందు వరుసలో ఉంటుంది.

మణిపాల్ యూనివర్సిటీ పరిశోధనాత్మక ఉన్నత విద్యకు పెట్టింది పేరు. ఈ యూనివర్సిటీ అందించే ఇంజనీరింగ్, మెడికల్ మరియు ఫార్మసీ కోర్సులకు విద్యార్థుల నుండి భారీ డిమాండ్ ఉంటుంది. మణిపాల్ ప్రధాన క్యాంపస్ కర్ణాటకలోని ఉడిపిలో ఉండగా, జైపూర్,  సిక్కింలో అనుబంధ క్యాంపసులను కలిగి ఉంది. అలానే ఇండియాలోనే కాకుండా మణిపాల్ మలేషియా, దుబాయిలలో బ్రాంచులను కలిగిఉంది.

15. అమృత ఏఈఈఈ ఎగ్జామ్

AEEE - Registration, Eligibility, Exam Dateఏఈఈఈ పరీక్షను అమృత విద్యా పీఠంలో బీటెక్ అడ్మిషన్లు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఏఈఈఈ అనగా అమృత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని అర్ధం. దేశంలో ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్న ప్రైవేట్ యూనివర్సిటీలలో 95 శాతం ప్లేస్మెంట్లతో అమృత విద్యా పీఠం ప్రధమ స్థానంలో ఉంది.

ఐఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగులో అమ్రిత 4వ స్థానంలో ఉండగా, దేశంలో ఉన్నత విద్యకు సంబంధించి టైమ్స్ ఇచ్చిన ర్యాంకింగులో దేశంలో ప్రధమ స్థానం దక్కించుకుంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, సిస్కో వంటి 200 పైగా కంపెనీలు అమ్రితలో తరుచు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందించేందుకు ముందుకు వస్తున్నాయ్యంటే వారిచ్చే క్వాలిటీ ఎడ్యుకేషన్ గూర్చి అర్థంచేసుకోవచ్చు.

అమృత విద్యాలయంకు దేశ వ్యాప్తంగా 6 క్యాంపస్‌లు ఉన్నాయి. ప్రధాన క్యాంపస్ అమృతపురి కాకుండా బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, మైసూరు మరియు కొచ్చిలో అనుబంధ క్యాంపసులు కలిగిఉంది. ఇందులో అమ్రితపురి, బెంగళూరు, చెన్నై మరియు కోయంబత్తూరులో ఇంజనీరింగ్ విద్యను అందిస్తుంది.

16. ఎల్‌పీయూ నెస్ట్ ఎగ్జామ్

LPUNEST - Registration, Eligibility, Exam Dateలవ్లీ ప్రొఫిషినల్ యూనివర్సిటీ బీటెక్ మరియు ఇతర కోర్సుల అడ్మిషన్లకు సంబంధించి నిర్వహించే ఎల్‌పీయూ నెస్ట్ 2023 నోటిఫికేషన్ వెలువడింది. పరీక్షను ఏప్రిల్ 5 నుండి ఏప్రిల్ 30 మధ్యలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎల్‌పీయూ నెస్ట్ ద్వారా లవ్లీ ప్రొఫిషినల్ యూనివర్సిటీ యందు బీటెక్ కోర్సులకు అడ్మిషన్లు కల్పించడంతో పాటుగా మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందజేస్తారు. పంజాబ్ కేంద్రంగా 2005 నుండి విద్య సేవలు అందిస్తున్న లవ్లీ ప్రొఫిషినల్ యూనివర్సిటీ దేశంలో అత్యధిక కేటగిర్లలో విభిన్న కోర్సులను అందిస్తున్న ప్రైవేట్ యూనివెర్సిటీగా పేరుగాంచింది.

ఎల్‌పీయూ నెస్ట్ పరీక్షకు ఏటా దాదాపు 50 వేలకు పైగా విద్యార్థులు హాజరవుతున్నారు. ఈ ప్రవేశ పరీక్షలో టాప్ మెరిట్ సాధించిన పేద విద్యార్థులకు ట్యూషన్ ఫీజులో 40% స్కాలర్షిప్ రూపంలో అందజేస్తారు.

17. గీతం అడ్మిషన్ టెస్ట్

GAT - Registration, Eligibility, Exam Dateగాట్ (GAT) ప్రవేశ పరీక్షను గీతం యూనివర్సిటీలో వివిధ యూజీ మరియు పీజీ అడ్మిషన్లు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్ష అర్హుత సాధించడం ద్వారా  బీటెక్, ఎంటెక్ తో పాటుగా ఫార్మసీ, ఆర్కిటెక్చర్, మానేజ్మెంట్, లా, నర్సింగ్ మరియు మరికొన్ని హోమ్ సైన్సెస్ కోర్సులలో సీట్ దక్కించుకోవచ్చు.

గీతం యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్ విశాఖపట్నంతో పాటుగా హైదరాబాద్ మరియు బెంగుళూరులో మరో రెండు అనుబంధ క్యాంపుస్లు కలిగి ఉంది. దేశంలో ఉన్న డ్రీమ్డ్ యూనివర్సిటీలలో దేశీయంగా, అంతర్జాతీయంగా గీతం యూనివర్సిటీకి మంచి గుర్తింపు ఉంది. అంతర్జాతీయంగా దాదాపు 25 యూనివర్సిటీలతో కలిసి పనిచేస్తుంది.

18. సింబియోసిస్ అడ్మిషన్ టెస్ట్

SITEEE - Registration, Eligibility, Exam Dateసింబియోసిస్ అడ్మిషన్ టెస్టును సింబియోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. ఈ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షతో పాటుగా మానేజ్మెంట్, లా, మాస్ కమ్యూనికేషన్, ఎకనామిక్స్, లిబరల్ ఆర్ట్స్, కంప్యూటర్ స్టడీస్ మరియు కలినరీ ఆర్ట్స్ వంటి యూజీ, పీజీ కోర్సులలో అడ్మిషన్లు కల్పించేందుకు సింబియోసిస్ ఎంట్రన్స్ టెస్ట్ (SET-A, SET-B) మరియు SLAT పేరుతో  పరీక్షలు నిర్వహిస్తుంది.

యూనివర్సిటీ దేశంలో పూణే, నోయిడా, బెంగుళూరు, నాశిక్, హైదరాబాదా మరియు నాగపూర్లో కలిపి మొత్తం ఆరు క్యాంపుస్లు నిర్వహిస్తుంది. ఇండియాలో ఒకానొక గొప్ప ప్రైవేట్ యూనివెర్సిటీగా చెప్పుకునే సింబియోసిస్ నిర్వహించే ఈ నాలుగు ప్రవేశ పరీక్షాల తీరుతెన్నులు ఇప్పుడు తెలుసుకుందాం.

19. కేఎల్ఈఈఈ ఎగ్జామ్

KLEEE Exam Eligibility, Registration, Exam Dateకేఎల్ఈఈఈ పరీక్షను కేఎల్ యూనివర్సిటీ యందు ఇంజనీరింగ్ ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించబడుతుంది. హైదరాబాద్ మరియు విజయవాడ కేంద్రంగా ఉన్నత విద్య అందిస్తున్న కేఎల్ యూనివర్సిటీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రైవేట్ కాలేజీల్లో మొదటి వరుసలో ఉంటుంది.

కేఎల్ యూనివర్సిటీ  ఇంజనీరింగ్ కోర్సులు కాకుండా ఆర్కిటెక్చర్, ఫార్మసీ, బయోటెక్నాలజీ, మానేజ్మెంట్, లా, కామర్స్ మరియు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వంటి విభిన్న విభాగాల్లో పదుల సంఖ్యలో కోర్సులను అందిస్తుంది

20. కేఐఐటీఈఈ ఎగ్జామ్

KIITEE Exam Eligibility, Registration, Exam Dateకేఐఐటీఈఈ పరీక్షను కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (KIIT) లో యూజీ, పీజీ మరియు రీసెర్చ్ కోర్సుల యందు మొడటి ఏడాది ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహిస్తారు. దేశంలో టాప్ 20 యూనివర్సిటీలలో ఒకటైన కళింగ ఇనిస్టిట్యూట్ దేశంలో ఏ ప్రైవేట్ యూనివర్సిటీ అందించని విభిన్న కోర్సులు అందిస్తుంది.

యూజీ, పీజీ కేటగిర్లలో ఇంజనీరింగ్, మెడికల్, మానేజ్మెంట్, లా, ఫాషన్ డిజైనింగ్, లాజిస్టిక్స్ & ఈ-కామర్స్, జనరల్ బ్యాచిలర్ డిగ్రీలతో పాటుగా మరెన్నో రీసెర్చ్ కోర్సులను ఆఫర్ చేస్తుంది. మెడికల్ కోర్సులు మినహా మిగతా అన్ని కోర్సుల ప్రవేశాలు కేఐఐటీఈఈ ప్రవేశ పరీక్ష ద్వారా నిర్వహిస్తారు.

21. జెట్ ఎగ్జామ్

JET Exam Eligibility, Registration, Exam Dateజెట్ పరీక్ష జైన్ యూనివర్సిటీలో వివిధ యూజీ, పీజీ మరియు పీహెచ్డీ కోర్సుల యందు అడ్మిషన్లు కల్పించేందుకు నిర్వహించబడుతుంది. బెంగుళూరు ప్రధాన కేంద్రగా నడుస్తున్న ఈ యూనివర్సిటీ ఇంజనీరింగ్, మానేజ్మెంట్, కామర్స్, డిజైన్, హెల్త్ కేర్ అండ్ సైన్సెస్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీలలో విభిన్న యూజీ, పీజీ కోర్సులు అందిస్తుంది.

22. పెస్ శాట్ ఎగ్జామ్

PESSAT Exam Eligibility, Registration, Exam Dateపెస్ శాట్ పరీక్షను పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ యూనివర్సిటీలో వివిధ యూజీ, పీజీ కోర్సుల యందు అడ్మిషన్లు కల్పించేందుకు నిర్వహిస్తారు. పెస్ శాట్ అనగా పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని అర్ధం.

బెంగుళూరు ప్రధాన కేంద్రగా నడుస్తున్న ఈ యూనివర్సిటీ, ఉన్నత విద్యను అందిస్తున్న ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించి కర్ణాటకలో నెంబర్ వన్ స్థానంలో ఉంది.  ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, మానేజ్మెంట్, ఫార్మసీ, లా, డిజైనింగ్ వంటి విభిన్న యూజీ, పీజీ కోర్సులు అందిస్తుంది.

Post Comment