Advertisement
కోస్ట్ గార్డు ఎగ్జామ్ 2022 | ఎగ్జామ్ నమూనా, ఎంపిక విధానం
Defence Jobs Latest Jobs

కోస్ట్ గార్డు ఎగ్జామ్ 2022 | ఎగ్జామ్ నమూనా, ఎంపిక విధానం

దేశ తీరప్రాంత రక్షణ వ్యవహారాల బాధ్యతను ఇండియన్ కోస్ట్ గార్డ్ నిర్వర్తిస్తుంది. ఇండియన్ కోస్ట్ గార్డు దేశ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. దీన్ని 1978 లో అధికారికంగా స్థాపించారు. దేశ ప్రాదేశిక జలాల పరిధిలో దీవుల రక్షణ, మానవ నిర్మాణాల పరిరక్షణ, సముద్ర జలాల్లో ఆపదలో చిక్కుకున్న జాలర్లను రక్షించడం, సముద్ర పర్యావరణాన్ని కాపాడడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది

నియామక బోర్డు ఇండియన్ కోస్ట్ గార్డ్
నియామక పరీక్షా ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎగ్జామినేషన్
ఎంపిక ప్రక్రియ రాతపరీక్ష/ఫీజికల్ & మెడికల్ టెస్ట్
ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ టెన్త్/ ఇంటర్/ గ్రాడ్యుయేషన్
వయో పరిమితి 18 - 30 ఏళ్ళ మధ్య
తాజా నోటిఫికేషన్ క్లిక్ చేయండి

అలానే సముద్ర జలాల కాలుష్యాన్ని తగ్గించడం, సముద్ర స్మగ్లింగు నియంత్రణలో కస్టమ్ అధికారులకు సహాయ పడటం, భారత సముద్ర జలల చట్టాలను అమలు చేయడం, సముద్ర జలాల్లో ప్రాణ, ఆస్తి నష్టాలను అంచనా వేయడం, వాటికి సంబంధించిన రిపోర్టులను రూపొందించడం మరియు అవి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం వంటి బృహత్తరమైన విధులను ఇండియన్ కోస్ట్ గార్డ్ నిర్వర్తిస్తుంది. ఈ వ్యవహారాలన్నీ సక్రమంగా జరిగేందుకు ఇండియన్ నేవీ, డిపార్టుమెంట్ ఆఫ్ ఫిషెరీస్, డిపార్టుమెంట్ ఆఫ్ రెవిన్యూ (కస్టమ్) మరియు కేంద్ర, రాష్ట్ర పోలీసుల సన్నిత సహకారంను ఇండియన్ కోస్ట్ గార్డ్ తీసుకుంటుంది.

దేశ ప్రాదేశిక జలాలపై సమర్ధవంతమైన పట్టు సాధించేందుకు, సౌలభ్యమైన అధికారిక నియంత్రణ కల్గిఉండేందుకు దేశ తీరప్రాంత జలాలను ఐదు జోన్లుగా విభజించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉన్నపటికీ రోజువారీ కార్యక్రమాలు, ఉద్యోగ నియామకాలు జోన్ల పరిధిలోనే జరుగుతాయి.

ఇండియన్ కోస్ట్ గార్డ్ జోన్లు, వాటి పరిధిలో ఉండే రాష్ట్రాలు మరియు పరీక్షా కేంద్రాలు
జోన్ పరీక్షా కేంద్రం జోన్ పరిధి రాష్ట్రాలు
నార్త్ జోన్ నోయిడా జమ్మూ & కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ మరియు చండీఘర్
నార్త్ - ఈస్ట్ జోన్ కోల్‌కతా బీహార్, జార్ఖండ్, మిజోరాం, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, అస్సాం, సిక్కిం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ప్రదేశ్, నాగాలాండ్ మరియు త్రిపుర.
ఈస్ట్ జోన్ చెన్నై తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి మరియు అండమాన్ & నికోబార్
వెస్ట్ జోన్ ముంబై మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, కేరళ, గోవా, డామన్ & డియు, దాద్రా నగర్ హవేలి మరియు లక్షద్వీప్
నార్త్ వెస్ట్ జోన్ గాంధీనగర్ గుజరాత్

ఇండియన్ కోస్ట్ గార్డ్ నియామక ప్రక్రియ

ఇండియన్ కోస్ట్ గార్డు ఫ్యామిలీలో చేరేందుకు నిరుద్యోగులకు రెండు మార్గాలున్నాయి. మొదటిది ఆఫీసర్ లెవెల్ ఎంట్రీ. రెండవది సెయిలర్ లెవెల్ ఎంట్రీ. ఇంటర్ మరియు గ్రాడ్యుయేషన్ అర్హుత ఉన్న అభ్యర్థులు ఆఫీసర్ లెవెల్ ఎంట్రీ ద్వారా కోస్ట్ గార్డ్ లో ఉద్యోగం సాధించవచ్చు. టెన్త్, ఇంటర్ మరియు  డిప్లొమా అభ్యర్థులు సెయిలర్ లెవెల్ ఎంట్రీ ద్వారా కోస్ట్ గార్డ్ జాబ్ చేజెక్కించుకునే అవకాశముంది.

 కోస్ట్ గార్డ్ ఆఫీసర్ లెవెల్ ఎంట్రీ

కోస్ట్ గార్డ్ అధికారులు నిర్వహించే విధులు ఆధారంగా ఆఫీసర్ లెవెల్ ఎంట్రీలో తిరిగి ఏడు సబ్ లెవెల్ ఎంట్రీస్ ఉన్నాయి. కొన్ని పోస్టులకు మహిళా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎడ్యుకేషన్ మెరిట్ ఆధారంగా రాతపరీక్షకు పిలుస్తారు. రాతపరీక్షలో అర్హుత సాధించిన అభ్యర్థులకు ఫీజికల్ ఫిట్నెస్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.

ఎంపికైన అభ్యర్థులకు 6 నెలల నుండి 2 ఏళ్ళ వరకు వివిధ నావెల్ అకాడమీలలో ట్రైనింగ్ అందించి విధుల్లో చేర్చుకుంటారు. కోస్ట్ గార్డ్ అధికారుల ప్రారంభ వేతనం 56,100/- నుండి మొదలవుతుంది. అధికారి ర్యాంకు పెరిగేకొద్దీ వేతన స్కేల్ మారుతుంటుంది. అసిస్టెంట్ కమాండెంట్ నుండి డైరెక్టర్ జనరల్ వరకు ఎదిగే అవకాశం ఉంటుంది. డైరెక్టర్ జనరల్ స్థాయికి చేరుకునేసరికి గరిష్టంగా 2,05,400/- వేతనం అందుకోవచ్చు.

ఇవి కాకుండా  కాకుండా ఇతర సదుపాయాలు ఉండనేఉన్నాయి. కుటంబ మొత్తకి మెడికల్ ఇన్సూరెన్స్ అందిస్తారు. వసతి సదుపాయం, ట్రావెల్ అలోవెన్సులు, కాంటీన్ సదుపాయం, సబ్సిడీతో రుణ సౌలభ్యం, సంవత్సరానికి 53 రోజులు సెలవు తీసుకునే అవకాశం, పదివేల నెలవారీ ప్రీమియంతో కోటి వరకు బీమా సదుపాయం మరియు పదివి విరమణ తర్వాత పెన్సన్ మరియు గ్రాట్యుటీ కూడా అందిస్తారు.

ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆఫీసర్ ఎంట్రీకి సంబంధించి అర్హుతలు
ఆఫీసర్ ఎంట్రీ రకం వయసు & జండర్ విద్యా అర్హుత మెడికల్ ప్రమాణాలు
జనరల్ డ్యూటీ 21 నుండి 25 ఏళ్ళు  (పురుషులు ) ఇంటర్ ఎంపీసీ తో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఎత్తు 157 సెం.మీ, ఎత్తుకు తగిన బరువు, ఛాతీ 5 సెం.మీ, కంటిచూపు 6/6 6/9 (అద్దాలతో), 6/6, 6/6 (అద్దాలు లేకుండా)
జనరల్ డ్యూటీ (ఉమెన్ షార్ట్ సర్వీస్ అప్పోయింట్మెంట్ ) 21 నుండి 25 ఏళ్ళు  (మహిళలు) ఇంటర్ ఎంపీసీ తో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఎత్తు 152 సెం.మీ, ఎత్తుకు తగిన బరువు, ఛాతీ 5 సెం.మీ, కంటిచూపు 6/6 6/9 (అద్దాలతో), 6/6, 6/6 (అద్దాలు లేకుండా)
జనరల్ డ్యూటీ పైలెట్ నావిగేటర్ ఎంట్రీ 19 నుండి 25 ఏళ్ళు (పురుషులు ) . ఎత్తు 162.5 సెం.మీ, ఎత్తుకు తగిన బరువు, ఛాతీ 5 సెం.మీ, కంటిచూపు 6/6 6/9 (అద్దాలతో), 6/6, 6/6 (అద్దాలు లేకుండా)
వాణిజ్య పైలెట్ లైసెన్స్ (మెన్) 19 నుండి 25 ఏళ్ళు (పురుషులు ) ఇంటర్మీడియట్ ఎత్తు 162.5 సెం.మీ, ఎత్తుకు తగిన బరువు, ఛాతీ 5 సెం.మీ, కంటిచూపు 6/6 6/9 (అద్దాలతో), 6/6, 6/6 (అద్దాలు లేకుండా)
వాణిజ్య పైలెట్ లైసెన్స్ (ఉమెన్) 19 నుండి 25 ఏళ్ళు (మహిళలు) ఇంటర్మీడియట్ ఎత్తు 165 సెం.మీ, ఎత్తుకు తగిన బరువు, ఛాతీ 5 సెం.మీ, కంటిచూపు 6/6 6/9 (అద్దాలతో), 6/6, 6/6 (అద్దాలు లేకుండా)
టెక్నికల్ ఎంట్రీ 21 నుండి 25 ఏళ్ళు (పురుషులు ) ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్ మరియు మెరైన్ ఇంజనీరింగ్ etc ) ఎత్తు 157 సెం.మీ, ఎత్తుకు తగిన బరువు, ఛాతీ 5 సెం.మీ, కంటిచూపు 6/6 6/9 (అద్దాలతో), 6/6, 6/6 (అద్దాలు లేకుండా)
లా ఎంట్రీ 21 నుండి 30 ఏళ్ళు (పురుషులు/మహిళలు) లా గ్రాడ్యుయేషన్ ఎత్తు 157సెం.మీ, ఎత్తుకు తగిన బరువు, ఛాతీ 5 సెం.మీ, కంటిచూపు 6/6 6/9 (అద్దాలతో), 6/6, 6/6 (అద్దాలు లేకుండా)

ఓబిసి, ఎస్సీ, మరియు ఎస్టీ అభ్యర్థులకు 3 నుండి 5 ఏళ్ళ వయోపరిమితి  సడలింపు ఉంటుంది.

కోస్ట్ గార్డ్ సెయిలర్ లెవెల్ ఎంట్రీ

కోస్ట్ గార్డ్ సెయిలర్ ఎంట్రీలో ప్రవేశించేందుకు తిరిగి మూడు మార్గాలున్నాయి. డిప్లొమా అర్హుతున్న అభ్యర్థులు యాంత్రిక్ ఎంట్రీ ద్వారా ఉద్యోగం సాధించవచ్చు. ఇంటర్మీడియేట్ అర్హుతతో నావిక్ జనరల్ డ్యూటీ ఎంట్రీ మరియు టెన్త్ అర్హుతతో నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ ఎంట్రీ పొందొచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎడ్యుకేషన్ మెరిట్ ఆధారంగా రాతపరీక్షకు పిలుస్తారు.

రాత పరీక్షలో అర్హుత సాధించిన అభ్యర్థులకు ఫీజికల్ ఫిట్నెస్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు. ఎంపికైన అభ్యర్థులకు 6 నెలల నుండి ఏడాది వరకు వివిధ నావెల్ అకాడమీలలో ట్రైనింగ్ అందించి విధుల్లో చేర్చుకుంటారు. యాంత్రిక్ ఎంట్రీ అభ్యర్థులకు 5th పే స్కేల్ పరిదిలో ప్రారంభ వేతనం లభిస్తుంది. నావిక్ ఎంట్రీ అభ్యర్థులకు 3rd పే స్కేల్ పరిధి ప్రారంభవేతనం లభిస్తుంది.

రాత పరీక్షా ఆబ్జెక్టివ్ పద్దతిలో నిర్వహిస్తారు. పరీక్షా ఇంటర్మీడియట్ స్థాయి మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సంబంధిత అంశాలతో ఉంటుంది. వీటితో పాటుగా బేసిక్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ కరెంటు అఫైర్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ రీజనింగ్ సబ్జక్ట్స్ నుండి ప్రశ్నలు ఇవ్వబడతాయి.

ఇండియన్ కోస్ట్ గార్డ్ సెయిలర్ ఎంట్రీకి సంబంధించి అర్హుతలు
సెయిలర్ ఎంట్రీ రకం వయోపరిమితి విద్యా అర్హుత మెడికల్ ప్రమాణాలు
యాంత్రిక్స్ (Yantrik) 18 నుండి 22 ఏళ్ళు డిప్లొమా (మెకానికల్, ఎలక్ట్రికల్, టెలికమ్యూనికేషన్ ) ఎత్తు 157 సెం.మీ, ఎత్తుకు తగిన బరువు, కంటిచూపు 6/9 6/12 (అద్దాలతో), 6/6, 6/6 (అద్దాలు లేకుండా)
నావిక్ జనరల్ డ్యూటీ (Navik) 18 నుండి 22 ఏళ్ళు ఇంటర్ ఎంపీసీ ఎత్తు 157 సెం.మీ, ఎత్తుకు తగిన బరువు, కంటిచూపు 6/9  (అద్దాలతో), 6/6 (అద్దాలు లేకుండా)
నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ (Navik) 18 నుండి 22 ఏళ్ళు టెన్త్ క్లాస్ పాస్ ఎత్తు 157 సెం.మీ, ఎత్తుకు తగిన బరువు, కంటిచూపు 6/36

ఓబిసి, ఎస్సీ, మరియు ఎస్టీ అభ్యర్థులకు 3 నుండి 5 ఏళ్ళ వయోపరిమితి  సడలింపు ఉంటుంది.