Admissions NTA Exams Research Entrance Exams Teaching Entrance Exams

UGC NET మరియు CSIR NET మధ్య వ్యత్యాసం

యూజీసీ నెట్ మరియు సీఎస్ఐఆర్ నెట్  అర్హుత పరీక్షలకు సంబంధించి చాల మంది విద్యార్థులలో గందరగోళం ఉంటుంది. ఈ గందగోళంను తరిమి కొట్టేందుకు ఈ పరీక్షల మధ్య ఉండే ప్రధానమైన వ్యత్యాసాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తవానికి ఈ రెండు అర్హుత పరీక్షలు భారత విశ్వవిద్యాలయాలు మరియు ప్రభుత్వ కళాశాలల్లో లెక్చరేషిప్(LS)/ అసిస్టెంట్ ప్రొఫెసోర్షిప్ గా లేదా ఈ రెండింటిలో అర్హుత నిర్ణహించేందుకు మరియు పరిశోధనల కోసం జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(JRF) ప్రోగ్రాంలో అవకాశం కల్పించేందుకు నిర్వహిస్తారు.

ఏటా జూన్ మరియు డిసెంబర్ లో జరిగే ఈ రెండు పరీక్షల వెనక ముఖ్య ఉద్దేశ్యం ఒకటే అయినప్పటికీ అందులో పాల్గునే అభ్యర్థుల ఎలిజిబిలిటీ వంటి చిన్నచిన్న విషయాల్లో వత్యాసం కనిపిస్తుంది. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

సీఎస్ఐఆర్ నెట్ పరిక్ష అంటే ఏమిటి ?

సీఎస్ఐఆర్ నెట్: CSIR అనగా ది కౌన్సిల్ అఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని అర్ధం. ఇది సైన్స్ & టెక్నాలజీ రంగాలలో అత్యాధునిక రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ నాలెడ్జ్ బేస్‌కు ప్రసిద్ధి చెందింది. సీఎస్ఐఆర్ పరిధిలో దేశ వ్యాప్తంగా 37 జాతీయ ప్రయోగశాలలు, 39 ఔట్‌రీచ్ సెంటర్‌లు, ఒక ఇన్నోవేషన్ కాంప్లెక్స్‌ కలిగి ఉంది.

సీఎస్ఐఆర్ నెట్ పరీక్షను సీఎస్ఐఆర్ మరియు యూజీసీ ఉమ్మడిగా పతి ఏటా జూన్ మరియు డిసెంబర్ నెలలో నిర్వహిస్తాయి. ఈ పరీక్షలో ఉండే క్లిష్టత దృష్ట్యా యూజీసీ నెట్ పరీక్షాతో పోల్చుకుంటే తక్కువ సంఖ్యలో అభ్యర్థులు హాజరౌతారు. సీఎస్ఐఆర్ నెట్ పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలు.

యూజీసీ నెట్ పరిక్ష అంటే ఏమిటి ?

యూజీసీ నెట్: UGC అనగా యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్ అని అర్ధం. ఇది దేశ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలకు గుర్తింపు ఇవ్వటంతో పాటు వాటి అభివృద్ధికి నిధులు అందించేందుకు 1956 లో కేంద్ర ప్రభుతం ఏర్పరిచిన ఒక చట్టబద్దమైన సంస్థ. యూజీసీ దేశంలో ఉన్నత విద్యకు సంబంధించి పూర్తి నిర్వహణ బాధ్యత వహిస్తుంది.

యూజీసీ నెట్ పరీక్షను ఇదివరకు సీబీఎస్ఈ మరియు యూజీసీ ఉమ్మడిగా నిర్వహించేవి. 2018 నుండి యూజీసీ ఆధ్వర్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. సీఎస్ఐఆర్ నెట్ పోల్చుకుంటే ఈ పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్యా ఎక్కువ. యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలు

సీఎస్ఐఆర్ నెట్ ఎలిజిబిలిటీ

సీఎస్ఐఆర్ నెట్ కేవలం సైన్స్ గ్రూపుల వారు మాత్రమే రాసేందుకు అర్హులు. ఈ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసేందుకు 55 శాతం మార్కులతో సైన్స్ గ్రూపుల్లో మాస్టర్ డిగ్రీ (పీజీ)ఉత్తీర్ణత అయి ఉండాలి. వీరితో పాటు బీఈ/బీటెక్, బీఫార్మా, ఎంబీబీస్ వంటి బ్యాచిలర్ సైన్స్ డిగ్రీలు ఉత్తీర్ణత అయిన వారు కూడా ఈ పరీక్ష రాసేందుకు అర్హులు.

యూజీసీ నెట్ ఎలిజిబిలిటీ

యూజీసీ నెట్ రాసేందుకు సైన్స్ గ్రూపుల వారితో పాటు మిగతా అన్ని గ్రూపుల వారు అర్హులు. దాదాపు 100 పైగా స్పెషలైజషన్స్ కు సంబంధించి జరిగె ఈ అర్హుత పరీక్ష రాయాలంటే 55% శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల నుండి మాస్టర్ డిగ్రీ (పీజీ) పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి

సీఎస్ఐఆర్ నెట్ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కి పోటీపడే అభ్యర్థుల వయసు పరీక్ష జరిగే సమయానికి 28 ఏళ్ళు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ట్రాన్స్జండర్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది. ఓబీసీ మహిళా అభ్యర్థులకు 3 ఏళ్ళు సడలింపు ఉంటుంది.

యూజీసీ నెట్ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కి పోటీపడే అభ్యర్థుల వయసు పరీక్ష జరిగే సమయానికి 30 ఏళ్ళు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ట్రాన్స్జండర్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.

ఎగ్జామ్ నమూనా

యూజీసీ నెట్ తో పోల్చుకుంటే సీఎస్ఐఆర్ నెట్ పరీక్ష కొంచెం క్లిష్టమైనది మరియు పూర్తి విభిన్నమైనది. ఐదు స్పెషలైజ్డ్ సబ్జెక్టుల యందు జరిగే ఈ పరీక్ష ప్రశ్న పత్రాల్లో మూడు భాగాలు ఉంటాయి. ప్రతి భాగంలో కొన్ని నిర్దిష్ట సంఖ్యలో మల్టిఫుల్ ఛాయస్ ప్రశ్నలు ఉండటంతో పాటుగా ప్రతి భాగంలో కొన్ని నిర్దేశిత సంఖ్యలో ప్రశ్నలకు సమాధానం చెయ్యాల్సి ఉంటుంది. ఋణాత్మక మార్కుల విధానం ఉంటుంది.

సీఎస్ఐఆర్ నెట్ తో పోల్చుకుంటే యూజీసీ నెట్ పరీక్ష కొంచెం సులభమైనది. యూజీసీ నెట్ మూడు గంటల నిడివిలో రెండు పేపర్లను రాయాల్సి ఉంటుంది. పేపర్ 1 అభ్యర్థి యొక్క జనరల్ అవెర్నెస్, మరియు వారి యందు ఉన్న టీచింగ్ ఆప్టిట్యూడ్ ను పరీక్షించే విదంగా ఉంటుంది. పేపర్ 2 అభ్యర్థి ఎంచుకున్న ఆప్షనల్ సబ్జెక్టు యందు ప్రాథమిక జ్ఞానాన్ని పరీక్షించే విదంగా ఉంటుంది. మార్కుల విధానం ఉండదు.

Post Comment