ఎస్‌బీఐ స్పెషలిస్టు ఆఫీసర్ ఎగ్జామ్ | ఎలిజిబిలిటీ, నియామక ప్రక్రియ
Bank Jobs Latest Jobs

ఎస్‌బీఐ స్పెషలిస్టు ఆఫీసర్ ఎగ్జామ్ | ఎలిజిబిలిటీ, నియామక ప్రక్రియ

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా మరియు దాని అసోసియేట్ బ్యాంకులకు సంబంధించి ప్రత్యేక విధులు నిర్వహించే అనలిస్టులు, లా ఆఫీసర్లు, ఎకానమిస్టులు, రిస్క్ అనలిస్టులు, సెక్యూరిటీ అధికారులు, సిస్టం అధికారులు, చార్టడ్ అకౌంటెంట్లు, వివిధ ఇంజినీర్లు, స్టాటిస్టిషియన్స్, బాష అధికారులు, ఫైర్ ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు వంటి సిబ్బంది నియమించేందుకు ఈ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ నిర్వహిస్తారు. ఏడాది పొడుగునా జరిగే ఈ స్పెషలిస్ట్ అధికారుల నియామక ప్రక్రియ పూర్తి వివరాలు ఇప్పుడు తెల్సుకుందాం.

Advertisement
నియామక బోర్డు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా
నియామక పరీక్షా ఎస్‌బీఐ స్పెషలిస్ట్ ఆఫీసర్స్
ఎంపిక ప్రక్రియ రాతపరీక్ష/ఇంటర్వ్యూ
ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ గ్రాడ్యుయేషన్
వయో పరిమితి 21 - 30 ఏళ్ళ మధ్య

ఎస్‌బీఐ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ

స్పెసలిస్ట్ ఆఫీసర్స్ నియామకాలు అవసరానికి అనుగుణంగా ఏడాది పొడుగునా ఎస్‌బీఐ భర్తీ చేస్తుంది. ప్రకటనలో ఉండే పోస్టు, గ్రేడును అనుచరించి విద్య అర్హుత, వయసు, అనుభవం సరిపోయే భారతీయ పౌరులు అందరు ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హుత నియమాలు ప్రతి పోస్టుకు మారుతూ ఉంటాయి. చాలా పోస్టులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించడం ద్వారా భర్తీ చేపడతారు. ఫైర్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, మరి కొన్ని సీనియర్ ఆఫీసర్  మరియు తక్కువ దరఖాస్తులు వచ్చిన పోస్టులను వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు.

ఎస్‌బీఐ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఎగ్జామ్ నమూనా

స్పెసలిస్ట్ ఆఫీసర్స్ నియామక పరీక్షా ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్షా రెండు దశలలో నిర్వహించబడుతుంది. ఫేజ్ I లో టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్/హిందీ), కొన్ని పోస్టులకు టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కూడా పరిశీలిస్తారు.

ఫేజ్ I  కు సంబంధించి అన్ని టెస్టులలో కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇందులో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఫేజ్ II కు ఆహ్వానిస్తారు. ఫేజ్ II లో పోస్టుకు సంబంధించిన ప్రొఫిషినల్ నౌలెడ్జ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో మెరిట్ సాధించిన వారికీ ఇంటర్వ్యూ కి పిలుస్తారు.

టెస్ట్ ప్రశ్నలు / మార్కులు సమయం
జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 50/50 90 నిముషాలు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35/35
జనరల్ ఇంగ్లీష్ 35/35
ప్రోఫిసినల్ నాలెడ్జ్ టెస్ట్ (PKT) జనరల్ ఐటీ నాలెడ్జ్ 25/50 70 నిముషాలు
రోల్ బేస్డ్ నాలెడ్జ్ 50/100

ఎస్‌బీఐ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఎంపిక ప్రక్రియ

పోస్టుల ఖాళీ సంఖ్యను బట్టి ప్రతి పోస్టుకు మూడు నుండి ఐదు మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ కు ఆహ్వానిస్తారు. పరీక్ష నిర్వహించని పోస్టులకు 7 నుండి 10 మంది అభ్యర్థులను పిలుస్తారు. ప్రొఫిషినల్ నౌలెడ్జ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ లో సాధించిన ప్రతిభ ఆధారంగా తుది జాబితా తయారుచేస్తారు.

రిజర్వేషన్ అభ్యర్థులకు 5% మార్కుల సడలింపు ఉంటుంది. కనీస అర్హుత మార్కులను ఆయా టెస్టులలో విద్యార్థులు కనబర్చిన ప్రతిభ ఆధారంగా బ్యాంకు నిర్ణయిస్తుంది. రాత పరీక్షలో సాధించిన మార్కులకు 70%, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులకు 30% వెయిటేజీ కేటాయిస్తారు.

Advertisement